google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : కమనీయంగా....స్వామివారికి చక్రస్నానం

2, ఏప్రిల్ 2024, మంగళవారం

కమనీయంగా....స్వామివారికి చక్రస్నానం

 కమనీయంగా....స్వామివారికి చక్రస్నానం






శ్రీసత్యసాయిజిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14వరోజు సోమవారం కమనీయంగా స్వామివారికి చక్రస్నానం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.తీర్థవాథి పురష్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను తిరువీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనమిస్తూ....భృగుతీర్థం(కోనేరు)వద్దకు  తీసుకుని వచ్చి ప్రధాన అర్చకులు మంత్రోచ్ఛారణలతో చక్రస్నానం,తిరుమంజనం,స్థాపన,కలశ జలాభిషేకం ప్రత్యేక పూజలు  నిర్వహించారు.అనంతరం ఆలయంలో ధ్వజస్తంభం వద్ద శ్రీవారి కంకణాలు తీసివేసి,స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతి నీరాజనాలతో గర్భాలయం తలుపులు మూసివేశారు.ఆలయం బృగుతీర్థం సమీపంలో భక్తులు రంగులు చల్లుకుంటూ వసంతోత్సవ సంబరాలు అంబరాన్నాంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి