google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : గొల్లపల్లిలో పోలీస్ పల్లెనిద్ర - అమడగూరులో సాయుధ బలగాలతో కవాతు - ఇంటర్ విద్యార్థి రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ - ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

12, ఏప్రిల్ 2024, శుక్రవారం

గొల్లపల్లిలో పోలీస్ పల్లెనిద్ర - అమడగూరులో సాయుధ బలగాలతో కవాతు - ఇంటర్ విద్యార్థి రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ - ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

గొల్లపల్లిలో పోలీస్ పల్లెనిద్ర


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్11(విజయ స్వప్నం.నెట్)

మండలంలోని ఇనగలూరు పంచాయతీ గొల్లపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఎస్ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులతో కలిసి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారని తెలిపారు.ఎన్నికల నిబంధనలపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ.... గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని,ఎన్నికల నిర్వహణలో ఆటంకాలు కలిగించకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన తెలిపారన్నారు.ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని,రాజ్యంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించినట్లు పేర్కొన్నారు.

$$$__________@@@_________$$$

మండలంలో దుద్దుకుంట కిషన్ రెడ్డి ప్రచారం 

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్11(విజయ స్వప్నం.నెట్)

మండలంలోని జేకేపల్లి పంచాయతీ పరిధిలోని తనకంటివారిపల్లి, కందుకూరిపల్లి, హరిపురం గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి పర్యటించి ఎన్నికల ప్రచారం చేపట్టిన్నట్లు వైకాపా శ్రేణులు తెలిపారు. దుద్దుకుంట కిషన్ రెడ్డి,వైకాపా నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి వైకాపా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారని తెలిపారు. తెదేపా కూటమి నాయకులు గ్రామానికి వచ్చి మాయమాటలు చెప్తే నమ్మవద్దని,రాబోయే ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి వైఎస్ జగనన్నని ముఖ్యమంత్రిగా, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని వారు కోరారన్నారు.

$$$__________@@@_________$$$

తెదేపా విజయానికి ప్రతి కార్యకర్త శ్రమించాలి 


 శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్11(విజయ స్వప్నం.నెట్)

తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికే పార్థసారథి పేర్కొన్నారు.గురువారం మండల కేంద్రంలో వెంకటసాయి ఐటిఐ కళాశాలలో తెదేపా నాయకులకు,కార్యకర్తలకు  తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేయగా మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి కే పార్థసారధి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.... రాబోయే ఎన్నికలు కీలకమైనవని, తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన సూపర్ సిక్స్,మినీ మ్యానిఫెస్టో  అంశాలపై ప్రజలకు వివరించి,ఐదేళ్ల సియం జగన్ పరిపాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యమని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

$$$__________@@@_________$$$

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఉత్తమ ప్రతిభ 

అమడగూరు ఏప్రిల్12(విజయస్వప్నం.నెట్)

ఇంటర్ పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలుబడగా మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచారు.ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 24 మందికీ గాను 21 మంది (87 శాతం)ఉత్తీర్ణత, ఇంటర్ మొదటి సంవత్సరంలో 51 మందికీ గాను 45 మంది (88 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం  విద్యార్ధిని బి..ఐశ్వర్య సిఈసి గ్రూప్ లో 942/1000 మార్కులు సాధించి అగ్ర స్థానంలో నిలిచింది.పి.శోభన బైపిసి గ్రూప్ లో 914/1000 మార్కులు సాధించింది. మొదటి సంవత్సరం లో నూర్ మహమ్మద్ ఎం.పి.సి. గ్రూప్లో 428/470, ఎస్. సమీర్  బై.పి.సి. గ్రూప్ లో 398/440 మార్కులు సాధించారు. కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ప్రిన్సిపాల్ ‌ శ్రీ ప్రభాకర్  విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అలాగే ఈ ఫలితాల కోసం కృషి చేసిన అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు.                                         ఉత్తమ ప్రతిభ విద్యార్థినికి అభినందనలు    ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  సిఈసి గ్రూపులో 942/1000 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వెంకటనారాయణపల్లి క్రాస్ కు చెందిన విద్యార్ధిని బి.ఐశ్వర్యకమను పలువురు అభినందించారు. తల్లిదండ్రులు తమ కుమార్తె కు మిఠాయిలు అందించి సంతోషం వ్యక్తం చేశారు.

బి. ఐశ్వర్య
బి. ఐశ్వర్య  CEC942/1000

P sobhana
పి. శోభనా  BIPC914/1000

$$$__________@@@_________$$$

ఇంటర్ విద్యార్థి రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్


దొడ్డం హర్షవర్ధన్

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్12(విజయస్వప్నం.నెట్)

ఇంటర్ విద్యా శాఖ శుక్రవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎంపీసీలో 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ పొందిన దొడ్డం హర్షవర్ధన్ ను అమడగూరు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుష్పగుచ్చం సమర్పించి 2వేలు నగదును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో జీవనం సాగిస్తు పదవ తరగతి,ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించి గ్రామానికి మంచి పేరు తెచ్చిన హర్షవర్ధన్ ను విద్యార్థులు స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి,తల్లిదండ్రులకు,గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు‌. హర్షవర్ధన్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి సామాజిక సేవలను అందించాలని ఆశాభావం వ్యక్తంచేశారు.  ఇంటర్ ఫలితాలలో.... ఆదర్శ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం.

మండలంలోని ఆదర్శ జూనియర్ కళాశాలకు చెందిన మొదటి సంవత్సరం 46మంది విద్యార్థులకు గాను 43మంది పరీక్షలు రాయగా (93.4%)పాసయ్యారని,ద్వితీయ సంవత్సరం 34మంది విద్యార్థులకు గాను 32మంది (94%) పాసయ్యారని కళాశాల కరస్పాండెంట్ తెలిపారు. ద్వితీయ బైపీసీలో సాయికుమార్ నాయక్ (911) ఎంపీసీలో అమృత (881) సీఈసీలో రేఖ (875) మార్కులు సాధించాలని, ప్రధమ సంవత్సరంలో బైపీసీలో అమృత(405) ఎంపీసీలో యస్వంతి(343) సీఈసీలో అలేఖ్య(425) మార్కులతో మొదటి స్థానంలో నిలిచారన్నారు.

ఓడిచెరువులో విద్యార్థుల ప్రతిభ మండల కేంద్రంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో  విద్యార్థుల ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

ద్వితీయ బైపీసీలో టి.తోసిఫ్(775) అంజలి(734)పూజిత(705) ద్వితీయ ఎంపీసీలో ఫాజీల(865) పవిత్ర(775) రఫీ (665) ద్వితీయ సీఈసీలో సాయిసందీప్(885) జి.మారుతి(659) అశోక్(552) మార్కులు సాధించారని, ప్రధమ బైపీసీలో లోక్నాథ్(392) కల్పనా(376) సుస్మిత(271) ప్రధమ ఎంపీసీలో లోకేష్(324) సి.నందిని(317) అశోక్(251) ప్రధమ సీఈసీలో తేజ వర్ధన్(400) రెడ్డిశేఖర్(360) భానుప్రకాష్ నాయక్(340) ప్రధమ సంవత్సరంలో 40 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 80% ఉత్తీర్ణత కాగా, ద్వితీయ ఇంటర్ విద్యార్థులు 30 మందికి 85% ఉత్తీర్ణత సాధించినట్లు కరస్పాండెంట్ పేర్కొన్నారు.ఉత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ....భోధనలు అందించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు.ఇదిలా వుండగా మండలంలోని తుమ్మలకుంట్లపల్లి పంచాయతీ ఎగువ చెర్లోపల్లికి చెందిన విద్యార్ధి యరమనేని యశ్వంత్ అమడగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సీఈసీలో 875 మార్కులు సాధించి కళాశాలలో ద్వితీయ స్ధానంలో నిందించారని గ్రామస్తులు, విద్యార్థులు పేర్కొంటూ.... తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

$$$__________@@@_________$$$

అమడగూరులో సాయుధ బలగాలతో కవాతు


శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్12(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం సిఐ రాజేంద్రనాధ్ యాదవ్ ఆధ్వర్యంలో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు.ఈసందర్భంగా సిఐ రాజేంద్రనాధ్ యాదవ్ మాట్లాడుతూ.... రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు,ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.రాజ్యంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.స్ధానిక పోలీసుస్టేషన్ నుండి పురవీధుల మీదుగా డప్పు వాయిద్యాలతో ప్రధాన రహదారిపై సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి