google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : రెండవ రోజు ముగిసిన హుండీ లెక్కింపు , శ్రీస్వామివారికి హుండీ ఆదాయం 36,74 లక్షలు - స్వచ్ఛందంగా వాలంటీర్లు రాజీనామా - ఎన్నికల కమిషన్ వాహనాల తనిఖీలు

4, ఏప్రిల్ 2024, గురువారం

రెండవ రోజు ముగిసిన హుండీ లెక్కింపు , శ్రీస్వామివారికి హుండీ ఆదాయం 36,74 లక్షలు - స్వచ్ఛందంగా వాలంటీర్లు రాజీనామా - ఎన్నికల కమిషన్ వాహనాల తనిఖీలు

రెండవ రోజు ముగిసిన హుండీ లెక్కింపు

శ్రీస్వామివారికి హుండీ ఆదాయం 36,74 లక్షలు


శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్ 03(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి వారిహుండిల లెక్కింపు కార్యక్రమము రెండవ రోజు గురువారం పూర్తి చేసినట్లు కార్యనిర్వహణాధికారి,సిబ్బంది తెలిపారు.హుండి లెక్కింపులో 36,74,845 నగదు,బంగారు 94 గ్రాములు,వెండి 1 కెజి 700 గ్రాములు వచ్చినట్లు తెలిపారు.ఈ మొత్తము శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవతములు-2024  సంబందించిన లెక్కింపు కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి, శ్రీసత్యసాయిజిల్లా దేవాదాయ కార్యాలయ సీనియర్ సహాయకులు రమేష్ బాబు పర్యవేక్షణ అధికారిగా హాజరై య్యారని,హుండి లెక్కింపు కార్యక్రమములో  దేవస్థానము సిబ్బంది,కెనరా బ్యాంకు శాఖ, కదిరి మేనేజర్ శ్రీ.మధుసుధన్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారన్నారు.

$$$__________@@@__________$$$

స్వచ్ఛందంగా వాలంటీర్లు రాజీనామా

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్ 03(విజయస్వప్నం.నెట్)

మండల వ్యాప్తంగా 20మందికి పైగా గ్రామ వాలంటీర్లు బుధవారం స్వచ్ఛందంగా రాజీనామాలు చేశరని ఆయా గ్రామ సచివాలయ సిబ్బంది తెలిపార..ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ప్రభుత్వ పధకాలను అందించడం సంతృప్తిగా ఉందని, ఐదేళ్లలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని,విథి నిర్వహణలో ఏలాంటి పొరపాట్లు చేసివుంటే హృదయ పూర్వకంగా క్షమించాలని కోరుతూ.... తంగేడుకుంట,చింతమానుపల్లి, ఓడిచెరువు పంచాయతీ గ్రామాలకు చెందిన 22 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని తెలిపారు.ఓడిచెరువు గ్రామ వాలంటీర్ ఆసాది గణేష్ రాజీనామా పత్రాన్ని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిణి వరలక్ష్మికి అందజేశారని తెలిపారు.

$$$__________@@@__________$$$

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్ 03(విజయస్వప్నం.నెట్)

2023 సాధారణ బదిలీలలో భాగంగా నవాబుకోట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సోముశేఖర్ నాయక్,సత్యనారాయణరెడ్డిలు బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఇరువురు ఉపాధ్యాయులను బుధవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించింది.సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ విద్యార్థులు చక్కని భవిష్యత్ కు పునాదులు వేసుకోవాలని విద్యార్థులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.అంతక ముందు చదువులతల్లి సరస్వతీదేవి  చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి ఘనంగా పూజలు నిర్వహించారు.

$$$__________@@@__________$$$

ధర్మవరం బిజేపీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొనాలి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్ 03(విజయస్వప్నం.నెట్)

నేడు(గురువారం)ధర్మవరంలో బిజేపీ,తెదేపా,జనసేన ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ విజయం కోసం ప్రారంభించే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మండల వ్యాప్తంగా అధికసంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని గురువారం మండల కేంద్రంలో ఆంజనేయస్వామి దేవాలయం వద్ద మండల బిజేపీ కన్వీనర్ రంగారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పిలుపునిచ్చారు.ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ధర్మవరం నియోజకవర్గం బిజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ ను అత్యంత మెజారిటీతో గెలిపించుకునేందుకు శ్రమిస్తామని ఆయన పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మేకల వెంకటరమణ,కిష్టప్ప,నల్లగుట్టపల్లి ఆటో అశ్వర్ధ,కుళ్ళాయమ్మ,నాగన్న, ఆశ్వర్ధప్ప తదితరులు పాల్గొన్నారు.నేడు(గురువారం) ధర్మవరంలో ఎన్నికల ప్రచార  కార్యక్రమంలో పాల్గొనే బిజేపీ అభ్యర్థి సత్యకుమార్ కు ఘనస్వాగతం పలికేందుకు గ్రామస్థాయి నుండి నాయకులు,కార్యకర్తలు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన ఈసందర్భంగా పిలుపునిచ్చారు.

$$$__________@@@__________$$$

వాహనాల తనిఖీలు ప్రక్రియ


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్ 03(విజయస్వప్నం.నెట్)

ఎన్నికల కమిషన్ నియమావళి మేరకు మండల వ్యాప్తంగా వాహనాల తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.బుధవారం మండలంలోని గాజుకుంటపల్లి సమీపంలో హిందూపురం, కదిరి ప్రధాన రహదారిపై  పోలీస్ సిబ్బందితో కలిసి నిర్వహించారని వాహనాల తనిఖీలు నిర్వహించారు న్నారు.కర్ణాటక మద్యం, అధికంగా నగదు అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి