వృద్ధాశ్రమానికి నిత్యవసర సరుకులు అందజేత
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్06(విజయస్వప్నం.నెట్)
మండలంలోని గాజులవారిపల్లి సమీపంలో మాతృశ్రీ వృద్ధాశ్రమానికి ఓడిచెరువు మండలం నారప్పగారిపల్లికి చెందిన రెడ్డిపల్లి మహేశ్వర్ రెడ్డి, గీతా దంపతుల ఏకైక కుమారుడు రిక్విత్ తొలి పుట్టినరోజు సందర్భంగా 10వేలు విలువ చేసే నిత్యవసర సరుకులను వృద్ధాశ్రమ నిర్వాహకురాలు అరుణ జ్యోతికిశనివారం అందచేశారు.ఈ సందర్భంగా వృద్ధులకు బ్రెడ్ల్లు,పండ్లను అందించారు.అనంతరం పుట్టినరోజు కేకు కట్ చేసి చిన్నారికి ఆశీస్సులు అందించారు.భవిష్యత్తులో తమ వంతుగా వృద్ధాశ్రమానికి మరింత సహకార అందిస్తామని మహేశ్వర్ రెడ్డి గీత దంపతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దంపతులకు వృద్ధాశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి కృతజ్ఞతలు తెలిపారు.
$$$__________@@@__________$$$
నేడు చర్మవ్యాధులకు వైద్యపరీక్షలు
శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్06(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో నేడు(ఆదివారం) రిషిత చిన్న పిల్లల ఆసుపత్రిలో ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు కే.కాశీ విశ్వనాథ్ వైద్యులు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని చిన్నపిల్లల వైద్యులు సివీ మదన్ కుమార్ తెలిపారు.అన్ని రకాల చర్మవ్యాధులకు,ఎలక్ట్రోకాటరి, కెమికల్ ఫీలింగ్, స్కిన్ అలర్జీ, (పాదం,చేతులకు) అధిక చెమటకి చికిత్స, సోరియాసిస్,బొల్లికి ప్రత్యేక చికిత్స,సుఖవ్యాధులు, దాంపత్య సమస్యలకు కౌన్సెలింగ్,చికిత్సలపై ప్రతి నెల మొదటి,మూడోవ ఆదివారం రిషిత చిన్న పిల్లల ఆసుపత్రిలో చర్మవ్యాధి వైద్య నిపుణులు కే.కాశీ విశ్వనాథ్ అందుబాటులో ఉంటూ....పరీక్షలు నిర్వహించి,చికిత్సలు చేస్తారని ఆయన తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
$$$__________@@@__________$$$
వైకాపా, తెదేపా నుండి కాంగ్రెస్ లోకి చేరిక
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్06(వఇజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ శాసనసభ అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఆమడగూరు మండలం ఏ.కొత్తపల్లి గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీ వైసీపీ నుండి కాంగ్రెస్ లో చేరగా,వీరికి అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ప్రజాదరణ లభిస్తుందని,యువనేత రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గ్రామస్థాయిలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.
$$$__________@@@__________$$$
మహిళలకు నూతన వస్త్రాలు అందించిన ముస్లిం సోదరుడు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్06(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రానికి చెందిన తెదేపా జిల్లా మైనారిటీ కార్యదర్శి ఆరీఫ్ ఖాన్ శనివారం పవిత్ర రంజాన్ మాసం పురష్కరించుకుని మహిళలకు నూతన వస్త్రాలు ఉచితంగా అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రంజాన్ మాసంలో పేదలకు ఆహారం, నగదు, వస్త్రాలు, వస్తు రూపేణా సాయమందించడం ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగా వందమంది మహిళలకు చీరలు, నూతన వస్త్రాలు అందించినట్లు తెలిపారు.
$$$__________@@@__________$$$
వైకాపాతోనే రాష్ట్రాభివృద్ధి
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్06(విజయస్వప్నం.నెట్)
సియం జగనన్న వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం మండలంలోని గుండువారిపల్లి పంచాయతీ గ్రామాల్లో ఆయన పర్యటించి ఇంటింటికి వెళ్లి వైకాపా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలకు వివరించి ప్రచారం చేపట్టారు.వైకాపాకు ఓట్లు వేసి వైయస్ జగన్మోహన్ రెడ్డిని సియంగా,దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించాలని ఈసందర్భంగా దుద్దుకుంట కిషన్ రెడ్డి కోరారు.మండల వైకాపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శ్రీ కృష్ణ పరమాత్ముడు బోధించిన గీతా సారాంశాన్ని స్మరించాలి: సుధాశ్రీ
శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్ 06(విజయస్వప్నం.నెట్)
లోకా సమస్తా సుఖినో భవంతు అంటూ సమస్త మానవాళికి జీవన విధానం గురించి ,ధర్మ పరివర్తన గురించి, సనాతన ధర్మం వైభవం గురించి తెలిపేదే గీతా సారాంశమని, అటువంటి భగవద్గీత గురించి నేటి తరం మానవాళికి గీతాసారాంశం లోని పరమార్థం గురించి తెలపాలని గతేడాది మే 23 నుండి ఆన్లైన్ లో ప్రతి రోజూ రెండుగంటలు శ్లోకాలు తప్పులు లేకుండా ప్రతి ఒక్కరితో చదివించి దానికి భావం నేర్పించిన మడకశిరకు చెందిన గురువు సుధాశ్రీ ఆథ్యాత్మిక సేవా కార్యక్రమాలను పలువురు వక్తలు కొనియాడారు. ఈ ఆన్లైన్ లో వివిధ ప్రాంతాలకు చెందిన హైదరాబాద్,విజయవాడ,బెంగళూర్,తిరుపతి, ప్రొద్దుటూరు, కదిరి, మదనపల్లె,మడకశిర నుండి సభ్యులు భగవద్గీతలోని మొత్తం18 అధ్యాయాలు నేర్చుకొని మొదటగా కదిరి పట్టణంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రహ్లాద సమేత శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో భగవద్గీత పారాయణం బోధించారు.అందులో భాగంగానే గ్రూప్ లోని సభ్యులందరికీ సుధాశ్రీ గురువు,ఆలయ ఈఓ శ్రీనివాసులరెడ్డి, ఆలయ ఉప ప్రధానార్చకులు శ్రీకుమారరాజాస్వామి సమక్షంలో గీతా పారాయణం ప్రభోథించి, సంకీర్తనలు అలంపించారు. పలువురు భగవద్గీత యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. సహకరించిన ఆలయ ఈఓ శ్రీనివాసులు రెడ్డికి, ఆలయ ఉపప్రధాన అర్చకులు శ్రీకుమారరాజాస్వామికి, ఆలయ సిబ్బందికి,సహాయ సహకారాలు అందించిన వారికి కార్యక్రమం నిర్వాహకులు మించాల శ్రీదేవి, మించలా మురళి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
$$$__________@@@__________$$$
దంచికొడుతున్న ఎండలు....
ఇళ్ళల్లో ఉన్న తప్పని ఉక్కపోత,ఈ జాగ్రత్తలు తీసుకోండి....!!.
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్ 07(విజయస్వప్నం.నెట్)పెరిగిన ఉష్ణోగ్రతలు మండల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వీపరితమైన ఉక్కపోత,వేడిగాలులతో పిల్ల పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8దాటిందంటే చాలు ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలంటే ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.మండల కేంద్రంలో బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, వైఎస్సార్ కూడళ్లలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.మార్చి నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో పశు కాపరులు ఇబ్బందులు పడుతున్నారు.నీటిమట్టం తగ్గుముఖం పడుతుందడంతో నీటి కొరత కారణంగా పశువులకు నీటి కోసం సుదూర ప్రాంతాల బోరుబావులను ఆశ్రయిస్తున్నారు.ఏప్రిల్ మొదటి వారంలో రెండు మూడు రోజుల్లోనే 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.సాధరణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాల్పుల తీవ్రత కొనసాగుతోందని వాతావరణం నిపుణులు అంటున్నారు.తీవ్ర ఉష్ణోగ్రతలతో జ్వరాల బారినపడే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఇంట్లో ఉన్న కొన్నిసార్లు ఉక్కపోత అధికంగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇళ్ళల్లో ఉన్న సరే.... ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- ఇంట్లో ఉంటే ఏసీ లేదా ఫ్యాన్ల, కూలర్ల కింద ఉండాలి. ఇంట్లోకి వేడి గాలులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడగాల్పులు ఇంట్లోకి చేరకుండా కర్టెన్లు ఉపయోగించాలి. #వదులుగా ఉండే కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి.ఇవీ చెమటను పీల్చి శరీరానికి చల్లబడేటట్లు చేస్తాయి.ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 లోపు బయటకు వెళ్ళకుండ ఉండడం మంచిది.ఒకవేళ అత్యవసర పనులపై బయటకు వెళ్తే .... తప్పనిసరిగా గొడుగును ఉపయోగించాలి.
- ఇంట్లో ఉన్నా .... తరచుగా నీళ్ళు తాగాలి.ఉప్పు కలిపిన నిమ్మరసం లేదా మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకొంటే ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా లభించి వడదెబ్బ బారినపడకుండా కాపాడతాయి.ప్రతి ఒక్కరూ రోజుకు 4లీటర్లు నీరు తాగాలి, ఎండలో పని చేసేవారు అదనంగా మరో లీటరు నీరు తాగాలి.
- వేసవి కాలంలో కలుషితమైన నీళ్ల ముప్పు అధికం, ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగడం సరికాదు.ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళడం ఉత్తమం.బయట తినడం మానుకోవాలి. #ఎండాకాలంలో మద్యం శరీరానికి మరింత ముప్పు చేస్తుంది. డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది.కాబట్టి మద్యపానానికి దూరంగా ఉంటే మేలు.వేడిచేసి చల్లార్చి నీటిలో ఓఆర్ఎస్ పొడి కలుపుకుని తాగడం వల్ల డీహైడ్రేషన్ బారినపడకుండా చూసుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి