నేడు అమ్మవారి జ్యోతోత్సవం
ఘనంగా శ్రీచౌడేశ్వరిదేవి సూర్యప్రభ పల్లకి ఉత్సవం
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్26(విజయస్వప్నం.నెట్)
నేడు(శనివారం)ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తంరెడ్డి,పొట్టా జయదేవ్ రెడ్డి,పొట్టా మల్లికార్జునరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమడగూరు మండల కేంద్రంలో చౌడేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారి జ్యోతి మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జ్యోతి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి విచ్చేసే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సూర్యప్రభ పల్లకిలో అమ్మవారు దర్శనం ఈనెల 23 నుండి 30వతేది వరకు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం 4వరోజు అమడగూరు బ్రాహ్మణ సంఘం,శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి,అమ్మవారి విగ్రహాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించిన సూర్యప్రభ పల్లకిలో రాత్రివేళ ప్రధాన పురవీధుల్లో మేళతాళాలు,వాయిద్యాలతో భక్తులకు దర్శనార్థం ఊరేగింపు నిర్వహించారని తెలిపారు,గ్రామస్తులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
$$$__________@@@__________$$$
ఉపాధి పనులు పరిశీలించిన డ్వామా పీడీ
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్26(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలోని ఓడిచెరువు పంచాయతీ గ్రామ పెద్దచెరువు వద్ద కూలీలు చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను శుక్రవారం డ్వామా పీడీ విజయప్రసాద్ పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... 252 కూలీ నగదును ప్రభుత్వం 300 రూపాయలకు పెంచిందని,ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.వేసవిలో కూలీ పనులు చేపట్టే ప్రదేశాల్లో నీడ, నీరు ప్రథమ చికిత్స కిట్లు తప్పకుండా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని ఆయన సూచించారు.ప్రభుత్వం సరాపర చేసిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూలీలకు పంపిణీ చేశారు. ఉపాధి హామీ కూలీల హాజరు, మాస్టర్ తదితర రికార్డులు పరిశీలించారు.ఏపీడి శ్రీనివాసులురెడ్డి, ఏపీవో సుధాకర్, ఈసీ ఆంజనేయులు, ఏపీడి అసిస్టెంట్ ప్రతాప్ రెడ్డి, శారదా, సాంకేతిక, క్షేత్ర సహాయకులు రాజారెడ్డి, రాజేంద్ర, హనుమంతురెడ్డి, బాలరాజు, అబ్బులు తదితరులు ఉన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి