google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : విజయస్వప్నం.నెట్ పాఠకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు - ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..! - నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశం

17, ఏప్రిల్ 2024, బుధవారం

విజయస్వప్నం.నెట్ పాఠకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు - ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..! - నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశం

 విజయస్వప్నం.నెట్ పాఠకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

$$$__________@@@__________$$$

ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..!

సాధారణ ఎన్నికలు - 2024లో నిర్భయంగా ఓటు  వేసేందుకు ముందుకు రావాలి: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి,ఏప్రిల్16(విజయస్వప్నం.నెట్)

ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మంగళవారం జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఓప్రకటనలో పేర్కొన్నారు.సాధారణ ఎన్నికలు 2024 కొరకు ప్రిసిడింగ్ అధికారులు, సహాయ ప్రిసిడింగ్  అధికారులు, ఇతర పోలింగ్ అధికారులకు పోస్టల్ బ్యాలెట్ కొరకు ఫారం12 దరఖాస్తులు పూర్తి చేసి ఈనెల 24. 25తేదీలలో తమ ఓటు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అందజేయాలని కలెక్టర్  తెలిపారు.

$$$__________@@@__________$$$

రేపు తెదేపా ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి నామినేషన్అ

ధికసంఖ్యలో కార్యక్రమాన్ని విజయవంతం:మాజీ మంత్రి  పల్లె రఘునాథ్ రెడ్డి 

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఏప్రిల్16(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి నియోజకవర్గం తెదేపా ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి 18న(రేపు) గురువారం నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం ఉదయం10 గంటలకు తెదేపా ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డితో పాటు యువనేత పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి,పల్లె రఘునాథ్ రెడ్డి నామినేషన్ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల టర్నింగ్ అధికారికి అందజేస్తారని తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా మండల,గ్రామస్ధాయిలో తెదేపా,జనసేన,బిజెపి నాయకులతోపాటు అయా పార్టీల కార్యకర్తలు,అభిమానులు ,మహిళలు పెద్ద ఎత్తున పుట్టపర్తికి తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని ఆయన కోరారు.

$$$__________@@@__________$$$

నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేయాలి

రిటర్నింగ్, నోడల్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశం

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఏప్రిల్16 (విజయస్వప్నం.నెట్)

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి  నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చేయాలని,జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్  పి.అరుణ బాబు  అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను  ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ భవనంలో  అన్ని విభాగాల నోడల్ అధికారులతో కలిసి సాధారణ ఎన్నికల సన్నద్ధతపై అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారు (ఆర్వో)లు, ఈ ఆర్వోలతో జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్  పి.అరుణ్ బాబు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓపి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.ఈసందర్భంగా జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి పి అరుణ బాబు మాట్లాడుతూ.. ఈ నెల 18న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపధ్యంలో అదే రోజు నుండి అభ్యర్థుల నామినేషన్ దాఖల ప్రక్రియ ప్రారంభం కావడంతో అన్ని నియోజకవర్గాల ఆర్వోలు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు.ఎక్కడా కూడ మోడల్ కోడ్ ఆఫ్ కాండెక్ట్ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఫారం వన్ నియోజకవర్గంలోని అన్ని ప్రముఖ కార్యాలయాల ప్రదేశాలలో ప్రచురణ చేయాలని,నామినేషన్ స్వీకరించడానికి ఉద్దేశించిన గదిలో 360 కోణంలో పనిచేసే సీసీ కెమెరా  అమర్చాలని,రాకపోకల కొరకు ఉద్దేశించబడిన ద్వారాన్ని సీసీ కెమెరా రికార్డ్ చేయాలని,నామినేషన్ వేసే అభ్యర్థులు 3 వాహనాలలో రావాల్సి ఉంటుందని,అటువంటి వాహనాలను ఆర్ఓ రూముకు 100 మీటర్ల దూరంలో ఆపాలని,నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థితో పాటుగా మరో నలుగురు మొత్తం ఐదు మంది రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రావచ్చునని,డి.ఎస్.పి కి తక్కువ ర్యాంకు కానీ అధికారిని నోడల్ ఆఫీసర్ గా నియమించాలని,ఆర్వో అభ్యర్థులకు ఇచ్చే చెక్ లిస్టును డూప్లికేట్ తయారు చేసుకోవాలని,పోటీ వేసే(నామినేషన్ వేయు)ప్రతి అభ్యర్థి తన పేరున ఏదైనా బ్యాంకులో కొత్తగా అకౌంటును ఓపెన్ చేసిన వివరాలను నామినేషన్ తో పాటు రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలని,నామినేషన్ వేసే ముందు రోజుకూడా అకౌంటును బ్యాంకులో ప్రారంభించవచ్చని,ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు,సిబ్బందికి కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియకు సంబందించిన కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు.ఇందు కోసం ముగ్గురు అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.రెండో విడత పిఓలకు,ఏపీవోలకు మే నెల 4,5 తేదీలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.మే నెల 7,8 తేదీలలో ఓపిఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం నమోదు చేసుకున్న వారందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో  మౌలిక వసతులు కల్పించాలని,ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్నిరకాల ఏర్పాట్లను సంబంధిత ఏఆర్వోల ద్వారా సిద్ధం చేసుకోవాలన్నారు.అన్ని నియోజకవర్గాలకు నిర్దేశించిన కౌంట్ మేరకు ఈవిఎం,,వివిప్యాడ్ సామగ్రిని భద్రంగా చేర్చలన్నారు.ప్రధానంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద టాయిలెట్లు,తాగునీరు,ట్రాన్స్పోర్టషన్, షామియానాలు,పార్కింగ్ స్థలం, ప్రధమ చికిత్స బాక్సులు,సూచిక బోర్డులను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు.ప్రత్యేకించి.. దివ్యంగులు,సీనియర్ సిటీజన్లు,ట్రాన్స్ జెండర్ ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్దేశించిన ఏర్పాట్లను చేయాలన్నారు.అలాగే.. హోమ్ ఓటింగ్ కు అర్హులైన ఓటర్ల డేటా సేకరణ పూర్తి చేయాలని,జిల్లాలో ఓటింగ్ శాతం పెంచడంపై ఆర్వోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఫెసిలిటేషన్ సెంటర్ ధర్మవరంలో ఏర్పాటు చేయాలని ధర్మవరం ఆర్ వో ను ఆదేశించారు.ఈనెల 17 ,18 తేదీలలో అబ్జర్వర్లు రానున్నారని,అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలిపారు.ఎన్నికల నోటిఫికేషన్ ముందురోజే... గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి నామినేషన్ దాఖలకు సంభందించిన గైడ్ లైన్లు తెలిపారని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. హిందూపురం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి,జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్,పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్,కదిరి ఆర్డీవో వంశీకృష్ణ,మడకశిర నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి గౌరీ శంకర్,పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ,జిల్లాలోని సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

వైకాపాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్16(విజయస్వప్నం.నెట్)

మండలంలోని మామిళ్ల కుంట పల్లి పంచాయతీ పరిధిలోని సుందరయ్య కాలనీ, ఎం.కొత్తపల్లి,వడ్డివారి పల్లి,తొట్లివారిపల్లి,మామిళ్ళకుంటపల్లి గ్రామంలో మంగళవారం పుట్టపర్తి శాసనసభ్యులు, వైకాపా పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి  తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి ప్రచారం చేపట్టిన్నట్లు వైకాపా శ్రేణులు తెలిపారు.గ్రామంల్లో ఆయన ప్రతి గడప తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారని,ఈసందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.... జగనన్న  చేస్తున్న సంక్షేమం శ్రీధరన్న  చేస్తున్న అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ఫ్యాను గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిగా,మీబిడ్డ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని పుట్టపర్తి ఎమ్మెల్యేగా మరోసారి ఆశీర్వదించాలని ఆయన ఈసందర్భంగా ప్రజలను కోరారు.కార్యక్రమంలో స్థానిక నాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్య పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి