అయ్యప్పస్వామి ఆలయంలో విషు పూజ
ఓబుళదేవరచెరువు ఏప్రిల్14 (విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బంగారు బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు. యేటా కేరళ నూతన సంవత్సరం సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో మేల్ తాంత్రీ మహేష్ నంబూద్రి తాంత్రీ బ్రహ్మశ్రీ మహేష్ మొహనారు స్వామి వారి ఆధ్వర్యంలో స్వామివారికి సుప్రభాత సేవ, పుష్పయాగం, పడిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. అందులో భాగంగా అయ్యప్పస్వామి సన్నిధానంలో పసుపు, కుంకుమ, అభిషేకాలు పూజలు నిర్వహించి, స్వామివారి మూలవిరాట్ విగ్రహానికి పట్టు వస్త్రం, వివిధ పుష్పాలతో అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి, కర్పూర హారతి నీరాజనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారన్నారు.
$$$__________@@@___________$$$
తనకల్లులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ
శ్రీసత్యసాయిజిల్లా తనకల్లు ఏప్రిల్14(విజయస్వప్నం.నెట్)
తనకల్లు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు.నల్లచెరువుకు చెందిన బెంగుళూరు రియల్టర్ పాలెం సుధాకర్ కార్యక్రమాలలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజ పూలమాల వేసి నివాళులు అర్పించారు.కదిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి కార్యక్రమానికి విచ్చేసి మాట్లాడారు.భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప రాజ్యాంగం రచించిన మహనీయుడు బిఆర్ అంబేడ్కర్ ఆశయాల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ కూడా నడవాలని కోరారు.బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన వందలాది మందికి పాలెం సుధాకర్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.దళిత సంఘాల నాయకులు,ప్రజా సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో.... భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆదివారం
కదిరి, పుట్టపర్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, నచ్చు బాలకృష్ణ యాదవ్, కదిరప్ప తదితరులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఘనంగా పాల్గొన్నారు. కొత్తచెరువు మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బెల్లం నజీర్ అద్వర్యంలో భారతరత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినట్లు బీసీ రాష్ట్ర సమన్వయకర్త నచ్చు బాలకృష్ణ యాదవ్ తెలిపారు. కదిరి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినట్లు తెలిపారు.
తనకల్లు ప్రెస్ క్లబ్ లో.... తనకల్లు మండల కేంద్రంలోని ప్రజా ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ పార్టీల నాయకులు,అంబేద్కర్ అభిమానులు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@___________$$$
తెదేపా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పవన్ కుమార్ రెడ్డి
శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్14(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణానికి చెందిన పవన్ కుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు అచ్చంనాయుడు ద్వారా ఆదివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.తెదేపాలో సేవలను గుర్తించి ఎంతో నమ్మకంతో రాష్ట్రస్థాయి పదవి అందించిన తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకు,రాష్ట్ర అధ్యక్షులు అచ్చంనాయుడుకు పవన్ కుమార్ రెడ్డి ఈసందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనకు రాష్ట్రస్థాయి పదవి రావడానికి సహకరించిన కదిరి నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు.తెదేపా బలోపేతానికి కృషి చేస్తానని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిచేందుకు తన వంతుగా శ్రమిస్తున్నారని పవన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
$$$__________@@@___________$$$
అంబేద్కర్ ఆశయాలను ఆచరిద్దాం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్14(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆదివారం అఖిల భారత బంజారా సేవా సమితి, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు యం,రమణా నాయక్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి ప్రసాదించిన నాయకుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అని,ఆయన అడుగుజాడల్లో పయనించి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని అప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళులర్పించిన వారమవుతామన్నారు. ప్రతి దినం మన దేశ రాజకీయాలను ప్రశ్నించాల్సిన ప్రజానీకానికి బీజం నాటిన నిఖార్సైన సాంఘిక విప్లవవాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఒడిసి మండల ఏఐబిఎస్ఎస్ ఉపాధ్యక్షుడు లాల్కనాయక్,రమేష్ నాయక్,ఉపాధ్యాయులు బాబు నాయక్,సుధాకర్ నాయక్, 108 భాస్కర్ నాయక్, సునీల్, వేణు, మోహన్ ఆర్సీఎల్ రమేష్ నాయక్, ఆనంద కిష్టప్ప, సుధాకర్, రామంజి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహ కమిటీ, బీసీ సంక్షేమ సాధన సమితి,వివిధ పార్టీల నాయకులు ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఎర్రదొడ్డప్ప, బావన్న, ముద్ధలపల్లి శ్రీనివాసులు, ఆనంద్, నర్సింహులు, సిపిఎం నాయకులు వివి రమణ, కుళ్ళాయప్ప, శ్రీరాములు, ఉద్యోగ సంఘాల నాయకులు లైన్ మేన్ రామాంజనేయులు, నర్సింహులు, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్, ప్రజా సంఘాల నాయకులు షబ్బీర్, గోపాల్ నాయక్ తెదేపా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$__________@@@___________$$$
సియం వైఎస్ జగన్ పై రాళ్ళ డాడి హేయమైన చర్య
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్14(విజయస్వప్నంనెట్)
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేయడం హేయమైన చర్యగా వైకాపా నాయకులు అభివర్ణించారు. ఆదివారం మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద సియం జగన్ పై రాళ్ళ డాడి నిరసిస్తూ మండల వైకాపా శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీనివాసులురెడ్డి, మండల కన్వీనర్ రాజునాయుడు, ఎంపీపీ పర్వీన్ షామీర్ భాను, జెడ్పీటీసీ దామోదర్ రెడ్డి, అగ్రికల్చర్ అడ్వైజ్ ఛైర్మన్ లక్ష్మీపతి, పట్టణ, గ్రామ కన్వీనర్లు కోళ్ళ కృష్ణారెడ్డి, మండోజీ ఆరీఫ్ ఖాన్, సర్పంచుల సంఘం అధ్యక్షులు బోయపాటి జగన్మోహన్ చౌదరి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితర వైకాపా నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.... సియం జగన్ పై రాళ్ళ డాడి తెదేపా రాజకీయ కుట్రగా విమర్శించారు. సియంపై దాడి చేసిన సంఘటనపై ప్రతి ఒక…
$$$__________@@@___________$$$
ఘనంగా యోగి వేమన బ్రహ్మోత్సవాలు ప్రారంభం
శ్రీసత్యసాయిజిల్లా గాండ్లపెంట ఏప్రిల్14(విజయస్వప్నం.నెట్)
గాండ్లపెంట మండలం కాటరుపల్లిలో ఆదివారం శ్రీ యోగి వేమన బ్రహ్మోత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.14 నుండి 17వతేది వరకు 4రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.మొదటిరోజు ఆదివారం మహాశక్తి పూజా,కుంభం ప్రత్యేక పూజలు నిర్వహించి,బుర్రకథ కాలక్షేపం,రెండవరోజు సోమవారం బండ్లు తిరగడం,పానక వంద్యారము, రాత్రి వేళల్లో ఆర్కెస్ట్రా , మూడోవ రోజు మంగళవారం ఉట్ల తిరుణాల,రాత్రి అగ్నిసేవ,నాల్గవరోజు బుధవారం గొడుగుల ఊరేగింపు ఉత్సవంతో శ్రీ యోగి వేమన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.సుదూరం నుండి విచ్ఛేసే భక్తులకు అన్నదాన, తాగునీరు సౌకర్యాలు కల్పిస్తూ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నమన్నారు.
$$$__________@@@___________$$$
నారా లోకేష్ సమక్షంలో టీడీపీలోకి చేరిన పుట్టపర్తి వైకాపా ముఖ్య నాయకులు
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి;14(విజయస్వప్నం.నెట్)
తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ బాబు సమక్షంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరినట్లు పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు లాయర్ రాజశేఖర్,వీర నారాయణ,వెంకటేష్, నాగరాజు,రామమోహన్ తో పాటు పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు.సియం జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి బాగా కుంటుపడిందని, తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని, వైకాపా పాలనలో ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగదని భావించే తాము తెదేపాలోకి చేరినట్లు వారు తెలిపారు.పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అధ్వర్యంలో పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన వైకాపా ముఖ్య నాయకులు తెల్లమర్ల సర్పంచ్ బిల్లే రత్నం,ఖమ్మం రవీంద్ర,పవన్ కుమార్,సందీప్,నాగేంద్ర,నాగరాజు,ఇరగంపల్లి మాజీ సర్పంచ్ ఆదినారాయణ నారా లోకేష్ బాబు సమక్షంలో టీడీపీ లోకి చేరారు. తెదేపాలోకి చేరిన వారిలో పుట్టపర్తి నియోజక వర్గానికి చెందిన వైకాపా ముఖ్య నాయకులు ఓడిచెరువు మండలం తంగేడు కుంట పంచాయతీ గొల్లవారిపల్లికి చెందిన లాయర్ శెట్టివారి రాజశేఖర్,కుసుమవారిపల్లి జయరామిరెడ్డి,గౌనిపల్లి మాజీ సర్పంచ్ శంకర్ గుప్తా,లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి వీరనారాయణ,రామ్మోహన్, అమడుగురు చెందిన లాయర్ వెంకటేష్,సింగల్ విండో మాజీ అధ్యక్షుడు నాగరాజు,బలిజపల్లి చెందిన భాస్కర్ ఆమడగూరు మండలం కొలిమిరాలపల్లికి చెందిన అనిల్ కుమార్ ,భగవాన్ సుబ్బాచారి శ్రీనివాసులు కృష్ణమూర్తి,కొత్తచెరువు మండలానికి చెందిన సుబ్బాచారి,ఉప సర్పంచ్ నర్సింహులు,రాజగోపాల్,శ్రీకాంత్,చైతన్య,వీరేష్,నాగ తేజ, ఓడిచెరువుకి చెందిన బైరిశెట్టి, వెంకటరమణా, లక్ష్మీనారాయణచారి, సురేష్ బాబు,బాలకృష్ణ, శంకర్ నారాయణ, రామిశెట్టి, రమణ, వెంకటరమణ, వివేక్, శ్రీనివాసులు, నరసింహారెడ్డి, అమగొండ పాల్యం నరసింహులు, నాగరత్నప్ప, కప్పలబండకు చెందిన రోశయ్య, చౌదరి,సాయిప్రసాద్,పవన్ కుమార్,గౌతమ్,నల్లమాడ మండలం చెరువు నరేంద్రరెడ్డి,పుట్టపర్తికి చెందిన సజ్జల మహేశ్వర్ రెడ్డితోపాటు పలువురు వైకాపా నాయకులు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అధ్వర్యంలో .హైదరాబాద్ లో నారా లోకేష్ బాబు స్వగృహంలో తెదేపాలోకి చేరగా నారా లోకేష్ చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
$$$__________@@@___________$$$
వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్14 విజయస్వప్నం.నెట్)
మండలంలోని సున్నంపల్లి పంచాయతీ వంచిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో కదిరి,హిందూపురం ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.హిందూపురం నుండి కదిరికి ద్విచక్ర వాహనంపై యువకుడు ఆన్సర్ వెళ్తుండగా మార్గమధ్యంలో వంచిరెడ్డిపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో యువకుడికి తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని 108 సిబ్బంది ప్రధమ చికిత్స అందించి, కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
$$$__________@@@___________$$$
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్14(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో ఆదివారం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి రాస్తారోకో చేసిన వైకాపా శ్రేణులపై చర్యలు తీసుకోవాలని తెలుగుయువత పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షులు బూదిలి ఓబుల్ రెడ్డి డిమాండ్ చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేస్తే వాటిని తెదేపా వారు చేశారని చిత్రీకరించి మండల కేంద్రంలో కదిరి, హిందూపురం ప్రధాన రహదారిపై రాస్థా రోకో నిర్వహించి ప్రజల రాకపోకలకు ఆటకం కలిగించారన్నారు.కావున ఎన్నికల కోడ్ ఉల్లంగించిన వైకాపా నాయకులపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
$$$__________@@@___________$$$
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్14(విజయస్వప్నం.నెట్)
డాక్టర్ బిఆర్ అంబేద్కర్133వ జయంతి సందర్భంగా ఆదివారం ఏపీఎస్పిటిడి జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కదిరి పరిధిలోని మొటుకుపల్లి ఆర్డిటి ప్రత్యేక పాఠశాలలో విద్యార్థినీ,విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జై భీమ్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఏపీ ఎస్పిటిడి కదిరి డిపో ఉద్యోగుల సహకారంతో డాక్టర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.గంగరాజు, కార్యదర్శి గంగాధర, నాయకులు ఎస్వీ నర్సు,శ్రీరాములు,జీఎం. స్వామి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@___________$$$
నేడు దుద్దుకుంట ఆధ్వర్యంలో..... వడ్డెర్ల, బీసీ ఆత్మీయ సమ్మేళనం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్14(విజయస్వప్నం.నెట్)
నేడు సోమవారం ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలో ఎస్బిఐ సమీప మైదానంలో పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా వడ్డెర్ల, బీసీ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆదివారం మండల వైకాపా నాయకులు పేర్కొన్నారు.3 మండలాలకు చెందిన వడ్డెర్లు, బిసి నాయకులు పాల్గొంటారని, కావున మండలంలోని గ్రామాల నుండి అధికసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
$$$__________@@@___________$$$
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్14(విజయ స్వప్నం.నెట్)
పదవ తరగతి 2005 -06 బ్యాచ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగేడుకుంట విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరూ పాల్గొని తమ తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. రోజంతా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఉపాధ్యాయులు చెన్నారెడ్డి, జయ చంద్రారెడ్డి, రాధమ్మ, కృష్ణమూర్తి, జనార్ధన్, నరేష్, పఠాన్ బాబాద్దీన్ ఖాన్, రవికుమార్, సునీత, రెహనా, మధుసూదన్, కరుణాకర్ రెడ్డి పాల్గొని పూర్వ విద్యార్థులను ఉద్దేశించి సందేశం ఇచ్చారు.విద్యార్థులు సేవా గుణాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులచేత గురువులకు ఘనంగా సన్మానం చేశారు.కార్యక్రమ నిర్వాహణ కమిటీ సభ్యులైన విద్యార్థులు మాట్లాడుతూ 19 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఉపాధ్యాయుల చల్లని దీవెనలే తాము ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు.ఈకార్యక్రమంలో జగన్, అశ్విని, మూర్తి, శశికళ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి