google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు చురుకుగా పని చేయాలి :జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు

21, ఏప్రిల్ 2024, ఆదివారం

ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు చురుకుగా పని చేయాలి :జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు

ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు చురుకుగా పని చేయాలి

-జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి,ఏప్రిల్ 20(విజయస్వప్నం.నెట్)

ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు చురుకుగా పని చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు శనివారం ప్రకటనలో తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలు నిర్వహణ మోడల్ కోడ్ ఆప్ కండక్ట్ లో భాగంగా 50 వేలకు మించి విలువ గల నగదు, ఆభరణాలు,వస్తువులు తరలించకూడదనే నిబంధనలను అతిక్రమించి జిల్లాలోని ఫ్లయిండ్ స్క్వాడ్ బృందాలు వివిద ప్రాంతాలలో సీజ్ చేసిన మొత్తాలు, అభరణాలు,వస్తువులను జిల్లా కలెక్టర్ శ్రీ సత్యసాయి జిల్లా వారు నియమించిన త్రిసభ్య కమిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్, డి.ఆర్.డి.ఏ జిల్లా సహకార శాఖ ఆడిట్ అధికారి,అసిస్టెంట్ ట్రెజరీ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. కావున జిల్లాలోని ప్రజలు ఎవరైనా మీ మొత్తాలు, ఆభరణాలు,వస్తువులు సీజ్ చేసిన యెడల తమ తమ పూర్తి ఆధారాలతో శ్రీయుత జిల్లా కలెక్టర్,శ్రీసత్యసాయి వారు నియమించిన త్రిసభ్య కమిటీ ఎదుట హాజరై ఆధారాలు సమర్పించి 24 గంటలలోపు సీజ్ చేసిన మొత్తాలు ఆభరణాలు,వస్తులువు తిరిగి మీరు తీసుకొనుటకు కావలసిన ఉత్తర్వులు జారీచేశారని, కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఇందులో మీకు మరిన్ని వివరములు కొరకు ప్రాజెక్ట్ డైరెక్టర్.డి.ఆర్.డి.ఏ వారి 9154840096 నంబరును సంప్రదించాలని సూచించారు.

$$$___________@@@__________$$$

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్20(విజయస్వప్నం.నెట్)

తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మండలంలోని గ్రామాల్లో శనివారం తెదేపా శ్రేణులు ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలో తెదేపా మండల కన్వీనర్ జయచంద్ర, కొండకమర్ల పంచాయతీ గ్రామ తెదేపా కార్యాలయంలో పార్లమెంట్ రైతు కోఆర్డినేటర్ ఆర్ఎంపీ డాక్టర్ జాకీర్ అహ్మద్ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొని చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అక్షరాలతో తయారు చేసిన కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్ధించారు.రాబోయే ఎన్నికల్లో తెదేపాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, పల్లె సింధూరరెడ్డి ఎమ్మెల్యేగా, చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని,ప్రతి ఒక్కరూ సైనికుడిలా శ్రమించాలని పార్టీ నాయకులు ఈసందర్భంగా కోరారు.ఈకార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి పీట్ల సుధాకర్,ఎస్సీ సెల్ నాయకులు బడిశం రామాంజనేయులు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి అంజనప్ప, మైనారిటీ సెల్ నాయకులు టైలర్ నిజాం, గండికోట ఇర్షాద్,ఆరీఫ్,షాను, తొళ్ళ నరసింహులు, మీడియా కోఆర్డినేటర్ కుంచపు ఆంజనేయులు, మీసేవ సుధాకర్, సౌదీ నాగరాజు మహిళా కార్యకర్తలు మస్తానమ్మ, అఖిల, జ్యోతి, రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు.

$$$___________@@@__________$$$

నేడు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పర్యటన 

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్20(విజయస్వప్నం.నెట్)

నేడు(21వతేది)ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మండల వ్యాప్తంగా పర్యటించే షెడ్యూల్ వివరాలు శనివారం వైకాపా శ్రేణులు తెలిపారు.ఆదివారం ఉదయం 7:30 తంగేడుకుంట గ్రామంలో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడి అనంతరం *అల్లాపల్లిలో 8:30గంటలకు, సున్నంపల్లిలో 9:30 గంటలకు, తిప్పేపల్లిలో 10:30 గం", ఓడిచెరువులో11:30 గం", మామ్మిళ్ళకుంట్లపల్లిలో మధ్యాహ్నం 12:30 గం", డబురువారిపల్లిలో 3 గంటలకు, కొండకమర్లలో4 గంటలకు పర్యటించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తల  సమావేశంలో పాల్గొంటారని. కావున ఈ సమావేశాలకు మండలంలోని వైకాపా శ్రేణులు కుటుంబసభ్యులందరు  హాజరు కావాలని పిలుపునిచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి