google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : ఓడిచెరువులో బీఎస్ఎఫ్ భద్రతా దళాలు కవాతు

10, ఏప్రిల్ 2024, బుధవారం

ఓడిచెరువులో బీఎస్ఎఫ్ భద్రతా దళాలు కవాతు

 ఓడిచెరువులో బీఎస్ఎఫ్ భద్రతా దళాలు కవాతు





శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్ 10(విజయస్వప్నం.నెట్)

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఓడిచెరువు మండల కేంద్రంలో 30 మంది బీఎస్ఎఫ్ భద్రతా జవాన్లు, 30 మంది స్టేషన్ పోలీసులు కలసి కవాతు నిర్వహించారు. బిఎస్ఎఫ్ డిఎస్పీ గౌతమ్ కుమార్, నల్లమాడ సిఐ రాజేంద్రనాధ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా.... ఓడిచెరువు, అమడగూరు, నల్లమాడ ఎస్ఐలు వంశీకృష్ణ, మగ్బుల్ బాషా, రమేష్ బాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా పోలీసుస్టేషన్ నుండి ప్రధాన పురవీధుల్లో కవాతు సాగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..‌‌.. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో సజావుగా జరగాలని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణలో ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజ్యంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

$$$__________@@@__________$$$


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి