google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : సింహా వాహనంపై శ్రీచౌడేశ్వరి అమ్మవారు దర్శనం

30, ఏప్రిల్ 2024, మంగళవారం

సింహా వాహనంపై శ్రీచౌడేశ్వరి అమ్మవారు దర్శనం

సింహా వాహనంపై శ్రీచౌడేశ్వరి అమ్మవారు దర్శనం


శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్29(విజయస్వప్నం.నెట్)

ఈనెల 23 నుండి 30వతేది వరకు శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి జ్యోతి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గురువారం 7వరోజు కొలిమిరాళ్ళపల్లి గ్రామ వాస్తవ్యులు కీ"శే" కడగట్టు సావిత్రమ్మ, సుబ్బారెడ్డి,భాస్కర్ రెడ్డి వీరి జ్ఞాపకార్థం జెడ్పీటీసీ కడగట్టు కవిత శివశంకర్ రెడ్డి, వరుణ్ తేజ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయ దారులుగా ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి,పల్లకిలో అమ్మవారి విగ్రహాన్ని పుష్పాలతో అలంకరించిన సింహా వాహనంపై రాత్రివేళ  గ్రామ పురవీధుల్లో మేళతాళాలు,వాయిద్యాలతో భక్తులకు దర్శనార్థం ఊరేగింపు నిర్వహించారు,గ్రామస్తులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీచౌడేశ్వరిదేవి బ్రహ్మోత్సవ అమ్మవారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు అన్నదాన, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

పలువురు తెదేపా నుండి వైకాపాలోకి చేరిక    


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు(పుట్టపర్తి) ఏప్రిల్29(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి నియోజకవర్గం ఓడిచెరువు మండలంలోని కొండకమర్ల పంచాయితీ గ్రామాల తెదేపాకు చెందిన 27కుటుంబాలు  పుట్టపర్తి శాసనసభ్యులు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి  సమక్షంలో వైకాపాలోకి చేరారు.

వైకాపాలోకి చేరిన వారిలో చిట్టిబాబు, వెంకటలక్ష్మి, రామ్ లక్ష్మమ్మ, గాయత్రి భాయ్, వసంత భాయ్, సావిత్రిబాయి, లక్ష్మీదేవి, మహేష్, రియాజ్ అహ్మద్, రషీద్ అబ్దుల్, హైదర్ వలీ, ధర్మవరం రాజా, షేక్షా తదితరులు వున్నారు. చేరిన వారికి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కండువాలు కప్పి వైకాపాలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఎమ్మెల్యేగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గెలవాలి

కడప పట్టణ అమీన్ పీర్ దర్గా లో మండోజీ ఆరీఫ్ ప్రార్థన

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్29(విజయస్వప్నం.నెట్)

సార్వత్రిక ఎన్నికల్లో శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలని సోమవారం కడప పట్టణంలో అమీన్ పీర్ దర్గాలో ఓడిచెరువు పంచాయతీ వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షులు మండోజీ ఆరీఫ్ ఖాన్ ప్రార్థనలు చేశారని విజయస్వప్నం ప్రతినిధికి తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ....పరమ పవిత్రమైన ఆథ్యాత్మిక పుణ్యభూమిలో వెలసిన అమీన్ పీర్ దర్గా ప్రశాంతత నిలయమని,ఎందరో మహానుభావులు నడియాడిన పుణ్యశిఖరమని,భక్తుల కొంగు బంగారంగా,మతసామరస్యానికి,జాతీయ సమైక్యతను చాటి చెప్పే అమీన్ పీర్ దర్గాలో  సమస్యలు చెప్పుకుని ప్రార్థనలు చేస్తే అన్ని నెరవేరుతాయని విశ్వాసంతో కడప పట్టణంలో సందర్శించి పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అఖండ విజయం సాధించాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.    జగనన్న సీఎం కావడం ఖాయం          2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అఖండ విజయం సాధించి మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలౌకి రావడం ఖాయమని ఓడిచెరువు పంచాయతీ గ్రామ వైకాపా అధ్యక్షులు మండోజీ ఆరీఫ్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగనన్న సారధ్యంలో వైకాపా ప్రభుత్వంలో ఎవ్వరి ప్రమేయం లేకుండా,అవినీతికి చోటు లేకుండా పాదయాత్రలో ఇచ్చిన హామీలను నవరత్నాలు, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి అందించి పేదప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని,రాష్ట్రంలో వైకాపా అత్యధిక స్థానాల్లో గెలుపొంది జగనన్న సీఎం కావడం ఖాయం అని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

$$$__________@@@__________$$$

పల్లె సింధూరమ్మ ను ఆశీర్వదించండి l

 సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి 

 చంద్రన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం

 ఎన్నికల ప్రచారంలో యువ నేత పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్29(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా కూటమి అభ్యర్థి పల్లె సింధూరమ్మను గెలిపించాలని టీడీపీ యువ నాయకుడు పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓడిచెరువు మండలంలోని డబురువారిపల్లి పంచాయతీ కుసుమవారిపల్లి,మామిళ్ళకుంట్లపల్లి పంచాయతీలోని ఎం.కొత్తపల్లి,వడ్డివారిపల్లి,తోట్లిపల్లి  గ్రామాల్లో తెదేపా అభ్యర్థి పల్లె సింధూర గెలుపుకు మద్దతుగా సోమవారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.యువనేత పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డికి గ్రామస్తులు పూలు చల్లి కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పల్లె కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, పుట్టపర్తి తెదేపా ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెదేపా విజయం ఖాయమన్నారు.ఈ ఐదేళ్ల వైకాపా పాలనలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారని విమర్శించారు.పుట్టపర్తి గడ్డపై తెదేపా జెండా ఎగురవేసి అమరావతిలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓడిచెరువు మండల తెదేపా,జనసేన,బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 టీడీపీ ప్రచారంలో కవ్వింపుకలకు దిగిన వైసీపీ నేతలు 

 వైసీపీ ప్రచార రథాన్ని అడ్డుపెట్టి టీడీపీని ఆపగలరా 

 మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి 

పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డికి మద్దతుగా టిడిపి యువనేత పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండడంతో వైసిపి నాయకులు వైసిపి ప్రచార రతాన్ని అడ్డుపెట్టి కవ్వింపులకు దిగడం మంచిది కాదని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హెచ్చరించారు.

వైసీపీ రెచ్చగొట్టడం వల్లే వివాదం 

 టీడీపీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్న సమయంలో వైసీపీ ప్రచార రథాన్ని టీడీపీ కార్యకర్తల ముందు అదే పనిగా తిప్పి అదే పనిగా రెచ్చగొట్టే చర్యలకు దిగారు. ఇలా పదే పదే రథాన్ని తిప్పవద్దని టీడీపీ కార్యకర్తలు చెప్పినా వినకుండా అదే పనిగా పలు మార్లు అడ్డుగించి కవ్వింపు చర్యలకు దిగడంతో ఈ వివాదం చెలరేగిందన్నారు.

 దీంతో వైసీపీ నాయకులు అక్కడికి చేరుకొని టీడీపీ కార్యకర్తలతో గొడవకు దిగారు. దీంతో అక్కడ ఇరు పార్టీల కార్యకర్తలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ వివాదం పెద్దది కావడంతో పోలీసులు వచ్చి ఇరుపార్టీలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. 

అయితే వైసీపీ పెద్దల జోక్యంతో రాజకీయ డ్రామా మొదలైంది.  వైసీపీ నేతలు నుంచి పోలీసులకు తీవ్ర ఒత్తిళ్లు రావడం టీడీపీ కార్యకర్తల్ని  మాత్రమే పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు. ఈ వివాదంపై మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి స్పందించి వైసీపీ వారు కవ్వింపులకు దిగడంతో ఈ వివాదం చెలరేగిందన్నారు . టీడీపీ కార్యకర్తల్నే ఏక పక్షంగా పోలీసులు ఇబ్బంది పెట్టడం సరైన చర్య కాదని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఇదే విధంగా వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి