31, మార్చి 2024, ఆదివారం

అంగరంగ వైభవంగా ఖాద్రీశుడు బ్రహ్మోత్సవం

 జయ జయ సింహా.... జయ నరసింహా....!!

అంగరంగ వైభవంగా ఖాద్రీశుడు బ్రహ్మోత్సవం

మొక్కులు తీర్చుకున్న లక్షలాది భక్తులు

శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి30 (విజయ స్వప్నం.నెట్) 






కదిరి పట్టణంలో శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి  బ్రహ్మరథోత్సవం లక్షలాది మంది భక్తుల మధ్య స్వామివారి నామస్మరణలతో అంగరంగ వైభవంగా   నిర్వహించారు. పక్షం రోజులు స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో భాగంగా పుష్కరం రోజు(12వరోజు)శనివారం ఉదయం 7:20 నుండి 8;10 శుభ ఘడియల్లో శ్రీదేవి, భూదేవి సమేతంగా ఖాద్రీశుడు ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించారు.8:12 గంటలకు స్వామివారు కొలువైన రథం ముందుకు కదిలి తిరువీధుల్లో స్వామివారు దర్శనం ఇస్తూ 12:56 గంటలకు స్వామివారి బ్రహ్మరథం యధాస్థానానికి చేరుకొంది.ఉదయం ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు ఆలయ అర్చక బృందం రథం ముందు బలిహరణం, ఆస్థాన పూజలు నిర్వహించి బ్రహ్మరథోత్సవం ప్రారంభించగా ఈఓ శ్రీనివాసులురెడ్డి బలిహరణం పూజలో పాల్గొని రథం తిరువీధుల్లో విహరిస్తూ యథాస్థానానికి చేరుకోనే వరకు దగ్గర వుండి పర్యవేక్షించారు.మండుతున్న ఎండలు సైతం ఏమాత్రం పట్టించుకోకుండా బ్రహ్మరథం లాగుతూ.... లక్షలాది మంది భక్తులు ధవణం మిరియాలు చల్లి స్వామివారిని దర్శించుకున్నారు.మాజీ ఎమ్మెల్యే పార్థసారథి,బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి రథంపై నుండి జయ జయ సింహా....జయ నరసింహా.... శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవిందా.... భక్త ప్రహ్లాద వరద గోవింద గోవిందా.... అంటూ ఆద్యంతం భక్తులతో పలికించారు. రథంపై ధవణం మిరియాలు చల్లితే కోరికలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆనావాయితీ ప్రకారం కుటాగుళ్ళ, మూర్తిపల్లి, గజ్జెలరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు పాల్గొని స్వామివారి బ్రహ్మరథం ముందుకు సాగేక్రమంలో నియంత్రించేందుకు పెద్ద పెద్ద తెడ్లు వేస్తువుంటే యథాస్థానానికి చేరేవరకు భక్తులు మోకులతో రథం లాగారు. డిఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. స్వామివారి రథం వెనుకవైపు అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వాహనాలు అనుసరించాయి.11వరోజు బ్రహ్మరథోత్సవం ముందురోజు శుక్రవారం యాగశాల నుండి శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారు తెల్ల ఏనుగుపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శనివారు తెల్లవారుజామున శుభ ఘడియల్లో స్వామివారి బ్రహ్మ రథావరోహణ పూజలు నిర్వహించారు. 



నేడు ఆశ్వ వాహనంపై ఖాద్రీశుడు దర్శనం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 13వరోజు ఆదివారం శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిస్తరని ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకులు తెలిపారు. అంతక ముందు ఆలయంలో ఆలయ యాగశాలలో నిత్యపూజ, హోమం పూజలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో సాయంత్రం స్వామివారిని ఆలయం సమీపంలో వున్న అలకోత్సవ మండపం వద్దకు తీసుకుని వచ్చి స్వామివారి అలకోత్సవ విశిష్టతను ఆలయ అర్చకులు భక్తులకు వివరిస్తారు.


30, మార్చి 2024, శనివారం

నేడు శ్రీలక్ష్మీనరసింహస్వామీవారి రధోత్సవం‌ ‌‌

 నేడు శ్రీలక్ష్మీనరసింహస్వామీవారి రధోత్సవం‌ ‌‌






శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి 29(విజయస్వప్నం.నెట్) 

కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి రథోత్సవం నేడు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి, 'అర్చకులు తెలిపారు.పక్షం రోజులుగా స్వామివారు వివిధ రూపాల్లో ప్రత్యేక వాహనాల్లో తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.లక్షాలాది మంది భక్తులు రధోత్సవానికి విచ్చేసి మొక్కుబడులు సమర్పించి స్వామివారికి దర్శనం చేసుకోనున్నారు.ఆలయ అధికారులు,కార్యానిర్వకులు స్వామివారి రథోత్సవానికి సర్వం సిద్ధం చేశారు.శ్రీవారి బ్రహ్మోత్సవములలో అత్యంత కీలక ఘట్టము ఈ బ్రహ్మరథోత్సవము (తేరు) శనివారం(నేడు)ఉదయం 8 గంటల  నుండి తిరుమాడ వీధుల్లో స్వామివారి రథోత్సవము లక్షలాదిమంది భక్తుల నామస్మరణలతో దర్శనం.

స్వామివారి రథం ప్రాముఖ్యత

  కదిరి తేరు రోజున లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి కర్ణాటక, తమిళనాడు తదితర సుదూర ప్రాంతాల నుండి తరలివస్తారు.స్వామివారి రథం 120 ఏళ్ల క్రితం రూపొందించారు.సుమారు 540 టన్నుల బరువు 37.5 అడుగుల ఎత్తు ఉంటుంది,రథంలోని స్వామివారి పీఠం వెడల్పు 16 అడుగులు ఉండేవిధంగా రూపొందించి,బ్రహ్మరథంపై సుమారు 256 శిల్ప కళాకృతులు అందంగా తీర్చిదిద్దారు.దేశములో వున్న బ్రహ్మరథముల కైల మూడవ అతి పెద్ద తేరు ఖాద్రీశుడు రథం.మొదటిది తంజావూరు జిల్లాలోని తరువరూర్ త్యాగశ్వర్ స్వామి ఆలయనిదిగా,రెండవది  అండాళ్ అమ్మవారు శ్రీవల్లి పుత్తురూ ఈ రెండు రథములు తమిళనాడు రాష్ట్రంలో ఉండడం విశేషం.దేశంలోనే ప్రసిధ్ధికెక్కిన మూడవ అతిపెద్దదయిన శ్రీమధ్ లక్ష్మీనరసింహస్వామివారి రథం కదిరి పట్టణంలో ఉండడం మన అందరికీ గర్వకారణంగా నిలిచింది. ఆనాదిగా ఆనవాయితీ ప్రకారం  కుటాగుళ్ళ, మూర్తిపల్లి, గజ్జెలరెడ్డిపల్లి గ్రామస్తులు  స్వామివారి రథం ముందుకు లాగుతారు.భారీ మోకులు (పెద్ద తాళ్ళు) నియంత్రించేందుకు పెద్ద పెద్ద తెడ్లు వాడుతారు.రథోత్సవంలో భక్తులు ధవణం,మిరియాలు స్వామివారకి సమర్పించడం విశేషం. స్వామివారి రథం తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం తిరిగి యధాస్థానంలో చేరుకోవడం అద్భత దృశ్యంగా చెప్పుకుంటారు.

గజవాహనంపై ఖాద్రీ నరసింహుడు దర్శనం.   సత్యసాయి జిల్లా కదిరి మార్చి 29(విజయస్వప్నం.నెట్) కదిరి పట్టణంలో వెలసిన శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి  దేవస్థానంలో మార్చి 19 నుండి ఏప్రిల్ 2 వరకు పక్షం రోజులపాటు నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 11వరోజు శుక్రవారం శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.ఉదయం యోగశాలలో నిత్యపూజ, హోమం గ్రామోత్సవం నిర్వహించారు.సంధ్యా సమయంలో ఉత్సవ మూర్తులను యాగశాల నుండి అలంకరణ మండపం వరకు తీసుకొచ్చి పూజలు నిర్వహించారు.రాజగోపురం వద్ద వివిధ పుష్పాలతో అలంకరించిన పల్లకిలో గజవాహనంపై(తెల్ల ఏనుగుపై)స్వామివారు ఆసీనులై ఊరేగింపుగా తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.భక్తులు స్వామివారికి కాయకర్పూరం సమర్పించి దర్శనం చేసుకొన్నారు.నేడు 12వరోజు శనివారం శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు రధోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి,ఆలయ అర్చకులు తెలిపారు.

29, మార్చి 2024, శుక్రవారం

ప్రజా గరుడ వాహనంపై ఖాద్రీశుడు - మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ

ప్రజా గరుడ వాహనంపై ఖాద్రీశుడు


శ్రీసత్యసాయి జిల్లా కదిరి మార్చి 28(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి  దేవస్థానంలో మార్చి 19 నుండి ఏప్రిల్ 2 వరకు పక్షం రోజులపాటు నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 9వరోజు బుధవారం శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు ప్రజా గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.ప్రత్యేక అలంకరణలో పల్లకిలో కొలువై ప్రజా గరుడ వాహనంపై శ్రీలక్ష్మీనరసింహస్వామివారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.ఉదయం యోగశాలలో నిత్య పూజ,హోమం గ్రామోత్సవం నిర్వహించారు.సంధ్యా సమయంలో స్వామివారు ప్రజా గరుడ వాహనంపై సుందర రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.నేడు 11వరోజు శుక్రవారం తెల్ల ఏనుగు వాహనంపై తిరుమాడ వీధుల్లో లక్ష్మీ నరసింహస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.అంతక ముందురోజు బుధవారం సాయంత్రం ఊరేగింపుగా బయలుదేరిన స్వామివారు తిరిగి గురువారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్నారని, సాయంత్రం యాగశాల నుండి ప్రజా గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారని ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి,ఆలయ అర్చకులు తెలిపారు.


మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ 

ఆడబిడ్డలకి నెలకు రూ"1500 అందిస్తాం.

ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు.


శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి 28(విజయస్వప్నం.నెట్)

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ద్వారా లక్ష 50 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెదేపా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా రెండవ రోజు గురువారం శ్రీసత్యసాయిజిల్లా కదిరిలో పర్యటించి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.తెదెపా అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ద్వారా లక్ష 50 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జిల్లాకు సాగునీర్చి, పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని,ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని,ఒక్కో ఆడబిడ్డకి 1500 చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే వారికి పథకం ద్వారా అందిస్తామని హామీలను మరోసారి ప్రజలకి చంద్రబాబు వివరించారు. వైకాపా ప్రభుత్వం అన్నింటా విఫలమైందన్నారు.తెదెపా  హయాంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం విస్మరించి ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వకుండా సియం జగన్ సీమ ప్రజలకు ద్రోహం చేశారని ధ్వజమెత్తారు

 ప్రజాగళం సభకు పోటెత్తిన జనం


తెదేపా జాతీయ అధ్యక్షుడు  నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు గురువారం కదిరిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు జనం పోటెత్తారు.డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.సభకు వచ్చిన జన సందోహాన్ని చూసి చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు.కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ విజయం సాధించడం ఖాయమని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ముస్లిం మైనార్టీల్లో భరోసా నింపేలా కదిరి ఈఫ్తార్ విందులో  చంద్రబాబు పాల్గొని హామీలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన తెలుగు తమ్ముళ్లు ఉత్సాహం నింపింది.శ్రీ సత్య సాయి జిల్లా రాప్తాడులో ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాకు విచ్చేసిన తెదేపా జాతీయ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికిన పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్, మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు,ఎంపీలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు స్వాగతం పలికారు.


శ్రీ సత్యసాయిజిల్లా  ఓడిచెరువు మార్చి29( విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని అల్లాపల్లి పంచాయితీ పగడాలవారి పల్లి,బోయపల్లి, కుక్కంటివారిపల్లి గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిసాన్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైఎస్ జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని వారు ఇంటింటా ప్రచారం చేపట్టారు.ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,వైకాపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి29(విజయస్వప్నం.నెట్)

 మండలంలోని సున్నంపల్లి పంచాయతీ కర్ణాటక సరిహద్దు పెద్దగుట్టపల్లి గ్రామ సమీపంలో చెక్పోస్ట్ వద్ద గురువారం ఎస్ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏఎస్ఐ కిషోర్ రెడ్డి,పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలు  నిర్వహించారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వాహనాలను తనిఖీలు నిర్వహించారు.అక్రమంగా కర్ణాటక మద్యం,నగదు తరలిస్తే చర్యలు తీసుకుంటామని,ప్రతి ఒక్కరూ నిభందనలు పాటించాలని ఆయన పేర్కొన్నారు.

28, మార్చి 2024, గురువారం

గురుకులంలో హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు - కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న సెబ్ పోలీసులు

మోహిని రూపంలో ఖాద్రీ నరసింహుడు దర్శనం




శ్రీసత్యసాయి జిల్లా కదిరి మార్చి 27(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి  దేవస్థానంలో మార్చి 19 నుండి ఏప్రిల్ 2 వరకు పక్షం రోజులపాటు నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 9వరోజు బుధవారం శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.కదిరి సుగంధ పరిమళాల మల్లెలతో,ఎదపై అమృత కలశాన్ని పట్టుకున్న అలంకరణతో మోహిని రూపంలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం యోగశాలలో నిత్య పూజ, హోమం గ్రామోత్సవం నిర్వహించారు.సంధ్యా సమయంలో స్వామివారు మోహిని రూపంలో ప్రతి ఇంటికి వెళ్ళి భక్తులకు దర్శనమిచ్చారు.బుధవారం సాయంత్రం ఊరేగింపుగా బయలుదేరిన స్వామివారు తిరిగి గురువారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకుంటారని ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి, ఆలయ అర్చకులు తెలిపారు.నేడు 10వరోజు గురువారం ప్రజా గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో లక్ష్మీ నరసింహ స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

$$$__________@@@__________$$$

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి27(విజయస్వప్నం.నెట్)

మండలంలోని తంగేడుకుంట పంచాయతీ నల్లచెరువుపల్లి చెందిన సీనియర్ వైకాపా నాయకుడు సూర్యంరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి దగ్గర శాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి బుధవారం ఇంటికెళ్ళి సూర్యంరెడ్డిని పరామర్శించి,వైద్య చికిత్సలు ఆరోగ్య విషయాలపై అడిగి తెలుసుకున్నారు.దైర్యంగా ఉండాలని, వైకాపా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారని వైకాపా నాయకులు,కార్యకర్తలు తెలిపారు.

$$$__________@@@__________$$$

కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న సెబ్ పోలీసులు

శ్రీసత్యసాయిజిల్లా తనకల్లు మార్చి27(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని సోమానాయక్ తాండా సమీపంలో ఎస్సీబీ స్టేషన్ ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించి భూక్యే నారాయణనాయక్, భూక్యే రవీంద్ర నాయక్ వద్ద నుండి 1624 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. దాడుల్లో నారాయణనాయక్ పట్టుబడగ  రవీంద్రనాయక్ పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు.స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు.

$$$__________@@@__________$$$

వైకాపా నుండి పలువురు తెదేపాలోకి చేరిక

శ్రీసత్యసాయిజిల్లా తనకల్లు మార్చి27(విజయస్వప్నం.నెట్)

తనకల్లు మండలం తవరం పంచాయతీ గందోడివారిపల్లి, సింగిరివాండ్లపల్లి గ్రామానికి చెందిన పలువురు వైకాపా నుండి బుధవారం కదిరి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెదేపాలోకి చేరారు. తిరుమలయ్యవారిపల్లికి చెందిన వైకాపా సీనియర్ నాయకులు మండెం వెంకటరెడ్డి,మాజీ సింగిల్ విండో అధ్యక్షులు వెంకటరమణప్పలతో పాటు గందోడివారిపల్లి,సింగిరివాండ్లపల్లి గ్రామాలకు చెందిన పలువురు వైకాపా వీడి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్,తెదేపా నాయకులు పవన్ కుమార్ రెడ్డి సమక్షంలో తెదేపాలోకి చేరారు.పార్టీలో చేరిన వారికి తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈకార్యక్రమంలో తనకల్లు మండల కన్వీనర్ రెడ్డిశేఖర్ రెడ్డి,మల్ రెడ్డి,రమణ,సత్యనారాయణ, మాధవరెడ్డి,చెన్నకృష్ణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$


శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు మార్చి27(విజయస్వప్నం.నెట్)

మండలంలోని చినగానిపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు,మాజీ స్టోర్ డీలర్ శివయ్య కుమార్తె బుధవారం రాత్రి అకాల మృతి చెందిన విషయం తెలుసుకున్న తక్షణమే మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారని తెదేపాశ్రేణులు తెలిపారు.

$$$__________@@@__________$$$

గురుకులంలో హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు


శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి 27(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో బుధవారం సాయంత్రం మాధవ గురుకులంలో నిరాశ్రయులైన పిల్లల మధ్య అభిమానులు గ్లోబల్ స్టార్,మెగా పవర్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి  తనయుడు గ్లోబల్ స్టార్,మెగా పవర్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా కదిరిలో మాధవ గురుకులంలో పిల్లల మధ్య రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ,అఖిల భారత చిరంజీవి యువత,రామ్ చరణ్ యువ ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో పిల్లలకు భోజన సదుపాయం కల్పించి వారి మధ్యనే కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా వేడుకలు నిర్వహించారు.అఖిల భారత చిరంజీవి యువత కదిరి నియోజకవర్గం అధ్యక్షులు లక్ష్మణ కుటాల మాట్లాడుతూ సమాజం బాగుండాలి అందులో మనం ఉండాలంటూ అభిమాన నటులు చిరంజీవి,పవన్ కళ్యాణ్  తపన పడుతుంటారని,అదే సేవా స్ఫూర్తితో రామ్ చరణ్  ఆదర్శంగా భావించి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా అటు సినీరంగంలో,ఇటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న తీరు అద్భుతమని,అటువంటి గొప్ప మంచి మనసున్న  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అందరి ఆశీస్సులు ఉండాలని,కదిరి మెగా ఫ్యాన్స్ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి,రామ్ చరణ్ యువ ఫౌండేషన్,అఖిల భారత చిరంజీవి యువత టీమ్ సభ్యులు రాజేంద్ర,మునిగోపాల్,హరి బాబు,కార్తిక్,చక్రి,చంద్ర మోహన్,రాజా,సుదర్శన్,నరసింహులు,సాయి,గణేష్ తదితర మెగా అభిమానులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$


శ్రీ సత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి27(విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయిజిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా బీవీ వెంకటరమణ ఎంపికైన సందర్భంగా మండల వడ్డెర్ల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.బుధవారం స్థానిక తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో మండల వడ్డెర్ల సంఘం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బివి వెంకట్రాముడును శ్రీ సత్యసాయిజిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎంపిక చేయడం హర్షణీయమన్నారు.వడ్డెర్ల సామాజిక వర్గానికి భవిష్యత్తులో మరింత రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వారు అధిస్థానానికి విజ్ఞప్తి చేశారు.వడ్డెర్ల సామాజిక వర్గానికి చెందిన బీవీ వెంకట్రాముడును ఎంపిక చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు, ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ బాబుకు,రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడుకు సందర్భంగా వడ్డెర్ల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సెల్ కార్యదర్శి వడ్డెర సంఘం నాయకులు అంజనప్ప,మీడియా కోఆర్డినేటర్ కుంచపు ఆంజనేయులు,ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్, బత్తినపల్లి ఆనంద్,మహిళా కార్యకర్త మస్తానమ్మ, మల్లికార్జున,పీట్ల మనోహర్, తెదేపా నాయకులు మోపూరి అంజనప్ప,షబ్బీర్,ముద్దలపల్లి శ్రీనివాసులు,ఆరీఫ్,కొలిమిరాళ్ళ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

27, మార్చి 2024, బుధవారం

సూర్యచంద్రప్రభల్లో శ్రీలక్ష్మనరసింహుడు - - శ్రీస్వామివారికి నీరాజనం కరపత్రాలు విడుదల - భార్యతో గొడవపడి.... ఉరివేసుకుని ఆత్మహత్య.

సూర్యచంద్రప్రభల్లో శ్రీలక్ష్మనరసింహుడు




శ్రీసత్యసాయి జిల్లా మార్చి26 కదిరి(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలిసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మినరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఈనెల 19 నుండి ఏప్రిల్ 2 వరకు పక్షం రోజులు వైభవంగా నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 8వరోజు శ్రీలక్ష్మీనరసింహస్వామివారు సూర్యచంద్రప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగింపుగా భక్తులకి దర్శనమిచ్చారు.వివిధ పుష్ప్వాల అలంకరణతో ఉదయం సూర్యకాంతిలో  శ్రీలక్ష్మీనరసింహస్వామివారు పల్లకిలో కొలువై ఊరేగింపుగా పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.రాత్రి చంద్రప్రభ శోభిల్లే పల్లకిలో ఆసీనులై భక్తులకు దర్శనం ఇస్తూ మంత్రి ముగ్ధులను చేశారు‌. రాత్రివేళలో ఆలయంలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.నేడు బుధవారం 9రోజు   శ్రీలక్ష్మీసింహస్వామివారి మోహిని ఉత్సవ ఊరేగింపుగా దర్శనమిస్తారని ఆలయ అర్చకులు, కార్యనిర్వాహకులు అర్చకులు తెలిపారు.

$$$__________@@@__________$$$


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి26(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల పరిధిలోని గాజుకుంటపల్లి సమీపంలో మంగళవారం ఎస్ఐ వంశీకృష్ణ పోలీసులతో కలిసి వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేసి లైసెన్సులు తదితర రికార్డులు పరిశీలించారన్నారు.జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాబోయే ఎన్నికల దృష్ట్యా వాహనాలను తనిఖీలు నిర్వహించారని ఈసందర్భంగా ఆయన తెలిపారు.ఎన్నికల కమిషన్ నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

$$$__________@@@__________$$$

వైకాపా నుండి తెదేపాలోకి వందలాది మంది చేరిక....! 

తెదేపాలోకి ఆహ్వనించిన మాజీమంత్రి పల్లె 

 


శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి మార్చి26(విజయస్వప్నం.నెట్) 

ఓడిచెరువు మండలంలో వైకాపా నుండి తెదేపాలోకి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో మంగళవారం భారీగా చేరారు.మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,పుట్టపర్తి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి,పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి,జనసేన పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ పత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 200 కుటుంబాల నాయకులు, కార్యకర్తలు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా ఓడిచెరువు మండల కేంద్రంలో తెదేపా శ్రేణులు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఎస్బిఐ సమీపంలో ఏర్పాటు చేసిన సభ వేదికలో పాల్గొని మాజీమంత్రి పల్లె,ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.…

$$$__________@@@__________$$$

శ్రీస్వామివారికి నీరాజనం కరపత్రాలు విడుదల 


శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి 26(విజయస్వప్నం.నెట్) 

కదిరి పట్టణంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో ప్రహ్లాద సమేత శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారికి నీరాజనం పాట విడుదల చేశారు.శ్రీవారికి ప్రతిఏటా ఫాల్గుణ మాసంలో 15 రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.ఈ బ్రహ్మోత్సవాల వైభవాన్ని శ్రీ వారి భక్తులకు మరింత చేరువ చేయాలని ప్రతిఏటా తమవంతుగా రచయిత చిన్నారావు ఆధ్వర్యంలో గాయకులు శ్రీ పూర్ణచంద్ర ( హైదరాబాద్) కార్తికేయ డిజిటల్స్ కార్తిక్,చక్రిల సహకారంతో శ్రీస్వామి వారికి నీరాజనం పేరుతో ఒక పాటను మంగళవారం శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మినరసింహస్వామి వారి ఆలయంలో ఆలయ ఈవో  వెండి దండి శ్రీనివాసుల రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు నరసింహ వసంతా చార్యుల చేతుల మీదుగా ప్రారంభించి అనంతరం స్వామివారి …

$$$__________@@@__________$$$

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మాథహర్చి26(విజయస్వప్నం.నెట్)

ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సతీమణి దుద్దుకుంట అపర్ణ రెడ్డి నేడు బుధవారం ఉదయం 8:30 గంటలకు నల్లమాడ మండలంలోని చౌటకుంటపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గోంటారని. కావున ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ కుటుంబ సభ్యులందరు తప్పకుండా హాజరు కావాలని  బుధవారం ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శులు ఓ ప్రకటనలో తెలిపారు.

$$$__________@@@__________$$$

భార్యతో గొడవపడి.... ఉరివేసుకుని  ఆత్మహత్య.

ఇడగొట్టు భూపతి(36)
ఇడగొట్టు భూపతి(36)

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి26 (విజయస్వప్నం.నెట్)

మండలంలోని  బాలప్పగారిపల్లికి చెందిన ఇడగొట్టు గంగులప్ప కుమారుడు ఇడగొట్టు భూపతి(36)అనే యువకుడు నిరంతరం తాగుడుకు బానిసై సోమవారం రాత్రి భార్యతో గొడవపడి మనస్తాపం చెంది బార్య ఇంటి ముందు నిద్రపోతున్న సమయంలో అతను ఇంట్లో తలుపులు మూసి సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. బార్య అశ్విని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

26, మార్చి 2024, మంగళవారం

బ్రహ్మ గరుడ వాహనంపై శ్రీలక్ష్మినరసింహుడు - క్షయ రహిత సమాజానికై శ్రమిద్దాం - భక్తిశ్రద్ధలతో అయ్యప్ప జన్మదిన పూజలు

హోలీ శుభాకాంక్షలు

రసాయనాలు లేని రంగులతో పండుగను ఆనందంగా జరుపుకుందాం.. విజయస్వప్నం.నెట్ వీక్షకులకు శ్రేయోభిలాషులకు హోలీ శుభాకాంక్షలు.. ఎడిటర్...!!!
$$$__________@@@__________$$$
బ్రహ్మ గరుడ వాహనంపై శ్రీలక్ష్మినరసింహుడు



శ్రీసత్యసాయిజిల్లా,కదిరి,మార్చి 24(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో అంగరంగ వైభవంగా పక్షం రోజులు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 6వరోజు శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారు బ్రహ్మ గరుడ వాహనంపై తిరు వీధుల్లో ఊరేంగింపుగా దర్శనమిచ్చారు.ఉదయం వివిధ రకాల పుష్పలాతో అలంకరించిన పల్లకిలో స్వామివారు కొలువై మేళతాళాలు వాయిద్యాల మధ్య పుర వీధుల్లో ఊరేంగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు.సాయంత్రం ఆలయంలో యోగశాల నుండి విష్ణువు వాహనమైన బ్రహ్మ గరుడ వాహనంపై ఆశీనులై భక్తులకు దర్శనమిస్తూ తిరువీధుల్లో ఊరేంగగా పల్లకి ముందు జానపద కళాకారులు భజనలు,భక్తి గీతాలు ఆలపించారు. రాత్రివేళ్ళ ఆలయంలో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించగా,చిన్నారుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు భక్తిశ్రద్దలతో తిలకించారు.నేడు సోమవారం శేషావాహనంపై శ్రీలక్ష్మినరసింహస్వామి దర్శనమిస్తారని ఆలయ కార్యనిర్వాహక అధికారి, అర్చకులు తెలిపారు.

$$$__________@@@__________$$$

క్షయ రహిత సమాజానికై శ్రమిద్దాం

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు మార్చి24(విజయస్వప్నం.నెట్)

ఎలాంటి వ్యాధికైనా ముందస్తు నివారణ చర్యలు ముఖ్యమని వీటిని ప్రతి ఒక్కరు భాద్యతగా స్వీకరించినప్పుడే దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాదులను ఆదిలోనే నివారించవచ్చని వైద్యాధికారి డాక్టర్ భానుప్రకాష్ పేర్కొన్నారు. ప్రపంచం క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  ఆవరణలో క్షయవ్యాధి అవగాహనా కార్యక్రమంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ....  2024లో క్షయ వ్యాధి రహిత భారతదేశం లక్ష్యంగా దేశంలో అన్ని ఆరోగ్య విభాగాల్లో శ్రమిస్తున్నాయని, వీటిలో ప్రజల భాగస్వామ్యం,సహాయ,సహకారం చాలా అవసరమని, ఇందులో భాగంగా ఆరోగ్య విద్య,అవగాహన,భాగ స్వామ్యం,నివారణ,చికిత్సలో సహకారం వీటిని తూచ పాటిస్తూ ఇతరులతో కూడా పాటింపచేసినప్పుడే క్షయ రహిత నవభారత సమాజం ఏర్పడుతుందని అయన పేర్కొన్నారు.వ్యాధి లక్షణాలు మొదలై రెండు వారాముల నుండి జ్వరంఆకలి లేక పోవడం,దగ్గినప్పుడు ఎర్ర రక్త జీరలతో కూడిన గల్ల,బరువు తగ్గడం వంటి లక్షణాలను ఆది లోనే కనుగొనగలిగితే ప్రాథమిక దశలోనే నివారించవచ్చని,ఈ లక్షణాలు కనిపించిన వెంటనే స్థానిక ఆరోగ్య సిబ్బంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్,ఆశ,ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించడం ద్వారా 6 నెలల పాటు ఉచిత మందుల చికిత్స డాట్  పర్యవేక్షణ విధానంలో లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో వైద్యధికారి కమల్ రోహిత్,వైద్యబృందం శుభాషిణి, దిల్ షాద్, విజయకుమారి, వరలక్ష్మి, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

పలువురిని మాజీమంత్రి పల్లె పరామర్శ 


 శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి24(విజయస్వప్నం.నెట్)

మండలంలోని సున్నంపల్లి పంచాయతీ మలకవారిపల్లికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు శివారెడ్డి కాలుకి శస్త్రచికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటున్న విషయం తెలుసుకొన్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం ఇంటి వద్దకు వెళ్లి శివారెడ్డి కుటుంబ సభ్యులను పలకరించి,యోగ క్షేమాలు అడిగితెలుసుకున్నట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.జనసేన పార్టీ పుట్టపర్తి సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

సత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అనంతపురం లో.....  మండలంలోని ఎద్దుల వారిపల్లికి చెందిన తెదేపా ఎస్సీ సెల్ నాయకులు గంగాద్రి కుమార్తె భాగ్యశ్రీ అనారోగ్యంతో అనంతపురం లోని సవేరా చికిత్స పొందుతుందగా ఆదివారం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు. చికిత్స పొందుతున్న భాగ్యశ్రీ తో మాట్లాడి  ఆరోగ్యం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించినట్లు తెలిపారు. ధైర్యంగా ఉండాలని అన్ని విధాలుగా ఆదుకుంటానని ఎస్సీ సెల్ నాయకుడికి మాజీ మంత్రి పల్లె భరోసా ఇచ్చినట్లు తెలిపారు.ఓడిచెరువు మండలంలోని నాయనకోట గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త మునెప్ప(45)శస్త్రచికిత్స వికటించి మృతి చెందిన విషయం తెలుసుకొన్న మాజీమంత్రి పల్లె  ఆదివారం మృతుడి భార్యతో ఫోన్లో మాట్లాడి పరామర్శించి, దైర్యంగా ఉండాలని తెదేపా అండగా ఉండి ఆదుకొంటామని భరోసా ఇచ్చినట్లు మాజీ కన్వీనర్ రాజారెడ్డి,ఆర్ఎంపి జాకీర్, ఎస్సీ సెల్ బడిశం రామాంజనేయులు తదితరులు తెలిపారు.

$$$__________@@@__________$$$

హీరో రామ్ చరణ్ అభిమానులు రక్తదానం 

 శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి24(విజయస్వప్నం.నెట్)

మెగాస్టార్ చిరంజీవి   తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: పుట్టిన రోజు వారోత్సవాలలో భాగంగా ఆదివారం అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి, రామ్ చరణ్ యువ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కదిరి ప్రభుత్వం ఏరియా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్త నమూనాలు సేకరించినట్లు అభిమానులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నారాయణ స్వామి ,చంద్ర మోహన్,బావాజీ, మురళి, శివ కుమార్, ప్రదీప్, వెంకటేష్ ,మనోహర్, లక్ష్మణ, రాజేంద్ర, కార్తిక్, హరీష్, వాల్మీకి, దేవలం కార్తిక్, ముని గోపాల్, పవన్ కళ్యాణ్, అనిల్, మధు సుధన్, సాయికుమార్ తదితర మెగాఅభిమానులు స్వఛ్చందంగా పాల్గొని  రక్తదానం చేశారన్నారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు లక్ష్మణ కుటాల, రామ్ చరణ్ యువ ఫౌండేషన్ అధ్యక్షులు మనోహర్ లు ప్రతి ఒక్క రక్త దాతకు కృతజ్ఞతలు తెలిపారు.

$$$__________@@@__________$$$

వైకాపా నుండి తెదేపాలోకి భారీగా చేరిక

శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు మార్చి24(విజయస్వప్నం.నెట్)

మండలంలోని సున్నంపల్లి పంచాయతీలో  71 కుటుంబాలు,అలాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లిలో 26కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలోకి చేరాయి. కురుమాలకు చెందిన 5 కుటుంబాలు, గొల్లపల్లిలో మరో 4కుటుంబాలు టిడిపిలోకి చేరినట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, జనసేన సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ సమక్షంలో ఆదివారం వైకాపా నుండి తెదేపాలోకి చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారని మండల తెదేపా శ్రేణులు తెలిపారు. నల్లమాడ లో....    మండలంలోని దొన్నికోట పంచాయతీ గ్రామంలో మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం చేపట్టారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ సిక్స్ పధకాలపై ప్రజలకు వివరిస్తూ.... రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రచారం చేపట్టినట్లు గ్రామ స్థాయి తెదేపా నాయకులు, కార్యకర్తలు తెలిపారు. ఈకార్యక్రమంలో తెదేపా నాయకులు సామకోటి ఆదినారాయణ, కృష్ణమూర్తి, కేశవరెడ్డి, గంగులప్పనాయుడు, రమణ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి24(విజయస్వప్నం.నెట్)

మండలంలోని సి అండ్ ఐజి మిషన్ చర్చిలో మట్టలాదివారాన్ని క్రైస్తవ సోదరులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు మట్టలు పట్టుకొని చర్చి చుట్టు ప్రదర్శన నిర్వహించారు. మట్టలాదివారం విశిష్టతను ఫాస్టర్ డాక్టర్ రెవరెండ్ ఎంజి జయానందం వివరించారు. ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు  చూపిన సన్మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం చర్చ్ లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో  దార్ల రాజశేఖర్, బాలరాజు, సునీల్ కుమార్, ఆశీర్వాదమ్మ, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

7వరోజు ఆదిశేష వాహనంపై నరసింహస్వామి



శ్రీసత్యసాయి జిల్లా మార్చి25 కదిరి(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలిసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మినరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఈనెల 19 నుండి ఏప్రిల్ 2 వరకు వైభవంగా నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏడవరోజు శ్రీలక్ష్మీనరసింహస్వామివారు ఆదిశేష వాహనంపై పురవీధుల్లో ఊరేగింపుగా భక్తులకి దర్శనమిచ్చారు.వివిధ పుష్ప్వాల అలంకరణతో  ఏడు పడగల ఆదిశేష పల్లకీలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారు కొలువై ఊరేగింపుగా పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయంలో చిన్నారులు,కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.నేడు మంగళవారం 8రోజు సూర్య,చంద్రప్రభ వాహనంపై శ్రీలక్ష్మీసింహస్వామివారు పల్లకిలో ఊరేగింపుగా దర్శనమిస్తారని ఆలయ అర్చకులు,కార్యనిర్వాహకులు అర్చకులు తెలిపారు.

$$$__________@@@__________$$$

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప జన్మదిన పూజలు

ఓబుళదేవరచెరువు మార్చి25(విజయ స్వప్నం.నెట్)

 మండల కేంద్రానికి అతి సమీపంలో ఎం.కొత్తపల్లి బంగారు బండపై వెలసిన శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయంలో సోమవారం అయ్యప్పస్వామివారి జన్మదినం సందర్బంగా ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు ఆధ్వర్యంలో భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రతి యేటా పాల్గుణ మాసంలో ఉత్తరా నక్షత్రం రోజు అయ్యప్పస్వామి జన్మదినం సందర్బంగా ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు.తెల్లవారుజామున నుండి స్వామివారి మూల విరాట్ విగ్రహానికి పసుపు,కుంకుమ అర్చనలు,పాలు,పెరుగు,నెయ్యి,తేనే,గంధం,పంచ ఫలాలు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించి,పట్టు వస్త్రాలు,పుష్ప అలంకరణలతో మహామంగళహారతి నీరజనాలు సమర్పించారు.స్వామివారి నామస్మరణాలతో భక్తులు కాయకర్పూరం సమర్పించారు. దర్శనం చేసుకొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

$$$__________@@@__________$$$

శ్రీ ఖాద్రీనృసింహుశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు



శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి 25(విజయస్వప్నం.నెట్)

నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా వెలసిన కదిరి పట్టణంలో శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము,చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రశిద్దిమైన వైష్ణవ క్షేత్రం.శ్రీస్వామివారి బ్రహ్మోత్సవములలో భాగంగా కదిరి పున్నమి పండుగ సందర్భముగా సోమవారం శ్రీమత్ ఖాద్రీ నృసింహుని దర్శనం కోసం భక్తులు పోట్టెత్తారు.శ్రీస్వామివారి దర్శనార్థము తెల్లవారుఝుమున నుండి  బారులు తీరడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.ముఖ్యంగా స్వామి ఇంటి ఇలవెల్పుగా వుండే భక్తులు,కర్నాటక రాష్ట్రములోని వివిధ ప్రాంతముల నుండి  అధికముగా భక్తాదులు ఆలయానికి విచ్చేయడంతోరద్దితో క్కికిరిసిన ఆలయ ప్రాంగణముతో పాటు తీరుమాడ వీధుల్లో స్వామి నామస్మరణలతో మారుమోగింది.ఆలయములో విశేషముగా దీపాలు వెలుగించి,స్వామివారి ఇలవెల్పు అయిన భక్తాదులు స్వామి వారికి తలనీలాలను,తూలభారము మొక్కుబడులు సమర్పించుకున్నారు.భక్తుల సౌక్యార్థము ప్రత్యేక దర్శనము, ఉచిత దర్శనము క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి 'అర్చకులు తెలిపారు.ఒక్కపొద్దులు,ఉపవాసము వున్న భక్తులందరికి దర్శనము అనంతరము నైవేద్య ప్రసాదము వితరణ, చల్లని తాగునీరు అందించి,  నిత్య అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేశారన్నారు.కళాకారులు సంగీత కచేరీ నిర్వహించారు.

$$$__________@@@__________$$$

శ్రీఅక్కదేవతల ఆలయంలో అన్నదాన సత్రానికి 20వేలు విరాళం

శ్రీ సత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి25(విజయస్వప్నం.నెట్)

మండలంలోని అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమావతి నది ఒడ్డుపై వెలసిన శ్రీఅక్కదేవతల  ఆలయంలో అన్నదాన సత్రానికి   గోపేపల్లి గ్రామానికి చెందిన మీసాల గంగులప్ప,అక్కలప్ప మల్లికార్జున (నల్లసింగయ్య గారిపల్లి లైన్మెన్) కవిత,సురేష్ బాబు అనిత, వీరి కుమారుడు పనింద్ర యాదవ్,జస్మిత్ కుటుంబసభ్యులతో కలసి సోమవారం ఆలయ పూజారి వెంకటేషుకి 20వేల నగదును  అందించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

 శ్రీ అక్కదేవతల ఆలయంలో ప్రత్యేక పూజలు.. 

పాల్గుణ సోమవారం పౌర్ణమి సందర్భంగా అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీఅక్కదేవతల ఆలయంలో    ఓడిచెరువుకి చెందిన  కర్లవేణుగోపాల్ (విద్యుత్ బిల్ కలెక్టర్)లక్ష్మీ నారాయణమ్మ,  వీరి కుమారులు హేమంత్,తిలోక్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం దర్శనం కోసం విచ్చేసిన 300 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారని పూజారి వెంకటేష్ తెలిపారు.