రాష్ట్ర భవిష్యత్ కోసమే.... తెదేపా,జనసేన పొత్తు
రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ ను ఇంటికి పంపాలి
రా.... కదలిరా.... సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు
మాకోసం కాకుండా ఏపీ రాష్ట్రాన్ని కాపాడుకోనేందుకు తెదేపా-జనసేన కలిశాయని,రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ ను ఇంటికి పంపాలని తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముక్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీసత్యసాయిజిల్లా పెనుకొండ సమీపంలో కియా కంపెనీ వద్ద సోమవారం రా.... కదలిరా.... కార్యక్రమానికి తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరై ప్రసంగిస్తూ.... వైకాపా ప్రభుత్వంపై, ఏపీ సిఎం వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు.ఏపి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలందరు అంటున్నారని, జనసేనతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మా స్వార్థం కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెదేపా, జనసేన కలిశాయని,రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ కు ఎన్నికల్లో గట్టిగ బుద్ది చెప్పి ఇంటికి పంపాలని చంద్రబాబు ప్రకటించారు.అనంతజిల్లా అంటే నాకు ఇస్తామని, 18నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా పరిశ్రమ తీసుకొచ్చామని, ఇప్పటికే కియా పరిశ్రమలో 12లక్షల కార్లు తయారై ప్రపంచం వ్యాప్తంగా నడుస్తున్నాయని,ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు. అత్యంత వర్షపాతం తక్కువ ఉన్న అనంతపురం జిల్లాను సశ్యాసమలం చేయడానికి సంకల్పించినట్లు తెలిపారు. రాయలసీమకు సాగునీరు ఇస్తే చాలు రైతులు బంగారం పండిస్తారన్నారు. తెదేపా అధికారంలో ఉంటే సాగునీరు, పెట్టుబడులు,ఉపాధి పెరిగేవని,తానేప్పుడు భావితారాల భవిష్యత్ కోసమే ఆలోచిస్తాని, దేశంలోనే నంబర్ వన్ గా రాష్ట్రాన్ని చేయాలన్నదే నా సంకల్పమని అయన తెలిపారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని చంద్రబాబు ప్రశ్నించారు.
నాలాడ్జ్ హబ్, సైన్స్ సిటీ వల్ల ఉద్యోగాలు వచ్చాయా...అని ప్రశ్నిస్తూ.... రాయలసీమకు తెచ్చిన పెట్టుబడులు ఏమిటో చెప్పాలని జగన్ కు సవాల్ విసిరారు.రాయలసీమకు ఏపార్టీ మేలు చేసిందో ప్రజలు గ్రహించాలని చంద్రబాబు సూచించారు. వాలంటీరి వ్యవస్థ కొనసాగుతుందని,ఎవరి ఉద్యోగం తొలగించబోమని, తెదేపా ప్రభుత్వం వస్తే వాలంటీరి వ్యవస్థకు మంచి భవిష్యత్ ఉంటుందని,వారికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పాలన వ్యవస్థలను ధ్వంసం చేయడం జగన్ మార్క్ అని, అభివృద్ధిలో తమ తెదేపా ముందు ఉంటుందన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకోంటామని చంద్రబాబు హామీనిచ్చారు.చెన్నై,బెంగుళూరు మధ్య కారిడర్ తీసుకొస్తామనీ హామీ ఇచ్చారు.రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలంతా పదడుగులు ముందుకేస్తే తాము వెంట ఉండి వంద అడుగులు వేస్తామని చంద్రబాబు అన్నారు.ఈకార్యక్రమంలో తెదేపా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జిలు,తెదేపా అనుబంధ సంఘాలు,జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు మార్చి04(విజయస్వప్నం.నెట్)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లకు గ్రేట్ చేసి జీతాలును పెంచాలని రాష్ట్ర యూనియన్ ఆదేశాల మేరకు సోమవారం విధులు నిర్వహిస్తూ..... నల్ల బ్యాడ్జిలు ధరించి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ఎదుట టిఏలు, సీఓలు నిరసన తెలిపారు.గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్నామని గ్రేడ్ పిక్షేషన్ చేసి, జీతాలు పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన కోరికలు తీర్చాలని వారు కోరారు.ఈ కార్యక్రమం లో సాంకేతిక సహాయకులు, రాజారెడ్డి, చంద్రారెడ్డి, హనుమంతరెడ్డి, ఆంజనేయులు, నాగముని, కంప్యూటర్ ఆపరేటర్లు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా ఆమడగూరు(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని ఏ.పుట్లవాండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రాయప్ప(68) సోమవారం తెల్లవారుజామున పాముకాటు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రాత్రి వేరుశెనగ పంటకు నీరు వదలడానికి కొడుకు, కోడలితో కలసి పొలానికి వెళ్లి నిద్రిస్తున్న సమయంలో రైతు చంద్రయ్యప్పకు విషపురుగు కాటు వేయడంతో గ్రామంలోకి చేరుకొని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
______________________________
సైబర్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త:బ్యాంక్ అధికారులు
శ్రీసత్యసాయిజిల్లా ఆమడగూరు మార్చి04(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఆధ్వర్యంలో ఆమడగూరు బస్టాండ్ ప్రాంతంl సోమవారం ఆర్థిక అక్షర్యాసత కార్యక్రమం నిర్వహించి ఎంవీ సైబర్ మోస,నేరాలపై ఫో్క్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళాకారులు బ్యాంక్ పథకాలు,సామాజిక భద్రత,సైబర్ నేరాలపై కళాజాత ప్రదర్శనలతో అవగాహన కల్పించిన్నట్లు బ్యాంక్ సిబ్బంది తెలిపారు.ప్రధానమంత్రి సురక్ష బీమా యోచన,ప్రధాని జీవనజ్యోతి యోచన,అటల్ పెంచన్ యోచన,జీరో అకౌంట్, నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించి,ప్రస్తుతం జరుగుతున్న సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు తీసుకొంటూ అప్రమత్తంగా ఉండాలని జానపద గీతాలు ఆలపిస్తూ.... నృత్య ప్రదర్శనలతో కళాకారులు అవగాహన కల్పించినట్లు బ్యాంక్ మేనేజర్ రవికాంత్ తెలిపారు.ఓడిచెరువు, నల్లమాడ మండలాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ పార్థసారధి,ఆమడగూరు బిజినెస్ పాయింట్ సీఎస్పీ కవిత బ్యాంక్ సిబ్బంది, కళాజాత సభ్యులు చిరంజీవి, విజయ్,వినోద్ పాల్గొన్నారని,గ్రామీణ ప్రజలు సహకరిసున్నట్లు ఆయన తెలిపారు.
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలంలోని అలాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో శ్రీ సోమవతి నది ఒడ్డున వెలసిన శ్రిఅక్క దేవతల ఆలయంలో మాఘుమాస చివరి సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి.అనంతరం దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసదాలు,అన్నదాన కార్యక్రమం నిర్వహించారని పూజారి వెంకటేష్ తెలిపారు.
______________________________
రా.... కదలిరా.... సభకు తరలిన తెలుగుతమ్ముళ్లు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, మార్చి04(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని కియో పరిశ్రమ సమీపంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యే రా.... కదలిరా.... బహిరంగ సభకు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా గ్రామాల నుండి సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళా కార్యకర్తలు వాహనాలలో తరలివెళ్లారు.
______________________________
పల్స్ పోలియో తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు మార్చి04(విజయస్వప్నం.నెట్)
జిల్లా ఇమ్మ్యూనైజేషన్ అధికారి కృష్ణయ్య సోమవారం ఓడిచెరువులో పర్యటించి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ పరిశీలించినట్లు వైద్యాధికారి భానుప్రకాష్ తెలిపారు.ఓడిచెరువు మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంను జిల్లా అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారని,కొండక మర్ల,ఒడిచెరువు పరిసర గ్రామాల్లో పోలియో చుక్కల కేంద్రాలను పరిశీలించి సలహాలు మరింత మెరుగైన ఫలితాలు సాధించటానికి తగు సూచనలు అందచేశారని తెలిపారు.ప్రారంభం నుండి రెండో రోజు వరకు సాధించిన పల్స్ పోలియో లక్ష్యాలపై అధికారి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పబ్లిక్ హెల్త్ నర్స్ అధికారిని వీరమ్మ,వైద్యాధికారి కమల్ రోహిత్,వైద్య సిబ్బంది దిల్ షాద్, ఆరోగ్య,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి