google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net

18, మార్చి 2024, సోమవారం

పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా దుద్దుకుంట

 వైకాపా శ్రేణులు సంబరాలు 


శ్రీసత్యసాయిజిల్లాఓడిచెరువు (విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని శనివారం అధిష్టానం ఖరారు చేయగా వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకొన్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి మరోసారి పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కలిపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓడిచెరువు వైకాపా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.మండల కేంద్రంలో ప్రధాన కూడలిలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచి పెట్టి సంబరాలు జరుపుకొన్నారు.రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపించుకొని ముఖ్యమంత్రి జగనన్నకు కనుకగా అందిస్తామని వైకాపా శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు.  ప్రతి ఒక్కరి సహకారంతో మెజారిటీ సాధిస్తాం  వైకాపా నాయకులు, కార్యకర్తలు,అభిమానులతో పాటు ప్రతి ఒక్కరి సహకారంతో రాబోయే ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీ సాధిస్తామని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం ఓడిచెరువు మండల వైకాపా కార్యాలయానికి ఎమ్మెల్యే దుద్దుకుంట విచ్చేసిన సందర్బంగా మండల వైకాపా శ్రేణులు అయనకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్బంగా ఎమ్మెల్యే దుద్దుకుంట మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో  గెలుపుకు కృషి చేయాలని,ప్రతి ఒక్కరి సహకారంతో వైకాపా భారీ మెజారిటీ సాధిస్తామని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ రాజునాయుడు, ఎంపిపి పర్వీన్ భాను,జడ్పీటీసీ, కుర్లి దామోదర్ రెడ్డి,అగ్రి అద్వైజర్ లక్ష్మిరెడ్డి,సర్పంచుల సంఘం అధ్యక్షులు బోయపాటి జగన్మోహన్ చౌదరి,సర్పంచ్ ముద్దలపల్లి గోవిందు పట్టణ కన్వీనర్ కోళ్ల కృష్ణారెడ్డి, నాయకులు మండోజీ ఆరీఫ్ ఖాన్, ఆనంద్ రెడ్డి, మైనారిటీ నాయకులు షామీర్,జో్ళి బాబా,బాబ్జాన్, గొల్లపల్లి వెంకటరెడ్డి, అంజనప్ప, ప్రభాకర్ నాయుడు, డీలర్ బాబు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

$$_________@@@__________$$


 శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువుమార్చి16(విజయస్వప్నం.నెట్)

మండలంలోని మిట్టపల్లి గ్రామంలో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు శ్రీ సరస్వతి పూజోత్సవం భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఉపాధ్యాయ బృందం సమక్షంలో విద్యార్థులు సరస్వతిదేవి విగ్రహనికి వివిధ పుష్పలతో అలంకరణ చేయగా అర్చకులు లక్ష్మీపతిరావు వైభవంగా పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్.రామచంద్రరావు,  ఉపాధ్యాయులు జయరాజు, జగన్, రామాంజనేయులు, జానకమ్మ, మంజులవాణీ, నరసమ్మ, రాధ, దనామయ్య తదితరులు పాల్గొన్నారు.

$$_________@@@__________$$

తుమ్మలకుంట్లపల్లిలో మాజీమంత్రి పల్లె ప్రచారం  

 వైకాపాను వీడి పలువురు తెదేపాలో చేరిక 


శ్రీ సత్యసాయిజిల్లా,ఓడిచెరువు మార్చి16(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని తుమ్మలకుంట్లపల్లిలో శనివారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రచారం చేపట్టారు.ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పధకాలను వివరిస్తూ....చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని,తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా,పల్లె సింధూరరెడ్డిని ఎమ్మెల్యేగా చేయాలని అయన ప్రచారం చేపట్టారు.అంతక ముందు మాజీమంత్రి పల్లెకు తుమ్మలకుంట్లపల్లి గ్రామ తెదేపా నాయకులు,కార్యకర్తలు, మహిళలు పూలు చల్లి, బాణాసంచా కాల్చి ఘనంగా స్వాగతం పలికారు.     వైకాపా నుండి తెదేపాలోకి చేరిక  మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో వణుకువారిపల్లికి చెందిన 17  కుటుంబాలు  వైకాపాను  వీడి తెదేపాలో చేరాయి. వీరికి టిడిపి కండువాలు కప్పి మాజీ మంత్రి పల్లె పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ జయచంద్ర, ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్,ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలేనాయక్, ఆర్ఎంపి జాకీర్, చంద్ర,సురేష్, మల్లికార్జున, అంజనప్ప,జయచంద్రరెడ్డి,జనసేన,బీజేపీ నాయకులు మేకల ఈశ్వర్,సతీష్,దివాకర్ రెడ్డి,గ్రామ తెదేపా నాయకులు శ్రీరాములునాయుడు,వెంకటేష్ నాయుడు, గౌస్ పీరా,హరున్,సికిందర్, ముని, జనార్దన్ రెడ్డి, నరసింహరెడ్డి, టిఎన్ఎస్ఎఫ్ ఇర్ఫాన్,లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

$$_________@@@__________$$


శ్రీసత్యసాయిజిల్లా,కదిరి మార్చి 16(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో శనివారం బీజేపీని వీడి వైకాపాలో చేరారు.డిష్ చంద్ర ఆధ్వర్యంలో బీజేపీ వీడి పలువురు నాయకులు,కార్యకర్తలు వైకాపాలో చేరగా కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్,వైకాపానాయకులు వజ్ర భాస్కర్ రెడ్డి కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు   కదిరి పట్టణంలో శనివారం అమరజీవి పొట్టి శ్రీరాములు 123 జయంతి సందర్బంగా శనివారం వైకాపా కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు,కార్యకర్తలు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన కోసం 52రోజులు ఆమరణ నిరాహార దీక్షలు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను ఈసందర్బంగా స్మరించుకొన్నారు.

$$_________@@@__________$$

ఎమ్మెల్యే అభ్యర్థి యశోదదేవి గెలుపుకు కృషి చేస్తాం

జనసేనపార్టీ శ్రేణులు  


త్యసాయిజిల్లాకదిరి మార్చి16(విజయస్వప్నం.నెట్)

కదిరి జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్  ఆధ్వర్యంలో తెలుగుదేశం,జనసేన పార్టీ,భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందికుంట యశోదమ్మ అత్యధిక మేజారితో గెలిపించి అసెంబ్లీకి పంపించే వరకూ కృషి చేస్తామని తెలుపుతూ శనివారం కందికుంట యశోదదేవి గృహంలో మర్యాద పూర్వకంగా కలిసినట్లు జనసేనికులు తెలిపారు.తెలుగు దేశం,జనసేన,భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిని కందికుంట నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఎంతో మంది అభాగ్యులకు సేవలు చేసిన మంచి మనిషిగా యశోదదేవి సేవా కార్యక్రమాలను కొనియాడారు.కందికుంట యశోదా దేవి గెలుపు కోసం జనసేన శ్రేణులు కృషి చేస్తామని జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్ తెలిపారు.ఈకార్యక్రమంలో మండల కన్వీనర్లు చిల్లా మహేష్ ,సాకే రవి కుమార్,భూక్యా రవీందర్ నాయక్,పట్టణ అధ్యక్షులు కాయల చలపతి,ఉపాధ్యక్షులు లక్ష్మణ కుటాల,ప్రధాన కార్యదర్శులు వానిల్లి అంజిబాబు,గుంతా ప్రతాప్,కార్యదర్శులు గంగాధర్,సాయి ప్రియ,ఐటీ  వింగ్ కోఆర్డినేటర్ పొరకల రాజేంద్ర ప్రసాద్,బ్లూ మూన్ స్కూల్స్ ఇన్స్టిట్యూట్ అధినేత మంచి శివ శంకర్,గవ్వల శ్రీనివాసులు,కొమ్మినేని చిన్న రెడ్డెప్ప,కొట్టే అశ్వర్త కుమార్,సత్యవతి,లక్ష్మీ ప్రసన్న,షమీమ్,తాజ్ మండల నాయకులు,పట్టణ కమిటీ సభ్యులు,కార్యకర్తలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

$$_________@@@__________$$

శ్రీ సత్యసాయిజిల్లా పుట్టపర్తి మార్చి16(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి మండలంలోని నిడిమామిడి పంచాయతీ పరిధిలో గ్రామాల్లో శనివారం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి, పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి దంపతులు ఎన్నికల ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన సూపర్ సిక్స్, బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ పథకాల ద్వారా చేకూరే లబ్ధిని ప్రజలకు వివరించారు. ఈకార్యక్రమంలో తెదేపా, జనసేన,బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి