google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : రైతు సంక్షేమమే.... ప్రధాని మోడీ ద్యేయం - ప్రతి ఒక్కరు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

1, మార్చి 2024, శుక్రవారం

రైతు సంక్షేమమే.... ప్రధాని మోడీ ద్యేయం - ప్రతి ఒక్కరు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

ప్రతి ఒక్కరు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి 


శ్రీసత్యసాయిజిల్లా,ఓబుళదేవరాచెరువు,ఫిబ్రవరి 29(విజయస్వప్నం.నెట్)
చట్టలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఓడిచెరువు మండల తహశీల్దార్ ఖాజాబీ సూచించారు.ఇనగాలూరు పంచాయతీ గ్రామ అంబేద్కర్ కాలనీ ఆర్డీటి భవనంలో గురువారం తహసీల్దార్ ఖాజాబీ అధ్యక్షతన సివిల్ రైట్స్ డే కార్యక్రమంపై కాలనీవాసులకు సమావేశం నిర్వహించగా ఎంపిడిఓ వరలక్ష్మి,ఎస్ఐ వంశీకృష్ణ పాల్గొన్నారు.ప్రతి పౌరుడు ప్రాథమిక హక్కులు,చట్టలపై  అవగాహన కలిగి ఉండాలని తహసీల్దార్ ఖాజాబీ సూచించారు.చట్టాలపై అవగాహన కలిగి ఉండడంతోపాటు సమస్యలపై స్పందించాలని,ప్రభుత్వ పధకాల వివరాలు,సక్రమంగా పంపిణి చేసే విధానంపై అవగాహన ఉండాలని,కుల ధ్రువీకరణ పత్రాల జారీలో సమస్యలు ఉన్నాయా.... కుల దుషణలు జరుగుతున్నాయా....అని తహసీల్దార్ అడిగి తెలుసుకున్నారు.ప్రతి పౌరుడు తమ హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఎస్సి,ఎస్టీ అట్రాటిసి కేసులపై అవగాహన కలిగి ఉండాలని,సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని ఎంపిడిఓ వరలక్ష్మి సూచించారు.దిశ యాప్, దిశ చట్టలపై ఎంత మందికి అవగాహన ఉందని అధికారులు అడిగారు.చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెలలో చివరి శుక్రవారం సివిల్ రైట్స్ డే నిర్వహిస్తున్నట్లు(ఫిబ్రవరి చివరి రోజు గురువారం)ఎస్ఐ వంశీకృష్ణ పేర్కొంటూ....కుల,మతలు వర్గ విబేధాలు లేకుండా సమాజంలో సమానత్వంగా రాజ్యాంగంలో రూపొందించారాన్నారు.ఆపద సమయాల్లో ఉన్నవారు 100,112 నంబర్లకు ఫోన్ చేస్తే వెంటనే పోలీసుల సహాయం పొందగలరని ఆయన సూచించారు.ఈకార్యక్రమంలో ఆర్ఐ నాగేంద్రవీఆర్వో,గ్రామ కార్యదర్శి,సచివాలయం సిబ్బంది,పోలీసులు,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.                             
ఆమడగూరులో సివిల్స్ డే ఆమడగూరు మండలంలోని జా్కుల కొత్తపల్లి పంచాయతీ గ్రామ కాలనీలో గురువారం డ్యూపుటీ తహసీల్దార్ వెంకటరెడ్డి అధ్యక్షతన పౌర హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను సద్వినియోగం చేసుకోవాలని,ప్రాధమిక హక్కులు,చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని,సమాజంలో వివక్ష చూపించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని, ప్రతి కుటుంబంలో పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాలని సూచించారు.ఈకార్యక్రమంలో ఏఎస్ఐ ధనుంజయ,ఆర్ఐ ఈశ్వరయ్య,వార్ధన్ కృష్ణానాయక్ వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.
_____________________________
 శ్రీసత్యసాయిజిల్లా,కదిరి, ఫిబ్రవరి29(విజయస్వప్నం. నెట్)
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుఅనే ఉద్యమంపైన  తిరుపతిలో నేడు(శుక్రవారం)నిర్వహించే భారీ సభకు సత్యసాయి జిల్లా కదిరి, పుట్టపర్తి డివిజన్ పరిధిలో గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని  కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగిటి మునికుమార్ గురువారం విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు.
_____________________________

శ్రీసత్యసాయిజిల్లా/ఓడిచెరువు ఫిబ్రవరి29(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలంలోని కొండకమర్ల పంచాయతీ వీరప్పగారిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇడుగుట్ట ఆంజనేయులు స్వగృహంలో గురువారం వివాహ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జి,మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరై నూతన వధూవరులు ఆశ, రామకృష్ణలను ఆశర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పాల్గోని ఆశ,రామకృష్ణ  వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
_____________________________
భాధిత కుటుంబాలకు ఆర్థికసాయం చేసిన బి.ఎస్ మక్బూల్
శ్రీసత్యసాయిజిల్లా,నల్లచెరువు, ఫిబ్రవరి29(విజయస్వప్నం.నెట్)
మండలలోని దేవరింటిపల్లికి చెందిన ముగ్గురు బాధితుల కుటుంబ సభ్యులకు గురువారం కదిరి వైకాపా శాసనసభ అభ్యర్థి బి.ఎస్. మక్బుల్  25వేల రూపాయలు ఆర్థికసాయం అందజేశారని వైకాపా శ్రేణులు తెలిపారు.షఫీ హజరత్,రహీమ్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఇరువురికి చేరో పదివేలు చొప్పున 20వేలు,అలాగే ఇమామ్ సాబ్ 5వేల రూపాయలు ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ అందజేశారన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి మండెం రవికుమార్ రెడ్డి,తదితర నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారన్నారు.
_____________________________
రైతు సంక్షేమమే.... ప్రధాని మోడీ ద్యేయం
బిజెపి కిసాన్ మోర్చా నాయకులు
 శ్రీసత్యసాయిజిల్లా మడకశిర ఫిబ్రవరి29(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలో గురువారం బీజేపీ కిసాన్ మోర్చా రాయలసీమ ఇంచార్జ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పియం కిసాన్ 6వ విడత నిధులు విడుదల సందర్బంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా బీజేపీ మినిస్ట్రీ అఫ్ రైల్వే బోర్డు సభ్యులు తలుపుల గంగాధర్ ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ.... రైతు సంక్షేమమే ద్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో అనేక పధకాలు అమలు చేసారని,ప్రధాని మోడీ హామీ ఇవ్వకపోయినా.... రైతులకు 4నెలలకు 2వేలు చొప్పున ప్రతి సంవత్సరం రైతు ఖాతాల్లోకి 6వేలు జమ చేస్తున్నారని,దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో రైతు సంక్షేమాని విస్మరించి నిర్లక్ష్యం చేసాయని,బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతే రాజుగా,రైతు సంక్షేమమే ద్యేయంగా  పిఎం కిసాన్ పథకం కోసం 21 వేల కోట్లు మంజూరు చేసిందని,ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో అనేక పధకాలు ప్రవేశపెట్టి మన్ననలు పొందుతున్నరన్నారు.కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ తయారు చేయించి ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసే ఘనత ప్రధాని మోడీకే సాధ్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృతత్వంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందని పలువురు కిసాన్ మోర్చా నాయకులు పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో రాయలసీమ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి,మైనారిటీ మోర్చా అధ్యక్షులు దస్తగిరి,మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి విక్టోరియ రాణి,రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రవీంద్ర,బీజేపీ నాయకులు,కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
______________________________

పుట్టపర్తి ఎనుములపల్లిలో అయ్యప్పస్వామి ఆలయ భూమిపూజ





శ్రీసత్యసాయిజిల్లా/పుట్టపర్తి మార్చి01(విజయస్వప్నం.నెట్)



శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి పట్టణానికి సమీపంలో ఎనుములపల్లి గ్రామ శివర్లో ఓబులేశ్వరస్వామి కొండపైన మాఘుమాస శుక్రవారం పురస్కరించుకొని శ్రీఅయ్యప్పస్వామివారి ఆలయ నిర్మాణానికి భక్తిశ్రద్దలతో పురోహితులు మంత్రోచ్చాణలతో భూమిపూజ నిర్వహించారు.ఆలయ కమిటీ నిర్వహక సభ్యులు మాట్లాడుతూ.... ఎనుములపల్లితో పాటు పరిసర గ్రామాలలో వందల మంది అయ్యప్పస్వామి మాలధారణ భక్తులు పూజలు, భజనలు, అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహించాడని సౌకర్యాలు లేక కొన్నేళ్లుగా ఇబ్బందులు పడేవరమని, కమిటీ ఏర్పాటు చేసుకొని ఆలయం నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టామని,ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న భక్తులకు,పుర ప్రజలకు కమిటీ నిర్వహకులు వేణుగోపాల్, శ్రీనివాసులు, రమణ, ఉమాపతి నాయుడు, నరసింహులు ఈసందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. అంతక ముందు తెల్లవారుజామున నుండి వివిధ మండలాల నుండి విచ్చేసిన అయ్యప్పస్వామి ఆలయాల గురుస్వాములు, భక్తులు అయ్యప్పస్వామి నామస్మరణ, శరణఘోష, భజన పాటలు ఆలపించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ అన్నప్రసాదాలు అందజేశారు. అనంతరం కమిటీ సభ్యులు గురుస్వాములకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఓడిచెరువు (ఎం.కొత్తపల్లి) శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు, ముదిగుబ్బ పంచాగిరీష అయ్యప్పస్వామి ఆలయ ధర్మకర్త సోమగుట్ట శిరిగిరెడ్డి గురుస్వామి బృందం ఎన్. వెంకటశివారెడ్డి, సంగాల ఎర్రప్ప,భగవాన్ స్టూడియో నాగరాజు, శివానాయక్,వెంకటేష్ నాయక్, చంద్రశేఖర్ నాయక్, ధర్మవరం విజయకుమార్ గురుస్వామి, పుట్టపర్తి గురుస్వామి పుట్టన్న తదితర ఆలయ గురుస్వాములు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

_____________________________
చెన్నేకొత్తపల్లి విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

 శ్రీ సత్యసాయిజిల్లా/పుట్టపర్తి మార్చి01(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి పట్టణానికి చెందిన ఖిద్మత్ ఎ ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహికులు షామీర్ ఆధ్వర్యంలో పుట్టపర్తి కేంద్రానికి చెందిన ఎన్టీఆర్ అభిమాని జావిద్ సహకారంతో రాప్తాడు నియోజవర్గం చెన్నేకొత్తపల్లి మండలలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల,భవతి కేంద్రం రెండు పాఠశాల విద్యార్థులకు శుక్రవారం జావిద్,షామీర్ చేతుల మీదుగా ఉపాధ్యాయుల సమక్షంలో వాటర్ బాటిల్స్,పలకలు,నోట్ బుక్స్,పెన్సిల్స్ తదితర విద్యా సామాగ్రి అందజేశారు.ఈ కార్యక్రమంలో షాకీర్,మౌలా,సాయి, ఉపాధ్యాయిని శ్వేత,ఉపాధ్యాయుడు నాగేంద్ర   తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి