ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలని పోలీస్ కవాతు
శ్రీసత్యసాయిజిల్లా,కదిరి, మార్చి11(విజయస్వప్నం.నెట్)
రాష్ట్రంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నిక నిర్వహణలో భాగంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోనేందుకు,ప్రజల భద్రతకు భరోసా కల్పించేదుకే జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు కదిరి పట్టణంలో కేంద్ర సాయుధబలగాలతో కలిసి పోలీసులతో సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహించినట్లు డిఎస్పీ శ్రీలత తెలిపారు.ఎటువంటి అల్లర్లు జరగకుండ,ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేవిధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాలు పోలీసులతో కవాతు నిర్వహిస్తున్నారని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించెందుకు ప్రజలందరు సహకరించాలని కదిరి పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్,బస్టాండ్, జీవిమాను సర్కిల్,చౌక్ బజారు, కోనేరు వీధి, హిందూపురం రోడ్డు తదితర ప్రాంతాల్లో కేంద్ర సాయుధబలగాలతో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు.
______________________________
మెనూ పాటించకపోతే చర్యలు
శ్రీసత్యసాయిజిల్లా,నంబుల పూలకుంట,మార్చి11(విజయస్వప్నం.నెట్)
వసతి గృహల్లో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశం మేరకు మెనూ ప్రకారం ప్రతి రోజు భోజనాలు అందించాలని కదిరి డివిజన్ అసిస్టెంట్ బీసీ సంక్షేమాధికారి బాలాజీ సోమవారం మండల కేంద్రంలో బీసీ బాలుర వసతి గృహన్ని సందర్శించి వార్ధన్ ఆంజనేయులుకు సూచించారు.ప్రభుత్వం మేరకు మెనూ పాటించకపోతే చర్యలు తప్పవన్నారు.పదవ తరగతి విద్యార్థుల హల్ టికెట్లు పరిశీలించి,ఒత్తిడి లేకుండా ఏకగ్రతతో పరీక్షలు రాయాలని,ఉత్తమ ఫలితాలతో హాస్టల్ కు,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొనిరావాలని అయన కోరారు.వసతి గృహంలో సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,మార్చి11(విజయస్వప్నం. నెట్)
మండలంలోని తిప్పేపల్లి పంచాయతీ గ్రామంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు,మాజీ సర్పంచ్ కుర్లి ఉత్తమరెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్బంగా గ్రామ సమీపంలో కుర్లి ఉత్తమరెడ్డి ఘాట్ వద్ద సోమవారం కుమారులు,కుటుంబ సభ్యులు కుర్లి నర్సిరెడ్డి,కుర్లి రంగారెడ్డి, కుర్లి రాజగోపాల్ రెడ్డి,జడ్పీటిసి దామోదర్ రెడ్డిలతో పాటు మండలంలోని నాయకులు, కార్యకర్తలు,ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు.
______________________________
అగ్గికి ఆహుతైన కొర్ర, అనప పంటలు:రైతును పరామర్శించిన సామకోటి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి11(విజయస్వప్నం.నెట్)
మండలంలోని ఇనగలూరు పంచాయతీ గ్రామానికి చెందిన టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శబరిష్ నాయుడుకు చెందిన పొలంలో ఆదివారం రాత్రి కొర్ర,అనప పంటలు అగ్గికి ఆహుతైన విషయం తెలుసుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకొని అగ్నికి ఆహుతైన పొలాన్ని పరిశీలించి రైతుకు అండగా ఉంటానని శ్రీసత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన అగ్గికి అహుతైన పొలాన్ని సోమవారం పరిశీలించి మాట్లాడుతూ...గ్రామస్తులు,బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం అగ్నికి ఆహుతైన పంటను,డ్రిప్స్ పైపులతో పాటు వ్యవసాయ సామాగ్రి పూర్తి దగ్ధమై దాదాపు ఒకటిన్నర ఎకరాల్లో వేసిన పంట పూర్తిగా బూడిద పాలైయిందని,లక్షపైగా పెట్టుబడి పెట్టి పంటపై రావాల్సిన దాదాపు రెండు లక్షల మేర ఆస్థి నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తంచేశారని,ఈచర్యతో కోలుకోలేని విధంగా నష్టపోయారని,పంట కాలిపోతుండడంతో పొలం వద్దకు వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసిన మంటలు అదుపులోకి రాలేదని, అప్పటికే పూర్తిగా పంట కాలిబూడిదైపోయిందని రైతు ఆవేదన వర్ణనతీతామని,ఉన్నతాధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి,దర్యాప్తు ప్రారంభించాలని,ప్రభుత్వం స్పందించి రైతుకు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని అయన తెలిపారు.ఈ కార్యక్రమంలో తెదేపా మైనార్టీ సీనియర్ నాయకులు నిజాం వలి, రమణ,అంజినాయుడు, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
______________________________
భాదితులకు మాజీ ఎంపీ నిమ్మల సాయం
శ్రీసత్యసాయిజిల్లా,బుక్కపట్నం,మార్చి11(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలంలోని మారాల పంచాయతీ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఆకులేటి నాగమణి అనారోగ్యంతో మృతి చెందగా,విషయం తెలుకొన్న తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు,మాజీ పార్లమెంట్ సభ్యులు నిమ్మల కిష్టప్ప సోమవారం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 20 వేలు ఆర్థిక సాయం అందించినట్లు తెదేపా నాయకులు వంశీ,అంజి రెడ్డి,కే.చంద్ర,ఎం.నాగరాజు తెలిపారు.ఇదే గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త సి.నరసింహులు అనారోగ్యంతో మృతి చెందిన సమాచారం తెలుసుకొన్న మాజీ ఎంపీ నిమ్మల బాధిత కుటుంబానికి 10 రూపాయలు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.
______________________________
నేడు స్వామివారి హుండీ లెక్కింపు
శ్రీసత్యసాయిజిల్లా, కదిరి, మార్చి11(విజయస్వప్నం.నెట్)
శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు(మంగళవారం)స్వామివారి హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి(ఉప కమీషనరు)సోమవారం ఓప్రకటనలో పేర్కొన్నారు.శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి హుండిల లెక్కింపు కార్యక్రమం మంగళవారము ఉదయం 6గంటల నుండి ప్రారంభం అవుతుందని,హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తులు ప్రభుత్వ నిభందనల ప్రకారము పురుషులు పంచె,కండువాతో రావాలని,ఎవ్వరు వారి స్వంత నగదు తీసుకొని హుండి లెక్కింపు ప్రాంతములోనికి హజరు కాకుడదని,బంగారు ఇతర విలువైన వస్తువులు ధరించి రాకూడదని అయన ఈసందర్బంగా సూచించారు.
______________________________
సూపర్ సిక్స్ పై ప్రచారం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, మార్చి11(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో సోమవారం తెదేపా శ్రేణులు సూపర్ సిక్స్ పధకాలపై కరపత్రాలు అందుస్తూ.... ప్రచారం చేపట్టారు.మండల కన్వీనర్ జయచంద్ర ఆధ్వర్యంలో తెదేపా జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మినీ మేనిపెస్టో లో రూపొందించిన బాబు షూరిటీ,భవిష్యత్తు గ్యారంటీ,సూపర్ సిక్స్ పధకాలపై ఓడిచెరువు గ్రామ కాలనీల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి,తెదేపాకు ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరారన్నారు.ఈకార్యక్రమంలో తెదేపా ఎస్సి సెల్ నాయకులు ముద్దలపల్లి శ్రీనివాసులు, మైనారిటీ సెల్ నాయకులు షబ్బీర్,ఆరీఫ్ ఖాన్,బూత్ కన్వీనర్ తోఫిక్ ఖాన్,అబ్బులు,మస్తానమ్మ,వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా,కదిరి,మార్చి11(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలసిన శ్రీ ఖాద్రీ లక్ష్మినరసింహస్వామివారి ఆలయంలో సోమవారం ప్రముఖ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ స్వామివారిని దర్శనం చేసుకొన్నారు.ఆలయ అర్చకులు స్వామి తీర్థ ప్రసాదాలు అందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి విశిష్టత ప్రజలకు చేరువ చేసే విధంగా కృషి చెయ్యాలని ఆకాంక్షించారు.శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ ఉప ప్రధాన అర్చకులు శ్రీ కుమార్ రాజా స్వామి వారికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ యూనివర్సిటీ వారు ధర్మ ప్రచారం విభాగంలో గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించినట్లు కుటాల లక్ష్మణ్ తెలిపారు.
______________________________
నేటి నుండి కేజీబీవి ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,మార్చి11(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రానికి సమీపంలో కస్తూరిభా బాలికల విద్యాలయంలో 6వతరగతి,ఇంటర్ ప్రవేశాలకు నేటి(మంగళవారం)నుండి దరఖాస్తులు స్వికరిస్తున్నట్లు ప్రత్యేక అధికారిణి గీతాభాయి సోమవారం ఓప్రకటనలో తెలిపారు.2024-25 సంవత్సరానికి గాను 6వ తరగతి,ప్రధమ ఇంటర్ ప్రవేశం కోసం నేటి(మార్చి12)నుండి ఏప్రియల్ 11వతేది వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వికరిస్తున్నట్లు ఆమె తెలిపారు.విద్యార్థుల తల్లిదండ్రులకు వర్షికాదాయం 1.20 వేలు మించి ఉండకూడదని,అన్ని ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని,ఎంపికైన విద్యార్థులకు చరవాణి ద్వారా సమాచారం అందిస్తూ....పాఠశాల నోటిస్ బోర్డుపై జాబితా పొందుపరుస్తామన్నారు.మిగిలిన 7,8,9 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వికరించనున్నట్లు ఆమె తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి