నేడు ఎమ్మెల్యే చేతుల మీదుగా సచివాలయం ప్రారంభం
శ్రీసత్యసాయిజిల్లా మార్చి06 ఆమడగూరు (విజయస్వప్నం.నెట్)
నేడు(గురువారం) ఉదయం 8:30 గంటలకు ఆమడగూరు మండలంలోని తుమ్మల సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి హాజరౌతారని, కావున ఈ కార్యక్రమానికి ఎంపీపీ, జడ్పీటీసీ,సర్పంచులు ఎంపీటీసీలు ,జేసీఎస్ కన్వీనర్, సచివాలయ కన్వీనర్లు,ఇతర ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు,వివిధ కార్పోరేషన్ డైరెక్టర్లు, పోలింగ్ బూత్ కన్వీనర్లు, ఏజెంట్లు, డీలర్లు, అనుబంధ సంఘాల కమిటీ అధ్యక్షులు,గ్రామ సచివాలయ సిబ్బంది,గృహ సారథులు, వాలంటీర్లు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు, అక్క చెల్లమ్మలు పాల్గోని విజయవంతం చేయాలని వైకాపా మండల కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి గురువారం ఓప్రకటనలో పిలుపునిచ్చారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా మార్చి06(ఓడిచెరువు)
మండల రెవిన్యూ కార్యాలయంలో బుధవారం జిల్లా అధికారులు నిర్వహించిన వీడియో కన్ఫరెన్స్ కార్యక్రమాన్ని తహసీల్దార్ ఖాజాబీ ఆధ్వర్యంలో వీఆర్వోలకు,బిఎల్ఓ సభ్యులకు సమావేశం ఏర్పాటు చేసి వీక్షించారు.అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్ గా నమోదు చేయాలని,ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా అధికారులు విధి విధానాలపై పలు అంశాలపై వీడియో కన్ఫారెన్స్ లో సూచించారని తెలిపారు. (విజయస్వప్నం.నెట్,ఓడిచెరువు ప్రతినిధి)
______________________________
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో బుధవారం ఉపాధ్యాయ సంఘాలు సమావేశం ఏర్పాటు చేయగా డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నరహరి పలు అంశాలపై మాట్లాడినట్లు శ్రీసత్యసాయి జిల్లా నాయకులు తెలిపారు.610 జీవో వారికి పదోన్నతులు ఇవ్వాలని,2003 డిఎస్సీ వారికి పాత పెన్షన్ ఇవ్వాలని,స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల సమాయాలు పాఠశాలల పనివేళాలకే పరిమితం చేయాలని సబ్జెక్టు కాంప్లెక్స్ లను మండలంలోనే ఏర్పాటు చేయాలని,స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ట్రావెలింగ్ అలవెన్స్, డిఏలను చెల్లించాలని,నెలవారీ పదోన్నతులను ఇవ్వాలని,ఎస్ఎ -2 పరీక్షలకు 1-5 తరగతులకు సిలబస్ ను సెమిస్టర్ 2 ను పరిగణించాలని,ఐఎఫ్పి ప్యానల్ లను సరిపడా ఇవ్వాలని,.ఇంకా 12 ఐఎఫ్ పి లు రావాల్సి ఉందని మంత్రి చెప్పారని,ఎస్ఐఎంఎస్ యాప్ లో మీటింగ్/ వర్క్ షాప్,డిడిఓ రిక్వెస్ట్ అప్లయ్ చేయాలంటే ఏ సమయంలో అయినా అప్లయ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని,ఒకటవ తరగతిలో వచ్చే విద్యా సంవత్సరం నుండి 6+1 వయసు తీసుకుంటే దాన్ని ప్రయివేటు విద్యా సంవత్సరం పాఠశాలలకు కూడా వర్తింప చేయాలని కోరగా ఈ ఏడాది అమలు చేయడంలేదని మంత్రి చెప్పారని,ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంగ్లీషు పదోన్నతుల గురించి ప్రాతినిధ్యం చేశామని,గిరిజన షెడ్యూల్ ప్రాంతాల్లో జీవో నెంబర్ 3 రద్దయినందున సమగ్ర జీవోను విడుదల చేయాలని ప్రతిపాదన చేసారని, ఒంటి పూట బడులను మార్చి 15 నుండి ప్రారంభించాలని,పాఠశాలలకు నిర్వహణా గ్రాంట్స్ విడుదల చేయాలని తదితరbసమస్యలను పరిష్కరించాలని మంత్రి బొత్స సత్యనారాయణకు వినతిపత్రాన్ని అందచేసినట్లు శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కట్టుబడి గౌస్ లాజమ్,మారుతి ప్రసాద్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు షర్ఫోద్దిన్,శ్రీనాధ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. (విజయస్వప్నం.నెట్ ప్రతినిధి)
______________________________
రేపటి నుండి నారా లోకేష్ శాంఖారావం
శ్రీసత్యసాయిజిల్లా(విజయస్వప్నం.నెట్)
రేపటి(శుక్రవారం)నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (ఉమ్మడి జిల్లాల పర్యటనలో) శ్రీసత్యసాయిజిల్లాలో శాంఖారావం కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు పర్యటిస్తారని, 8వతేది మొదటి రోజు 3 నియోజకవర్గాలలో,9వతేది రెండవరోజు రెండు నియోజకవర్గ పరిధిలో పర్యటించి శాంఖారావం కార్యక్రమంలో పాల్గొంటారని మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ లు విలేకరుల సమావేశాల్లో పేర్కొన్నారు. జనసేన, తెదేపా నాయకులు, కార్యకర్తలు,ప్రతి ఒక్కరు తరలివచ్చి విజయవంతం చేయాలని గురువారం కదిరి, శ్రీసత్యసాయి తెదేపా కార్యాలయాల్లో విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా మార్చి06(విజయస్వప్నం.నెట్)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు బుధవారం ఏపీఓ సుధాకర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయగా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిణి వరలక్ష్మి పాల్గోని మాట్లాడుతూ.... వేసవిలో పనులు చేసే ప్రదేశాల్లో నీరు,నీడ, ప్రధమ చికిత్స తదితర సౌకర్యాలు కల్పించాలని,ప్రతి కుటుంబ సభ్యులకు పనులు కల్పించి వలసలు నివారించాలని తదితర అంశాలపై ఆమె సూచనలు ఇచ్చారు.ఈకార్యక్రమంలో సాంకేతిక సహాయకులు రాజారెడ్డి, చంద్రారెడ్డి, ఆంజనేయులు, హనుమంతరెడ్డి, సీఓలు తదితరులు పాల్గొన్నారు. (విజయస్వప్నం.నెట్, ఓడిచెరువు)
శ్రీసత్యసాయిజిల్లా మార్చి06(విజయస్వప్నం.నెట్)
శంఖారావం పర్యటన కార్యక్రమంలో భాగంగా బుధవారం సత్యసాయి జిల్లాకు విచ్చేసిన నారా లోకేష్ బాబుకి పుట్టపర్తి విమానాశ్రయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునితమ్మ, సత్యసాయి జిల్లా టీడీపీ ముఖ్యనేతలు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చిత్రపటాన్ని అందించి ఘనంగా స్వాగతం పలికారు. (విజయస్వప్నం.నెట్, పుట్టపర్తి ప్రతినిధి)
వశిష్ఠ పాఠశాలలో ఐఐటీ కోర్సుపై అవగాహన
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మండల కేంద్రంలో బుధవారం వశిష్ఠ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఐఐటీ కోర్సుపై అవగాహన శిక్షణ కార్యక్రమం కరస్పాండెంట్ పిట్టా శివశంకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ఎంఈఓ2 రమణ ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు.గతంలో ఐఐటీ పరీక్షలకు నాణ్యమైన విద్యా పట్టణాల్లో భోదించేవారని,ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల ప్రయివేట్ పాఠశాలలో నిష్ణాతులచే ఐఐటీ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ తరగతులు అందుబాటులోకి తీసుకొనిరావడం శుభపరిణామని పేర్కొన్నారు. ఈఅవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని అయన సూచించారు.ఈసందర్బంగా ఐఐటీ పోటీ పరీక్షలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు.భోధకులు నాగిరెడ్డి,వేంకటేష్, ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయ బృందం గంగాద్రి,మోహన్ రెడ్డి,నళిని,షరీఫ్,రమణ,రమాదేవి,రాంబాబు తదితరులు పాల్గొన్నారు. (విజయస్వప్నం.నెట్,ప్రతినిధి, ఓడిచెరువు)
ఆరోగ్యశ్రీ పేదల వరదాయిని :వైద్యాధికారి బానుప్రకాష్
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి 06(విజయస్వప్నం.నెట్)
ఆరోగ్య శ్రీ పథకం పేద ప్రజలకు వరం లాంటిదని,ప్రతి సద్వినియోగం చేసుకొని కుటుంబంలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని వైద్యధికారి భానుప్రకాష్ పేర్కొన్నారు.మండల పరిధిలోని మామిళ్ల కుంటపల్లి పంచాయతీ గ్రామంలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్యశిబిరం ఏర్పాటు చేయగా వైద్యాధికారి భానుప్రకాష్ హాజరై మాట్లాడుతూ....ఆరోగ్యశ్రీ పారితోషకం 5 లక్షల నుండి 25 లక్షల వరకూ పెంచరన్నారు.ప్రతి కుటుంబ సభ్యులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఆరోగ్య సురక్ష వైద్యశిబిరంలో 379 మందికి ఆరోగ్య పరీక్షలు,చికిత్సలు చేసి,ఉచితంగా మందుల పంపిణీ చేశారు.రిఫరెల్ సర్వీస్ సేవలు అందచేశారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య,ఆశ 104, సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
శ్రీసత్యసాయిజిల్లా మార్చి06(కదిరి)
8వతేది కదిరి పట్టణం పివిఆర్ పంక్షన్ హాల్ ఎదురుగా దేవరచేరువు సమీప కొత్త బైపాస్ రోడ్డు వద్ద నిర్వహించే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం బహిరంగ సభస్థలి ప్రాంతాన్ని బుధవారం కదిరి తెలుగుదేశంపార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పరిశీలించి,ఏర్పాట్ల పనులు పర్యవేక్షించారు.టిడిపి నాయకులు పీవీ పవన్ కుమార్ రెడ్డి,టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. (విజయస్వప్నం.నెట్,కదిరి)
_______________________________
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి