మోహిని రూపంలో ఖాద్రీ నరసింహుడు దర్శనం
శ్రీసత్యసాయి జిల్లా కదిరి మార్చి 27(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలసిన శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మార్చి 19 నుండి ఏప్రిల్ 2 వరకు పక్షం రోజులపాటు నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 9వరోజు బుధవారం శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.కదిరి సుగంధ పరిమళాల మల్లెలతో,ఎదపై అమృత కలశాన్ని పట్టుకున్న అలంకరణతో మోహిని రూపంలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం యోగశాలలో నిత్య పూజ, హోమం గ్రామోత్సవం నిర్వహించారు.సంధ్యా సమయంలో స్వామివారు మోహిని రూపంలో ప్రతి ఇంటికి వెళ్ళి భక్తులకు దర్శనమిచ్చారు.బుధవారం సాయంత్రం ఊరేగింపుగా బయలుదేరిన స్వామివారు తిరిగి గురువారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకుంటారని ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి, ఆలయ అర్చకులు తెలిపారు.నేడు 10వరోజు గురువారం ప్రజా గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో లక్ష్మీ నరసింహ స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి27(విజయస్వప్నం.నెట్)
మండలంలోని తంగేడుకుంట పంచాయతీ నల్లచెరువుపల్లి చెందిన సీనియర్ వైకాపా నాయకుడు సూర్యంరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి దగ్గర శాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి బుధవారం ఇంటికెళ్ళి సూర్యంరెడ్డిని పరామర్శించి,వైద్య చికిత్సలు ఆరోగ్య విషయాలపై అడిగి తెలుసుకున్నారు.దైర్యంగా ఉండాలని, వైకాపా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారని వైకాపా నాయకులు,కార్యకర్తలు తెలిపారు.
$$$__________@@@__________$$$
కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న సెబ్ పోలీసులు
మండల పరిధిలోని సోమానాయక్ తాండా సమీపంలో ఎస్సీబీ స్టేషన్ ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించి భూక్యే నారాయణనాయక్, భూక్యే రవీంద్ర నాయక్ వద్ద నుండి 1624 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. దాడుల్లో నారాయణనాయక్ పట్టుబడగ రవీంద్రనాయక్ పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు.స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు.
$$$__________@@@__________$$$
వైకాపా నుండి పలువురు తెదేపాలోకి చేరిక
శ్రీసత్యసాయిజిల్లా తనకల్లు మార్చి27(విజయస్వప్నం.నెట్)
తనకల్లు మండలం తవరం పంచాయతీ గందోడివారిపల్లి, సింగిరివాండ్లపల్లి గ్రామానికి చెందిన పలువురు వైకాపా నుండి బుధవారం కదిరి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెదేపాలోకి చేరారు. తిరుమలయ్యవారిపల్లికి చెందిన వైకాపా సీనియర్ నాయకులు మండెం వెంకటరెడ్డి,మాజీ సింగిల్ విండో అధ్యక్షులు వెంకటరమణప్పలతో పాటు గందోడివారిపల్లి,సింగిరివాండ్లపల్లి గ్రామాలకు చెందిన పలువురు వైకాపా వీడి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్,తెదేపా నాయకులు పవన్ కుమార్ రెడ్డి సమక్షంలో తెదేపాలోకి చేరారు.పార్టీలో చేరిన వారికి తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈకార్యక్రమంలో తనకల్లు మండల కన్వీనర్ రెడ్డిశేఖర్ రెడ్డి,మల్ రెడ్డి,రమణ,సత్యనారాయణ, మాధవరెడ్డి,చెన్నకృష్ణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు మార్చి27(విజయస్వప్నం.నెట్)
మండలంలోని చినగానిపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు,మాజీ స్టోర్ డీలర్ శివయ్య కుమార్తె బుధవారం రాత్రి అకాల మృతి చెందిన విషయం తెలుసుకున్న తక్షణమే మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారని తెదేపాశ్రేణులు తెలిపారు.
$$$__________@@@__________$$$
గురుకులంలో హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి 27(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో బుధవారం సాయంత్రం మాధవ గురుకులంలో నిరాశ్రయులైన పిల్లల మధ్య అభిమానులు గ్లోబల్ స్టార్,మెగా పవర్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్,మెగా పవర్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా కదిరిలో మాధవ గురుకులంలో పిల్లల మధ్య రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ,అఖిల భారత చిరంజీవి యువత,రామ్ చరణ్ యువ ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో పిల్లలకు భోజన సదుపాయం కల్పించి వారి మధ్యనే కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా వేడుకలు నిర్వహించారు.అఖిల భారత చిరంజీవి యువత కదిరి నియోజకవర్గం అధ్యక్షులు లక్ష్మణ కుటాల మాట్లాడుతూ సమాజం బాగుండాలి అందులో మనం ఉండాలంటూ అభిమాన నటులు చిరంజీవి,పవన్ కళ్యాణ్ తపన పడుతుంటారని,అదే సేవా స్ఫూర్తితో రామ్ చరణ్ ఆదర్శంగా భావించి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా అటు సినీరంగంలో,ఇటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న తీరు అద్భుతమని,అటువంటి గొప్ప మంచి మనసున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అందరి ఆశీస్సులు ఉండాలని,కదిరి మెగా ఫ్యాన్స్ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి,రామ్ చరణ్ యువ ఫౌండేషన్,అఖిల భారత చిరంజీవి యువత టీమ్ సభ్యులు రాజేంద్ర,మునిగోపాల్,హరి బాబు,కార్తిక్,చక్రి,చంద్ర మోహన్,రాజా,సుదర్శన్,నరసింహులు,సాయి,గణేష్ తదితర మెగా అభిమానులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శ్రీ సత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి27(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా బీవీ వెంకటరమణ ఎంపికైన సందర్భంగా మండల వడ్డెర్ల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.బుధవారం స్థానిక తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో మండల వడ్డెర్ల సంఘం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బివి వెంకట్రాముడును శ్రీ సత్యసాయిజిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎంపిక చేయడం హర్షణీయమన్నారు.వడ్డెర్ల సామాజిక వర్గానికి భవిష్యత్తులో మరింత రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వారు అధిస్థానానికి విజ్ఞప్తి చేశారు.వడ్డెర్ల సామాజిక వర్గానికి చెందిన బీవీ వెంకట్రాముడును ఎంపిక చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు, ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ బాబుకు,రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడుకు సందర్భంగా వడ్డెర్ల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సెల్ కార్యదర్శి వడ్డెర సంఘం నాయకులు అంజనప్ప,మీడియా కోఆర్డినేటర్ కుంచపు ఆంజనేయులు,ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్, బత్తినపల్లి ఆనంద్,మహిళా కార్యకర్త మస్తానమ్మ, మల్లికార్జున,పీట్ల మనోహర్, తెదేపా నాయకులు మోపూరి అంజనప్ప,షబ్బీర్,ముద్దలపల్లి శ్రీనివాసులు,ఆరీఫ్,కొలిమిరాళ్ళ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి