పుట్టపర్తి ఎనుములపల్లిలో అయ్యప్పస్వామి ఆలయ భూమిపూజ
శ్రీసత్యసాయిజిల్లా/పుట్టపర్తి మార్చి01(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి పట్టణానికి సమీపంలో ఎనుములపల్లి గ్రామ శివర్లో ఓబులేశ్వరస్వామి కొండపైన మాఘుమాస శుక్రవారం పురస్కరించుకొని శ్రీఅయ్యప్పస్వామివారి ఆలయ నిర్మాణానికి భక్తిశ్రద్దలతో పురోహితులు మంత్రోచ్చాణలతో భూమిపూజ నిర్వహించారు.ఆలయ కమిటీ నిర్వహక సభ్యులు మాట్లాడుతూ....ఎనుములపల్లితోపాటు పరిసర గ్రామాలలో వందల మంది అయ్యప్పస్వామి మాలధారణ భక్తులు పూజలు,భజనలు,అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహించాడని సౌకర్యాలు లేక కొన్నేళ్లుగా ఇబ్బందులు పడేవరమని,కమిటీ ఏర్పాటు చేసుకొని ఆలయం నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టామని,ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న భక్తులకు,పుర ప్రజలకు కమిటీ నిర్వహకులు వేణుగోపాల్,శ్రీనివాసులు,రమణ,ఉమాపతినాయుడు,నరసింహులు ఈసందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.అంతక ముందు తెల్లవారుజామున నుండి వివిధ మండలాల నుండి విచ్చేసిన అయ్యప్పస్వామి ఆలయాల గురుస్వాములు,భక్తులు అయ్యప్పస్వామి నామస్మరణ,శరణఘోష, భజన పాటలు ఆలపించారు.పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ అన్నప్రసాదాలు అందజేశారు.అనంతరం కమిటీ సభ్యులు గురుస్వాములకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈకార్యక్రమంలో ఓడిచెరువు (ఎం.కొత్తపల్లి) శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులునాయుడు,ముదిగుబ్బ పంచాగిరీష అయ్యప్పస్వామి ఆలయ ధర్మకర్త సోమగుట్ట శిరిగిరెడ్డి గురుస్వామి బృందం ఎన్.వెంకటశివారెడ్డి,సంగాల ఎర్రప్ప,భగవాన్ స్టూడియో నాగరాజు,శివానాయక్,వెంకటేష్ నాయక్, చంద్రశేఖర్ నాయక్, ధర్మవరం విజయకుమార్ గురుస్వామి, పుట్టపర్తి గురుస్వామి పుట్టన్న తదితర ఆలయ గురుస్వాములు,భక్తులు ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి