google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : కాంగ్రెస్ సీనియర్ నేతలను కలసిన దాదిరెడ్డి - బాబు షూరిటీ.... యువతకి జాబు గ్యారంటీ - శ్రీ శనీశ్వరస్వామి ప్రథమ వార్షికోత్సవ అమరాపురం మండలంలోని బసవనపల్లి గ్రామం

10, మార్చి 2024, ఆదివారం

కాంగ్రెస్ సీనియర్ నేతలను కలసిన దాదిరెడ్డి - బాబు షూరిటీ.... యువతకి జాబు గ్యారంటీ - శ్రీ శనీశ్వరస్వామి ప్రథమ వార్షికోత్సవ అమరాపురం మండలంలోని బసవనపల్లి గ్రామం

కాంగ్రెస్ సీనియర్ నేతలను కలసిన దాదిరెడ్డి



శ్రీసత్యసాయిజిల్లా,మార్చి09(విజయశ్వప్నం.నెట్)

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి,రాహుల్ గాంధీ ప్రధాని చేయడంతో భారతదేశ అభివృద్ధి చెందుతుందని మాజీమంత్రి,సిడబ్ల్యుసి సభ్యులు నీలకంఠం రఘువీరారెడ్డి  పేర్కొన్నట్లు పుట్టపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి తెలిపారు. శనివారం నీలకంఠపురంలో స్వగృహంలో రఘువీరారెడ్డిని  మర్యాదపూర్వకంగా కలిసి  సన్మానించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని, కాంగ్రెస్ గ్యారంటీ,ఇందిరమ్మ అభయాస్తం పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని,కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే  ఖాతాలోకి 5వేలు జమ చేస్తారని గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సూచించారని తెలిపారు.అలాగే మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్ రెడ్డి స్వగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి సత్కరించారని యువనాయకుడు దాదిరెడ్డి తెలిపారు.పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తే ఆశీస్సులు,సహకారాలు అందించాలని మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్ రెడ్డిని నియోజకవర్గ సమన్వయకర్త దాదిరెడ్డి కోరారన్నారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే టిడిపి నాగరాజు రెడ్డి స్వగృహంలో శనివారం ఆయనను కలిసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తున్నట్లు పేర్కొంటూ.... కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తమ వంతు అందించాలని మాజీ ఎమ్మెల్యే టిడి నాగరాజరెడ్డిని కోరినట్లు తెలిపారు.మాజీమంత్రి రఘువీరారెడ్డి,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే.సుధాకర్ సమక్షంలో ఆమడగూరు మండలానికి చెందిన సానినేని శ్రీధర్ రెడ్డి,జరిపిటి శ్రీరాములు,సంతోష్ రెడ్డి,సురేంద్ర రెడ్డి,వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారన్నారు.

______________________________

బాబు షూరిటీ.... యువతకి జాబు గ్యారంటీ

శ్రీ సత్యసాయిజిల్లా, పుట్టపర్తి,మార్చి9(విజయస్వప్నం.నెట్) 

మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సూచనల మేరకు శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యాలయంలో పట్టణ కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులు పాల్గొని మాట్లాడుతూ....రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారని,రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాసం కల్పించడంలో వారు విమర్శించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు.18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ జాబితాలో నమోదు చేసుకుని,రాబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు తెలుగుదేశం పార్టీ వేయాలని,అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు షూరిటీతో యువతకు జాబు గ్యారెంటీ అని వారు పేర్కొన్నారు.అనంతరం కరపత్రాలు విడుదల చేశారు.ఈకార్యక్రమంలో నియోజవర్గ తెలుగు యువత ఓబుళరెడ్డి,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అంబులెన్స్ రమేష్,నియోజవర్గ ప్రధాన కార్యదర్శి మనోహర్,ఉపాధ్యక్షులు వైవి మురళిచౌదరి,హిందూపురం టిఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి గణేష్ చౌదరి,సుధీర్,మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

______________________________


భాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట తెదేపా కార్యకర్తలు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన ఇరువురు కుటుంబాలను శనివారం కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పరామర్శించారు.కదిరి పరిధిలోని మూర్తిపల్లికి చెందిన తెదేపా కార్యకర్త సురేంద్ర నాయుడు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకొన్న కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను ఓదార్చారని స్థానిక తెదేపా నాయకులు తెలిపారు.పట్నం గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త కిష్టప్ప మృతి చెందిన సమాచారంతో గ్రామానికి చేరుకొని కిష్టప్ప మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి తెదేపా అండగా ఉంటుందని కందికుంట భరోసా ఇచ్చినట్లు తెలిపారు.అలాగే జో్కుపాలెం వీధికి చెందిన తెదేపా కార్యకర్త ఇర్షాద్ అనారోగ్య సమస్యతో కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొన్న కందికుంట ఆసుపత్రికి వెళ్లి ఇర్షాద్ ను పరామర్శించి దైర్యంగా ఉండాలని, తెదేపా అండగా ఉంటుందని,ఇర్షాద్ ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడినట్లు తెదేపా నాయకులు ఐటిడిపి మన్సుర్, సలాం,ఇస్మాయిల్,రమణ తదితరులు తెలిపారు.

______________________________

శ్రీసత్యసాయిజిల్లా, కదిరి,మార్చి09(విజయస్వప్నం. నెట్)

రాష్ట్ర గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శనివారం కదిరి వైకాపా అభ్యర్థి మక్బూల్ బాషా ఆధ్వర్యంలో వైకాపా నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా విజయం సాధించడానికి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ప్రణాళికబద్ధంగా దిశా నిర్దేశాలు రూపొందించడానికి  అనంతపురం వెళుతుండగా కదిరి సమీపంలో మొటుకుపల్లి వద్ద కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ భాష మంత్రి పెద్దిరెడ్డికి పుష్పగుచ్చాల అందించి స్వాగతం పలికారు.వైకాపా విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారని వైకాపా శ్రేణులు తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ సమన్వయకర్త ఇస్మాయిల్, పూల శ్రీనివాసరెడ్డి,మాజీ రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, వైకాపా నాయకులు సాదిక్ బాషా, లింగాల లోకేశ్వర్ రెడ్డి, సాధత్ అలీ ఖాన్,రాజశేఖర్ రెడ్డి,కొమ్ము గంగాదేవి, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

______________________________

శ్రీ సత్యసాయిజిల్లా అమరాపురం మండలంలోని బసవనపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శనీశ్వరస్వామి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం ఈనెల 11వతేదీ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 11వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటల నుండి శ్రీశనీశ్వరస్వామి వారి మూల విగ్రహానికి అర్చనలు,అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, స్వామివారి వార్షిక ఉత్సవ కార్యక్రమంలో గ్రామ  ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి