google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : 19నుండి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలు - లేపాక్షి ఆలయంలో చండీయాగం - బాధితురాలికి వందేమాతరం సభ్యులు ఆర్థిక సాయం

11, మార్చి 2024, సోమవారం

19నుండి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలు - లేపాక్షి ఆలయంలో చండీయాగం - బాధితురాలికి వందేమాతరం సభ్యులు ఆర్థిక సాయం

సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు

శ్రీసత్యసాయిజిల్లా ఆమడగూరు మార్చి10(విజయస్వప్నం.నెట్) 
సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా మండలంలోని గుండువారిపల్లి సమీపంలో కస్తూర్బా బాలికల పాఠశాల ఆవరణలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.సావిత్రిబాయి పూలే జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆమె ఆశయాల బాటలో ముందుకు నడవాలని వారు విద్యార్థులకు సూచించారు.సావిత్రిబాయి పూలేకు భారతరత్న అవార్డు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి చింతా నాగరాజు, గురుస్వామి,ప్రకాష్, వెంకటేష్, ఉపాధ్యాయ బృందం,విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.
కదిరి కాంగ్రెస్ కార్యాలయంలో...... భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని,రచయిత్రి,కులమత భేదాలకు అతీతంగా సమాజసేవకురాలు,నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రీబాయి ఫూలే మహనీయురాలుగా కాంగ్రెస్ పార్టీ బీసీ రాష్ట్ర సమన్వయకర్త నచ్చు బాలకృష్ణ యాదవ్ కొనియాడారు.ఆదివారం సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్బంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనతోపాటు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.
_____________________________

శ్రీసత్యసాయిజిల్లా కదిరి(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో ఆదివారం ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిధిగా కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్యెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని సూచనలు ఇచ్చారని తెలిపారు.టీడీపీ నాయకులు పివి.పవన్ కుమార్ రెడ్డి,జనసేన నాయకులు బ్లూ మూన్ అధినేత శివశంకర్,వాల్మీకి స్కూల్ అధినేత అనిల్ కుమార్ రెడ్డి తదితరులు హాజరైయ్యారని ప్రయివేట్ టీచర్స్ తెలిపారు.
_____________________________




శ్రీసత్యసాయిజిల్లా  ఓడిచెరువు మండలంలోని వణుకువారిపల్లి కొత్త రోడ్డు వద్ద ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడిగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఒడిచెరువు నుండి మిట్టపల్లికి వెళ్ళ్తున్న ఆటో కొత్త రోడ్డు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడడంతో స్థానికులు ఆటోలో ఉన్న ప్రయాణికులను బయటకు తీసారని,భార్గవ్ అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారని, మిగిలిన ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.
_____________________________
తెదేపా సూపర్ సిక్స్ కిట్లు పంపిణి

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు మార్చి10(విజయస్వప్నం.నెట్) 
ఓడి చెరువు మండల కేంద్రంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులకు కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేసి సూపర్ సిక్స్ కిట్లు అందజేసి మండల జయచంద్ర మాట్లాడుతూ. 
... మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సూచనల మేరకు తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ మినీ మేనిపెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పధకాలపై విసృత్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.గ్రామాల్లో ప్రచారం చేపట్టినట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.క్లస్టర్ ఇంచార్జ్ నారపరెడ్డి, చికెన్ షాను,పీట్ల సుధాకర్,టైలర్ నిజాం,పొగాకు షన్వాజ్,సౌదీనాగరాజు,ఆరీఫ్,మస్తానమ్మ, పాలెమ్మ,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.             నల్లమాడలో సూపర్సిక్స్ కిట్లు అందజేత నల్లమాడ తెలుగుదేశంపార్టీ మండల కన్వీనర్ మైలా శంకర్ ఆధ్వర్యంలో మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం తెదేపా శ్రేణులకు బాబు షూరిటీ,భవిష్యత్తుకు గ్యారంటీ,సూపర్ సిక్స్ కిట్లు అందజేశారు.తెదేపా జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన మినీ మేనిపెస్టో పధకాలు బాబు షూరిటీ,భవిష్యత్తుకు గ్యారంటీ,సూపర్ సిక్స్ కరపత్రాలతో గ్రామస్థాయిలో ప్రచారం చేపట్టి ప్రజలకు వివరించాలని,తెదేపాకు ఓటు వేసి,చంద్రబాబును ముఖ్యమంత్రిగా,పల్లె రఘునాథ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరాలని సూచించారని తెలిపారు.ఈకార్యక్రమంలో మాజీ కన్వీనర్ కేశవరెడ్డి, బుట్టి నాగభూషణనాయుడు, పుట్ల రవీంద్ర,పఠాన్ బాబావలి,జనార్దన్,రమేష్ నాయుడు,మల్లికార్జున,చంద్రశేఖర్ రెడ్డి,కులశేఖర్ నాయుడు,రమేష్ రెడ్డి, ఆంజనేయులు,శివప్రసాద్ నాయుడు, శ్రీనివాసరెడ్డి,హరిప్రసాద్, వెంకటరాముడు,సుబ్బరాయుడు,ఈశ్వరయ్య,రవికుమార్ తదితర తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.
_____________________________
బాధితురాలికి వందేమాతరం సభ్యులు ఆర్థిక సాయం
శ్రీసత్యసాయిజిల్లా తనకల్లు మార్చి10(విజయస్వప్నం.నెట్)
మండలంలోని మారప్పగారిపల్లికి చెందిన రసూలమ్మ కుమార్తె అమ్మజాన్ భర్త సౌదీకి బతుకుతెరువు కోసం వెళ్లి మృతి చెందిన విషయం తెలుకొన్న వందేమాతరం సేవా సంఘం సభ్యులు ఆదివారం పేద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి,సేకరించిన 10వేల నగదు అందజేశారు. మానవసేవే.... మాధవ సేవంటూ.... పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వందేమాతరం సభ్యులను పలువురు అభినందిస్తున్నారు. అమ్మజాన్ కుటుంబ సభ్యులు వందేమాతరం సేవకులకు కృతజ్ఞతలు తెలిపారు. బాగేపల్లి అశోక్, సంకు వెంకటరమణ, గోవిందు, బాలకృష్ణ, రిపోర్టర్ శీను,బాగేపల్లి కార్తీక్, బాదుల్ల, జక్కన్న, ఫక్కిర్, నవీన్, శ్రీనివాసులు, బాగేపల్లి సుబ్బయ్య, మూర్తి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
_____________________________
బత్తల ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం


శ్రీసత్యసాయిజిల్లా,కదిరి, మార్చి10(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో ఆదివారం ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో చంద్రహాస్ ఆసుపత్రి ఆవరణలో ఉచిత వైద్య శిబిరం వైద్యనిపుణులు దివ్య చంద్ర(జనరల్ మెడిసిన్) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్బంగా వైద్యులు మాట్లాడుతూ షుగర్, బీ.పీ,రక్త పరీక్ష,థైరాయిడ్, ఆస్తమా, మోకాళ్లు, కీళ్ల సమస్యలు, కిడ్నీ సంబంధించిన వ్యాధులు,ఊదర సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు,డయాబెటిక్ అలర్జీ వ్యాధులతో బాధపడుతున్నవారికి వైద్యశిబిరంలో  పరీక్షించి, ఉచితంగా మందులు అందజేశారని బత్తల ఫ్యామిలీ సభ్యులు తెలిపారు.
_____________________________
లేపాక్షి ఆలయంలో చండీయాగం

శ్రీసత్యసాయిజిల్లా,లేపాక్షి,మార్చి10(విజయస్వప్నం.నెట్)
లేపాక్షి దుర్గా వీరభద్రస్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మఉత్సవాల్లో భాగంగా ఆదివారం శివపార్వతి విగ్రహాలకు అర్చనలు, అభిషేకం,ప్రత్యేక పూజలు నిర్వహించి, చండీయాగం, సింహవాహనోత్సవం, మహా పూర్ణహుతి భక్తిశ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.రాత్రివెళ్ళల్లో శివాపార్వతి విగ్రహాలు ముత్యాలపల్లకిలో దర్శనం, కిళ్ళుగుర్రాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని ఈఓ నరసింహమూర్తి పేర్కొంటూ.... శివరాత్రి బ్రహ్మఉత్సవాల్లో భాగంగా సోమవారం వసంతోత్సవం, ధ్వజవరోహణ, శయనోత్సవం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
_____________________________
19నుండి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 

 శ్రీసత్యసాయిజిల్లా,కదిరి,మార్చి10(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో ప్రసిద్ధికేక్కిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల వివరాల పోస్టర్లు ఆలయ కార్యనిర్వహణ అధికారులు,ప్రధాన అర్చకులు విడుదల చేయగా, ఈనెల(మార్చి)19 నుండి ఏప్రిల్ 2వతేది వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలపై ఆలయ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు.ఈనెల 19న అంకురార్పణం,20న స్వామివారి కళ్యాణోత్సవం,21న హంసవాహనం, 22న సింహవాహనం, 23న హనుమంత వాహనం,24న బ్రహ్మగరుడ వాహనం,25న శేషవాహనం,26న సూర్యచంద్ర వాహనం,27న మోహిని ఉత్సవం,28న ప్రజా గరుడసేవ,29న గజవాహనం(తెల్ల ఏనుగుపై) 30వతేది శనివారం బ్రహ్మ రధోత్సవం(తేరు) 31న అశ్వవాహనం, ఏప్రిల్ 1వతేది తీర్థవాధి,2న పుష్పయాగోత్సవం కార్యక్రమాలతో ముగుస్తాయని తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి