ఐపీఎల్ తరహాలో జర్నలిస్టులకు క్రికెట్ నిర్వహించడం గ్రేట్
కొడిమి జర్నలిస్ట్ కాలనీ ఒకసారి సందర్శిస్తాను
మచ్చా రామలింగారెడ్డి కృషి అభినందనీయం
కడప విన్నర్స్, వైజాగ్ రన్నర్స్ ట్రోఫీలను అందించినజిల్లా కలెక్టర్ గౌతమి
శ్రీసత్యసాయి/అనంతపురం మార్చి02 (విజయస్వప్నం.నెట్)
రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ క్రికెట్ జట్లు అనంతపురంలో క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అందరూ ఒకే వేదికపై పాల్గోని ఐపీఎల్ తరహాలో టోర్నమెంట్లు నిర్వహించడం గొప్ప విషయమని అనంత జిల్లా కలెక్టర్ గౌతమి అన్నారు.యూనియన్ అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి కృషి అభినందనీయమని ఒకే వేదికపై ఇంత మంది జర్నలిస్టులను ఒకతాటిపైకి తీసుకొనిరావడం గొప్ప విషయమని కలెక్టర్ గౌతమి అన్నారు.అనంతపురం నగరంలోని ఆర్డిటి క్రీడా గ్రామంలో జరుగుతున్న శ్రీ సత్యసాయి రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ యూనిటీ కప్ 2024 ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభ మచ్చా రామలింగారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో అమరావతి హాస్పిటల్ ఎండి అంకే ముత్యాలు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎంతో పని ఒత్తిడి మీద ఉంటారని,అలాంటి వారి కోసం అనంతపురంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మానసిక ఉల్లాసంతో పాటు ఆటవిడుపుగా ఉంటుందన్నారు. అలాగే గతంలో తాను ఆర్డీవోగా ఉన్నప్పుడు జర్నలిస్ట్ కాలనీ సంబంధించిన ఫైల్స్ ను త్వరతగతిన పూర్తి చేసానని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన జర్నలిస్టులకు అనంతపురం ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.మచ్చా రామలింగారెడ్డి క్రికెట్ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు, అలాగే జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కడప జిల్లాతో కూడా తనకు అనుబంధం ఉందని గెలిచిన కడప జట్టు సభ్యులకు పలకరించారు.కార్యక్రమంలో భాగంగా ఫైనల్స్ లో గెలిచిన కడప జట్టుకు అలాగే రన్నర్స్ గా నిలిచిన వైజాగ్ జట్టుకు ట్రోఫీలను అందించారు దీంతోపాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్ట్ బెస్ట్ బ్యాట్స్ మెన్ బెస్ట్ బౌలర్,మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్,మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీలను అలాగే టోర్నమెంట్లో పాల్గొన్న టీములన్నిటికీ జ్ఞాపికలు అందజేశారు.కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మార్కండేయులు,నాగభూషణం,భోగేశ్వర్రెడ్డి,రసూల్ తదితరులతో పాటు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఖాన్,విజయరాజు,షాకీర్,రఘు,శ్రీకాంత్,చక్రి,భీమా శివ ప్రసాద్, రవి, సాదిక్, ఈశ్వర్, చక్ర, సాయి, త్యాగరాజు, వాలి తదితరులు పాల్గొన్నారు.
_____________________________
రాయలసీమ స్థాయి కరాటే పోటీల్లో కదిరి విద్యార్థుల ప్రతిభ
శ్రీసత్యసాయి/అనంతపురంజిల్లా మార్చి 03(విజయస్వప్నం.నెట్)
అనంతపురంజిల్లా గుంతకల్లు పట్టణంలో ఈనెల2న నిర్వహించిన 6వ ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీలు గోజిరియో కరాటే అకాడమీ వారి ఆధ్వర్యంలో కార్యనిర్వహకుడు మాస్టర్ దినేష్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించగా, ఈ పోటీలకు ముఖ్య అతిధులుగా మోటార్ వాహనాల తనిఖీ అధికారి రాజాబాబు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ యాదవ్, జనసేన గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వాసగిరి మణికంఠ, గుంతకల్ ఫుట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఆర్.ఎన్. శ్రీనివాస్, కరాటే అకాడమీ అల్ ఇండియా చీఫ్ టెక్నికల్ డైరెక్టర్ అల్తాఫ్ పాషా హాజరై మాట్లాడుతూ.... కరాటే గురించి అందులోని ప్రయోజనాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ పోటీలలో కదిరి మాస్టర్ షాకీర్ శిష్యులు 5 మంది విద్యార్థులు పాల్గొనగా నలుగురు ప్రధమ,ఒకరు తృతీయ స్థానం నిలిచారు.కట విభాగంలో తమ తమ ప్రతిభను ప్రదర్శించి పతకాలను సాధించారు. కదిరి జైన్ పాఠశాల నుండి జోయ ఫాతిమా, మహమ్మద్ జయేద్ మొదటి స్థానాన్ని, శ్రీ శాంతినికేథన్ పాఠశాల నుండి మహమ్మద్ కైఫ్, రీదాముస్కాన్ లు మొదటి స్థానాన్ని ,రామకృష్ణ పాఠశాల నుండి నూరా నాయక్ మూడవ స్థానాన్ని సాధించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ షాకీర్ ని దుషాలువా, మెమోంటో తో సత్కరించారు. ఈసందర్బంగా కరాటే విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల యాజమాన్యం విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
_____________________________
ఓడిచెరువు గ్రామ అంబేద్కర్ కాలనీకి చెందిన తెదేపా ఎస్సి సెల్ నాయకులు అంజనప్ప రోడ్డుప్రమాదంలో గాయపడి బాధపడుతున్న విషయం తెలుసుకొన్న మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శనివారం అంజనప్ప ఇంటికెళ్లి కుటుంబ పరామర్శించి,తెదేపా అండగా ఉంటుందని దైర్యం చెప్పి సాయమందించారు.ఓడిచెరువు గ్రామానికి చెందిన విలేకరి శంకర కాలికి శస్త్రచికిత్సతో విశ్రాంతి తీసుకొంటున్న ఇంటికి పల్లె వెళ్లి పరామర్శించి యోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.రోడ్డు ప్రమాదంలో గాయపడి బాధపడుతున్న రెహమాన్ ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థికసాయం చేశారు. అలాగే మండలంలోని అల్లాపల్లి పంచాయితీ బాలప్పగారిపల్లికి చెందిన కిష్టమ్మ ఆకస్మిక మృతి వార్త తెలుసుకొని వారి స్వగ్రామానికి మాజీమంత్రి పల్లె వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారని తెలిపారు.
_____________________________
పల్స్ పోలియోపై వైద్యబృందం ర్యాలీ
శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు మార్చి02 (విజయస్వప్నం.నెట్)
పోలియో రహిత నవ సమాజానికై ఇప్పటి నుండే తల్లి దండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం భాద్యతగా తీసుకోవాలని వైద్యధికారి భానుప్రకాష్ పేర్కొన్నారు.శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పురవీధులగుండ నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు అంటూ వైద్య బృందం పల్స్ పోలియో ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కూడలి వద్ద మానవహారం ఏర్పాటు చేసి వైద్యాధికారి భానుప్రకాష్ మాట్లాడుతూ.... పోలియో మహమ్మారిని నిర్మూలణ క్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ వ్యాధిని వ్యాపించే వైరస్ సూక్ష్మ జీవి మురికి నీరు, కలుషిత ఆహారం వలన వ్యాప్తి చెందుతుందని, తద్వారా అంగవైకల్యం కలుగుతుందని ఈ విషయాలు ఆరోగ్యవిద్య లో భాగంగా ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. (3వతేది) ఆదివారం నుండి నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొంటూ.... మండలవ్యాప్తంగా 73 పోలియో చుక్కల కేంద్రాలు, ఒక ట్రాన్సట్ కేంద్రం, ఒక మొబైల్ టీం ద్వారా 4854 మంది అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు 5 సంవత్సరాల వయసు బిడ్డ వరకూ బూత్ ల, 13,337 గృహాల సందర్శన ద్వారా అర్హులైన పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం నందు వైద్యాధికారి కమల్ రోహిత్,వైద్య సిబ్బంది శుభాషిణి, దిల్ షాద్, విజయకుమారి, మురళీ, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆమడగూరు మండల వైద్యాధికారిణి అపర్ణ ఆధ్వర్యంలో శనివారం పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆదివారం నుండి పల్స్ పోలియో కార్యక్రమం మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కంటూ.... 0 వయసు నుండి 6 వయసు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వైద్యసిబ్బంది, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
_______________________________
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మండలంలోని గౌనిపల్లి, పగడాలపల్లి మార్గంలో శనివారం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీ కొన్న ప్రమాదంలో మహేష్ గాయపడిన విషయం బంధువులు 108 సిబ్బందికి సమాచారం అందించగా,108 సిబ్బంది తక్షణమే చేరుకొని వాహనంలో గాయపడిన మహేష్ కు ప్రధమ చికిత్స అందిస్తూ కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళినట్లు సమాచారంగా ఉంది.
_______________________________
శ్రీసత్యసాయిజిల్లా నల్లచెరువు (విజయస్వప్నం.నెట్)
నల్లచెరువు మండలంలోని పాలపాటిదీన్నే ఆంజనేయస్వామి ఆలయం వద్ద శనివారం మండల వైకాపా కన్వీనర్ ఆధ్వర్యంలో నాయకులకు కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. నేడు ఆదివారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మండలానికి విచ్చేసి గీతమందిరం సమీపంలో మాబు, ముస్తఫా పొలాలలో సభ వేదికపై వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గోని అనంతరం పార్టీ కార్యాలయం ప్రారంభం చేస్తారని, కావున ప్రతి వైకాపా కార్యకర్త, నాయకులు ఉదయం 9గంటలకు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దశరథనాయుడు పెట్రోల్ బాంక్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి యర్రకుంట్ల గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి,బైక్ ర్యాలీ నిర్వహించి, వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా ధర్మవరం(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా ధర్మవరం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి పరిటాల శ్రీరామ్ సతీమణి జ్ఞాన శనివారం ధర్మవరంలో ప్రచారం నిర్వహించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ,రాష్ట్ర అsxభివృద్ధి నారా చంద్రబాబు నాయుడితోనే సాధ్యమని, తెదేపాను గెలిపించి, నారా చంద్రబాబును ముఖ్య మంత్రిని చేయాలని ఆమె ప్రచారం చేపట్టారు.
______________________________
4న పెనుకొండలో జరిగే చంద్రబాబు సభతో తాడేపల్లి దద్దరిల్లాలి
రా....కదలిరా.... సభను విజయవంతం చేయాలి.
ప్రజలు మంచి తీర్పుతో వైసీపీకి గుణపాఠం చెప్పాలి : ఉమ్మడి జిల్లాల టీడీపీ ఎన్నికల పరిశీలకులు కోవెల మూడి రవీంద్ర (నాని)
శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి మార్చి02 (విజయస్వప్నం.నెట్)
పెనుకొండ నియోజకవర్గంలోని కియా కంపినీ సమీపంలో రా కదలి రా సభకు విచ్చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అనంత,సత్యసాయి ఉమ్మడి జిల్లాల టీడీపీ ఎన్నికల పరిశీలకులు కోవెల మూడి రవీంద్ర (నాని) పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు పేర్కొన్నారు. పుట్టపర్తి తెదేపా ప్రధాన కార్యాలయంలో శనివారం నియోజకవర్గ టిడిపి విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పల్లెతో పాటు టీడీపీ ఉమ్మడి జిల్లాల టీడీపీ పరిశీలకుడు కోవెల మూడి రవీంద్ర (నాని) పుట్టపర్తి టీడీపీ పరిశీలకుడు బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల టీడీపీ ఎన్నికల పరిశీలకులు రవీంద్ర (నాని) మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.పిల్లల భవిష్యత్ కోసం చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉందన్నారు.అభివృద్ధిలో బాగా వెనుకడిన అనంతపురం, సత్యసాయి జిల్లాలు అభివృద్ధి పథంలో నడవాలంటే టీడీపీకి పూర్తి అధికారం ఇవ్వాలనీ ప్రజలకు పిలుపునిచ్చారు.సత్యసాయి ,అనంత పురం ఉమ్మడిజిల్లాలో 14 స్థానాలు టీడీపీ కైవసం చేసుకొని టీడీపీకి కంచుకోటని మళ్ళీ నిరూపించుకోవాలన్నారు. టికెట్ల కోసం పోటీ కాదు,టీడీపీని గెలిపించడానికి కార్యకర్తలు పోటీ పడాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టపర్తి టికెట్ పై ఇప్పటికే సంకేతాలు ఇచ్చారని ఆమేరకు అధిష్టానం సరైన నిర్ణయంతో మీరు కోరుకున్న వ్యక్తినే సకాలంలో ప్రకటించి అధినేత చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకుంటారన్నారు.అప్పటి వరకు మీరు ఎదురు చూడకుండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమై పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థినీ ఈఎన్నికల్లో గెలిపించి చంద్రబాబుకు కానుక ఇవ్వాలని కార్యకర్తల్ని ఆయన కోరారు. పెనుగొండలో జరిగే రా కదలిరా సభతో తాడేపల్లి జగన్ ప్యాలెస్ దద్దరిల్లెలా సభ మోగాలన్నారు.ప్రజల కష్టాలు తీరాలంటే వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో నిలబడిన అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ తరపున గెలిపించుకొని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బచ్చాల పుల్లయ్య,మాజీ ఎంపి నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం దిగిపోయి తెదేపా అధికారంలోకి రావడం తథ్యం అన్నారు.విద్యుత్,ఆర్టీసీ చార్జీలు నిత్యవసర సరుకులు, వివిధ రకాల పన్నులు విధించిన జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిగేలా పాలన చేస్తోందన్నారు.వీటికి స్వస్తి పలకాలంటే ఓటు ఆయుధంతో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. అనంతరం మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తోపాటు బచ్చల పుల్లయ్య చేతుల మీదుగా అన్ని మండలాలకు టీడీపీ ఎన్నికల శంఖారావం కిట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో 6 మండలాల టిడిపి మండల కన్వీనర్లు వాల్మీకి సాధికారికత జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు , వలిపి శ్రీనివాసులు , రామకృష్ణ , మల్లి రెడ్డి , మైలే శివశంకర్ , జయ చంద్ర గోపాల్ రెడ్డి,విజయ్ కుమార్ తో పాటు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణమూర్తి , శ్రీనివాస్ రెడ్డి, కాపు కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయల్ మురళి, ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకుడు కాలే నాయక్,ఎస్సీ సెల్ జిల్లా నాయకులు రామంజి, టీడీపీ సీనియర్ నాయకులు సాలక్క గారి శ్రీనివాసులు, పిట్టా ఓబుళరెడ్డి, శ్రీరామ్ రెడ్డి, పుల్లప్ప,పొగాకు డాక్టర్ జాకీర్, కేశవ రెడ్డి, రమణ, కొండే ఈశ్వరయ్య, జయచంద్ర, తెలుగుయువత నాయకులు ఓబుళరెడ్డి, జయ ప్రకాష్, కారపు శివ ప్రకాష్, మహేశ్వర్ రెడ్డి, షాన్వాజ్, మాజీ సర్పంచ్ మాణిక్యంబాబ, సలాం ఖాన్, బాబావలి, అబ్బాస్, మహిళ నాయకురాలు గాయత్రి, లావణ్య, రాధమ్మ మాధవి, మస్తానమ్మ, టిడిపి అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి