google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : రేపటి నుండి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

18, మార్చి 2024, సోమవారం

రేపటి నుండి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

రేపటి నుండి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 

 శ్రీసత్యసాయిజిల్లా,కదిరి,మార్చి17(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో ప్రసిద్ధికేక్కిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు రేపటి నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారులు,ప్రధాన అర్చకులు తెలిపారు. ఆలయంలో భక్తుల దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఓప్రకటనలో పేర్కొన్నారు. రేపు 19న(మంగళవారం)అంకురార్పణం పూజలతో ప్రారంభమై, 20న స్వామివారి కళ్యాణోత్సవం, 21న హంసవాహనం,22న సింహవాహనం,23న హనుమంత వాహనం, 24న బ్రహ్మగరుడ వాహనం, 25న శేషవాహనం, 26న సూర్యచంద్ర వాహనం, 27న మోహిని ఉత్సవం, 28న ప్రజా గరుడసేవ, 29న గజవాహనం(తెల్ల ఏనుగుపై) 30వతేది శనివారం బ్రహ్మ రధోత్సవం(తేరు) 31న అశ్వవాహనం, ఏప్రిల్ 1వతేది తీర్థవాధి, 2న పుష్పయాగోత్సవం కార్యక్రమాలతో ముగుస్తాయని తెలిపారు.

$$__________@@@@__________$$

శ్రీసత్యసాయిజిల్లా,మార్చి17,కదిరి(విజయస్వప్నం.నెట్)

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట యశోదదేవి సమక్షంలో 10వ వార్డులో వైకాపాను వీడి తెదేపాలోకి యువనాయకుడు సయ్యద్ సాధిక్ ఆధ్వర్యంలో చేరాగా, వీరికి అభ్యర్థి కందికుంట యశోదదేవి తెదేపా కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానం పలికారు. ఈకార్యక్రమంలో అల్లాబకాష్, బాబ్జాన్, రఫిక్, సయ్యద్ బాష, మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

$$__________@@@@__________$$

శ్రీసత్యసాయిజిల్లా, గాండ్లపెంట,మార్చి17(విజయస్వప్నం.నెట్)

మండలంలోని పట్రవాండ్లపల్లి గ్రామంలో వెలసిన శ్రీ భైరవేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి  హాజరైన రాష్ట్ర పట్రకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ ఏ కృష్ణమూర్తి, శ్రీ సత్య సాయి జిల్లా పట్రా కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కత్యం వెంకటకృష్ణ హాజరై తమ వంతు సహాయంగా కృష్ణమూర్తి 5వేలు, వెంకటకృష్ణ 5వేలు రూపాయలు విరాళం అందజేశారని పెద్దన్నవారిపల్లికి చెందిన జిల్లా పట్ర కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కత్తెం వెంకటకృష్ణ తెలిపారు.

$$__________@@@@__________$$

శ్రీసత్యసాయిజిల్లా,నంబులపూలకుంట,మార్చి17(విజయస్వప్నం.నెట్)

మండలంలోని మేకలచెరువు పంచాయతీ గౌడచెరువు గ్రామానికి చెందిన హరిహర ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తెదేపాకు చెందిన పలువురు వైకాపాలోకి చేరగా,వీరికి కదిరి అసెంబ్లీ అభ్యర్థి బిఎస్ మక్బుల్,హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ వైకాపా కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి,రాష్ట్ర సిఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, సోసైటీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, మండల కన్వీనర్ రంగారెడ్డి వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

$$__________@@@@__________$$

ఇక్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల కరాటే విన్యాసాలు

శ్రీసత్యసాయిజిల్లా,కదిరి, మార్చి17(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలోని ఇక్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కియో జపాన్ షోటోకాన్ కరాటే  అసోసియేషన్ ఇండియా కరాటే బెల్ట్ ఎగ్జామినేషన్ మాస్టర్ అక్బర్ అలీ  ఆధ్వర్యంలో ఆదివారం కరాటే విన్యాసాలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ఇక్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ నాసిర్  పాల్గొన్నారని, కరాటే విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన పంచెస్  కిక్స్, కథాస్, టైల్స్ బ్రేకింగ్,గర్ల్స్ హెడ్ తో టైల్స్ బ్రేకింగ్ తదితర విన్యాసాలు అబ్బురపరిచాయని ఉపాధ్యాయ బృందం పేర్కొన్నారు. ఈసందర్బంగా ఇక్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ నాసిర్ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ప్రత్యేకంగా కరాటే,బాక్సింగ్ లాంటి యుద్ధ కళల్లో  శిక్షణ తీసుకోవాలని కరాటే సాధన చేస్తే ఆరోగ్యంతో పాటు మెదడు చలాకిగా ఉంటుందని, అలాగే ఏదైనా సాధించడం కోసం కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పెరుగుతుందని, అమ్మాయిలకు ఆత్మరక్షణగా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్ సాధిస్తే 2% రిజర్వేషన్  ఉంటుందని, విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. అబుబకర్ సిద్ధిక్, అనీష్ అలీ. నో మాన్. జైన్. ఇలియాజ్. సోయబ్, ఉమేష్ అప్స.అబూబకర్ సిద్ధిక్. హాజీర భాను 10 మందికి ఎల్లో బెల్టులు అందజేశారు.అలాగే తస్మియా  ఆరెంజ్ బెల్ట్స్, కాశీఫ్ హుస్సేన్ కి గ్రీన్ బెల్టు, ధ్రువీకరణ  పత్రాలను అందజేశారు.ఈసందర్బంగా శిక్షణ భోధకులు మాస్టర్ అక్బర్ అలీని అభినందించారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు పాల్గొన్నారు

$$__________@@@@__________$$

మహిళలను సన్మానించిన బలిజ సంఘ సభ్యులు 

శ్రీసత్యసాయిజిల్లా,కదిరి,మార్చి17(విజయస్వప్నం.నెట్)

శ్రీశ్రీశ్రీకృష్ణదేవరాయల స్ఫూర్తితో బలిజ ఐక్యత కోసం శ్రీ కృష్ణ దేవరాయల కదిరి బలిజ సంఘం  ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో కాలానికి సేవలు అందించి కుల పెద్దలను,మాతృమూర్తులనుమహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం సమాజంలో ఉత్తమమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహిళలను  సన్మానించారని తెలిపారు. సంఘం ఏర్పడి అనతికాలంలోనే వేసవిలో చలి వేంద్ర శిబిరం,రక్తదాన కార్యక్రమం,శ్రీ కృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ర్యాలీలు తదితర కార్యక్రమాలు బలిజ బంధువుల సహకారంతో పూర్తి చేసి రెండవ ఏడాదిలోకి అడుగు పెడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.భవిష్యత్తులో రాజకీయాలకు అతీతంగా రాగ  ద్వేషాలకు పోకుండా కులానికి సంబందించిన సమస్యలను పరిష్కరిస్తూ బలిజలకు అండదండగా ఉంటూ బలిజల ఐక్యత కోసం కృషి చేస్తామని, అలాగే బలిజ బంధువుల్లో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సహాయ సహకారాలు అందించెందుకు తోడ్పాటు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్షులు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి ధృణం శ్రీనివాసులు, బైరిసెట్టి, చింతా శ్రీనివాసులు, రమేష్ బాబు, లక్ష్మణ కుటాల, చంద్ర మోహన్, బలిజ పెద్దలు, యువకులు, మహిళలు  పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయల స్ఫూర్తితో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న రాయల్ పీపుల్స్ ఫ్రెంట్ రాయలసీమ యువత విభాగం అధ్యక్షులు లక్ష్మణ్ కుటాలను  శ్రీకృష్ణ దేవరాయల బలిజ సంఘం నాయకులు సత్కరించినట్లు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి