భవన కార్మికుల ఔదర్యం గాయపడిన భాదితుడికి సాయం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి01(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఉంటున్న భవన నిర్మాణ కార్మికుడు వెంకటేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి ఇంటికి పరిమితమైన విషయం తెలుసుకొన్న భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం నిరుపేద కార్మికుడు వెంకటేష్ ఇంటికి వెళ్లి పరామర్శించి,7500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పోరాటాల.శ్రీరాములు.కుళ్లాయప్ప భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కేశవ,కార్యదర్శి రవికుమార్,సభ్యులు శ్రీనివాసులు పి.సూర్యనారాయణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.గాయపడిన కార్మికుడికి ఆర్థికసాయం అందించిన భవన నిర్మాణ సంఘం సభ్యుల సేవాగుణాన్ని పలువురు అభినందించారు.
_______________________________________
శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి01(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణములోని మాజీ శాసనసభ్యులు కడపల మోహన్ రెడ్డి స్వగృహంలో శుక్రవారం తనకల్లు మండలానికి చెందిన పలువురు మాజీ శాసనసభ్యులు కడపల మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలోకి చేరారు.తెదేపా నుండి వైకాపాలోకి చేరిన తనకల్లు మండలానికి చెందిన పలువురికి మాజీ శాసనసభ్యులు కడపల మోహన్ రెడ్డి,కదిరి శాసనసభ అభ్యర్థి బి.మక్బుల్ వైకాపా కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
_______________________________________
నేడు జర్నలిస్ట్ క్రికెట్ టోర్ని ఫైనల్ విజయవంతంగా
శ్రీ సత్యసాయి స్టేట్ లెవెల్ జర్నలిస్ట్ క్రికెట్ యూనిటీ కప్ 2024
ఇలాంటి టోర్నమెంట్లు మళ్లీ మళ్లీ పెట్టాలి పలు జిల్లాల కెప్టెన్ ల విజ్ఞేప్తి
మచ్చా రామలింగారెడ్డి కృషి అభినందనీయం
అనంతపురం జిల్లాలో ఆర్డీటి మైదానంలో జరుగుతున్న శ్రీసత్యసాయి రాష్ట్రస్థాయి జర్నలిస్టు క్రికెట్ యూనిటీ కప్ 2024 విజయవంతంగా నడుస్తుందని రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన ప్రతి జట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వసతి భోజనం సౌకర్యాలను కల్పిస్తూ ఎప్పటికప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉన్న పరిష్కరిస్తున్న మచ్చా రామలింగారెడ్డికి, వారి బృందానికి వివిధ జిల్లాల కెప్టెన్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టోర్నిలో భాగంగా ఆర్డిటి ప్రధాన మైదానంలో శుక్రవారం సెమీఫైనల్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ అందరిని ఒక వైదిక పైకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశామని,క్రీడాకారులు రావడంతో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా నడుస్తుందన్నారు. జర్నలిస్టుల అభివృద్ధి సంక్షేమమే తన ధ్యేయమని అందరూ ఐక్యతగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నేడు శనివారం ఫైనల్ మ్యాచ్ తో టోర్నమెంట్ ముగుస్తుందన్నారు. శ్రీసత్యసాయి జిల్లా,కడప రాజంపేట, వైజాగ్ జట్ల కెప్టెన్లు మాట్లాడుతూ ఇలాంటి టోర్నమెంట్ ఏడాదికి రెండు నిర్వహించాలని,దీంతో జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి టోర్నమెంట్లతో అందరిని ఒక తాటిపైకి తీసుకురావడానికి విశేష కృషి చేసిన మచ్చా రామలింగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.మరోసారి ఇలాంటి టోర్నమెంట్ తో కలుసుకొని జర్నలిస్టుల ఐక్యతను నిరూపించాలన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఖాన్, విజయ్, షకీర్, రఘు, శివ, త్యాగరాజు, శ్రీకాంత్, వాలి తదితరులు పాల్గొన్నారు.
_______________________________________
ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వంద కుటుంబాలు టిడిపి నుంచి వైసీపీలో చేరిక
శ్రీసత్యసాయిజిల్లా,ఆమడగూరు,మార్చి01(విజయస్వప్నం.నెట్)
ఆమడగూరు మండలంలోని బాలప్పగారిపల్లి,సానే వారిపల్లి,గువ్వలపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి,హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ సమక్షంలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారని తెలిపారు. బాలప్పగారిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి,హిందూపూరం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే దుద్దుకుంట సాదరంగా ఆహ్వానించి వైఎస్ఆర్సిపి పార్టీలోకి కాండవాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారన్నారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి,హిందూపూరం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల ఆకర్షితులై వైఎస్ఆర్సిపి పార్టీలోకి వందలాదిగా చేరుతున్నారన్నారు.రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిందిగా వారు కోరారు.అలాగే పుట్టపర్తి శాసనసభ్యులుగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని, హిందూపూర్ ఎంపీగా బోయ శాంతమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
_______________________________________
శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి01(విజయశ్వప్న.నెట్)
కదిరి పట్టణ పరిధిలో వివిధప్రాంతాలకు చెందిన 20కుటుంబాలు శుక్రవారం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీలో చేరగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి నాగన్న,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టీఎండి ఇలియాజ్,సభ్యులు మున్నా,సుగుణమ్మ, గంగులమ్మ, ఆర్ఎస్ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ తదితరులు పార్టీలో చేరిన పలువురికి ఆర్సీపి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.
_______________________________________
4న శ్రీసత్యసాయి జిల్లాకు చంద్రబాబు రాక పెనుగొండలో
రా.... కదలిరా.... బహిరంగ సభ
శ్రీసత్యసాయిజిల్లా పెనుగొండలో 4న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రా.... కదలిరా కార్యక్రమంలో పాల్గొంటారని, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు చేబడుతున్నట్లు తెదేపా ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర,పెనుకొండ తెదేపా శాసనసభ, అభ్యర్థి సబితమ్మ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.రా.... కదలిరా బహిరంగ సభకు నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
_______________________________________
శ్రీసత్యసాయిజిల్లా గాండ్లపెంట మార్చి01(విజయస్వప్నం.నెట్)
గాండ్లపెంట మండలం కట్టారుపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల రైతులు శుక్రవారం లోఓల్టేజితో పంటలు ఎండిపోయి నష్టపోయి ఇబందులు పడుతున్నామని రైతులు మండల విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించారు. లోఓల్టేజితో పాటు కదిరి ఇండష్ట్రీయ ఏరియాకు తమ గ్రామాలకు చెందిన విద్యుత్ ను సరఫరా చేస్తున్నారని,తరచూ లోఓల్టేజి,విద్యుత్ కోతలతో రబి సీజన్లో సాగుచేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని,తీరా చేతికి వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు చేరుకొని రైతులకు సర్ది చెప్పి అధికారులతో మాట్లాడి ఆందోళన విరామింప చేశారు.
_______________________________________
పుట్టపర్తిలో నేడు టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం.
శ్రీసత్యసాయిజిల్లా/పుట్టపర్తి మార్చి01(విజయస్వప్నం.నెట్)పుట్టపర్తి
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నేడు (శనివారం) ఉదయం 10:30 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు.పెనుకొండ నియోజకవర్గంలో ఈనెల 4న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన,టీడీపీ ఎన్నికల శంఖారావం,టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై సమావేశంలో చర్చిస్తారని, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ ఛార్జ్ లు,క్లస్టర్ ఇంచార్జ్ లు, టిడిపి అనుబంధ సంస్థల సభ్యులు,స్థానిక ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని ఈసందర్బంగా అయన కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి