హరహర శివ శంభో శంకర మహాదేవా....!
శ్రీసత్యసాయిజిల్లా( విజయస్వప్నం.నెట్)
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం శ్రీసత్యసాయిజిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. లేపాక్షి దుర్గా వీరభద్రస్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కుల్వంత్ హల్ లో భక్తులు నిరంతరం భజనలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ ఆవరణలో హరిహర క్షేత్రంలో పార్వతిపరమేశ్వరుల కళ్యాణం కనుల పండువగా నిర్వహించారు. కదిరి,తిమ్మమ్మ మర్రిమాను, ధర్మవరం, గోరంట్ల, హిందూపురం, పెనుకొండ తదితర మండలాల శివాలయాల్లో భక్తులు పొటేత్తరు. హరికథలు, భజనలు, హర హర మహాదేవ శివ శంభో శంకర నామస్మరణలతో ఆలయాలు మార్మోగాయి. భక్తులకు తీర్థ, అన్నప్రసాదాలు అందజేశారు. ఓడి చెరువులో.... మండలంలోని కొండకమర్ల, తుమ్మలకుంట్లపల్లి, తిప్పేపల్లి, ఓడిచెరువు, ఎంబి క్రాస్ గ్రామాల్లో మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో రుద్రహోమం, అభిషేకాలు, అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రి వేళల్లో దీపోత్సవ పూజలు, భజనలు, భక్తి గీతాలు ఆలపించి గ్రామీణ ప్రాంతాల ఆలయాలల్లో భక్తులు జాగరణ చేపట్టారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లేపాక్షి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు శ్రీవారి గరుడ సేవా సమితి సభ్యులు, హిందూపురం సేవకుల ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ పానీయాలు అందజేశారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా కదిరి డిఎస్పీ శ్రీలత శుక్రవారం మహాశివరాత్రి సందర్బంగా తిమ్మమాంబ ఉత్సవాలల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు డిఎస్పీ శ్రీలతకు దుస్సాలువతో సత్కరించారు.ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బందోబస్తు పర్యవేక్షించి, మహాశివరాత్రి ఉత్సవాలు పూర్తి అయ్యే వరకు గట్టి బందోబస్తు నిర్వహించి, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండ చూడాలని ఎస్ఐకి పోలీసులకు సూచించారని తెలిపారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా మార్చి08( విజయస్వప్నం. నెట్)
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పర్యటించి సభలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ 2023-24 కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిన కార్యకర్తల సేవలను కొనియాడారు. కార్యకర్తల కష్టాన్ని, అంకితభావాన్ని గుర్తించిందని,సేవలకు గుర్తింపుగా నారా లోకేష్ బాబు ఉత్తమ కార్యకర్తగా ఎంపికైన గండికోట ఇర్షాద్ కు ప్రశంసాపత్రం అందజేశారని తెలిపారు.ప్రశంసాపత్రాలు అందుకొన్న వారిలో ఐటిడిపి నియోజకవర్గం ఉపాధ్యక్షులు పొగాకు షన్వాజ్ సౌదీ నాగరాజు, చికెన్ షాను, జ్యోతి ఉన్నారని గండికోట ఇర్షాద్ తెలిపారు. మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
______________________________
వృద్ధాశ్రమానికి నిత్య సరుకులు వితరణ
శ్రీ సత్య సాయిజిల్లా,అమడుగురు,మార్చి08(విజయస్వప్నం.నెట్)
మండలంలోని గాజులపల్లి సమీపంలో మాతృశ్రీ వృద్ధాశ్రమానికి శుక్రవారం కదిరి పట్టణానికి చెందిన శశిధూర్ మిత్రబృందం 12 వేల విలువచేసే నిత్యవసర సరుకులు ఆశ్రమ నిర్వాహకురాలు అరుణ జ్యోతికి అందజేశారు.ఎవ్వరి అండ లేకుండా ఒంటరి మహిళ మాతృశ్రీ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుచేసి అరుణజ్యోతి అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమ వంతుగా 12విలువచేసే నిత్యవసర సరుకులు అందిస్తున్నట్లు హను,గోల్డ్ శివ,సతీష్,అంజన్ రెడ్డి,డాక్టర్ దినేష్,సునీల్ తెలిపారు.వృద్ధాశ్రమానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్న కదిరి పట్టణానికి చెందిన మిత్ర బృందానికి నిర్వాహకురాలు అరుణ జ్యోతి కృతజ్ఞతలు తెలిపారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి08(విజయస్వప్నం.నెట్)
కదిరి డివిజన్ లోని నల్లచెరువు మండల మాజీ విలేకరి వాసుదేవరెడ్డి ప్రమాదవశాత్తు రోడ్డుప్రమాదంలో గాయపడి సాయినాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి.సిద్దారెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత వైద్యుడికి సూచించారని స్థానిక వైకాపా ప్రజాప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు తెలిపారు. కార్యకర్తను పరామర్శించిన అభ్యర్థి మక్బుల్ కదిరి డివిజన్ నల్లచెరువు మండల పరిధిలోని ఇందుకూరిపల్లికి చెందిన వైకాపా కార్యకర్త రామిరెడ్డి ప్రమాదావశత్తు కాలికి గాయాలై కదిరిలో ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తీసుకొన్న వైకాపా శాసనసభ అభ్యర్థి బిఎస్ మక్బుల్ ఆసుపత్రికి చేరుకొని కార్యకర్తను పరామర్శించి,వైకాపా అండగా ఉంటుందని దైర్యం చెప్పి,వైద్యచికిత్సలకు ఆర్థికసాయం అందించినట్లు వైకాపా నాయకులు,కార్యకర్తలు తెలిపారు.
______________________________
వైకాపా వీడి 15 కుటుంబాలు టీడీపీ, జనసేన కూటమిలోకి చేరిక
శ్రీసత్యసాయిజిల్లా,(పుట్టపర్తి)మార్చి08(విజయస్వప్నం.నెట్)
తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి పిలుపునిచ్చారు.శుక్రవారం ఓడిచెరువు మండలంలోని సున్నంపల్లి పంచాయతీ పెద్దగుట్లపల్లి గ్రామానికి చెందిన దాదాపు 15 కుటుంబాలు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షులు బి.కె పార్థసారథి సమక్షంలో వైకాపాని వీడి తెదేపా,జనసేన కూటమి పార్టీలోకి చేరారు. పార్టీ లోకి చేరిన వారికి తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధితో పాటు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశ్యంతోనే వైకాపాను వీడి తెదేపా,జనసెన ఉమ్మడి కూటమిలో చేరినట్లు వారు తెలిపారు. పార్టీలోకి చేరిన వారిలో విశ్వనాథరెడ్డి, అనిల్ కుమార్,రమేష్,శివ ప్రసాద్, అభినంద, ప్రవీణ్ కుమార్, వైపి. చంద్రశేఖర్, నరేష్, రామచంద్ర, వి.గంగులప్ప, వి.భరత్, శివకుమార్, రాజు, భరత్ కుమార్, రాజు, చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.ఈకార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ జయచంద్ర, సున్నంపల్లి సర్పంచ్ నాగేంద్ర, తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
______________________________
మినీ మేనిఫెస్టోపై కాంగ్రెస్ నాయకులు ప్రచారం
శ్రీ సత్యసాయిజిల్లా,ఓడిచెరువు, మార్చి08 విజయస్వప్నం.నెట్)
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే ఇటీవల ప్రకటించిన మెనీ మేనిఫెస్టోపై శుక్రవారం మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ నాయకులు దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రతి నిరుపేద మహిళ కుటుంబానికి 5వేల రూపాయలు అందిస్తామని ప్రచారం చేస్తున్నట్లు మండల నాయకులు రామాంజనేయులు, రెడ్డప్ప, నాయుడు, కిష్టప్ప, వాసుదేవ రెడ్డి, బావన్న,సోమశేఖర్, సురేందర్ రెడ్డి తదితరులు తెలిపారు.
______________________________
బాబు షూరిటీపై తెదేపా నాయకులు ప్రచారం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు మార్చి08( విజయస్వప్నం.నెట్)
మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బాబు షూటి - భవిష్యత్తుకు గ్యారెంటీ,బాబు సూపర్ 6 కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మాజీ ఎంపిపి ఇస్మాయిల్ తెలిపారు. సూపర్ 6,బాబు షూరిటీ.భవిష్యత్తుకు గ్యారంటీ మినీ మేనిపెస్టోపై, అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ తెలుగుదేశం,జనసేన పార్టీల సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారన్నారు.ఈకార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అల్లాబకాష్, లక్ష్మీపతి నాయుడు, శ్రీనివాసులు నాయుడు, సుధాకర్ నాయుడు, అబ్దుల్ రూవూఫ్, శామీర్ భాష,మాజీ స్టోర్ డీలర్, భాస్కర, మైక్ రమణ, అంజి, మాబు, బాలకృష్ణ, బాబ్జాన్, అంజి, రమణ, నాసిర్, శేషయ్యగారిపల్లి శ్రీనివాసులు, యశ్వంత్, గజ్జలప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
______________________________
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించిన జగన్
-తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
శ్రీసత్యసాయిజిల్లా(విజయస్వప్నం.నెట్)
ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలు విస్మరించారని, సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు సిద్ధమా...
అంటూ సిఎం జగన్ కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు సవాల్ విసిరారు. శాంఖారావం కార్యక్రమంలో శ్రీసత్యసాయిజిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం కొత్తచెరువు, కదిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ తుంగలో తొక్కిన అంశాలు స్పష్టం చేశారు.జగన్ నిరంకుశ పాలనపై నారా లోకేష్ ధ్వజమెత్తరు. నియంత పాలకుడికి బుద్ది చెప్పి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. తెదేపా జిల్లాలో చేసిన అభివృద్ధిని, అధికారంలోకి రాగానే చేపట్టబోయే పనులను వివరించారు. అధికారంలోకి రాగానే జిల్లాను అభివృద్ధి చేసే భాద్యత తాను తీసుకొంటానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకుందామని పవన్కళ్యాణ్ తో కలసి తెదేపా-జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అయన తెలిపారు. సూపర్ సిక్స్ మేనిపెస్టో ప్రజల్లోకి విసృత్తంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. అంతకముందు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీసత్యసాయి సమాధిని దర్శనం చేసుకొని, అనంతరం సభ వేదికపై స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బికే పార్థసారధి, మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కదిరి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్, ఎమ్మెల్సి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షులు వరుణ్, పుట్టపర్తి సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించెందుకు కృషి చేస్తామని తెదేపా, జనసేన కార్యకర్తలతో నారా లోకేష్ వేదికపై నేతల సమక్షంలో ప్రతిజ్ఞ చేయించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి