సింహ వాహనంపై శ్రీలక్ష్మినరసింహస్వామి
కదిరి పట్టణంలో అంగరంగ వైభవంగా పక్షం రోజులు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 4వరోజు శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారిని సింహ వాహనంపై తిరు వీధుల్లో ఊరేంగింపుగా దర్శనమిచ్చారు.వివిధ రకాల పుష్పలాతో అలంకరించిన పల్లకిలో స్వామివారు కొలువై మేళతాళాలు వాయిద్యాల మధ్య పుర వీధుల్లో ఊరేంగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయంలో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించగా,చిన్నారుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు భక్తిశ్రద్దలతో తిలకించారు.నేడు శనివారం హనుమంతుడి భుజాలపై శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనమిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.
$$$__________@@@__________$$$
ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట సమక్షంలో తెదేపా నుండి వైకాపాలో చేరిక
మండలంలోని ఇనగలూరు పంచాయితీ గాజుకుంటపల్లి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి పుట్టపర్తి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.తెదేపా నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో శ్రీనివాసులు, రామప్ప, రామకృష్ణ,ప్రసాద్, సాయిబాబు, గంగులప్ప, యాల్లప్ప, కిష్టప్ప, జయచంద్రరెడ్డి, ఒగ్గేటి శ్రీనివాసులు, వెంకటనారాయణ, ఇడగొట్టు గోపాల్, కే.ఆంజనేయులు, సీ.నారాయణప్ప, టీ.ఆంజనేయులు, చలపతి, ఆదినారాయణ, రమేశ్ తదితరులు వున్నారు.ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న అందిస్తున్న సంక్షేమ పధకాలు, శ్రీధరన్న చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వైకాపా లో చేరినట్లు తెలిపారు.తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి,మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యే దుద్దుకుంట ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వైకాపా శ్రేణులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే దుద్దుకుంట
$$$__________@@@__________$$$
చలివేంద్రం ఏర్పాటు
మండలంలోని వెంకటాపురం పంచాయతీ నారప్పగారిపల్లిలో శుక్రవారం రెడ్డిపల్లి మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు.వేసవి కాలంలో ప్రయాణికుల దాహర్తి తీర్చడానికి గ్రామంలో చలివేంద్ర శిబిరం ఏర్పాటు చేసారని తెలిపారు. తుమ్మల, నల్లగుట్లపల్లి, తుమ్మలకుంట్లపల్లి తదితర గ్రామాలకు వెళ్లే పాదచారులు, వాహనదారులు ఎండతీవ్రతతో తాగునీటి సమస్య లేకుండ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, రాజారెడ్డి, నరేంద్ర, అజయ్, నారాయణ, అంజి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
మాజీ ఎమ్మెల్యే కందికుంటపై కేసులను కొట్టేసిన హైకోర్టు
కదిరి తేదేపా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పై సిబిఐ కోర్టు విధించిన శిక్షణను కొట్టివేస్తూ శుక్రవారం తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. తమ నాయకుడు కందికుంట పై ఉన్న కేసులను కొట్టివేయడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కదిరి నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు శిక్షను రద్దు చేస్తూ తీర్పు ప్రకటించిన సందర్బంగా మండల పరిధిలోని నల్లచెరువు, నంబూలపూలకుంట, తనకల్లు, గాండ్లపెంట మండలాల్లో తెదేపా శ్రేణులు బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకొన్నారు.
$$$__________@@@__________$$$
మాజీమంత్రి పల్లె సమక్షంలో వైకాపా వీడి తెదేపాలో చేరిక
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మార్చి22(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండలం,బుచ్చయ్యగారిపల్లి గ్రామంలో శుక్రవారం మాజీ మంత్రి,పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జి పల్లె రఘునాథ్ రెడ్డి,టీడీపీ,జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి,పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్బంలో గ్రామానికి చెందిన 271 కుటుంబాలు వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా,మాజీమంత్రి పల్లె చేరినవారికి తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, సూపర్ సిక్స్ పధకాలపై ప్రచారం చేపట్టి,రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా ఆమడగూరు మార్చి22(విజయస్వప్నం.నెట్)
జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు మండలంలోని బోయపల్లి,పూలకుంటపల్లి సమీపంలో చెక్ పోస్ట్లు ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఐ మగ్బుల్ బాషా తెలిపారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్యా కర్ణాటక సరిహద్దుల ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాట్లు చేసి,కర్ణాటక నుండి అక్రమ మద్యం రవాణాను అరికట్టనున్నట్లు అయన పేర్కొన్నారు.గ్రామాల్లో అక్రమ మద్యం క్రయావిక్రయాలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకొంటామన్నారు.
$$$__________@@@__________$$$
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి
శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరువు మార్చి22(విజయస్వప్నం. నెట్)
రాబోయే సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని మండల స్పెషల్ ఆఫీసర్ రమేష్, తహసిల్దార్ ఖాజాబీ పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం అన్ని రాజకీయ పార్టీ నాయకులకు సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల కమిషన్ నియమావళి పై సమీక్షించారు.ఎన్నికల నిర్వహణ, ప్రచార వాహనాల అనుమతులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నాగేంద్ర, సిబ్బంది,రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో.... మండలంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులతో శుక్రవారం ఎస్ఐ వంశీకృష్ణ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించే విధంగా సహకరించాలని,ఎంసీసి తదితర నియమ నిబంధనలపై పోలీసుస్టేషన్ లో అన్ని రాజకీయ పార్టీ నాయకులకు సమావేశం ఏర్పాటు చేసి ఎస్ఐ వంశీకృష్ణ సూచించారు.
$$$__________@@@__________$$$
ఓడిచెరువు మండలంలోని సున్నంపల్లి గ్రామంలో శుక్రవారం శ్రీతారాములు విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.పురోహిత అర్చకులు పంచరత్న సురేష్ శర్మ,లక్ష్మిపతి శాస్త్రి మంత్రోచ్చరణలతో దీపదూప,అభిషేకం,అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించి,దేవత విగ్రహాలు,ధ్వజస్టంభం ప్రతిష్టలు భక్తిశ్రద్దలతో నిర్వహించారు.విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పుట్టపర్తి శాసన సభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి పాల్గొన్నారు.స్థానిక నాయకులు,కార్యకర్తలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి