సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో విజయదుందుభి మ్రోగించిన
శ్రీ జ్ఞానసాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
ఒకే పాఠశాలలో 10మంది విద్యార్థుల ఎంపికపై హర్షం
శ్రీసత్యసాయిజిల్లా,ఓబుళదేవరచెరువు మార్చి 15(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండల కేంద్రంలోని శ్రీ జ్ఞాన సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10మంది విద్యార్థులు 14వతేది (నిన్న)గురువారం ప్రకటించిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో ప్రతిభతో విజయందుందుభి మోగించి పాఠశాల గుర్తింపు పొందుతోంది.ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అకాడమిక్ సిలబస్ భోదనతో పాటు, సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన సిలబస్ ను కూడా ప్రత్యేక క్లాసులు నిర్వహించి శిక్షణ ఇవ్వడం జరిగిందని,శిక్షణ తీసుకున్న 12 మంది విద్యార్థులలో పదిమంది విద్యార్థులు అర్హత సాధించారని కరస్పాండెంట్ క్రిష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఓడిచెరువు మండల కేంద్రంలో శుక్రవారం ప్రధాన రహదారిపై విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.అర్హత సాధించిన విద్యార్థులను స్కూల్ కరస్పాండెంట్ క్రిష్ణమోహన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం,తల్లిదండ్రులు,పుర ప్రముఖులు అభినందించారు.అనంతరం పాఠశాలలో విద్యార్థులకు మిఠాయిలు పంచి పెట్టి సంబరాలు చేసుకొన్నారు. పాఠశాల స్థాపించిన అనతి కాలంలో నవోదయ,సైనిక్ పాఠశాలలో ప్రవేశలకు విద్యార్థుల ఎంపిక కావడం విశేషంగా ఉందని,2024-25 సంవత్సరానికి శ్రీ జ్ఞానసాయి విద్యానికేతన్ పాఠశాల నుండి 10మంది విద్యార్థులు(ఓకే పాఠశాల నుండి)ఎంపిక రికార్డ్ గా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు.
______________________________
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి