చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
మండలంలోని కొట్టువారిపల్లి క్లస్టర్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం పోషణ పక్వడ వారోత్సవాలు ఐసిడిఎస్ సూపెర్వైజర్ గంగాదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు,చిన్నారులకు ప్రత్యేక పౌష్టికాహారం అంగన్వాడీ కార్యకర్తలు ద్వారా అందిస్తున్నారని,రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలకు కోడిగుడ్డు,బాలామృతం తదితర పౌషికాహారాలు అందిస్తున్నట్లు సూపెర్వైజర్ గంగాదేవి తెలిపారు. ఈనెల 23వరకు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పోషణ పక్వడ వారోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో అంగన్వాడీ భోధకులు, సహాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా నల్లచెరువు మార్చి13(విజయస్వప్నం.నెట్)
నల్లచెరువు మండలంలోని బాలేపల్లి తండా కొత్తపల్లి పంచాయతీ గ్రామాల్లో బుధవారం కదిరి నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ పర్యటించి ప్రచారం చేపట్టారు.ప్రతి ఇంటికి సంక్షేమ పధకాలు అందించిన వైఎస్ జగనన్నను మరోసారి ఆశ్వదించి ముఖ్యమంత్రిగా చేయాలని అయన ప్రజలను కోరుతూ ప్రచారం చేపట్టారు. ఈకార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి13(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో బుధవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపిపి పర్వీన్ భాను అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్యసమావేశంలో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా,పగలు పూట కూడ విద్యుత్ సరఫరా చేసి 9గంటలపాటు కొనసాగించి రైతులను ఆడుకోవాలని వెంకటాపురం ఎంపిటిసి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. ఏఈ రామసురారెడ్డి స్పందిస్తూ పగటి పూట విద్యుత్ సరఫరా తదితర సమస్యలను ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళ్ళ్తానని తెలిపారు. ఎంపిడిఓ మాట్లాడుతూ.... వేసవి కాలం సమీపిస్తున్నందున గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా,విద్యుత్ అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ ఖాజాబీ, జడ్పీటీసీ కుర్లి దామోదర్ రెడ్డి,పశు వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, ఏఈ దీపిక, ఎంఈఓ 1 సురేష్ బాబు,వైద్యాధికారి కమల్ రోహిత్,హార్టికల్చర్ హెచ్ఓ లావణ్య, ఐసిడిసి సూపెర్వైజర్ విజయకుమారి, ఏఓ ఇలియాజ్, ఎపిఓ సుధాకర్, ఈఓఆర్డి రాజశేఖర్, సూపరింటెండెంట్ రెడ్డప్ప, సీనియర్ అసిస్టెంట్ గజ్జల శ్రీనివాసులు రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు వివిధ శాఖాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
______________________________
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి13(విజయస్వప్నం.నెట్)
తెలుగుదేశం పార్టీని గెలిపించి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చెబితేనే ప్రజా సంక్షేమ పధకాలు అమలు చేసి రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కదిరి నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సతీమణి కందికుంట యశోదదేవి పేర్కొన్నారు.బుధవారం కదిరి పట్టణంలో 9వార్డులో కందికుంట యశోదదేవి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మినీ మేనిపెస్టోపై ప్రచారం చేపట్టారు.అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పధకాలు అందించాలన్నా రాష్ట్ర ప్రగతి పధంలో ఉండాలన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు.ప్రజా సంక్షేమ పధకాలు అందించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తి విఫలమైందన్నారు.రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ విజయంతో నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేయాలని ఆమె ప్రచారం చేపట్టారు.ఈకార్యక్రమంలో తెదేపా పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్,రమణ,పర్వీన్భాను,సల్మాన్, గంగ రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
______________________________
శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవం నిర్వహిద్దాం
ఎమ్మెల్యే పీవీ.సిద్ధారెడ్డి
శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి13(విజయస్వప్నం.నెట్)
శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎప్పటిలాగే ఈఏటా వైభవంగా అత్యంత వైభవంగా నిర్వహిద్దామని కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి పేర్కొన్నారు.కదిరి పట్టణంలో వెలసిన శ్రీలక్ష్మినరసింహస్వామి దేవస్థానంలో బుధవారం ఈఓ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బ్రహ్మోత్సవాల నిర్వహణ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు 15 రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారని, సంబంధించిన ఏర్పాట్లను పూర్తిస్థాయిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చలపతినాయని సత్రాన్ని నిర్మించుకొని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామని,తితిదే కళ్యాణ మండపం ఆవరణాన్ని శ్రీవారికి అనుసంధానం చేసామన్నారు. అంతేకాకుండా శ్రీవారి బృగుతీర్థం పనులను ప్రారంభించి పూర్తి అయ్యే సమయంలో అపారమైన వర్షాలతో బృగుతీర్థం పూర్తిగా దెబ్బతినిందని, బృగుతీర్థంను పునః నిర్మించుకుందామని చర్యలు చేపట్టిన ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా భక్తులకు బృగుతీర్థంను అందుబాటులోకి తీసుకురాలేక పోయామన్నారు. ఏదేమైనా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఎక్కడ రాజీపడకుండా ఏమాత్రం అంతరాయాలు కలగకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్ధసారధి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, బీజేపీ నాయకులు గుడిసె దేవానంద్, డిఎస్పి శ్రీలక్ష్మి,ఆర్డి ఓ వంశీకృష్ణ వివిధ శాఖ అధికారులు, నిపుణులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
______________________________
అల్ షిఫా న్యూరో థెరిపి ఆక్యుపంక్చర్ క్లినిక్ ప్రారంభించిన వైద్యులు
శ్రీసత్యసాయిజిల్లా,కదిరి, మార్చి13(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలోని కాలేజ్ రోడ్డు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ షిఫా న్యూరో థెరిపి, ఆక్యుపంక్చర్ క్లినిక్, రజి యునాని ఆయుర్వేద మందుల దుకాణాలను బుధవారం ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ సివి మదన్ కుమార్, సీనియర్ డాక్టర్ జి.శంకరయ్యలు ప్రారంభించారు.. వీరితోపాటు మరికొందరు డాక్టర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండల కేంద్రం సమీపంలో వడ్డివారిపల్లి వద్ద పల్లవి మండల సమాఖ్య (డిఆర్డిఏ, వైకేపి ఆఫీస్) కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా నేడు(గురువారం) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తునట్లు పేర్కొంటూ మండల పరిధిలోని పొదుపు స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు, గ్రామ సంఘాల ప్రతినిధులు, మండల సమాఖ్య సభ్యులు, సిబ్బంది హాజరై అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపియం రమణప్ప బుధవారం ఓప్రకటనలో పిలుపునిచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి