google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : మండలాల వ్యాప్తంగా పల్స్ పోలియో... - రా.... కదలిరా....సభ విజయవంతం చేయండి -

4, మార్చి 2024, సోమవారం

మండలాల వ్యాప్తంగా పల్స్ పోలియో... - రా.... కదలిరా....సభ విజయవంతం చేయండి -

మండలాల వ్యాప్తంగా పల్స్ పోలియో...


శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు మార్చి03(విజయస్వప్నం.నెట్)

మండల వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యాధికారి భానుప్రకాష్ తెలిపారు.మండల వ్యాప్తంగా 4854 మంది 0-5 వయసు పిల్లలు ఉండగా,4710 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసి, మొదటి రోజే 97% లక్ష్యం సాధించినట్లు ఈసందర్బంగా అయన తెలిపారు.                    నల్లమాడలో  ఎమ్మెల్యే సమక్షంలో....  నల్లమాడ మండలంలోని పాత బత్తలపల్లి పంచాయతీ గ్రామాలలో ఆరోగ్య ఉపకేంద్రంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు.నల్లమాడ మండల వ్యాప్తంగా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఆదివారం ప్రాధమిక ఆరోగ్య వైద్యాధికారులు ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేసి మాట్లాడుతూ....పోలియో లేని సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈకార్యక్రమంలో వైద్యబృందం, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.                ఆమడగూరులో.... ఆమడగూరు మండల వ్యాప్తంగా 2789 మంది చిన్నారులు ఉండగా ఆదివారం మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యశాల అధికారుల ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించి 2733 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారని,రేపు(సోమవారం)మిగిలిన చిన్నారులకు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు వైద్యాధికారిణి అపర్ణ తెలిపారు.

___________________________________

ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించిన జగనన్నను మరోసారి ఆశీర్వదించండి:మంత్రి పెద్దిరెడ్డి


శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి 03(విజయస్వప్నం.నెట్)

ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించిన జగనన్నను మరోసారి ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర గునుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పేర్కొన్నారు.కదిరి,తనకల్లు,నల్లచెరువు మండలాల్లో మండల మహిళా సమాఖ్య ప్రతినిధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాల్లో కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ అధ్యక్షతన,హిందూపురం పార్లమెంట్  అభ్యర్థి శాంతమ్మ పాల్గొనగా, ముఖ్యఅతిధిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరై మాట్లాడారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టినట్లు అయన పేర్కొన్నారు.ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించిన జగనన్నను మరోసారి ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేయాలని,కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ ను, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మను గెలిపించాలని అయన ఈసందర్బంగా ప్రజలను కోరారు.అనంతరం ఆయా మండలాల్లో వైఎస్ఆర్ ఆసరా చెక్కులను మహిళా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. ఈకార్యక్రమంలో వైకేపి వెలుగు అధికార సిబ్బంది,మహిళా సంఘాల ప్రతినిధులు,సభ్యులు,సర్పంచులు,ఎంపిటిసిలు,వైకాపా శ్రేణులు పాల్గొన్నారు.

___________________________________

రా.... కదలిరా....సభ విజయవంతం చేయండి : మాజీమంత్రి పల్లె


శ్రీసత్యసాయిజిల్లా మార్చి03(విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయిజిల్లాలో తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కార్యక్రమంలో భాగంగా పెనుకొండలో కియా పరిశ్రమ సమీపంలో నేడు(సోమవారం)నిర్వహించే రా.... కదలిరా.... ఆఖరి సభ ఏర్పాట్లను ఆదివారం మాజీమంత్రులు పల్లె రఘునాధ్ రెడ్డి,పరిటాల సునీతమ్మ,శ్రీసత్యసాయి, అనంత ఉమ్మడి జిల్లాల తెదేపా ఎన్నికల పరిశీలకులు కోవెలమూడి రవీంద్ర,మాజీ ఎమ్మెల్యే బికే పార్థసారధి, పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థి సబితమ్మ తెదేపా శ్రేణులు పాల్గోని పరిశీలించి,వేదిక ఏర్పాట్లు,వాహనాలు పార్కింగ్,విఐపి,మీడియా ప్రత్యేక గ్యాలరీ, మహిళలకు సిట్టింగ్,కళాకారులకు వేదిక ఏర్పాట్లపై నాయకులు,కార్యకర్తలతో చర్చించి,గతంలో ఎప్పుడులేని విధంగా చంద్రబాబు సభలో వసతి,సౌకర్యాలు కల్పించి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంటూ.... రా.... కదలిరా సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

___________________________________

స్నేహమంటే ఇదేరా....!

మిత్రమా.... మేమున్నామంటూ... 

పూర్వ విద్యార్థులు భరోసా

శ్రీసత్యసాయిజిల్లా ఓబుళదేవరచెరువు మార్చి03(విజయస్వప్నం.నెట్)

అన్ని బంధాల కన్న స్నేహ బంధం మిన్న అనే విధంగా ఓడిచెరువులో స్నేహితుడికి మేమున్నామంటూ.... పూర్వ విద్యార్థులు భరోసా కల్పించారు.28ఏళ్ల క్రితం కళాశాలలో చదువుకున్న స్నేహితుడు శస్త్రచికిత్సతో భాధపడుతున్న విలేకరి పూల శంకరప్ప మరువవీధిలో ఇంటికెళ్లి కష్టాల్లో మేమున్నామని పూర్వ విద్యార్థులు 10వేల రూపాయలు అందించి భరోసా కలిపించారు. కష్ట పరిస్థితిల్లో శస్త్రచికిత్స చేసుకొని విశ్రాంతి తీసుకొంటున్న స్నేహితుడికి సహచర పూర్వ విద్యార్థులు లైన మేన్ రామాంజనేయులు, వ్యాయామ ఉపాధ్యాయులు బాబ్జాన్,టీవీ మెకానిక్ రమేష్, ఉపాధ్యాయులు పఠాన్ బాబా, గిరిబాబు, అబ్లు హుస్సేన్, రామచంద్ర, పణిభూషణ్ సహచర స్నేహితులు కలసి సేకరించిన 10వేలు ఆర్థికసాయం అందజేశారు. సిరి సంపదలే కొలమానంగా బంధాలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత సమాజంలో.... కష్ట పరిస్థితుల్లో మేమున్నామంటూ.... తోటి స్నేహితుడికి సాయం అందించి భరోసా కల్పించిన పూర్వ విద్యార్థుల ఔదార్యాన్ని పలువురు అభినందిస్తూ స్నేహమంటే ఇదేరా....అని కొనియాడారు.

___________________________________

శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి మార్చి03(విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి డివిజన్ కొత్తచెరువు మండలంలోని తలమర్ల ,రెడ్డిపల్లి పంచాయతీ (మాసుపల్లి) గ్రామంలో తెదేపాకు చెందిన పలువురు ఆదివారం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి  అధ్వర్యంలో వైస్సార్సీపీలో చేరారు.ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

___________________________________


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి03(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల కేంద్రంలో ఆదివారం ఎస్బిఐ బ్యాంక్ వద్ద ఫ్యామిలీ కేర్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో వైద్యాశిబిరం ఏర్పాటు చేసి బిపి,షుగర్,చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యానిపుణుడు టిఎస్ మహ్మద్ ముస్తఫా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.

___________________________________

శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి మార్చి03(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి మున్సిపాలిటీ ఎనుములపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మున్సిపల్ కార్మికుడు చిన్నప్పగారి లక్ష్మీనారాయణ ఆదివారం రాత్రి ఆకస్మిక మృతి చెందిన విషయం తెలుసుకొన్న మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గ్రామంలో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి,మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,ఆర్థిక సహాయం అందించి,పిల్లల చదువులకు సాయం అందిస్తానని,అన్ని విధాలా అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారని తెదేపా శ్రేణులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి