google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : అంగరంగ వైభవంగా ఖాద్రీశుడు బ్రహ్మోత్సవం

31, మార్చి 2024, ఆదివారం

అంగరంగ వైభవంగా ఖాద్రీశుడు బ్రహ్మోత్సవం

 జయ జయ సింహా.... జయ నరసింహా....!!

అంగరంగ వైభవంగా ఖాద్రీశుడు బ్రహ్మోత్సవం

మొక్కులు తీర్చుకున్న లక్షలాది భక్తులు

శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి30 (విజయ స్వప్నం.నెట్) 






కదిరి పట్టణంలో శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి  బ్రహ్మరథోత్సవం లక్షలాది మంది భక్తుల మధ్య స్వామివారి నామస్మరణలతో అంగరంగ వైభవంగా   నిర్వహించారు. పక్షం రోజులు స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో భాగంగా పుష్కరం రోజు(12వరోజు)శనివారం ఉదయం 7:20 నుండి 8;10 శుభ ఘడియల్లో శ్రీదేవి, భూదేవి సమేతంగా ఖాద్రీశుడు ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించారు.8:12 గంటలకు స్వామివారు కొలువైన రథం ముందుకు కదిలి తిరువీధుల్లో స్వామివారు దర్శనం ఇస్తూ 12:56 గంటలకు స్వామివారి బ్రహ్మరథం యధాస్థానానికి చేరుకొంది.ఉదయం ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు ఆలయ అర్చక బృందం రథం ముందు బలిహరణం, ఆస్థాన పూజలు నిర్వహించి బ్రహ్మరథోత్సవం ప్రారంభించగా ఈఓ శ్రీనివాసులురెడ్డి బలిహరణం పూజలో పాల్గొని రథం తిరువీధుల్లో విహరిస్తూ యథాస్థానానికి చేరుకోనే వరకు దగ్గర వుండి పర్యవేక్షించారు.మండుతున్న ఎండలు సైతం ఏమాత్రం పట్టించుకోకుండా బ్రహ్మరథం లాగుతూ.... లక్షలాది మంది భక్తులు ధవణం మిరియాలు చల్లి స్వామివారిని దర్శించుకున్నారు.మాజీ ఎమ్మెల్యే పార్థసారథి,బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి రథంపై నుండి జయ జయ సింహా....జయ నరసింహా.... శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవిందా.... భక్త ప్రహ్లాద వరద గోవింద గోవిందా.... అంటూ ఆద్యంతం భక్తులతో పలికించారు. రథంపై ధవణం మిరియాలు చల్లితే కోరికలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆనావాయితీ ప్రకారం కుటాగుళ్ళ, మూర్తిపల్లి, గజ్జెలరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు పాల్గొని స్వామివారి బ్రహ్మరథం ముందుకు సాగేక్రమంలో నియంత్రించేందుకు పెద్ద పెద్ద తెడ్లు వేస్తువుంటే యథాస్థానానికి చేరేవరకు భక్తులు మోకులతో రథం లాగారు. డిఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. స్వామివారి రథం వెనుకవైపు అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వాహనాలు అనుసరించాయి.11వరోజు బ్రహ్మరథోత్సవం ముందురోజు శుక్రవారం యాగశాల నుండి శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారు తెల్ల ఏనుగుపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శనివారు తెల్లవారుజామున శుభ ఘడియల్లో స్వామివారి బ్రహ్మ రథావరోహణ పూజలు నిర్వహించారు. 



నేడు ఆశ్వ వాహనంపై ఖాద్రీశుడు దర్శనం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 13వరోజు ఆదివారం శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిస్తరని ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకులు తెలిపారు. అంతక ముందు ఆలయంలో ఆలయ యాగశాలలో నిత్యపూజ, హోమం పూజలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో సాయంత్రం స్వామివారిని ఆలయం సమీపంలో వున్న అలకోత్సవ మండపం వద్దకు తీసుకుని వచ్చి స్వామివారి అలకోత్సవ విశిష్టతను ఆలయ అర్చకులు భక్తులకు వివరిస్తారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి