google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : బండలు మీదపడి ముగ్గురికి గాయాలు - వెలుగు వృద్ధాశ్రమానికి విద్యార్థులు విరాళం

20, మార్చి 2024, బుధవారం

బండలు మీదపడి ముగ్గురికి గాయాలు - వెలుగు వృద్ధాశ్రమానికి విద్యార్థులు విరాళం

శ్రీసత్యసాయిజిల్లా,కదిరి,మార్చి 19(విజయస్వప్నం.నెట్)


కదిరి పట్టణంలో ప్రసిద్ధికెక్కిన ఖాద్రీ పుణ్యక్షేత్రంలో మంగళవారం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆలయ ప్రధాన అర్చకులు అంకురార్పణ పూజలు నిర్వహించారు.19నుండి ఏప్రిల్ 2వతేది వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాల్గుణ శుద్ధ దశమి పురస్కరించుకొని ఆలయంలో సాయంత్రం యోగశాలలో బ్రహ్మోత్సవ శుభాకార్యానికి ఆలయ అర్చకులు మంత్రోచ్చరణలతో అంకురార్పణ పూజలు నిర్వహించారు. బ్రహ్మండనాయుకుడు ఖాద్రీ నరసింహుడి బ్రహ్మోత్సవాలతో కదిరి పట్టణం రంగు రంగు కాంతులతో వెలుగొందుతోంది.        నేడు స్వామివారి కళ్యాణోత్సవం         ఖాద్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రెండవ రోజు(బుధవారం)సాయంత్రం 6గంటల నుండి స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.ఆలయంలో వివిధ పుష్ప్వాలతో అలంకరణ చేపట్టారని,స్వామివారి కళ్యాణం తిలకించే భక్తులకు సౌకర్యాలు కల్పించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారన్నారు.ప్రభుత్వం తరపున శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.
$$$_________@@@_________$$$
బండలు మీదపడి ముగ్గురికి గాయాలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి19(విజయ స్వప్నం.నెట్) 
మండలంలోని లో వడ్డీవారిపల్లి పోస్ట్ ఆఫీస్  మంగళవారం వాహనంలో చలువ రాతి బండలు దింపుతుండగా ప్రమాదవశాత్తు బండలు మీద పడడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.లోడు దింపడానికి లారీ ఎక్కిన హరి,నాగరాజు,సల్మాన్ లు బండలు దింపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు బండలు జారీ ముగ్గురి కాళ్ళపైన పడడంతో నల్లమాడకు చెందిన హరి,నాగరాజులకు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు వారిని తక్షణమే వాహనంలో పుట్టపర్తి ఆసుపత్రికి తరలించి, సల్మాన్ ను 108 వాహనంలో  కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు .

$$$_________@@@_________$$$
నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుపుతున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి:ఆర్ఎస్ యు డిమాండ్
శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి19(వినాయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో గత కొద్దిరోజులుగా ఇష్టారాజ్యంగా కోచింగ్ సెంటర్లను అనుమతి లేకుండా ఆదాయమే మాధ్యేయం అనే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకి మాయ మాటలతో మభ్యపెట్టి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, కోచింగ్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని మంగళవారం తహసీల్దార్ కు ఆర్ ఎస్ యూ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈసందర్బంగా జిల్లా అధ్యక్షులు సాగినాల చరణ్ మాట్లాడుతూ.... కొన్ని నవోదయ. సైనిక్ కోచింగ్ సెంటర్లలో హాస్టల్ సౌకర్యం లేకుండా నెలకు 8వేలు నుండి 10 వేల రూపాయలు అక్రమంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారని, ఉదయం 8గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కోచింగ్ సెంటర్లు  నడుపుతున్నారని, ఎలాంటి అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు నడుపుతూ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని, ఇలాంటి కోచింగ్ సెంటర్లపై విద్యాశాఖాధికారులు తక్షణ చర్యలు తీసుకోని సెంటర్లను సిజ్ చేయాలని, లేని పక్షంలో ఉద్యమాలు ఉదృతం చేస్తామని అయన హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఆర్ఎస్యూ మండలం నాయకులు భాష, కుపెంద్ర, తరుణ్, లోకేష్, వేణు విద్యార్థులు పాల్గొన్నారు.
$$$_________@@@_________$$$
బాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం:మాజీమంత్రి పల్లె

శ్రీసత్యసాయిజిల్లా మార్చి19 అమడగూరు(విజయస్వప్నం.నెట్)
తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం మండల కేంద్రంలో మాజీమంత్రి పల్లె పర్యటించి తెదేపా శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా,జనసేన, బిజెపి ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో అభివృద్ధి పనులు మొదలుపెట్టి కొనసాగిస్తామన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పధం వైపు నడిపించడం బాబుతోనే సాధ్యమన్నారు.బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ,సూపర్ సిక్స్ పధకాలను వివరిస్తూ ప్రచారం చేపట్టారు. మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పలువురు వైకాపా నాయకులు మాజీమంత్రి పల్లె సమక్షంలో తెదేపాలోకి చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాసులురెడ్డి, ఎస్టీ సెల్ కాలేనాయక్, టీఎన్ఎస్ఎఫ్ రామాంజనేయులు, మూర్తి,సుధాకర్ రెడ్డి, టైలర్ రామాంజులు, మారుతీ, చంద్రశేఖర్, రమణరెడ్డి, లావణ్య, గాయత్రి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$_________@@@_________$$$
వెలుగు వృద్ధాశ్రమానికి విద్యార్థులు విరాళం
శ్రీసత్యసాయిజిల్లా మార్చి19 తనకల్లు(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలోని శ్రీశారద పాఠశాల విద్యార్థులు మదనపల్లిలో వెలుగు వృద్ధాశ్రమానికి  ఒక నెలకి సరిపడే  ఖర్చు మొత్తాన్ని పాఠశాల కరస్పాండెంట్ శ్రీవాణితో కలిసి విరాళంగా అందజేశారని  తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీ వాణి మాట్లాడుతూ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులు సేవగుణంతో విరాళాలు అందజేశారని, మంచి ఆలోచనతో సేకరించిన మొత్తాన్ని విరాళంగా అందించడం విద్యార్థుల సేవాగుణం అభినందనీయమన్నారు. విద్యతోపాటు సమాజంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అలవర్చుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ బృందం నజీర్,నరేష్,నూర్ మహమ్మద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలుగు వృద్ధాశ్రమ నిర్వాహకులు విద్యార్థులను అభినందించారు.
$$$_________@@@_________$$$
శ్రీ సత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి19విజయస్వప్నం.నెట్)
సొసైటీ పరిధిలో రుణాలు తీసుకున్న రైతులు ఈనెల 30వ తేదీ లోపు వడ్డీలు చెల్లించి రెన్యువల్ చేసుకోవాలని ఓడి చెరువు సహకార సంఘం చైర్మన్ ఎద్దుల రామసుబ్బారెడ్డి సీఈవో రామ్మోహన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు సకాలంలో రెన్యువల్ చేసుకుంటే ప్రభుత్వం కల్పించే రాయితీలు వర్తిస్తాయన్నారు. ఆధార్,వన్బి  అడంగల్,రెండు పాస్ ఫోటోలు వెంట తీసుకొని రెన్యువల్ చేయించుకోవాలని వారు తెలిపారు.
$$$_________@@@_________$$$
శ్రీశ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న మచ్చా


(శ్రీసత్యసాయి/అనంత జిల్లా)మార్చి19(విజటాస్వప్నం.నెట్)
మైసూర్  దత్త పీఠం బాలస్వామి శ్రీశ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ  ప్రత్యక్ష దైవం శిరిడి సాయి సినిమా షిరిడి సాయిబాబా పాత్రధారిగా నటించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి మంగళవారం కుటుంబ సమేతంగా కలిసి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు ప్రత్యక్ష దైవం శిరిడి సాయిబాబా సినిమా విశేషాలను ఈసందర్బంగా విజయానంద తీర్థ స్వామీజీ వారు అడిగి తెలుసుకున్నారు.ప్రత్యక్ష దైవం శిరిడి సాయిబాబా సినిమా విజయవంతం కావాలని స్వామీజీ ఆశీర్వదించారు.అనంతపురం పట్టణంలోని దత్త దేవాలయంలో దత్త జ్ఞానసాగర 36 వసంత్సోవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసారని,అనంతపురం జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా స్వామీజీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.
$$$_________@@@_________$$$
టీ.కుంట్లపల్లిలో ఎమ్మెల్యే దుద్దుకుంట ఎన్నికల ప్రచారం

శ్రీసత్యసాయి జిల్లా  ఓడిచెరువు మార్చి19(విజయస్వప్నం.నెట్) 
పంచాయతీ గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చెట్టారు. ఠాణకొత్తపల్లి, పెద్దసానేవారిపల్లి, తాటిమేకలపల్లి, అంబేద్కర్ కాలనీ,తుమ్మల కుంట్లపల్లి, బసప్పగారిపల్లి, ఎగువ చెర్లోపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పర్యటించి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేపట్టారు.పేద ప్రజల శ్రేయస్సే ద్యేయంగా శ్రమిస్తున్న జగనన్న ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని, మీబిడ్డ శ్రీధరన్న ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. అంతక ముందు శ్రీదండు మారెమ్మ ఆలయంలో ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పలువురు తెదేపాను వీడి వైకాపాలోకి చేరగా ఎమ్మెల్యే దుడ్డుకుంట వైకాపా కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ రాజునాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, ఎంపిపి పర్వీన్ షామీర్ బాషా, జడ్పీటీసీ, కుర్లి దామోదర్ రెడ్డి, నాయకులు లక్ష్మిరెడ్డి, కోళ్ల కృష్ణారెడ్డి,గొల్లపల్లి వెంకటరెడ్డి, మండోజీ ఆరీఫ్ ఖాన్,స్థానిక నాయకులు సోసైటీ వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ నాయుడు, ఎంపిటిసి సూర్య ప్రభాకర్ నాయుడు, చంద్రమౌళి, గంగిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, ప్రభాకర్ నాయుడు, మాజీ సర్పంచ్ రమణ, అక్రమ్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
$$$_________@@@_________$$$
కమనీయం శ్రీలక్ష్మినరసింహస్వామి కళ్యాణం


శ్రీసత్యసాయి జిల్లా కదిరి మార్చి20(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో  శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో నిర్వహించే పక్షం రోజుల శ్రీవారి బ్రహ్మోత్సవాల  కార్యక్రమాల్లో భాగంగా  రెండవ రోజు స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. యోగశాల నుండి నవ వధువులు శ్రీదేవి భూదేవితో పాటు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మండపం వద్దకు ఆలయ ప్రధాన అర్చకులు,తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు వేదమంత్రాలతో మంగళ సూత్రాలను శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అలంకరించారు. ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేలాది మంది భక్తులు శ్రీవారి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించి, చదివింపులు సమర్పించారు. నేడు(గురువారం) శ్రీ లక్ష్మీనరసింహస్వామి పురవీధుల్లో ఊరేగింపుగా దర్శనమిస్తారని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు.
$$$_________@@@_________$$$
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
శ్రీసత్యసాయిజిల్లా హిందూపురం మార్చి20(విజయస్వప్నం.నెట్) 
మండలంలోని బీట్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్  కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ అరుణ్ బాబు,జెసి అభిషేక్ పరిశీలించారు.  కళాశాలలో కౌంటింగ్ అనుకూల పరిస్థితులపై  ఆరా తీశారు. కళాశాల కౌంటింగ్ కేంద్రంలో గట్టి బందోబస్తు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, తహసిల్దార్ శివప్రసాద్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రెడ్డి శేఖర్, మండల సర్వేయర్ శ్రీనివాసులు, ఆర్ఐ అమరేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

$$$_________@@@_________$$$
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు  
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి20(విజయస్వప్నం.నెట్) 
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే  చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వరలక్ష్మిపేర్కొన్నారు. మండల ప్రజాప్రసాద్ అభివృద్ధి కార్యాలయంలో ఏపిడి శ్రీనివాసులు, ఏపీవో సుధాకర్ సంయుక్త అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి  సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేయగా ఎంపీడీవో వరలక్ష్మి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ.... ఎన్నికలలో రాజకీయ పార్టీ నాయకుల ప్రచార కార్యక్రమంలో ఏ ఉద్యోగులైన పాల్గొంటే చర్యలు  తప్పవున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న,వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సంభాషించిన కూడ శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో సాంకేతిక, క్షేత్రస్థాయి సహాయకులు పాల్గొన్నారు.

$$$_________@@@_________$$$
పోలీస్ చెక్ పోస్ట్ స్థల పరిశీలన 
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి20(విజయస్వప్నం.నెట్)
 మండలంలోని సున్నంపల్లి పంచాయతీ పెద్దగుట్టపల్లి గ్రామ సమీపంలో పోలీస్ చెక్ పోస్ట్ కోసం స్థలాన్ని బుధవారం తహసీల్దార్ ఖాజాబీ, ఎస్ఐ వంశీకృష్ణ పరిశీలించినట్లు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో అక్రమ మద్యం రవాణా అరికట్టడానికి  పెద్దగుట్టపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కిషోర్ రెడ్డి,ఆర్ఐ నాగేంద్ర, గ్రామకార్యదర్శి రఫిక్, డిజిటల్ అసిస్టెంట్ ప్రవీణ్ రెడ్డి, విఆర్ఏలు రాముడు, సోము, పోలీస్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
$$$_________@@@_________$$$
ప్రజా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్ర శిబిరం

శ్రీసత్యసాయిజిల్లా,తనకల్లు,మార్చి20(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ రావి చెట్టు వద్ద ప్రజా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండకమర్ల రెడ్డిభాష,సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం చలివేంద్ర శిబిరం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా తనకల్లు ఎస్ఐ ధరణి బాబు  పాల్గొన్నారు.ఈసందర్బంగా ఎస్ఐ  చలివేంద్రం శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.... వేసవిలో ప్రజా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, భవిష్యత్తులో ప్రజా ప్రెస్ క్లబ్ సభ్యులు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి మండల ప్రజలు మన్నలను  పొందాలని  అశభావం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో మండల ప్రముఖులు దేశాయ్ వెంకటరెడ్డి, కానిస్టేబుల్ శివప్రసాద్, పాత్రికేయులు, రమణ, మస్తాన్ వలి, షాహీర్ బాషా, శ్రీనివాసులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
$$$_________@@@_________$$$

శ్రీసత్యసాయిజిల్లా కదిరి పట్టణం గణేష్ బార్బర్ షాపు వద్ద కదిరి నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మాజీ నాయిబ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ నాయిబ్రాహ్మణ సేవాసంఘం సీనియర్ నాయకులు గుంటుపల్లి నాగేశ్వరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ నాగేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి నాయి బ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా అనేక సేవలు అందించినట్లు తెలిపారు.గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు, ఆదరణ పథకం ద్వారా వాయిద్యాపరికరాలు, దుకాణాలకు పనిముట్లు మంజూరు చేసి తన వంతుగా సేవతో నాగేశ్వరావు మన్ననలు పొందరని, తను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి, అత్మాభిమానంతో జీవితాన్ని గడిపిన వ్యక్తి,ఇలాంటి వ్యక్తిని మనమందరము ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని వారు సూచించారు.ఈకార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు టి.రమణ,వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య, దేవస్థానం మాజీ డైరెక్టర్ ఆర్.నాగరాజు, బీసీ మహాజన సమితి అధ్యక్షులు కె. ఆర్. హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి మునికుమార్, ఉపాధ్యక్షులు ఇండ్లూరి కృష్ణ,నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు శివకుమార్, సాధికారిక కమిటీ జిల్లానాయకులు శ్రీరాములు,సవిత సమాజ ప్రచార కార్యదర్శి నరేష్,డోలు రమణ,సంఘం నాయకుడు గణేష్,వీర విగ్నేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
$$$_________@@@_________$$$
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు మార్చి20(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షలు సజావుగా జరుగుతున్నట్లు కడప డివిజన్ ఆర్జెడి రాఘవరెడ్డి పేర్కొన్నారు.  జిల్లా ఉన్నత పాఠశాల,విజ్ఞాన్,శ్రీ విజ్ఞాన్,జీవనజ్యోతి పాఠశాలల్లో పదవ తరగతి పరీక్ష కేంద్రాలను బుధవారం రాఘవరెడ్డి తనిఖీ చేపట్టి,ప్రతి గదికి వెళ్లి విద్యార్థులు రాస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని కేంద్రాల్లో పది పరీక్షలు సజావుగా జరుగుతున్నాయన్నారు. అంతకుముందు ఎంఈఓ చెన్నకృష్ణ పరీక్ష కేంద్రాలను  తనిఖీ చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి