google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : వర్కింగ్ జర్నలిస్టులందరికి ఇళ్లపట్టాలు మంజూరు చేయాలి - బాధితులకు తెదేపా పవన్ ఆర్థికసాయం - ప్రధాని మోడీ పధకాలపై ప్రచారానికి శ్రీకారం

6, మార్చి 2024, బుధవారం

వర్కింగ్ జర్నలిస్టులందరికి ఇళ్లపట్టాలు మంజూరు చేయాలి - బాధితులకు తెదేపా పవన్ ఆర్థికసాయం - ప్రధాని మోడీ పధకాలపై ప్రచారానికి శ్రీకారం

వర్కింగ్ జర్నలిస్టులందరికి ఇళ్లపట్టాలు మంజూరు చేయాలి

శ్రీసత్యసాయిజిల్లా,తనకల్లు మార్చి 05(విజయస్వప్నం.నెట్)

గత కొన్ని ఎళ్లుగా మండలంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ లు,అక్రిడీటేషన్ ఉన్న పాత్రికేయులకు సైతం నివాస యోగ్యమైన ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం రెవిన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ నాగేశశ్వర్ రావుకు ప్రజా ప్రెస్ క్లబ్ సభ్యులు  వినతిపత్రం అందచేశారు.ఈసందర్బంగా ప్రజాప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ....2018లో నివాస యోగ్యమైన ఇంటి పట్టాలు మంజూరు చేసారని,మిగిలిన అక్రిడీటేషన్ కలిగిన వాళ్ళతో పాటు మండలంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికి ఇళ్లపట్టాలు మంజూరు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కే.రెడ్డిబాష,ఉపాధ్యక్షులు అధికారి శ్రీనివాసులు, షాహీర్, నరసింహులు, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.

                                                            

శ్రీదేవి తాగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభం 


శ్రీసత్యసాయిజిల్లా,ఆమడగూరు మార్చి05(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో మంగళవారం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తం రెడ్డి చేతుల మీదుగా తాగునీరు శుద్ధి కేంద్రాన్ని ప్రారంభం చేశారు. గోరంట్ల మండలం బూడిదగడ్డపల్లికి చెందిన శివారెడ్డి, రామకృష్ణమ్మ, రాజారెడ్డి, కాంతమ్మ దంపతుల సహాయ సహకారాలతో తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసారని, ఆలయానికి విచ్చేసే భక్తులతో పాటు పుర ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని, వేసవిలో ఇబ్బందులు పడే వారు దహార్తి తీర్చుకావడానికి శ్రీదేవి శుద్ధి తాగునీటి కేంద్రం అందుబాటులో ఉంటుందని ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు.

                                                            

శ్రీ సత్యసాయిజిల్లా,నల్లమాడ మార్చి05(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి మండలంలోని ఎనుములవారిపల్లికి చెందిన బోయ మల్లప్ప మంగళవారం మృతి చెందిన తెలుసుకొన్న మాజీమంత్రి పల్లెరఘునాథ్ రెడ్డి వారి స్వగ్రామానికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించి, ఎల్లవేళలా తెదేపా అండగా ఉంటానని హామీ ఇచ్చారని తెదేపా శ్రేణులు తెలిపారు.అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న అదే గ్రామానికి చెందిన పెద్ద తిరుపాలప్పా కుటుంబ సభ్యులను మాజీమంత్రి పల్లె పరామర్శించి ఆర్థిక సాయం అందించి,అతనికి చికిత్స అందిస్తున్న వైద్యుడకి ఫోన్ చేసి మెరుగైనవైద్యచికిత్స అందించాలని సూచించారన్నారు.

                                                            

బాధితులకు తెదేపా పవన్ ఆర్థికసాయం

శ్రీసత్యసాయి జిల్లా,కదిరి మార్చి05(విజయస్వప్నం.నెట్)

తనకల్లు మండలంలో సోమవారం తెల్లవారుజామున లారీ ఎద్దులబండిని ఢీ కొన్న ప్రమాదంలో టిడిపి కార్యకర్త వెంకటరమణ మృతి చెందిన విషయం తెలుసుకొన్న తెదేపా నాయకులు పివి పవన్ కుమార్ రెడ్డి మంగళవారం గ్రామంలో ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి,ఎల్లవేళలా అండగా ఉంటామని దైర్యం చెప్పి 20వేలు ఆర్థిక సహాయం అందించినట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.

                                                            

వేసవిలో దాహార్తి తీర్చడానికి చలివేంద్రం: తెదేపా నాయకులు సామకోటి

శ్రీసత్యసాయిజిల్లా, పుట్టపర్తి మున్సిపల్ కేంద్రం, గోకులం డ్వాక్రా బజార్ వద్ద మంగళవారం శ్రీసత్యసాయిజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ చలివేంద్రం శిబిరం ఏర్పాటు చేసి ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... వేసవి సమీపిస్తున్న సందర్భంగా మున్సిపల్ జిల్లా కేంద్రం గోకులం డ్వాక్రా బజార్  ప్రదేశంలో చలివేంద్రం ఏర్పాటు చేశామని,రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలకు ద్రాహాన్ని తీర్చడం కొరకు చలివేంద్రం ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాజాయాదవ్, నియోజకవర్గ టిఎన్టియుసి అధికార ప్రతినిధి రామాంజనేయులు, నారాయణస్వామి, పోతలయ్య, సంతోష్, అంజినాయుడు, రమణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

                                                            

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు మార్చి05(విజయస్వప్నం.నెట్) 

నేడు(బుధవారం) ఉదయం 10:30 గంటలకు మండలంలోని కొండకమర్ల 1,2 సచివాలయాలు, కొండకమర్ల 1రైతుభరోసా కేంద్రాలను పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రారంభిస్తారని, అలాగే అల్లాపల్లి పంచాయతీలో పిఏసీఎస్ గోడౌన్ ను ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఆధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని మండల కన్వీనర్ మధ్ధే రాజునాయుడు కోరారు.

                                                            

ప్రధాని మోడీ పధకాలపై ప్రచారానికి శ్రీకారం 

 శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు మార్చి05(విజయస్వప్నం.నెట్)

ప్రధాని మోడీ  నేతృత్త్వంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పధకాలు గ్రామస్థాయిలో ప్రచారం చేపట్టి బలోపేతానికి కృషి చేస్తున్నామని బిజెపి మండల అధ్యక్షులు సున్నంపల్లి రంగారెడ్డి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం పిఎం కిసాన్ పధకం ద్వారా 4నెలలకు 2వేలు చొప్పున ఏడాదికి 6వేలు రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారని,జల జీవన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు  తాగునీరు, విద్యా,వైద్య తదితర రంగాల్లో నూతన సంస్కరణలు తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనతగా అభివర్ణిస్తూ.... గ్రామాల్లో బిజెపి బలోపేతం కోసం ప్రచారం చేపట్టినట్లు అయన తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి