పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్ట బందోబస్తు:జిల్లా ఎస్పీ
శ్రీ సత్యసాయిజిల్లా పుట్టపర్తి మార్చి18 (విజయ స్వప్నం.నెట్ )
శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి కట్టుదిట్టమైన ప్రటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో సెల్ ఫోన్లు స్మార్ట్ వాచీలు, పర్సులు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకుండా తనిఖీలు చేపట్టారు.ఈనెల 18నుండి 30వతేదీ వరకు పదవ తరగతి పరీక్ష నిర్వహణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికార యంత్రాంగం తెలియజేశారు. పోలీస్ బృందాలచే పరీక్ష కేంద్రాల వద్ద పెట్రోలింగ్ నిర్వహించారు.పరీక్ష కేంద్రాల సమీప ప్రదేశాలలో పరీక్షలు ముగిసేవరకు జిరాక్స్ సెంటర్లు మూసి వేయించి, పరీక్ష కేంద్రాల నుండి వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమలుపరిచి ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు సజావుగా శాఖ ద్వారా అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
$$$__________@@@__________$$$
పదవ తరగతి పరీక్షలు ప్రశాంతం
శ్రీసత్యసాయిజిల్లా,ఆమడగూరు మార్చి18(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా ప్రశాంతంగా నిర్వహించారని సెంటర్ చీఫ్ భాస్కర్,డిఓ నరేష్ నాయక్,ఏపిడి పవన్ కుమార్ పేర్కొంటూ....తొలిరోజు తెలుగు పరీక్షకు 229మంది విద్యార్థులకు గాను 222 మంది హాజరుకాగా, 7మంది విద్యార్థులు గైర్హుజారయ్యారన్నారు.పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు నీరు,వెలుతురు తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులు ఏకగ్రతతో పరీక్షలు రాయలనే నిబంధనల మేరకు 100 మీటర్లు వరకు 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.పరీక్ష సమయ వెళ్ళల్లో జిరాక్స్ కేంద్రాలు మూసివేసే విధంగా చర్యలు తీసుకొన్నట్లు తెలిపారు. ఒడిచెరువులో.... మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా ప్లైయింగ్ స్వ్క్ డ్ భాస్కర్ రెడ్డి విజ్ఞన్,శ్రీవిజ్ఞన్,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు వెళ్లి పరీక్ష కేంద్రాల గదులు పరిశీలించినట్లు చీఫ్ అధికారులు తెలిపారు.
$$$__________@@@__________$$$
కరాటే బెల్ట్ టెస్ట్ పరీక్ష లో ఉత్తీర్ణులైన శ్రీ విజ్ఞాన్ సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,మార్చి17(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు మండలంలోని శ్రీ విజ్ఞాన్ సీబీఎస్ఇ పాఠశాల ఆవరణంలో ఆదివారం కరాటే బెల్ట్ టెస్ట్ పరీక్ష కార్యక్రమం యునైటెడ్ షోటోఖాన్ కరాటే డో ఇండియా, శ్రీసత్యసాయి జిల్లా స్టయిల్ ఛీఫ్, కరాటే మాస్టర్ 5 థ్ డాన్ బ్లాక్ బెల్ట్ మాస్టర్ షాకీర్ ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శ్రీ విజ్ఞాన్ స్కూల్ చైర్మన్ మస్తాన్, ప్రధానోపాధ్యాయులు రంగారెడ్డి హాజరై విద్యార్థులకు కరాటే వలన అవగాహనా కల్పిస్తూ..... ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం,మానసిక ఉల్లాసం, మేధాశక్తిని, ఆపదలో మనలను మనం కాపాడుకునే శక్తి సామర్ధ్యాలను పెంపొందించుటకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చదువుతో పాటు కరాటే కూడా మనకు చాలా అవసరమని కరాటే క్రీడా స్కూల్ గేమ్స్ లో ఉందని రాబోయే కాలంలో కరాటే క్రీడా వలన మనకు స్పోర్ట్ కోటాలో కూడా మరెన్నో అవకాశాలు ఉన్నాయని, కరాటే గురించి వాటి ప్రయోజనాల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం బెల్ట్ టెస్ట్ పరీక్ష నిర్వహిణాలో వామప్స్,సీటప్స్,పంచేస్, బ్లాక్స్,కిక్స్, స్టాండ్స్,కటస్, పరీక్షలు నిర్వహించారు. బెల్ట్ టెస్ట్ పరీక్షకు సుమారు 31 మంది విద్యార్థిని,విద్యార్థులు పాల్గొని వైట్ బెల్ట్ నుండి యెల్లో బెల్ట్ కి అర్హత సాధించారని,విద్యార్థులకు ముఖ్య అతిధుల చేతులమీదుగా యెల్లబెల్ట్, ప్రశంసపత్రాన్ని అందజేసి,మాస్టర్ షాకిర్ కి అభినందనలు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే కోచ్ లు రంజిత్,చాందిని,విద్యార్ధుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్
అనంతపురం,మార్చి18(విజయస్వప్నం.నెట్)
పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు.అనంత పట్టణంలోని ఫస్ట్ రోడ్ లో శ్రీ శారదా పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో 10వతరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు కల్పించాలని, పరీక్షలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, మార్చి18(విజయస్వప్నం.నెట్)
నేడు(మంగళవారం)ఓడిచెరువు మండలంలోని తుమ్మలకుంట్లపల్లి పంచాయతీ లో ఉదయం 8గంటలకు పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పర్యటించి ఠ్తాణాకొత్త పల్లి,తాటిమేకలపల్లి,పెద్దసావారిపల్లి,బసప్పగారిపల్లి, ఎగువ చెర్లోపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గోంటారని,కార్యక్రమంలో ఎంపీపీలు,జడ్పీటీసీలు, కన్వీనర్లు,సర్పంచులు,ఎంపీటీసీలు,వైస్ ఎంపీపీలు,వార్డు సభ్యులు,మండల జేసీఎస్ కన్వీనర్లు,సచివాలయ కన్వీనర్లు,మండల బూత్ కమెటీ కన్వీనర్లు,ఏజెంట్లు,సింగల్ విండో ప్రెసిడెంట్లు,ప్రజా ప్రతినిధులు,కార్పోరేషన్ డైరెక్టర్లు,డీలర్లు,అనుబంధ సంఘాల కమిటీ అధ్యక్షులు,గృహ సారథుల,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు,మహిళలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మండల వైకాపా నాయకులు సోమవారం ఓప్రకటనలో పిలుపునిచ్చారు. ఓడిచెరువు మండలంలోని తుమ్మలకుంట్లపల్లి పంచాయతీ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ యరమనేని రెడ్డప్పనాయుడు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సోమవారం గ్రామానికి వెళ్లి రెడ్డప్ప నాయుడును పరామర్శించి,దైర్యం చెప్పి,త్వరగా కొలుకోవాలని అకాంక్షించారని మండల వైకాపా శ్రేణులు,స్థానిక ప్రజాప్రతినిధులు,వైస్సార్సీపీ నాయకులు తెలిపారు.
$$$__________@@@__________$$$
రాజకీయపార్టీ పోస్టర్లు తొలగింపు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి18(విజయస్వప్నం.నెట్)
ఎన్నికల కోడ్ వెలుబడిన నేపథ్యంలో గత రెండు రోజులుగా తహశీల్దార్ ఖాజాబీ ఆధ్వర్యంలో అధికార సిబ్బంది మండల వ్యాప్తంగా రాజకీయపార్టీ నేతల విగ్రహాలకు వస్త్రాలు కప్పి,రాజకీయపార్టీ పోస్టర్లను తొలగించే చర్యలు చేపట్టారు.సోమవారం మండలంలోని గ్రామాల్లో పర్యటించి సచివాలయాలు,ప్రధాన కూడళ్ళు పరిశీలించి,ఎన్నికల నియమాలకు విరుద్ధంగా ఉన్న పోస్టర్లు తొలగించే విధంగా చర్యలు చేపట్టారని తెలిపారు.రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ప్రజలు,రాజకీయ నాయకులు సహకరించాలని అధికారులు కోరారు.ఆర్ఐ నాగేంద్ర,వీఆర్వోలు,వీఆర్ఏలు రామాంజనేయులు, కొండప్ప, విశ్వనాధ్ రెడ్డి,రంగప్ప,రమణ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి మార్చి18(విజయస్వప్నం.నెట్)
మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నేడు(మంగళవారం) అమడగూరు మండలంలో మధ్యాహ్నం 3 గంటలకు పర్యటించి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని,ఈకార్యక్రమంలో మండల తెదేపా,జనసేన,బిజెపి నాయకులు,కార్యకర్తలు, మహిళలు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెదేపా శ్రేణులు పిలుపునిచ్చారు. నల్లమాడలో మాజీమంత్రి పల్లె విసృత్త ప్రచారం శ్రీ సత్యసాయిజిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం రెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని రామాపురం,రెడ్డికుంట తాండ, నేరాలవంకతాండ,బాపనకుంట గ్రామాల్లో సోమవారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.ప్రచారంలో మాజీమంత్రి పల్లె ఇంటింటికి తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి, వేయించి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.మాజీమంత్రి పల్లెకు గ్రామ తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయి, అనంతజిల్లా, మార్చి18(విజయస్వప్నం.నెట్)
అనంత,శ్రీసత్యసాయి ఉమ్మడి జిల్లాల వడ్డెర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల జయరాం,పోలన్న,డి,వెంకటనారాయణ,వడ్డే వెంకట్,వడ్డెర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు రామాంజనేయులు,జాతీయ ఉపాధ్యక్షులు పల్లపు జయచంద్ర,సాధికార సమితి వన్నూరప్ప,జిల్లా యూత్ అధ్యక్షులు ఇ.నాగార్జున,నాయకులు కృష్ణమూర్తి తదితరులు సోమవారం ఉండవల్లిలో తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు స్వగృహంలో ఆయనకు పుష్ప గుచ్చాలు అందించి మర్యాద పూర్వకంగా కలిసారని, ఈసందర్బంగా జిల్లాలో రెండు ఎమ్మెల్యే,ఒక ఎంపీ టికెట్లు కేటాయించాలని కోరగా అధినేత చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి వడ్డెర్లకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు.
$$$__________@@@__________$$$
కారు అదుపు తప్పి బోల్తా....
శ్రీసత్యసాయిజిల్లా ఆమడగూరు మార్చి18(విజయస్వప్నం.నెట్)
నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన ఇరువురు యువకులు సోమవారం బెంగుళూరుకు వెళ్ళ్తున్న సందర్బంలో మండలంలోని చిన్నగానిపల్లి రోడ్డు చినపానపల్లి బస్టాప్ మలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన పొలంలోకి దూసుకెళ్లి బండరాతికి ఢీ కొని బోల్తా పడడంతో కారు పై భాగంగా పూర్తి తినిందని,అయితే కారులో వెనుకవైపుకు ఒరిగి కూర్చోవడంతో ఇరువురు యువకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.ఎస్ఐ మగ్బుల్ బాషా,పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.అయితే బోల్తా పడిన కారును జెసిబితో బయటకు తీసుకొచ్చి రోడ్డుపై ఉంచారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా ఆమడగూరు మార్చి18(విజయస్వప్నం.నెట్)
మండలంలోని లోకోజిపల్లి చెక్ పోస్ట్ వద్ద సోమవారం ఎస్ఇ మగ్బుల్ బాషా,పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా మండలంలోని లోకోజుపల్లికి చెందిన మర్రిమేకుల నారాయణ కర్ణాటక నుండి ఆంధ్రాకు అక్రమంగా మద్యం విక్రయానికి తరలిస్తున్న వ్యక్తిని చెక్ పోస్ట్ వద్ద అరెస్ట్,అతని వద్ద నుండి మద్యం స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
$$$__________@@@__________$$$
పది విద్యార్థులకు ఆర్టీసీ బస్సు మరిచారా....!!!!
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి18(విజయస్వప్నం.నెట్)
పదవ తరగతి పరీక్షలకు సరైన సమయానికి చేరుకొని హాజరైయ్యేందుకు ఉచితంగా ఆర్టీసీ బస్సులు నడిపించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించడం ఉచితంగా పరీక్ష కేంద్రాలకు చేరవేయడం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.అయితే మండలానికి సుదూర మారుమూల తుమ్మలకుంట్లపల్లి గ్రామ పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. తుమ్మలకుంట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దసానివారిపల్లి, ఎగువచెర్లోపల్లి, తాటిమేకలపల్లి,వీరఓబనపల్లి, దోన్ని కోటవారిపల్లి, బండకిందపల్లి నల్లగుట్టపల్లి విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంలో అధికారులు చొరవ తీసుకోలేదా.... అని పలువురు అనుకొంటున్నారు. సోమవారం తొలి రోజు మండల కేంద్రానికి చేరుకోవడానికి విద్యార్థులు నానా అవస్థలు పడినట్లు పలువురు తెలిపారు. ఆర్టీసీ బస్సు వస్తుందని చాలాసేపు నిరీక్షించిన ఎంతసేపటికి రాకపోవడంతో విద్యార్థులు చేసేదేమిలేక అధికంగా బాడుగలతో పరీక్ష కేంద్రాలకు హాజరైనట్టు పలువురు తెలిపారు.ఇప్పటికైనా తుమ్మలకుంట్లపల్లి నుండి నల్లగుట్టపల్లి మీదుగా మండల కేంద్రానికి పరీక్షలు ముగిసే వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు కోరుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి