google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : నేడు శ్రీలక్ష్మీనరసింహస్వామీవారి రధోత్సవం‌ ‌‌

30, మార్చి 2024, శనివారం

నేడు శ్రీలక్ష్మీనరసింహస్వామీవారి రధోత్సవం‌ ‌‌

 నేడు శ్రీలక్ష్మీనరసింహస్వామీవారి రధోత్సవం‌ ‌‌






శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి 29(విజయస్వప్నం.నెట్) 

కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి రథోత్సవం నేడు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి, 'అర్చకులు తెలిపారు.పక్షం రోజులుగా స్వామివారు వివిధ రూపాల్లో ప్రత్యేక వాహనాల్లో తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.లక్షాలాది మంది భక్తులు రధోత్సవానికి విచ్చేసి మొక్కుబడులు సమర్పించి స్వామివారికి దర్శనం చేసుకోనున్నారు.ఆలయ అధికారులు,కార్యానిర్వకులు స్వామివారి రథోత్సవానికి సర్వం సిద్ధం చేశారు.శ్రీవారి బ్రహ్మోత్సవములలో అత్యంత కీలక ఘట్టము ఈ బ్రహ్మరథోత్సవము (తేరు) శనివారం(నేడు)ఉదయం 8 గంటల  నుండి తిరుమాడ వీధుల్లో స్వామివారి రథోత్సవము లక్షలాదిమంది భక్తుల నామస్మరణలతో దర్శనం.

స్వామివారి రథం ప్రాముఖ్యత

  కదిరి తేరు రోజున లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి కర్ణాటక, తమిళనాడు తదితర సుదూర ప్రాంతాల నుండి తరలివస్తారు.స్వామివారి రథం 120 ఏళ్ల క్రితం రూపొందించారు.సుమారు 540 టన్నుల బరువు 37.5 అడుగుల ఎత్తు ఉంటుంది,రథంలోని స్వామివారి పీఠం వెడల్పు 16 అడుగులు ఉండేవిధంగా రూపొందించి,బ్రహ్మరథంపై సుమారు 256 శిల్ప కళాకృతులు అందంగా తీర్చిదిద్దారు.దేశములో వున్న బ్రహ్మరథముల కైల మూడవ అతి పెద్ద తేరు ఖాద్రీశుడు రథం.మొదటిది తంజావూరు జిల్లాలోని తరువరూర్ త్యాగశ్వర్ స్వామి ఆలయనిదిగా,రెండవది  అండాళ్ అమ్మవారు శ్రీవల్లి పుత్తురూ ఈ రెండు రథములు తమిళనాడు రాష్ట్రంలో ఉండడం విశేషం.దేశంలోనే ప్రసిధ్ధికెక్కిన మూడవ అతిపెద్దదయిన శ్రీమధ్ లక్ష్మీనరసింహస్వామివారి రథం కదిరి పట్టణంలో ఉండడం మన అందరికీ గర్వకారణంగా నిలిచింది. ఆనాదిగా ఆనవాయితీ ప్రకారం  కుటాగుళ్ళ, మూర్తిపల్లి, గజ్జెలరెడ్డిపల్లి గ్రామస్తులు  స్వామివారి రథం ముందుకు లాగుతారు.భారీ మోకులు (పెద్ద తాళ్ళు) నియంత్రించేందుకు పెద్ద పెద్ద తెడ్లు వాడుతారు.రథోత్సవంలో భక్తులు ధవణం,మిరియాలు స్వామివారకి సమర్పించడం విశేషం. స్వామివారి రథం తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం తిరిగి యధాస్థానంలో చేరుకోవడం అద్భత దృశ్యంగా చెప్పుకుంటారు.

గజవాహనంపై ఖాద్రీ నరసింహుడు దర్శనం.   సత్యసాయి జిల్లా కదిరి మార్చి 29(విజయస్వప్నం.నెట్) కదిరి పట్టణంలో వెలసిన శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి  దేవస్థానంలో మార్చి 19 నుండి ఏప్రిల్ 2 వరకు పక్షం రోజులపాటు నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 11వరోజు శుక్రవారం శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.ఉదయం యోగశాలలో నిత్యపూజ, హోమం గ్రామోత్సవం నిర్వహించారు.సంధ్యా సమయంలో ఉత్సవ మూర్తులను యాగశాల నుండి అలంకరణ మండపం వరకు తీసుకొచ్చి పూజలు నిర్వహించారు.రాజగోపురం వద్ద వివిధ పుష్పాలతో అలంకరించిన పల్లకిలో గజవాహనంపై(తెల్ల ఏనుగుపై)స్వామివారు ఆసీనులై ఊరేగింపుగా తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.భక్తులు స్వామివారికి కాయకర్పూరం సమర్పించి దర్శనం చేసుకొన్నారు.నేడు 12వరోజు శనివారం శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు రధోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి,ఆలయ అర్చకులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి