google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : ప్రజా గరుడ వాహనంపై ఖాద్రీశుడు - మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ

29, మార్చి 2024, శుక్రవారం

ప్రజా గరుడ వాహనంపై ఖాద్రీశుడు - మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ

ప్రజా గరుడ వాహనంపై ఖాద్రీశుడు


శ్రీసత్యసాయి జిల్లా కదిరి మార్చి 28(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి  దేవస్థానంలో మార్చి 19 నుండి ఏప్రిల్ 2 వరకు పక్షం రోజులపాటు నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 9వరోజు బుధవారం శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు ప్రజా గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.ప్రత్యేక అలంకరణలో పల్లకిలో కొలువై ప్రజా గరుడ వాహనంపై శ్రీలక్ష్మీనరసింహస్వామివారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.ఉదయం యోగశాలలో నిత్య పూజ,హోమం గ్రామోత్సవం నిర్వహించారు.సంధ్యా సమయంలో స్వామివారు ప్రజా గరుడ వాహనంపై సుందర రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.నేడు 11వరోజు శుక్రవారం తెల్ల ఏనుగు వాహనంపై తిరుమాడ వీధుల్లో లక్ష్మీ నరసింహస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.అంతక ముందురోజు బుధవారం సాయంత్రం ఊరేగింపుగా బయలుదేరిన స్వామివారు తిరిగి గురువారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్నారని, సాయంత్రం యాగశాల నుండి ప్రజా గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారని ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి,ఆలయ అర్చకులు తెలిపారు.


మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ 

ఆడబిడ్డలకి నెలకు రూ"1500 అందిస్తాం.

ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు.


శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి 28(విజయస్వప్నం.నెట్)

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ద్వారా లక్ష 50 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెదేపా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా రెండవ రోజు గురువారం శ్రీసత్యసాయిజిల్లా కదిరిలో పర్యటించి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.తెదెపా అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ద్వారా లక్ష 50 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జిల్లాకు సాగునీర్చి, పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని,ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని,ఒక్కో ఆడబిడ్డకి 1500 చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే వారికి పథకం ద్వారా అందిస్తామని హామీలను మరోసారి ప్రజలకి చంద్రబాబు వివరించారు. వైకాపా ప్రభుత్వం అన్నింటా విఫలమైందన్నారు.తెదెపా  హయాంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం విస్మరించి ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వకుండా సియం జగన్ సీమ ప్రజలకు ద్రోహం చేశారని ధ్వజమెత్తారు

 ప్రజాగళం సభకు పోటెత్తిన జనం


తెదేపా జాతీయ అధ్యక్షుడు  నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు గురువారం కదిరిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు జనం పోటెత్తారు.డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.సభకు వచ్చిన జన సందోహాన్ని చూసి చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు.కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ విజయం సాధించడం ఖాయమని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ముస్లిం మైనార్టీల్లో భరోసా నింపేలా కదిరి ఈఫ్తార్ విందులో  చంద్రబాబు పాల్గొని హామీలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన తెలుగు తమ్ముళ్లు ఉత్సాహం నింపింది.శ్రీ సత్య సాయి జిల్లా రాప్తాడులో ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాకు విచ్చేసిన తెదేపా జాతీయ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికిన పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్, మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు,ఎంపీలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు స్వాగతం పలికారు.


శ్రీ సత్యసాయిజిల్లా  ఓడిచెరువు మార్చి29( విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని అల్లాపల్లి పంచాయితీ పగడాలవారి పల్లి,బోయపల్లి, కుక్కంటివారిపల్లి గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిసాన్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైఎస్ జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని వారు ఇంటింటా ప్రచారం చేపట్టారు.ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,వైకాపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి29(విజయస్వప్నం.నెట్)

 మండలంలోని సున్నంపల్లి పంచాయతీ కర్ణాటక సరిహద్దు పెద్దగుట్టపల్లి గ్రామ సమీపంలో చెక్పోస్ట్ వద్ద గురువారం ఎస్ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏఎస్ఐ కిషోర్ రెడ్డి,పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలు  నిర్వహించారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వాహనాలను తనిఖీలు నిర్వహించారు.అక్రమంగా కర్ణాటక మద్యం,నగదు తరలిస్తే చర్యలు తీసుకుంటామని,ప్రతి ఒక్కరూ నిభందనలు పాటించాలని ఆయన పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి