హనుమంతుడి భుజాలపై శ్రీనరసింహుడు దర్శనం
శ్రీసత్యసాయి జిల్లా మార్చి23 కదిరి(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలిసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మినరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఈనెల 19 నుండి ఏప్రిల్ 2 వరకు వైభవంగా నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఐదవరోజు హనుమంతుడి భుజాలపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువై పురవీధుల్లో ఊరేగింపుగా భక్తులకి దర్శనమిచ్చారు.వివిధ పుష్ప్వాల అలంకరణలో సుందర రూపంలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారు శ్రీహనుమంతుడి భుజస్కంధాలపై ఆశీనులై ఊరేగింపుగా పురవీధుల్లో దర్శనమిచ్చారు.రాత్రి వేళల్లో కళాకారులూ,చిన్నారుల ప్రదర్శనల్,సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకొంటున్నాయి.నేడు ఆదివారం బ్రహ్మ గరుడ వాహనంపై శ్రీలక్ష్మీసింహస్వామివారు ఊరేగింపుగా దర్శనమిస్తారని ఆలయ అర్చకులు,కార్యనిర్వాహకులు అర్చకులు తెలిపారు.
$$$__________@@@__________$$$
కదిరి డిపోలో శనివారం ఏపీఎస్పిటిడి జై భీమ్ అసోసియేషన్ కమిటీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్బంగా కదిరి డిపో మేనేజర్ మైనుద్దీన్ కిజై భీమ్ అసోసియేషన్ సభ్యులు పూలమాలలు వేసి సన్మానించి పరిచయ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జై భీమ్ రాష్ట్ర కమిటీ చీప్ అడ్వైజర్ బాబన్న,రీజనల్ నాయకులు ముత్యాలు, కె.వి రమణ,ఆర్జి నాయక్,పుట్టపర్తి డిపో ఆదెన్న,అంజి నాయక్,గురుస్వామి నాయక్,కదిరి డిపో కమిటీ నాయకులు గోపాల్ నాయక్, ఎస్వీ నర్సు, గంగాధర్, గంగరాజు, గోవిందప్ప, నారాయణస్వామి తదితరులు పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
భగత్ సింగ్ కు ఘన నివాళులు
శ్రీసత్యసాయిజిల్లా,కదిరి, ఆమడగూరు/కడప 23(విజయస్వప్నం.నెట్)
బ్రిటిష్ పరాయి పాలన నుంచి భారతదేశంలో స్వేచ్ఛ,స్వాతంత్య్రం కోసం 23 ఏళ్లకి చిరుప్రాయంలోనే తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన భగత్ సింగ్ నేటి విద్యార్ధి, యువజనులకు ఆదర్శప్రాయమని రాయలసీమ విద్యార్ధి,యువజన సంఘం (ఆర్ఎస్ వైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కన్నెలూరు శంకర్ తెలిపారు. భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్బంగా శనివారం కడప పట్టణంలో ఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కన్నెలూరు శంకర్ మాట్లాడుతూ.... బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీ పీడనల నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో స్వేచ్ఛాకాంక్షని రగిల్చి,స్వరాజ్యసాధన పోరాటంలో చిరు ప్రాయంలోనే తన ప్రాణాలను దేశ స్వాతంత్య్రం కోసం అర్పించారని ఉరితాళ్ళను పూలమాలగా స్వీకరించారన్నారు. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని నేటి విద్యార్ధి, యువత ఆదర్శంగా తీసుకోవాలని వారి ఆశయ సాధనకు కృషి చెయ్యాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ వైఎఫ్ జిల్లా కార్యదర్శి ఓరుగంటి నాగేంద్రబాబు,నగర నాయకులు తాహీర్, మోక్ష, సాయి తదితరులు పాల్గోన్నారు. భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తాం...
శ్రీసత్యసాయిజిల్లా(కదిరి)
రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ ఎస్ యు) ఆధ్వర్యంలో శనివారం కదిరి పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో భగత్ సింగ్ 93 వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సగినాల చరణ్ మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయ సాధనలో విద్యార్థులు యువకులు ముందుకు సాగాలని అయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ యూ నాయకులు తరుణ్,హేమంత్,నిఖిల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఆమడగూరు ఆటోస్టాండ్ ఆవరణలో.... మండల కేంద్రంలోని భగత్ సింగ్ ఆటో స్టాండ్ ఆవరణంలో శనివారం భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్బంగా ఆటో డ్రైవర్లు సమక్షంలో యూనియన్ నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.యూనియన్ నాయకులు మాట్లాడుతూ... .స్వరాజ సాధన కోసం అతి చిన్న వయసులో భగత్ సింగ్ తన ప్రాణాలను దేశ స్వాతంత్రం కోసం అర్పించారని,ప్రతి ఒక్కరు ఆయన ఆశయాల బాటలో నడవాలన్నారు. కుళ్లాయప్ప, ఆటో యూనియన్ అధ్యక్షులు సుధాకర్, ఉపాధ్యక్షులు రామాంజనేయులు సభ్యులు గంగులప్ప, మురళి, మూర్తి కేశవస్వామీ, ఆంజనేయులు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
మృతుల కుటుంబాలను పరామర్శ
మండల పరిధిలోని చింతమానుపల్లి పంచాయతీ మల్లెలవాండ్లపల్లి గ్రామానికి చెందిన వడ్డే వెంకటేష్ శనివారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు కిసాన్ రెడ్డి గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతదేహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారని వైకాపా శ్రేణులు తెలిపారు.మండలంలోని ఎం.కొత్తపల్లికి చెందిన గుర్రం రామిరెడ్డి శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందగా ఆ కుటుంబసభ్యులను ఎమ్మెల్యే దుద్దుకుంట తనయుడు దుద్దుకుంట కిసాన్ రెడ్డి మృతదేహనికి నివాళులు అర్పించి,కుటుంబసభ్యులను ఓదార్చి, వైకాపా ఎల్లవేళలా అండగా ఉంటుందని దైర్యం చెప్పారని తెలిపారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు/ఆమడగూరు మార్చి23(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలంలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన పెద్దగుట్టపల్లి గ్రామ పరిధిలోని సున్నంపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును శనివారం రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో భాగ్యరేఖ పరిశీలించి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల దృష్యా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేపట్టాలని పోలీసులకు ఆమె సూచించారు.ఎస్ఐ వంశీకృష్ణ,తహసిల్దార్ ఖాజాబీ,ఆర్ఐ నాగేంద్ర,ఏఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. ఆమడగూరులో.... మండల పరిధిలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు బిల్లూరు క్రాస్,వెంకటనారాయణపల్లి క్రాస్ వద్ద ఏర్పాటుచేసిన పోస్టులను శనివారం పుట్టపర్తి ఆర్డిఓ, రిటర్నింగ్ అధికారి భాగ్యరేఖ పరిశీలించారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఏయే గ్రామాలు ఉన్నాయని, అలాంటి గ్రామాలపై ఎలాంటి నిఘా ఉంచాలనే అంశాలపై ఎస్ఐ మగ్బుల్ బాషాకు ఆర్డీఓ భాగ్యరేఖ సూచనలిచ్చారు.అనంతరం రెవిన్యూ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడుతూ.... ఎన్నికల నియమావళి మేరకు బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీ పోస్టర్లు,ప్రజాప్రతినిధుల ఫోటోలు లాంటివి తొలగించాలని,ప్రచార వాహనాలకు అనుమతులు తదితర అంశాలపై సమీక్షించారు. తహసీల్దార్ రామనాథరెడ్డి,ఎంపిడిఓ అశోక్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ వెంకటరెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి23( విజయ స్వప్నం. నెట్)
నేడు ఆదివారం మండలంలోని సున్నంపల్లి, దాదిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పర్యటిస్తారని తెదేపా నాయకులు తెలిపారు. మాజీమంత్రి పల్లె సమక్షంలో వైకాపా నుండి పలు కుటుంబాలకు చెందిన నాయకులు,కార్యకర్తలు తెదేపా లో చేరనున్నట్లు శనివారం తెదేపా శ్రేణులు తెలిపారు.మండలంలోని నాయకులు,కార్యకర్తలు ఈకార్యక్రమంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి23(విజయస్వప్నం.నెట్)
మండలంలోని పగడాలవారిపల్లిలో పోషణ పక్వాడా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సూపెర్వైజర్ విజయకుమారి ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.... పౌషికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, గర్భిణీలు, బాలింతలు పౌషికాహారం తీసుకోవాలని, ప్రదానంగా పాలు,కోడిగుడ్డు, ఆకుకూరలు వల్ల ప్రయోజనాలను వివరించారు.అంగన్వాడీ భోధకులు ప్రమీల, షమీమ్, సుకన్య, స్వర్ణ,పార్వతి, సునంద, శ్యామల, మంజుల, వెంకటరమణమ్మ,ఇందిర ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి