పుట్టపర్తి అసెంబ్లీ అభ్యర్థిగా పల్లె సింధూర రెడ్డి
మండలాల్లో తెదేపా శ్రేణులు సంబరాలు
పుట్టపర్తి నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా పల్లె సింధూర రెడ్డి పేరు ఖరారు చేయగా ఓడిచెరువు మండల కేంద్రంలో తెదేపా శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు.గురువారం తెదేపా అధిష్టానం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూర రెడ్డిని పుట్టపర్తి అభ్యర్థిగా ప్రకటించిన సందర్బంగా మండల కేంద్రంలో అంబెడ్కర్ కూడలిలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకొన్నారు.ఎం.బి క్రాస్,కొండకమర్ల ప్రధాన కొడలల్లో తెలుగుతమ్ముళ్లు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకొని, పుట్టపర్తి తెదేపా అభ్యర్థిగా సింధూరా రెడ్డిని ప్రకటించిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు,ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుకు తెదేపా నాయకులు,కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ జయచంద్ర,నిజాంవలి, జాకీర్ మహ్మద్,బడిశం రామాంజనేయులు, మీసేవ సుధాకర్, సౌదీ నాగరాజు, చికెన్ షాను,అంజన్ రెడ్డి, ఆరీఫ్, అబ్బులు, శ్రీనివాసులు,ఆంజనేయులు,గంగాద్రి,ఇర్షాద్,సి.కిష్టప్ప,మస్తానమ్మ,అఖిల,జ్యోతి,పాలెమ్మ తదితరులు పాల్గొన్నారు. నల్లమాడలో తెదేపాశ్రేణులు సంబరాలు నల్లమాడ ప్రధాన కూడలిలో తెదేపా నాయకులు,కార్యకర్తలు గురువారం పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లె సింధూర రెడ్డిని ప్రకటించిన సందర్బంగా బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకొన్నారు.సత్యమ్మ ఆలయంలో టెంకాయాలు కొట్టి పూజలు నిర్వహించి అక్కడ బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి తెదేపా శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. రెండవ జాబితాలో అధిష్టానం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూర రెడ్డిని పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయడంపై చంద్రబాబు,లోకేష్ బాబులకు తెదేపా నాయకులు,కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ మైలే శంకర,బుట్టి నాగభూషణనాయుడు,బ్రహ్మనందరెడ్డి,ప్రేమనాథరెడ్డి,డ్రైవర్ అంజి,పల్లపు శ్రీరాములు,సూర్యనారాయణ, రాజారెడ్డి, సురేంద్రరెడ్డి,పుట్ల రవీంద్ర, సోముబాబు, పరకాల ప్రకాష్, మంజునాథరెడ్డి, నర్సింహులు, అమరనాథరెడ్డి, చంద్రశేఖర్, గంగాధర్,పట్నం బయ్యప్ప, రవీంద్రనాయక్, ఆటో బాష,రవికుమార్,పల్లపు సాయి తదితరులు పాల్గొన్నారు.
ఆమడగూరులో అంబరాన్ని అంటిన సంబరాలు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలును పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లె సింధూరరెడ్డిని గురువారం తెదేపా అధిష్టానం ప్రకటించడంతో నాయకులు, కార్యకర్తలు స్థానిక బస్టాండ్ ప్రాంతంలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచి పెట్టి భారీగా సంబరాలు చేసుకొన్నారు. ఈసందర్బంగా తెలుగుతమ్ముళ్లు తెదేపా అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రాబోయే ఎన్నికలలో పల్లె సింధూరరెడ్డిని ఎమ్మెల్యేగా అత్యధి మెజారిటీతో గెలిపించుకొని తీరుతామని తెలుగుతమ్ముళ్లు ధీమా వ్యక్తం చేశారు.మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ శ్రీనివాసులురెడ్డి, ఐటిడిపి టైలర్ రామాంజనేయులు, మీసం అంజి, ఆదినారాయణరెడ్డి, మాజీ ఎంపిపి రామచంద్ర,ప్రసాద్, రామాంజనేయులు, శ్రీనివాసులు, ఫొటో స్టూడియో మూర్తి, రమణ,వెంకటరెడ్డి, ఆనంద్, నందిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
**__________$$__________**
అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
కర్ణాటక నుండి అక్రమంగా ఆంధ్రాకు మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మగ్బుల్ బాష తెలిపారు.అయన ఈసందర్బంగా మాట్లాడుతూ.... గురువారం ఉదయం కర్ణాటక రాష్టం నుండి ఆంధ్రాకు అక్రమంగా కర్ణాటక మద్యం తలిస్తున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో సంగీతంపల్లి గ్రామ శివార్లో పోలీసులతో కలిసి వాహనాలు తనిఖీలు చేపట్టగా మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన కే. రాజా అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని, అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కదిరి కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్ఐ తెలిపారు.
**__________$$__________**
నేడు మండలాల్లో ఎమ్మెల్యే దుద్దుకుంట పర్యటన
నేడు (శుక్రవారం)పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పర్యటన షెడ్యూల్ మేరకు ఉదయం 8గంటలకు అమడగూరు మండలంలోని శీతిరెడ్డిపల్లి వద్ద నిర్మించిన పిఏసిఎస్ గోడౌన్ ను ప్రారంభిస్తారని, 9గంటలకు ఓడిచెరువు మండలంలోని మామిళ్ళకుంట్లపల్లిలో నిర్మించిన పిఏసిఎస్ గోడౌన్ ప్రారంభించి అనంతరం కొత్తచెరువు మండలంలోని మైలసముద్రం రైతు భరోషా కేంద్రం,వెల్ నెస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారని, 3:30గంటలకు కొత్తచెరువు మండలం తలమర్ల లో రైతు సోదరులకు ప్రభుత్వం నుండి సబ్సిడితో మంజూరు చేసిన వ్యవసాయ పరికరాలను పంపిణీ చేస్తారని,తదుపరి సాయంత్రం 4:30గంటలకు పుట్టపర్తి రూరల్ మండలంలోని పెడపల్లి-2 సచివాలయం,వెల్ నెస్ కేంద్రాన్ని ప్రారంభించి ప్రసంగిస్తారని గురువారం ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శులు ఓప్రకటనలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఆధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
**__________$$__________**
భాధిత కుటుంబానికి నాగబాబు 5లక్షల చెక్కు అందజేత
శ్రీసత్యసాయిజిల్లా,తనకల్లు మార్చి14(విజయస్వప్నం.నెట్)
మండలంలోని గాందోడివారిపల్లికి చెందిన జనసేన పార్టీ క్రియశీలక కార్యకర్త జి.శంకర గతేడాది బెంగుళూరు నుండి ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం మండల జనసేన నాయకులు రాష్ట్ర జనసేన ప్రధాన కార్యాలయం నేతల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన జనసేన పిఏసి సభ్యులు కొనేదల నాగబాబు గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో భాదిత కుటుంబానికి 5లక్షల చెక్కు అందజేశారని మండల జనసేన శ్రేణులు తెలిపారు.ఈకార్యక్రమంలో కదిరి జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవప్రసాద్, తనకుల్లు మండల కన్వీనర్ కేవి రమణ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్,జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు లక్ష్మణ్ కుటాల తదితరులు పాల్గొన్నారు.
**__________$$__________**
కదిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కందికుంట యశోదదేవి
శ్రీసత్యసాయిజిల్లా,కదిరి,మార్చి14(విజయస్వప్నం.నెట్)
తెదేపా రెండవ జాబితాలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సతీమణి కందికుంట యశోదదేవిని కదిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం అధిష్టానం ప్రకటించిన సందర్బంగా తెదేపా నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ప్రధాన కూడలల్లో జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అంటూ నినాదాలు చేస్తూ.... బైక్ ర్యాలీ చేపట్టి కందికుంట స్వగృహం వద్ద హార్షం వ్యక్తం చేస్తూ.... కందికుంట నాయకత్వం వర్ధిల్లాలి అంటూ మిఠాయిలు పంచి పెట్టి తెలుగుతమ్ముళ్లు సంబరాలు చేసుకొన్నారు.కదిరి అసెంబ్లీ తెదేపా అభ్యర్థిపై నెలకొన్న సందేహాలకు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట యశోదదేవి పేరు అధిష్టానం ఖరారు చేయడంతో ఉత్కంఠకు తెర పడింది.
**__________$$__________**
శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి14(విజయస్వప్నం.నెట్)
కదిరి మండలంలోని చెలమకుంట్లపల్లి గ్రామంలో గురువారం కదిరి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మగ్బుల్ తోపాటు పూల శ్రీనివాస రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు.ఉదయం చెలమకుంట్లపల్లి పంచాయితీ పందలకుంట గ్రామానికి చేరుకొని ఆంజనేయస్వామి దేవాలయంలో పూజ కార్యక్రమంలొ అయన పాల్గొన్నారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ తోపాటు వైసీపీ రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాస రెడ్డి ఎన్నికల ప్రచారంలొ పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ అన్నను మరోసారి సీఎం చేసుకుందాం అని ప్రతి గడప గడప అభ్యర్థించారు.ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ కు గ్రామ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు వైసిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
**__________$$__________**
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు మార్చి15(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రములో స్థానిక(డిఆర్డిఏ,వైకేపి) పల్లవి మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండల పరిధిలోని 40 గ్రామ సంఘాల ప్రతినిధులు,గ్రామ సంఘాల సహాయకులు హాజరైయ్యారు.ముందుగా ఆటలు,పాటల పోటీలు నిర్వహించి, అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యతపై వ్యక్తులు ప్రసంగించారు. సమాజంలో మహిళలను గౌరవించేలా చూడాలని,అన్ని రంగాలలో మరింత రాణించే విధంగా ప్రతి మహిళా చైతన్యవంతురాలు కావాలని,సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను విరివిగా ఏర్పాటు చేసుకొని మెరుగైన జీవన విధానాన్ని పొందేలా అందరూ కృషి చేయాలన్నారు. ఎంపీపీ పర్వీన్ షామీర్ మాట్లాడుతూ ముఖ్యంగా ఆడపిల్లలను తప్పనిసరిగా చదివించాలని,స్వతహాగా అలోచించే విధంగా ప్రోత్సహించాలని,మహిళలకు ప్రత్యేకించి రూపొందించబడిన ప్రత్యేక చట్టాలపై,హెల్ప్ డెస్క్ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలని, అవరోధాలను అధికమించి ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు చట్టాలు ఉపయోగపడతాయని వాటిపైన పూర్తిస్థాయిలో ప్రతి మహిళ తెలుసుకోవాలని ఆమె సూచించారు. ఏడీసీసీ బ్యాంకు మేనేజరు అర్చన మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు.తప్పనిసరిగా ప్రతి మహిళ జీవనోపాదులు ఏర్పాటు చేసుకొని మెరుగైన ఆదాయభివృద్ధి సాధికారత దిశగా ముందుకెళ్లాలన్నారు.ఈకార్యక్రమంలో హాజరైన మహిళా సంఘ సభ్యులు ఒకరికొకరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.సమావేశం తర్వాత వివిధ ఆటల పాటలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేసి, ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా అతిథులకు దుశాలవులు కప్పి పుష్పగుచుములతో, పసుపు కుంకుమలతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి లక్ష్మీదేవి, ఐసీడీఎస్ సూపర్వైజర్ జయకుమారి,
శ్రీసత్యసాయిజిల్లా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు ఈశ్వరమ్మ,ఏపీఎం రమణప్ప,సీసీలు సీసీలు వెంకటరమణ, వేణుగోపాలు, హేమభూషణ, శ్రీనివాసులు, చంద్రారెడ్డి, మండల సమైక్య అకౌంటెంట్, గ్రామ సంఘాల ప్రతినిధులు,గ్రామ సంఘం ఓబీ సభ్యులు, మండల సమైక్య సిబ్బంది పాల్గొన్నారు.
**__________$$__________**
ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత: డిఐజి అమ్మిరెడ్డి
అనంతపురం మార్చి15(విజయస్వప్నం.నెట్)
నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పోస్టర్లను శుక్రవారం అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి విడుదల చేసి మాట్లాడుతూ కరువు జిల్లాలో చెట్లు,అడవులురక్షించడంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్ హెచ్ ఆర్ సి ఎన్ డి టి సంస్థ ఎంతో కృషి చేస్తుందని,అలాగే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని,ఈసంస్థ వృక్షాల పరిరక్షణ కోసం సేవలు అందిస్తున్న సంస్థ సభ్యులకు తమవంతు ఎలాంటి సహకారమైన అందిస్తామన్నారు.ఎటువంటి పారితోషకం, ప్రభుత్వనిధులు తీసుకోకుండా. ఎన్నోలక్షల చెట్లను,జిల్లావ్యాప్తంగా రక్షించడమే కాకుండా నాటిన మొక్కలను పెంచిపోషిస్తూ.... పాఠశాల విద్యార్థులకు నిరంతరం పర్యావరణ విశిష్టతపై అవగాహన కలిగిస్తున్న సంస్థ సభ్యులకు అయన అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ హరిలాల్ నాయక్, సౌత్ ఇండియన్ కౌన్సిల్ మెంబర్,అనంతపురం జిల్లా అధ్యక్షుడు రంజిత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
**__________$$__________**
ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షల మాస్ కాపీలను అరికట్టాలి: ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ
శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి 15(విజయస్వప్నం. నెట్)
ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షల్లో మాస్ కాఫీయింగ్ అరికట్టాలని ఏఐఎస్ఎఫ్,ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తూ శుక్రవారం తహసీల్దార్ పుల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబ్జాన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శేషం మహేంద్రలు మాట్లాడుతూ జిల్లాలో ఓపెన్ స్కూల్లో విద్యార్థులను పాస్ చేపిస్తామని ఒక విద్యార్థి నుంచి 12 వేల నుంచి 15 వేల వరకు వసూలు చేస్తున్నారని, అదేవిధంగా ఈనెల 18 నుంచి జరుగబోయే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలలో మాస్ కాఫీయింగ్ ని అరికట్టాలని, ఒక్కొక్క విద్యార్థి నుండి 1000 రూపాయలు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామంటూ విద్యార్థులకు ఫోన్లు ద్వారా ఒత్తిళ్లు చేస్తున్నారని, కదిరి పట్టణంలో ఈనెల 18వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి,మాస్ కాపీలను అరికట్టాలని, లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద బైఠాయించి మాస్ కాపీలను అందజేసే కోఆర్డినేటర్స్ ని తరిమి కొడతామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో తరుణ్,తేజ్, జస్వంత్, మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
**__________$$__________**
జానపద వృత్తి సంఘాల కళాకారులకు అవగాహనా
శ్రీసత్యసాయిజిల్లా మార్చి15(విజయస్వప్నం.నెట్)
జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శ్రీసత్యసాయిజిల్లాలోని రొద్దం,కొత్తచెరువు, సోమందేపల్లి, పెనుగొండ నాలుగు మండలాల సంఘాల సభ్యులకు శుక్రవారం రొద్దం మండల కేంద్రంలో శ్రీ సాయిబాబా దేవస్థానం ఆవరణలో పెనుగొండ డివిజన్ అధ్యక్షులు నాగార్జున ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీసత్యసాయి జిల్లా జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షులు,రాష్ట్ర కమిటీ నాయకులు ఎం.నారాయణ పాల్గొని మాట్లాడుతూ.... తిరుమల తిరుపతి దేవస్థానంలో హరినామ సంకీర్తన భజనలు, తిరుమల సన్నిధిలో అఖండములో జరిగే కార్యక్రమాలు,హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో కార్యక్రమాలు, ప్రభుత్వాలు, గుర్తింపు కార్డులు మంజూరు,తిరుపతి కేంద్రం నుండి సంఘం కార్డులు, సంఘా సభ్యత్వాలు, ఇన్సూరెన్స్ తదితర అంశాలపైన సమీక్షించారు. నాలుగు మండలాల సంఘాల ప్రతినిధులు, గురువులు, సభ్యులు పాల్గొన్నారు.
**__________$$__________**
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో విజయదుందుభి మ్రోగించిన
శ్రీ జ్ఞానసాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒకే పాఠశాలలో 10మంది విద్యార్థుల ఎంపికపై హర్షం
ఓడిచెరువు మండల కేంద్రంలోని శ్రీ జ్ఞాన సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10మంది విద్యార్థులు 14వతేది (నిన్న)గురువారం ప్రకటించిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో ప్రతిభతో విజయందుందుభి మోగించి పాఠశాల గుర్తింపు పొందుతోంది.ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అకాడమిక్ సిలబస్ భోదనతో పాటు, సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన సిలబస్ ను కూడా ప్రత్యేక క్లాసులు నిర్వహించి శిక్షణ ఇవ్వడం జరిగిందని,శిక్షణ తీసుకున్న 12 మంది విద్యార్థులలో పదిమంది విద్యార్థులు అర్హత సాధించారని కరస్పాండెంట్ క్రిష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఓడిచెరువు మండల కేంద్రంలో శుక్రవారం ప్రధాన రహదారిపై విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.అర్హత సాధించిన విద్యార్థులను స్కూల్ కరస్పాండెంట్ క్రిష్ణమోహన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం,తల్లిదండ్రులు,పుర ప్రముఖులు అభినందించారు.అనంతరం పాఠశాలలో విద్యార్థులకు మిఠాయిలు పంచి పెట్టి సంబరాలు చేసుకొన్నారు. పాఠశాల స్థాపించిన అనతి కాలంలో నవోదయ,సైనిక్ పాఠశాలలో ప్రవేశలకు విద్యార్థుల ఎంపిక కావడం విశేషంగా ఉందని,2024-25 సంవత్సరానికి శ్రీ జ్ఞానసాయి విద్యానికేతన్ పాఠశాల నుండి 10మంది విద్యార్థులు(ఓకే పాఠశాల నుండి) ఎంపిక రికార్డ్ గా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు.
**__________$$__________**
నూతన గోడౌన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
శ్రీసత్యసాయిజిల్లా ఆమడగూరు/ఓడిచెరువు (విజయస్వప్నం.నెట్)
(శుక్రవారం)పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం అమడగూరు మండలంలోని శీతిరెడ్డిపల్లి వద్ద నిర్మించిన పిఏసిఎస్ గోడౌన్,ఓడిచెరువు మండలంలోని మామిళ్ళకుంట్లపల్లిలో నిర్మించిన పిఏసిఎస్ గోడౌను ప్రారంభించి మాట్లాడారు.రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న కృషి చేస్తున్నారని,రైతులకు అందుబాటులో రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయ సామాగ్రి,వివిధ సంక్షేమ ఫలాలు అందిస్తు రైతుల గుండెల్లో జగనన్న చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.ముందుగా ఎమ్మెల్యే దుద్దుకుంటతోపాటు వైకాపా శ్రేణులు గోడౌన్ల వద్ద పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆమడగూరు, ఓడిచెరువు మండలాల వైకాపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
**__________$$__________**
పల్లె సింధూరకు ఘనంగా స్వాగతం
భారీ ర్యాలీలో తెలుగుతమ్ముళ్లు
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మార్చి15(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సిందూరరెడ్డికి తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి,ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డికి తెదేపా శ్రేణులు శుక్రవారం గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు.కేశాపురం పెద్దమ్మగుడిలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేపట్టిన పల్లె సిందూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె కుటుంబ సభ్యులకు అపూర్వ స్వాగతం పలికారు.కొత్త చెరువు మండల సరిహద్దు కొడవగానిపల్లి సమీపంలోని సత్యసాయి వాటర్ ట్యాంక్ వద్ద భారీ కాన్వాయ్ తో వచ్చిన పల్లె సింధూర రెడ్డి కి పూలవర్షం కురిపిస్తూ పెద్ద క్రేన్ ద్వారా గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. అంతకు ముందు అనంతపురంలో పల్లె సిందూరరెడ్డి మామ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కి,తల్లిదండ్రులు శంకర్ రెడ్డి,సౌభాగ్య రాణిలతో ఆశీర్వాదం తీసుకొని, ప్రసన్నాయనపల్లిలో పల్లె వ్యవసాయ క్షేత్రంలో అత్త స్వర్గీయ పల్లె ఉమాఘాట్ వద్ద నివాళులు అర్పించారు. పుట్టపర్తి,కొత్త చెరువు మండలం కొడవగానిపల్లి సరిహద్దు నుంచి కొడవగానిపల్లి,మైలే పల్లి,కొత్త చెరువు వరకు సాగింది.కొత్త చెరువు సర్కిల్ లో అంబేద్కర్ విగ్రహానికి వాల్మీకి విగ్రహానికి,ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం బుక్క పట్నం,జానకం పల్లి,కర్ణాటక నాగేపల్లి మీదుగా చిత్రావతి పుట్టపర్తి గణేష్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ సాగింది.ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ మా కుటుంబంపై ఎంతో నమ్మకం ఉంచి తన కోడలు పల్లె సింధూర కు టికెట్ ఇచ్చినందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేసి చంద్రబాబుకు పుట్టపర్తి టీడీపీ విజయాన్ని కానుకగా ఇస్తామని తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి