29, ఫిబ్రవరి 2024, గురువారం

విద్యార్థుల వైజ్ఞానిక అద్భుత ప్రతిభ ప్రదర్శనలు ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్ - మార్చి మొదటి వారం నుండి ఒంటిపూట ఒడులు నిర్వహించాలి: డిటిఎఫ్ - అనారోగ్యంతో వీఆర్వో శివప్ప మృతి

అనారోగ్యంతో వీఆర్వో శివప్ప మృతి

     శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఫిబ్రవరి28(విజయస్వప్నం.నెట్)

vro shivappaఓడిచెరువు పంచాయతీ గ్రామ సచివాలయం-2 వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న తలారి శివప్ప గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం అర్ధరాత్రి స్వగృహం తంగేడుకుంట గ్రామంలో మృతి చెందినట్లు రెవిన్యూ సిబ్బంది తెలిపారు. తహశీల్దార్ ఖాజాబీ,రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ జాకిర్,ఆర్ఐ నాగేంద్ర,వీఆర్వోలు గ్రామానికి వెళ్లి తలారి శివప్ప మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీఆర్వో తలారి శివప్ప మృతి విషయం తెలుసుకొన్న మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తంగేడుకుంట గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పి ఓదార్చారని తెదేపా శ్రేణులు తెలిపారు

______________________________

విద్యార్థులకు బహుమతులు ప్రదానం 

శ్రీసత్యసాయిజిల్లా, తలుపుల, ఫిబ్రవరి28(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో బుధవారం జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆహార భద్రత సాధన, విజ్ఞాన శాస్త్రవేత్తల కృషి అంశంపై వ్యాసరచన పోటీలు 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించి, ప్రతిభ కనబరచిన విద్యార్థులకు  బహుమతులు ప్రదానం చేసినట్లు ఉపాధ్యాయ బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీఎస్టీసీ, ఏపి కాస్ట్, డీఎస్టీ శ్రీ సత్య సాయి జిల్లా సైన్స్ బృందం  సహకార పర్యవేక్షణలో నిర్వహించరన్నారు.పాఠశాల విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు పి.భాస్కర్, తలమర్ల ప్రభాకర్, డి.దివాకర్  ఉపాధ్యాయ బృందం పాల్గోని కార్యక్రమాన్ని నిర్వహించరన్నారు.

______________________________

విద్యార్థుల వైజ్ఞానిక అద్భుత ప్రతిభ ప్రదర్శనలు

ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఫిబ్రవరి28(విజయస్వప్నం.నెట్)

అంతర్జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా బుధవారం మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ లో విద్యార్థుల ప్రయోగాల ప్రదర్శనలు ఆకట్టుకోన్నాయి. స్థానిక విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సైన్స్ ప్రదర్శన ఎంఈఓ-1 రమణ తిలకించారు. ఈ సందర్భంగా ఐఐటి ఏడవ తరగతి చదువుతున్న షేక్.సుహన నీటి కాలుష్యం పైన ప్రయోగించిన ప్రదర్శన ఆకట్టుకుంది. నీటి కాలుష్యంపై నిర్వహించిన ప్రదర్శన చూసిన  ఎంఈఓ విద్యార్థిని షేక్ సుహనను అభినందించారు. వశిష్ఠ పాఠశాలలో విద్యార్థుల తయారుచేసిన ప్రాజెక్టులు విద్యాధికారులు తిలకించారు. వేమారెడ్డిపల్లి సమీపంలో రెయిన్బో పాఠశాలలో సైన్స్ డే సందర్బంగా విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు కౌంటర్లు ఏర్పాటు చేసిన ప్రయోగాలు ప్రదర్శించారు. శ్రీ విజ్ఞాన్ సీబిఎస్ పాఠశాలలో ప్రాజెక్టులు ప్రదర్శించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏంఈఓ కరస్పాండెంట్ సాహేరాబాను, మార్గానుగుంట్ల ఫక్రుద్దీన్ హెడ్మాస్టర్ శ్రీనివాసులు, ఏవో మల్లికార్జున్రెడ్డి, ఉపాధ్యాయులు రఘు,బాలాజీ, రెయిన్బో,వశిష్ట, మస్తాన్ సిబిఎస్ పాఠశాలల కరస్పాండెంట్లు జయసింహారెడ్డి, మస్తాన్, పిట్ట శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

______________________________

మార్చి మొదటి వారం నుండి ఒంటిపూట ఒడులు నిర్వహించాలి: డిటిఎఫ్

శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి28(విజయస్వప్నం. నెట్)

రాష్ట్రంలో పాఠశాలలకు ప్రతి ఏడాది మార్చి15 నుండి ఒంటి పూట బడులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అయితే ఈయేడు  ముందుగానే వేసవికాలం వచ్చినట్లుందని, గతంలో కంటే ఇప్పటికే ఎండలు త్రీవంగా ఉన్నాయని, విద్యార్థులు ఎండ వేడిమితో ఇబ్బందులు పడే  పరిస్థితి ఉన్నందున మార్చి మొదటి వారం నుండి ఒంటిపూట ఒడులను  నిర్వహణకు ఆదేశాలు జారీ చేయాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు (ఓడిచెరువు మండలానికి చెందిన ఉపాధ్యాయ సంఘం నాయకులు) శ్రీసత్యసాయి జిల్లా డిటిఎఫ్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గౌస్ లాజామ్, మారుతి, సబ్ కమిటీ సభ్యులు షర్ఫోద్దిన్,సురేష్ బాబు,రామకృష్ణ,వెంకట చలమయ్య,నాగరాజు బుధవారం విలేకరులకు ప్రకటనలో తెలిపారు.

______________________________

తలుపుల విద్యార్థులకు జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి

శ్రీసత్యసాయిజిల్లా,తలుపుల ఫిబ్రవరి28(విజయస్వప్నం.నెట్ )

ఈఎండీపీ సైన్స్ ఎక్సపో -2024 జిల్లాస్థాయి కార్యక్రమాన్ని  శ్రీసత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి బుధవారం  కొత్తచెరువు బాలుర పాఠశాలలో ప్రారంభించారు.ఈకార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాల విద్యార్థులు వారి వారి ప్రాజెక్టులను ప్రదర్శించగా, జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రాజెక్టులు ఎంపికైన వాటిలో తలుపుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన హాండ్స్ ఫ్రీ యూరినల్స్ అనే ప్రాజెక్టు జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి బహుమతిని గెలుచుకొన్నారని,త్వరలో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలలో విద్యార్థులు పాల్గొననున్నారని ఉపాధ్యాయులు తెలిపారు.

______________________________

శ్రీసత్యసాయిజిల్లా(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండలంలోని మిట్టపల్లి, మామ్మిళ్లకుంట్లపల్లి గ్రామాల్లో చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను బుధవారం డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయప్రసాద్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.... వేసవికాలం సమీపిస్తుండడంతో ఉపాధి పనులు చేపట్టే ప్రదేశాల్లో నీడ,నీరు,ప్రధమ చికిత్స  తదితర సౌకర్యాలు కల్పించాలని, వ్యవసాయ తక్కువ ఉన్నందున కూలీలకు పనులు కల్పించి, వలసలు నివారించాలని ఉపాధి సిబ్బందికి సూచించారని ఏపిడి శ్రీనివాసులురెడ్డి,అసిస్టెంట్ ఏపిడి ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఏపీఓ సుధాకర్, సాంకేతిక సహాయకులు రాజారెడ్డి, ఆంజనేయులు, హనుమంతరెడ్డి, రాజేంద్ర, చంద్రారెడ్డి, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

______________________________

కర్రె రవిశంకర్

కర్రె రవిశంకర్

శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి28, నల్లచెరువు (విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయి జిల్లా ఆర్య వైశ్య సంఘం పొలిటికల్ వైస్ చైర్మన్ గా నల్లచెరువు మండలానికి చెందిన కర్రె రవిశంకర్ ను బుధవారం ఎంపికపై వాసవి ఆర్య వైశ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.జిల్లా ఆర్య వైశ్య సంఘం పొలిటికల్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేసిన రాష్ట్ర,అనంత, శ్రీసత్యసాయి ఉమ్మడి జిల్లాల సంఘం ప్రతినిధులకు వైస్ చైర్మన్ కర్రె రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే,ఎంపీ సీట్లు కేటాయించి, అలాగే స్థానిక సంస్థల్లో అన్ని రంగాలలో ఆర్య వైశ్యలకు ప్రాధాన్యత కలిపించాలని ఆయన కోరారు.కదిరి ఆర్య వైశ్య సంఘం నాయకులకు, వివిధ గ్రామ, మండల, డివిజన్ ఆర్య వైశ్య సంఘం నాయకులకు, సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 2న హిందూపురంలో శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షులుగా రాము ప్రమాణం స్వీకారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొంటూ... ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గోని విజయవంతం చేయాలని ఆయన ఈసందర్బంగా పిలుపునిచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి