28, ఫిబ్రవరి 2024, బుధవారం

మాజీమంత్రి పల్లె ఆధ్వర్యంలో రా.... కదలిరా....

 మాజీమంత్రి పల్లె ఆధ్వర్యంలో రా.... కదలిరా.... భారీ బైక్ ర్యాలీ



palle raghunath reddy

 తెదేపా శ్రేణులతో విద్యుత్ కేంద్రాన్ని ముట్టడి  

 ఇనుగలూరు పంచాయతీలో పలువురు వైకాపా నుండి తెదేపాలో చేరిక 

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి27(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండలంలోని ఇనగలూరు, గొల్లపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ నుండి తెదేపాలోకి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో  చేరారు.ఇనగలూరు,గొల్లపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 53 కుటుంబాలు మంగళవారం వైసీపీనీ వీడీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకొని పార్టీలోకి చేరారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మాజీ మంత్రి పల్లెతో పాటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప,నియోజకవర్గ పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య,పార్థసారథి రెడ్డి హాజరయ్యారు.ఈ సంధర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి  రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచక పాలనకు స్వస్తి పలకాలని ప్రజలకు పిలపునిచ్చారు.వైకాపా తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. వైకాపా ప్రభుత్వంలో విద్యుత్ చార్జీలు,బస్ చార్జీలు,చెత్త పన్ను,నిత్యవసర సరుకులు భారీగా పెంచి ప్రజలకు మరింత భారం విధించారన్నారు.మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి ,పుట్టపర్తి లో పల్లె రఘునాథ్ రెడ్డి నీ ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు.అనంతరం గ్రామంలో రా.... కదలిరా....కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పల్లె ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి వైకాపా తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం  రావణకాష్టంలా, అంధకారంగా,అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారడం ఖాయమని,టీడీపీ అధికారంలోకి తీసుకొని రావాలని,చంద్రబాబుతోనే మీ భవిష్యత్తుకు గ్యారంటీ, రాష్ట్ర అభివృద్ధి చెందుతోందని ప్రచారం చేపట్టారు.రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి, అనారోగ్యంతో చికిత్సలు పొందుతున్న వారికి తదితర భాదిత కుటుంబ సభ్యులను పరామర్శించి,తెదేపా అండగా ఉంటుందని మాజీమంత్రి పల్లె భరోసా కల్పించి ఆర్థికసాయం చేశారుకార్యక్రమంలో మండల కన్వీనర్ జయచంద్ర, మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి,సర్పంచ్ శంకర్ రెడ్డి, ఎంపిటిసి శ్రీనివాసులు, మాజీ ఎంపిటిసిలు రామానాయుడు, రాజారెడ్డి,పీట్ల సుధాకర్,టైలర్ నిజాం,సాంబ శివారెడ్డి,నారపరెడ్డి,మహబూబ్ బాషా,కంచి సురేష్,గంటా శ్రీనివాసులు,సౌదీ నాగరాజు, ఆరీఫ్,కుమార్ రాయల్, 

భాస్కర్ రెడ్డి  ,మోహన్ రెడ్డి , చంద్రారెడ్డి, గంగిరెడ్డి , సుదర్శన్ రెడ్డి, శివారెడ్డి,రమణ రెడ్డి ,మస్థానమ్మ, అఖిల, బాగ్యమ్మ, పాపమ్మ, సాలెమ్మ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ కేంద్రాన్ని ముట్టడించిన తెదేపా శ్రేణులు    మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తెదేపా నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చి అనధికారిక విద్యుత్ కోతలను నిరసిస్తూ మండల విద్యుత్ ప్రధాన కేంద్రాన్ని ముట్టడించారు. ప్రస్తుతం రబి సీజన్లో బోరు బావుల కింద సాగుచేసిన పంటలు విద్యుత్ కోతల కారణంగా ఎండిపోయాయని, అప్పులు చేసి  పంటలు సాగు చేస్తే విద్యుత్ కోతల కారణంగా చేతికందే సమయంలో నీరందాక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని, 9గంటలనాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. అనంతరం ఏఈ రామసురారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అంతక ముందు తెదేపా పుట్టపర్తి ఇంచార్జ్, మాజీమంత్రి పల్లె ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

______________________________

శ్రీసత్యసాయిజిల్లా,కదిరి ఫిబ్రవరి27(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మంగళవారం  అంపాపతి గోవిందు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి బహుజన సమాజ్ పార్టీ  శాసనసభ అభ్యర్థి ప్రసాద్ ఎన్నికల గుర్తు, పార్టీ చిహ్నం రంగులతో ముద్రించిన పోస్టర్లు విడుదల చేశారు.బిఎస్పి పార్టీ గెలుపు కోసం శ్రమించి నియోజకవర్గంలో బిఎస్పి జెండా ఎగురావేస్తారమన్నారు.

______________________________

శ్రీసత్యసాయిజిల్లా,కదిరి, ఫిబ్రవరి27(విజయస్వప్నం.నెట్)

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ యూనివర్సిటీ 45వ వార్షిక ఇంటర్ నేషనల్ సెమినార్  నిర్వహక ప్రతినిధులచే కదిరి పట్టణంలో వెలసిన ప్రసిద్ధి శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం ఉపప్రధాన అర్చకులు శ్రీ కుమార్ రాజా ఆచార్యుల వారికి ధర్మ ప్రచారంలో తన సేవలను గుర్తింపుగా గౌరవ డాక్టరేట్  పురస్కారం ప్రధానం చేసిన సందర్భంగా శ్రీ  అర్చకం కుమార్ రాజా ఆచార్యుల వారి స్వగృహంలో మంగళవారం కదిరి సేవాదళ్ యువసేవకులు కుటాల లక్ష్మణ్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారన్నారు.


______________________________

ఎమ్మెల్యే సతీమణి దుద్దుకుంట అపర్ణ రెడ్డి దొన్నికోటలో ప్రచారం

 ఘన స్వాగతం పలికిన వైసిపి శ్రేణులు

శ్రీసత్యసాయిజిల్లా,నల్లమాడ ఫిబ్రవరి27(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని దొన్నికోట, గూడమేకలపల్లి, చెర్లోపల్లి  గ్రామాలలో మంగళవారం పుట్టపర్తి శాసన సభ్యులు దుద్ధుకుంట శ్రీధర్ రెడ్డి సతీమణి అపర్ణ రెడ్డి ఎన్నికల ప్రచారం చెప్పారు.కార్యకర్తలు,మహిళలతో కలిసి దొన్నికోట పంచాయితీలోఆమె జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.పుట్టపర్తిని అన్ని విధాలుగా శ్రీధర్ రెడ్డి అభివృద్ధి చేసారని,మరోసారి  ఓటు వేసి ఆశీర్వదించి గెలిపిస్తే.... మరింత అభివృద్ధి చేసి చూపిస్తాడని ఆమె ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి తెలిపారు.పుట్టపర్తితోపాటు నియోకవర్గస్థాయిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను తీసుకొచ్చిన ఘనత శ్రీధర్ రెడ్డికే  దక్కిందన్నారు.ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మన ముఖ్యమంత్రి జగనన్నని, మీ బిడ్డ శ్రీధర్ రెడ్డిని మరొక్కసారి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను ఆమె కోరారు. ఈ ఎన్నికల్లో మరో సారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి మీ బిడ్డ శ్రీధర్ రెడ్డిని తిరిగి భారీ మెజారిటీతో  ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రచారం చేపట్టారు..ప్రచారంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

__________________________________

లంచం తీసుకొంటు ఏసీబికి పట్టుబడిన ఆర్ఐ 

R I Kranthi Kumar

శ్రీసత్యసాయిజిల్లా/అనంతపురం ఫిబ్రవరి27(విజయస్వప్నం.నెట్)

అనంతపురంజిల్లా పామిడి మండల తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పామిడి మండలంలోని అనుంపల్లి గ్రామానికి చెందిన శేషాద్రి అనే రైతు  ల్యాండ్ ముటేషన్ పట్టా పుస్తకం కొరకు దరఖాస్తు చేసుకున్నాడని, అయితే ల్యాండ్ మోటివేషన్ చేయాలంటే 10 వేలు లంచం  ఇవ్వాలని ఆర్ఐ క్రాంతి కుమార్ రైతును డిమాండ్ చేశాడని, దీంతో రైతు 6వేల రూపాయలకు బేరం  కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడని ఏసీబి డిఎస్పి వేంకటాద్రి తెలిపారు. దీంతో  ఆర్ ఐ క్రాంతి కుమార్ రైతు నుండి 6వేలు రూపాయలు లంచం తీసుకుంటుండగా మాటువేసి ఆర్ ఐ క్రాంతి కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని తెలిపారు.ఆర్ఐ వద్ద నుండి 6వేల రూపాయలను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి ఏసిపి కోర్టు లో హాజరు పరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి