26నుండి రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నీ
జర్నలిస్టు క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.లక్ష్మి
అనంతపురం/శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి 20(విజయస్వప్నం.నెట్)
ఈనెల 26న అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహించే రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్లో వర్కింగ్ జర్నలిస్టులందరూ పాల్గొని ఐకమత్యంతో ముందుకెళ్లాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. లక్ష్మి అన్నారు.ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్లను ప్రత్యేక అధికారిణి వై శ్రీలక్ష్మి ఆవిష్కరించారు.విజయవాడ నగరంలోని సీఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం ఉదయం రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్లను వై శ్రీలక్ష్మి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డితో కలిసి ఆవిష్కరించారన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి నగేష్,డి.రాజగోపాల్,అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకటేష్,తిరుపతి జిల్లా నాయకుడు వెంకటేష్ తదితర సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వై.శ్రీలక్ష్మి మాట్లాడుతూ అనంతపురంలో రాష్ట్రస్థాయి జర్నలిస్టు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని,ఇందుకోసం కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ని అభినందిస్తున్నానని మచ్చా రామలింగారెడ్డి జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ విజయవంతం కావాలని వై శ్రీలక్ష్మి ఆకాంక్షించారు.వార్తలు సేకరణలో భాగంగా నిత్యం పని ఒత్తిడితో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ టోర్నమెంట్ నిర్వహించడం ఒక రికార్డని,ఇందులో వర్కింగ్ జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని,ఈ టోర్నీ జర్నలిస్టుల ఆటవిడుపుకి కూడా ఉపయోగపడుతుందని వై.శ్రీ లక్ష్మీ(పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి)ఆశాభావం వ్యక్తం చేశారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా,కదిరి, ఫిబ్రవరి20(విజయస్వప్నం.నెట్)
ఈనెల 22వతేదీ ఏపీ సీఎం కార్యాలయం ముట్టడికి ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి పిలుపుమేరకు విజయవాడ బయలుదేరి వెళ్ళానున్నట్లు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆర్గన సెక్రటరీ కే.ఇందాదుల్లా ఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఫిబ్రవరి20(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఓడిచెరువు ఒకటవ సచివాలయంలో రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామ వాలంటీర్లకు ఇంటింటికి జగనన్న వైద్య సేవలు,ఆరోగ్య కార్డుల నమోదు తదితర అంశాలపై వివరించారు. సర్పంచ్ ముద్దలపల్లి గోవిందు, వైకాపా మైనారిటీ నాయకులు షామీర్ బాషా,వార్డు సభ్యులు జానీ,గ్రామకార్యదర్శి రామలింగారెడ్డి,సచివాలయం సిబ్బంది, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
______________________________
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మండలంలోని అల్లాపల్లి గ్రామ సమీపన వెలసిన శ్రీప్రసన్నాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి మంగళవారం గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు,గ్రామప్రజలు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. పురోహిత పూజారి శ్రీపంచరత్న సురేష్ శర్మచే భూమి పూజ కార్యక్రమం నిర్వహించి, అనంతరం జెసిబి యంత్రంతో ఆలయం ఆవరణలో కంపచెట్లను తొలగించిన్నట్లు తెలిపారు. ఈసందర్బంగా రాష్ట్ర బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ జి.వెంకటేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గ్రామ పెద్దల సహకారంతో విరాళాలు సేకరించి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఆలయ అభివృద్ధి నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు.ఆలయానికి ఎదురుగా ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రంగారెడ్డి,ఉపాధ్యాయులు కే. నాగరాజ్,తిరుపాల్ నాయక్ గ్రామ పంచాయితీ పెద్దలు వెంకట్ నారాయణ,సీతారామయ్య, శ్రీనివాసరెడ్డి,రామకృష్ణారెడ్డి,గోపాల్,ప్రసాద్ రావు,రామాంజి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం
శ్రీసత్యసాయిజిల్లా,నల్లచెరువు ఫిబ్రవరి20(విజయస్వప్నం.నెట్)
నల్లచెరువు మండలం, గొర్లవాండ్లపల్లి గ్రామంలో ఈనెల 19నుండి 21వరకు నిర్వహించే శ్రీసీతారామలక్ష్మణ,ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ శుభకార్యక్రమములో పాల్గొనాలని వైకాపా రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షులు నాయకులు డాక్టర్ బత్తల హరిప్రసాద్ కి ఆహ్వానపత్రిక అందించినట్లు ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు. నల్లచెరువు జడ్పీటీసీ బసిరెడ్డి విశ్వనాథ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏనుకొండ దశరథరామయ్యనాయుడు,సర్పంచ్ సమిఉల్ల తదితరులతో కలసి వెళ్లి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారని తెలిపారు.
______________________________
జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువుఫిబ్రవరి20(విజయస్వప్నం.నెట్)
జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని జనసేన పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయ కర్త పత్తి చంద్రశేఖర్ అన్నారు.ఒడిచేరువు అంబేద్కర్ కూడలి వద్ద హిందూపురం,కదిరి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి వైసిపి విధ్వంస వైఖరికి మైండ్ సెట్ కి రాప్తాడు సిద్ధం సభ ప్రతీకగా నిలిచిందన్నారు.ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీ కృష్ణపై ఉద్దేశంగా వైసిపి మూకలు మూకుమ్మడిగా దాడి చేశారన్నారు.పోలీసుల సమక్షంలో పాత్రికేయులపై దాడి చేసిన వారిని ఇంత వరకు అరెస్ట్ చెయ్యకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఫోటోగ్రాఫర్ శ్రీ కృష్ణకి జనసేన పార్టీ అండగా నిలుస్తుందని,దాడికి పాల్పడిన వైసిపి మూకలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.సిద్ధం సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒరగబెట్టిందేమీ లేదని,జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఫోబియాతో జగన్ రెడ్డి వణికి పోతున్నారన్నారు. కేవలం జనసేన - టిడిపిలను విమర్శించడానికి మాత్రమే పరిమితమయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసిపి ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతాని,వైసిపి మూకల ఉడత ఊపులకు జనసైనికులు, టిడిపి కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని వడ్డీతో సహా తిరిగి చెల్లించేందుకు ఏ మాత్రం వెనకాడబోమన్నారు.అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఓడీచెరువు మండల అధ్యక్షులు మేకలఈశ్వర్, టీడీపీ నాయకులు ఓబుళరెడ్డి, షబ్బీర్, మీసేవ సుధాకర్, మల్లికార్జున, సిపిఎం నాయకులు శ్రీరాములు,జనసేన నాయకులు ఆర్ట్ శ్రీనివాసులు, కొండబోయన సతీష్,సీసి కెమెరా శంకర్,దివాకర్ రెడ్డి,ఉపేంద్ర, నరేంద్ర,అంజి, నిఖిల్ కాంగ్రెస్ నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి