నూతన ఎస్ఐ వంశీకృష్ణ భాద్యతలు స్వీకరణ
శ్రీసత్యసాయి జిల్లా, ఓడిచెరువు ఫిబ్రవరి05(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు పోలీసుస్టేషన్ లో ఎస్ఐ వంశీకృష్ణ నూతనంగా భాద్యతలు చేపట్టాగా,ఏఎస్ఐలు,హెడ్ కానిస్టేబుల్,కానిస్టేబుళ్లు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికి పరిచయాలు చేసుకొన్నారు.ఎన్నికల బదిలీల ప్రక్రియలో భాగంగా ముదిగుబ్బ పోలీసుస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ వంశీకృష్ణను ఓడిచెరువు మండల పోలీసుస్టేషన్ కు అధికారులు నియమించగా ఎస్ఐ వంశీకృష్ణ నూతనంగా భాద్యతలు చేపట్టారు.గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్ఐ బి.మల్లికార్జునరెడ్డి కనగానపల్లి పోలీసుస్టేషన్ కు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. నూతనంగా భాద్యతలు చేపట్టిన ఎస్ఐ వంశీకృష్ణ మాట్లాడుతూ....గ్రామాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు దృష్టి సారించి,శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ సిబ్బందితో కలసి ప్రజలకు అందుబాటులో ఉంటూ.... సేవలు అందిస్తామని అయన తెలిపారు.
_______________________________________
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు(విజయస్వప్నం.నెట్)
మండలంలోని సున్నంపల్లి పంచాయతీ గ్రామానికి చెందిన లక్ష్మిదేవమ్మ శస్త్రచికిత్సలు చేసుకొని కడప పట్టణంలో బంధువుల వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయాన్ని సచివాలయ వెల్ఫర్ అసిస్టెంట్ సోముకు వైకాపా నాయకుడు హరినాథ్ రెడ్డి తెలియజయగా....సోమవారం స్వంత ఖర్చుతో కడపకు వెళ్లి ఫించన్ నగదును అందజేశారని విజయస్వప్నం.నెట్ విలేకరికి తెలిపారు.పింఛన్ నగదు అందుకొన్న సందర్బంగా లబ్ధిదారులు లక్ష్మిదేవమ్మ ధన్యవాదములు తెలిపారన్నారు.
______________________________________
భవన నిర్మాణ కార్మికులు అర్దనగ్న ప్రదర్శన:ఇళ్లపట్టాలు ఇవ్వాలని డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఫిబ్రవరి05(విజయస్వప్నం.నెట్)
సిఐటియూ జిల్లా,డివిజన్,మండల నాయకులు రమణ,లక్ష్మినారాయణ, కుళ్లాయప్ప,పోరాటాల శ్రీరాములు ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, గృహాలు మంజూరు చేయాలని కోరుతూ....భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు సోమవారం 7వరోజుకు చేరుకోగా.... అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు అర్దనగ్న ప్రదర్శన చేసినట్లు తెలిపారు. ఇళ్లపట్టాలు పంపిణి చేసే వరకు దీక్షా శిబిరంలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.అనంతరం దీక్షా శిబిరం నుండి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని నినాదాలు చేస్తూ....రెవిన్యూ కార్యాలయం వద్దకు చేరుకొని స్పందన కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ జాకీర్ హుస్సేన్ కు వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కిష్టప్ప,కార్యదర్శి రవి,కోశాధికారి సూరి,శ్రీనివాసులు,మహేంద్ర, సహాయ కార్యదర్శి కేశవ,రమణప్ప,మహిళ నాయకురాలుమనీ,గంగాదేవితదితరులు పాల్గొన్నారు.
____________________________________________
భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి:ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజి
శ్రీసత్యసాయి జిల్లా,ఓడి చెరువు ఫిబ్రవరి05(విజయస్వప్నం.నెట్)
మండల వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సోమవారం మండల డిప్యూటీ తహశీల్దార్ జాకీర్ హుస్సేన్ కు భవన నిర్మాణ కార్మికులు,ఏఐటీయూసీ నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు మండల వ్యాప్తంగా వందలాది మంది ఉన్నారని,గ్రామీణ ప్రాంతాలలో భవన నిర్మాణాల పనులు చేస్తూ....కొన్నేళ్లుగా నిలువ నీడ లేని దయనీయ పరిస్థితుల్లో కుటుంబాలు ఫోషించించు కుంటున్న భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు పట్టాలు, గృహాలు మంజూరు చేయాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా....ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు.వెంకటాపురం పంచాయతీ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 11 ప్రభుత్వ భూమిలో భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్ర,సిపిఐ మండల కార్యదర్శి చలపతినాయుడు,భవన నిర్మాణ కార్మికులు తిరుపాల్ నాయక్,రమణ,గంగరాజు,కదిరప్ప,గంగులప్ప,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
____________________________________________
కదిరికి మరో చారిత్రాత్మక గౌరవ ఆణిముత్యం
సినీ దర్శక నిర్మాత అక్కమ్మగారి సూర్యనారాయణ:కదిరి ప్రాంతవాసులు
శ్రీసత్యసాయి జిల్లా, కదిరి ఫిబ్రవరి05(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణానికి చెందిన ప్రొడ్యూసర్,డైరెక్టర్ అక్కమ్మ గారి సూర్యనారాయణకి అంతర్జాతీయ స్థాయిలో రెండు అవార్డులు వరించాయి. బెస్ట్ తెలుగు ఫిలిం డైరెక్టర్ గా దోస్తాన్ మూవీకి బెస్ట్ తెలుగు కాన్సెప్ట్ ఫిలింగా అవార్డులు అనుకున్నారు.4వతేది ఆదివారం రాత్రి తిరుపతి నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో కదిరికి చారిత్రాత్మక గౌరవం అంతర్జాతీయ స్థాయిలో దక్కింది.కదిరి పట్టణానికి చెందిన ప్రొడ్యూసర్ & డైరెక్టర్ శ్రీ అక్కమ్మగారి సూర్యనారాయణకి అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ తెలుగు ఫిలిం డైరెక్టర్ గా, దోస్తాన్ మూవీకి బెస్ట్ తెలుగు కాన్సెప్ట్ ఫిలిం గా అవార్డు అందుకున్నారని తెలిపారు.అవార్డు అందుకొన్న సందర్బంగా అక్కమ్మగారి సూర్యనారాయణ మాట్లాడుతూ....ఈ దోస్తాన్ మూవీకి ఇంత అరుదైన గౌరవం రావడం చాలా సంతోషంగా ఉందని,అలాగే తమ మూవీకి కష్టపడ్డ మూవీ టీం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అలాగే ఈ మూవీలో సిద్ స్వరూప్,ఆర్ కార్తికేయ,ఇందు ప్రియా,ప్రియా వల్లభి హీరో,హీరోయిన్లుగా నటించారన్నారు.డిపిడి వెంకటేష్ కర్రీకి,రవిరెడ్డికి,ఎడిటర్ సుదీర్ కుమార్ కి,మ్యూజిక్ డైరెక్టర్ ఎల్లెందర్ మహావీర్ కి కో-డైరెక్టర్ గణేష్ ముత్యాలకి,అసిస్టెంట్ డైరెక్టర్ బాదుల్లా,కన్న, బి.పవన్ కుమార్ (ముత్యాల చెరువు పవన్ కుమార్)హైదరాబాది షాకీర్ తోపాటు సినిమా కోసం పని చేసిన ప్రతి టెక్నీషియన్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అరుదైన గౌరవం దక్కడంతో కదిరికి ఆణిముత్యంగా అభివర్ణిస్తూ.... పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
____________________________________________
సమస్యలు చెప్పడానికి వెళ్ళితే తలుపులు వేశారు
రెవిన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆర్సిపి ఖండన
శ్రీసత్యసాయి జిల్లా, కదిరి ఫిబ్రవరి05(విజయస్వప్నం.నెట్)
రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని సోమవారం 8రోజులుగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిరవధిక దీక్షలో నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని సందర్భంగా.... రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ సత్యసాయి జిల్లా కార్యదర్శి డాక్టర్ నాగన్న,కదిరి డివిజన్ కార్యదర్శి టిఎండి ఇలియాజ్,మండలకార్యదర్శి గుజ్జల శేఖర్,మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుగుణమ్మలు పేర్కొంటూ.... సోమవారం స్పందన కార్యక్రమంలో కదిరి మండల డిప్యూటీ తహశీల్దార్ ని కలిసి సమస్యను వివరించడానికి ప్రయత్నం చేయగా....కనీసం వినే ఓపిక కూడా లేదని,సమస్యలు చెప్పడానికి వెళ్లిన బాధితులతో వాదిస్తూ తలుపులు వేసిన వైనం రెవిన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు.ఆర్ఐ మున్వర్ హుస్సేన్ గోల్ మాల్ లో డిప్యూటీ తహశీల్దార్ కు,ఆర్డిఓకు హస్తం ఉందని వారు ఆరోపించారు.మున్సిపల్ కార్యాలయం వద్ద ఎనిమిది రోజులుగా రాత్రింబవళ్ళు నిరవధిక దీక్షలు చేస్తున్న ఇప్పటికి స్పందించని రెవెన్యూ అధికారులవైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
సర్వేనెంబర్ 83 కుంభకోణం పై విచారణ జరిపించాలని,సర్వే 1735-1ఏ1లోఉద్యోగులకు ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని,అర్హులైనపేదలకుఇఇళ్లపట్టాలు మంజూరు చేయాలని,పేదల ముసుగులో ధనవంతులకు పట్టాలు పంపిణి చేసిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శిబిరంలో నినాదాలు చేస్తూ....నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్, వరప్రసాద్, రాజేష్, నాయకులు శశిధర్ కనక పరమేశ్వరి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
--------------------------------------------------------------------
శ్రీసత్యసాయి జిల్లా,కదిరి పట్టణంలో సోమవారం వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తల హరిప్రసాద్ స్వగృహంలో నెహ్రు యువ కేంద్ర జాతీయ ఉపాధ్యక్షులు పి.విష్ణువర్ధన్ రెడ్డికి(క్యాబినెట్ రాంక్)పుష్పగుచ్చాలు అందించి గౌరవ పూర్వకంగా ఆహ్వానం పలికి సేవా కార్యక్రమాలపై మాట్లాడుకున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్వి కన్స్ట్రక్షన్స్ శ్రీకాంత్ రెడ్డి,ఎస్టీడీ సురేష్(గడ్డం సురేష్)కాంట్రాక్టర్ బాబా,చికెన్ జకీర్ తదితరులు పాల్గొన్నారు.
_________________________________
రజతోత్సవ వేడుకలో పాల్గొన్నండి:డిటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్
శ్రీసత్యసాయి జిల్లా,ఓబుళదేవరచెరువు ఫిబ్రవరి 05(విజయస్వప్నం. నెట్)మండలంలో కొండకమర్ల ప్రాధమిక పాఠశాల ఆవరణంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రజితోత్సవాల(25సంవత్సరాల) వేడుకకు సంబంధించిన గోడపత్రికలను మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరసింహులు,సోమశేఖర్ నాయక్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ పాల్గోని ఉపాధ్యాయులతో కలసి విడుదల చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ మాట్లాడుతూ డిటిఎఫ్ రజితోత్సవాలను ఫిబ్రవరి 10,11 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు, ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థిక బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని,2004 ముందు ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాలపై నోటిఫికేషన్ జారీ చేయబడిన సంవత్సరం తర్వాత నియామకం కాబడిన ఉపాధ్యాయులకు ఆయా శాఖల ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మెమో 57 అనుసరించి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని,12వ పే కమిషన్ ఆలస్యమైనందున మధ్యంతర భృతి (ఐ.ఆర్) 45 శాతం చెల్లించాలని,ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని,ఉపాధ్యాయ నియామకాలలో అప్రెంటిస్ విధానాన్ని విరమించుకోవాలని,ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వ్యాయామ ఉపాధ్యాయులకు ఈ.యల్స్ మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తు,రజతోత్సవ వేడుకలలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని అయన పిలుపునిచ్చారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్ నాయక్,మునే నాయక్,షబినా,అతావుల్లా,నాగరాజు,మాధవి,భార్గవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి