పుట్టపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా మహబూబ్ బాషా దరఖాస్తు
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పుట్టపర్తి నియోజకవర్గానికి శాసనసభ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకొన్నట్లు మాజీ ఎంపిటిసి మహబూబ్ బాషా తెలిపారు. ఈసందర్బంగా విలేకరులతో అయన మాట్లాడుతూ.....దాదాపు 4దశబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని,రాబోయ్ 2024 సార్వత్రిక ఎన్నికలలో పుట్టపర్తి శాసనసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడలోని ఆంధ్ర భవనంలో దరఖాస్తు చేసినట్లు తెలిపారు.గతంలో ఎంపీటీసీగా,వైస్ ప్రెసిడెంట్ గా,ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా పార్టీకి సేవలు అందిస్తున్నారని,అటు పార్టీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటు,ఇటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యపై స్పందిస్తూన్నారని, గ్రామ స్థాయిలో నాయకులు, కార్యకర్తలతో కలసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తూ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకు అందించిన దరఖాస్తులో పేర్కొన్నారని అయన తెలిపారు.దరఖాస్తును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలించాలని, పెద్దల నిర్ణయం మేరకు నడుచుకుంటానని,మైనార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే పుట్టపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని పుట్టపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న మహబూబ్ బాషా ఈసందర్బంగా తెలిపారు.
_______________________________
తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలి:మండల తెదేపా శ్రేణులు
శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు ఫిబ్రవరి 09(విజయస్వప్నం. నెట్)
చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి...పల్లె రఘనాథరెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే కావాలని శనివారం సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ శ్రేణులు తీర్మానం చేశారు.స్థానికేతరులకు టికెట్ ప్రచారంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి మద్దతుగా మండల సర్వ సభ్య సమావేశం లో టీడీపీ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసి మాట్లాడారు.ఏపిలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనీ,పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని ఓడి చెరువు మండల టీడీపీ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఓడి చెరువు మండల కేంద్రము ఐటిఐ లో నిర్వహించిన టిడిపి సర్వసభ్య సమావేశంలో తెలుగుదేశం కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ఏపికి ముఖ్యమంత్రి కావాలని పుట్టపర్తి అభివృద్ధి కోసం పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తూ వారికి మద్దతుగా అన్ని పంచాయతీలోని దేవాలయాల్లో టీడీపీ అధ్వర్యంలో తెలుగు దేశం అభిమానులు కొబ్బరి కాయలు కొట్టి పూజలు నిర్వహించారన్నారు. గత 25 సంవత్సరాలుగా నల్లమాడ,ఆ తరువాత కొత్తగా ఏర్పడిన పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రజలకు అండగా నిలబడి తెలుగు దేశం పార్టీకి ఒక సేవకుడిలా కంటికి రెప్పలా కార్యకర్తల్ని కాపాడుకొంటు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన
పల్లెకు మద్దతు గా నియోజకవర్గంలో అందరం కలిసి కట్టుగా పని చేసి టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వారు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఏ కష్టమొచ్చినా తానున్నానంటూ ప్రజలకు అండగా మాజీ మంత్రి పల్లె నిలిచారని, కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా పగలనకా,రాత్రనక వారి కష్టాల్లో పాలుపంచుకున్నారని,కంటికి రెప్పలా ప్రజలను కాపాడుకొంటూ... వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ.... వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనపై ధ్వజమెత్తరు.ప్రజలకు అత్యంత దగ్గరగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ నాయకుడు పల్లె వస్తున్నారని, ప్రజలే దేవుళ్ళు పార్టీ దేవాలయంగా భావించి పనిచేసే పల్లె రఘునాథ్ రెడ్డి లాంటి వ్యక్తికి పుట్టపర్తి టికెట్ ఇవ్వాలని టిడిపి అధిష్టానాన్ని కోరారు.నియోజకవర్గంలో ఎలాంటి సంబంధం లేని స్థానికేతర్లకు టికెట్ కేటాయిస్తే టిడిపి ఓటమి చవిచూడటం ఖాయమన్నారు.ప్రజలు,టీడీపీ కార్యకర్తల మనో భావాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం ,ప్రజల కోసం పని చేసిన పల్లె కే తిరిగి టికెట్ ఇస్తే ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఈ రాష్ట్రానికి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.పార్టీ కోసం 25 ఏళ్లుగా పుట్టపర్తి నియోజక వర్గ అభివృద్ధికి సేవ చేస్తున్న పల్లె రఘునాథ్ రెడ్డి నీ కాదని పొరబాటున టీడీపీ అధిష్ఠానం స్థానికేతరులకు టికెట్ ఇస్తే ,గెలిచే టీడీపీ సీటును కోల్పోవాల్సి వస్తుందన్నారు.ఈ నియోజకవర్గం నుంచే టీడిపి విజయం తో ప్రారంభించి అది చంద్రబాబుకు బహుమతిగా టీడీపీ కార్యకర్తలు ఇస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల పార్టీ కన్వీనర్ జయచంద్ర,మాజీ సొసైటీ అధ్యక్షులు పిట్ట ప్రభాకర్ రెడ్డి,రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి అంజనప్ప,జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బడిశం రామాంజనేయులు, పార్లమెంటరీ తెలుగు రైతు సోషల్ మీడియా కోఆర్డినేటర్ జాకీర్ అహ్మద్, సర్పంచ్ శంకర్ రెడ్డి,నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఓబుళరెడ్డి, నియోజకవర్గ టిఎన్టియుసి అధ్యక్షులు నిజాం వలి,మాజీ కన్వీనర్లు రాజారెడ్డి రామానాయుడు,మండల ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్,ఐ టి డి పి షాన్వాజ్, ఇర్షాద్, మైనార్టీ నాయకులు షబ్బీర్, ఎస్సీ సెల్ నాయకులు శ్రీనివాసులు, పిచ్చిలి నరసింహులు,నారపరెడ్డి, అంజన్ రెడ్డి, సి సురేష్, పందిపోటు శంకర, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
_______________________________
రాష్ట్ర స్థాయి దళిత రచ్చబండ సదస్సును జయప్రదం చేయండి:బిజెపి రాష్ట్ర ఎస్సి మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్
శ్రీసత్యసాయిజిల్లా(విజయవాడ)ఫిబ్రవరి09(విజయస్వప్నం. నెట్)
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుడిసె దేవానంద్ ఆధ్వర్యంలో విజయవాడలో శనివారం ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి,రాష్ట్ర సంఘటన మహామంత్రి మధుకర్ నూకల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు,రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాష్ట్ర కార్యదర్శులు,రాష్ట్ర కోశాధికారి,రాష్ట్ర ప్రధాధికారులు,జోనల్ ఇన్చార్జిలు,జిల్లా మోర్చా అధ్యక్షులు,జిల్లా మోర్చా ప్రధాన కార్యదర్శిలు,జిల్లా ఇన్చార్జి పాల్గొన్నారన్నారు. బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య, బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సంబు నాథ్ తుండియా ఆదేశాల మేరకు ఫిబ్రవరి 22వతేది ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే "బస్తీ సంపర్క్ అభియాన్" "రాష్ట్రస్థాయి దళిత రచ్చబండ"కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గోని విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవానంద్ ఈసందర్బంగా పిలుపునిచ్చారు.
_______________________________
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 10వ తరగతి మోడల్ టెస్ట్
శ్రీసత్యసాయిజిల్లా,తలుపుల ఫిబ్రవరి09(విజయస్వప్నం.నెట్)
తలుపుల మేజర్ పంచాయతీలో శుక్రవారం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి మోడల్ టెస్టుకు 240 మంది విద్యార్థిని,విద్యార్థులు హాజరు హాజరైయ్యారని ఏఐఎస్ఎఫ్ తలుపుల మండల కార్యదర్శి మహేంద్ర మహేంద్ర తెలిపారు.ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు లక్ష్మీనారాయణ, ఏఐవైఎఫ్ మాజీ నాయకులు ఎల్ వి రమణలు విచ్చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పదవ తరగతి మోడల్ పరీక్ష ను రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినీ, విద్యార్థులు ఒత్తిళ్లకు,భయాందోళనకు గురి కాకుండా మానసిక స్థైర్యాన్ని నింపడానికి మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు చాలామందిలో భయం వెంటాడుతూ ఉంటుందని,ఆ భయాన్ని పోగొట్టి విద్యార్థులు పరీక్షలను ఒత్తిళ్లకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాసే విధంగా ముందస్తుగా ఇలాంటి పదవ తరగతి మోడల్ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో భయం తొలిగిపోతుందని తెలిపారు.నేటి విద్యార్థులే రేపటి సమాజాన్ని మార్చే పౌరులుగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమాజాన్ని మార్చే శక్తి కేవలం విద్యార్థులకు మాత్రమే ఉందన్నారు,ఈ సమాజాన్ని ఒక పెన్ను మార్చగలదు, ఈ సమాజాన్ని ఒక పుస్తకం మార్చగలదు, ఈ సమాజాన్ని ఒక ఉపాధ్యాయుడు మార్చగలడని నినాదాలు చేశారు. ప్రతి ఒక విద్యార్థి కూడా ప్రస్తుత విద్యాభ్యాసంలోనే చదువుతోపాటు ఈ సమాజంలో జరుగుతున్న అవినీతిని,ఏదైనా సంఘటలపై యువత ప్రశ్నించడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. 2024 లో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం శ్రీసత్యసాయి జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలని ఆశభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మానవ హక్కుల స్వచ్ఛంద సేవ డివిజన్ చైర్మన్ మునీందర్ మాట్లాడుతూ తలుపుల మండలంలో పదో తరగతికి చెందిన విద్యార్థిని, విద్యార్థులు పరీక్ష ఫలితల్లో టాపర్ గా నిలిచినా విద్యార్థులకు 10వేల116 రూపాయలు బహుమతి అందిస్తామని ప్రకటించారు. అదేవిధంగా టాపర్ విద్యార్థికి ఒక ఏడాదికి ఖర్చు తనే భరాయిస్తాయని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు విజయ్ ,అశోక్ కుమార్,బాషా విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు..
_______________________________
శ్రీసత్యసాయిజిల్లా,కదిరి
గ్రామ సర్వే నంబర్ 83లో జరిగిన భూ కుంభకోణంలో కోట్ల రూపాయలు దళారుల ద్వారా చేతులు మారిన వైఖరిపై పాత ఆర్డీఓ కార్యాలయం వద్ద రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 12రోజులు చేపట్టిన అధికారులు స్పందించలేదని శనివారం అర్బన్ సిఐ పుల్లయ్య శిబిరం వద్దకు చేరుకొని దీక్షలు చేపట్టిన జిల్లా కార్యదర్శి నాగన్న,కదిరి డివిజన్ కార్యదర్శి టీఎండి ఇలియాజ్, ఆర్ఎస్వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి.అరుణ్ కుమార్,రాయలసీమ మహిళా సంఘము అధ్యక్ష,కార్యదర్శి గంగులమ్మ, సుగుణమ్మ లతోపాటు 32 మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి దీక్ష శిబిరాన్ని భగ్నం చేశారని వారు తెలిపారు.అనంతరం32మందిపై కేసు నమోదుచేశారని,శిబిరాన్ని భగ్నం చేసి,కేసు నమోదు చేయడాన్ని ప్రజాస్వామిక వాదులు,రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఖండించాలని వారు కోరారు.శిబిరాన్ని భగ్నం చేస్తే ఉద్యమం ఆగదని,అవినీతికి పాల్పడిన భూమాఫియా రెవిన్యూ అధికార సిబ్బందిపై ప్రభుత్వ భూములను అమ్ముకున్న అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని,అర్హులైన పేదలకు ఇళ్లు,ఇళ్ల స్థలాలు పంపిణి చేసే ఉద్యమాలు కొనసాగిస్తామని జిల్లా కార్యదర్శి,డివిజన్ కార్యదర్శి,నాగన్న,ఇలియాజ్ తదితరులు పేర్కొన్నారు.
_______________________________
పల్లెకి పోదాం ప్రారంభం
శ్రీసత్యసాయిజిల్లా, తలుపుల (విజయస్వప్నం.నెట్)
భారతీయ జనతా పార్టీ చేపట్టిన పల్లెకి పోదాం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తలుపుల మండల కేంద్రంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరిస్తూ క్యాలెండర్లు, కరపత్రాలు పంపిణి చేసినట్లు బీజేపీ శ్రేణులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షలు గోవిందు,వెంకటేశ్వర్లు,ప్రధన కార్యదర్శి అశోక్ కుమార్,చౌడయ్య,చెక్క చంద్ర,ఆంజనేయులుతదితరులు పాల్గొన్నారు.
_______________________________
నాయిబ్రాహ్మణ యువతకు ఉపాధి కల్పించాలి
శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి09(విజయస్వప్నం.నెట్)
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో బీసీ కమిషన్ చైర్మన్ శంకర్ నారాయణ,కార్యదర్శి మాధవి లతాకి శుక్రవారం శ్రీసత్య సాయిజిల్లా,కదిరి వెలసిన శ్రీఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కళ్యాణకట్టలో నాయిబ్రాహ్మణ పోస్టుల నియామకం అక్రమ పద్ధతిలో పెద్ద మొత్తంలో లంచాలు తీసుకొంటు,స్థానిక నాయిబ్రాహ్మణ యువతకు అన్యాయం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఈవో మీద శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగ యువతీ యువకులు అవకాశం కల్పించాలని రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వినతిపత్రం అందజేశారని మంగలి మహాసభ రాష్ట్ర కన్వీనర్ హరిప్రసాద్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి ఇన్ జాకీర్ హుస్సేన్ తదితరులు తదితరులు తెలిపారు.
_______________________________
అయోధ్య శ్రీరాముల కళ్యాణోత్సవంపై రాధయాత్ర
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఫిబ్రవరి 09:
ఈనెల 21న కదిరి పట్టణ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల మైదానంలో కదిరి సేవా భారతి ఆధ్వర్యంలో శ్రీ అయోధ్య రాముల కళ్యాణోత్సవం శుభకార్యముకు గ్రామీణ ప్రాంతాల నుండి తరలిరావాలని 11 మండలాల్లో రదయాత్రతో కరపత్రాల ప్రచారం చేపట్టారని, అందులో భాగంగా నేడు(శనివారం) మండలంలోని ఎంబి క్రాస్, వేమారెడ్డిపల్లి, ఆకుతోటపల్లి నుండి ఓడిచెరువు మీదుగా మామిళ్లకుంట్లపల్లి, కుసుమవారిపల్లిలో రాత్రి ఈశ్వరిమాత ఆలయం వద్ద భజన కార్యక్రమం నిర్వహించి, 11వతేది ఉదయం దిగువపల్లి నుండి గాజుకుంటపల్లి,వణుకువారిపల్లి, మిట్టపల్లి గ్రామాల మీదుగా శ్రీరాముల రదయాత్ర కొనసాగించి నల్లమాడ మండలంలోని పులగంపల్లికి చేరుకొంటుందని ధర్మజాగారణ, సేవా భారతి కార్యవర్గసభ్యులు చంద్రశేఖర్, నాగేశయ్య,పుల్లప్ప, సుబ్బరాజు,మిట్టపల్లి నరసింహరెడ్డి, పూజారి వెంకటరమణ తదితరులు తెలిపారు. అయోధ్య సీతారాముల కళ్యాణమహోత్సవం కార్యక్రమంలో ప్రవచకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు పాల్గోని ప్రవచనాలు భోధిస్తారని తెలిపారు.
_______________________________
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి