15, ఫిబ్రవరి 2024, గురువారం

ఘనంగా తొలి ఉచిత వివాహ మహోత్సవం - జేఈఈలో సత్తా చాటిన వశిస్ట పూర్వ విద్యార్థి లక్ష్మి గణేష్ - అనారోగ్యానికి గురైన ఎంటీఎస్ ఉపాధ్యాయుడు ఎంఈఓ

ఘనంగా తొలి ఉచిత వివాహ మహోత్సవం



ఓబుళదేవరచెరువు ఫిబ్రవరి14(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బంగారు బండపై వెలసిన శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామివారి దేవస్థానం ఆవరణలో శ్రీలక్ష్మినరసింహస్వామి సన్నిధిలో బుధవారం కదిరి జోగి శ్రీదేవి ఫౌండేషన్ చైర్మన్ కోడూరు శ్రీకాంత్, ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు మాట్లాడుతూ....11 జంటల సామూహిక ఉచిత వివాహాల కార్యక్రమంలో భాగంగా తొలి ఉచిత వివాహ కార్యక్రమంలో ఆమడగూర,ఓడిచెరువు మండలాలకు చెందిన వధువరులకు జోగి శ్రీదేవి ఫౌండేషన్ కోడూరు శ్రీకాంత్ నూతన వస్త్రాలు, మంగళసూత్రం తదితర పెళ్లి సామాగ్రి అందించగా,పురోహిత పూజారులు పంచరత్న సురేష్ శర్మ, సత్యనారాయణశర్మలు కళ్యాణం నిర్వహించినట్లు తెలిపారు. అంతక ముందు వినాయకస్వామికి, సుబ్రహ్మణ్యంస్వామివారికి అర్చనలు,శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామివారికి అభిషేకం, పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించి, వివాహ వేడుకలలో పాల్గొన్న బంధుమిత్రులకు భోజనాలు ఏర్పాటు చేశారు.పేద వధూవరులకు ఉచితంగా నూతన వస్త్రాలు, మంగళసూత్రాలు అందించి,సామూహిక వివాహా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని,శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామివారి దేవస్థానంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని ఈసందర్బంగా పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.ఈకార్యక్రమంలో ఆలయ సేవకులు బ్యాంక్ శీనా,ఆనంద్,డప్పు నరేష్,మణికంఠ సుధాకర,సర్వేయర్ గంగులప్ప,సునీల్,ఉత్తమరెడ్డి,సుదర్శన్ రెడ్డి,సీసికెమెరా శంకర్,సందీప్,శ్రీరాములు,రమేష్,టైలర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

______________________________

అనారోగ్యానికి గురైన ఎంటీఎస్ ఉపాధ్యాయుడు ఎంఈఓ, ఉపాధ్యాయుల ఔదర్యం


శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు(విజయస్వప్నం.నెట్)మండలంలోని 

కమ్మవారిపల్లి ప్రాధమికొన్నత పాఠశాలలో బుధవారం ఎంటిఎస్ ఉపాధ్యాయుడు నేలకోటప్ప తీవ్ర అస్వస్థత గురై పాఠశాలలోనే కుప్పకూలి పడిపోవడంతో హుటాహుటిన కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారని,ప్రథమ చికిత్సలు చేయించినంతరం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విషయం తెలుసుకొన్న ఉపాధ్యాయులు,ఎంఈఓలు సురేష్ బాబు,రమణ స్పందించి 32 వేల రూపాయలు విరాళాలు సేకరించి పంపాగా,అదేవిధంగా జిల్లాలోని ఎంటీఎస్ ఉపాధ్యాయులతోపాటు జిల్లా ప్రధాన కార్యదర్శి కే నాగరాజ్ 11000 నగదు ఫోన్ పే ద్వారా ఆర్థికసాయం అందించారని తెలిపారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు నేలకొటప్ప కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారన్నారు.

______________________________

జేఈఈలో సత్తా చాటిన వశిస్ట పూర్వ విద్యార్థి లక్ష్మి గణేష్

శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు ఫిబ్రవరి14(విజయస్వప్నం.నెట్)

జేఈఈ మెయిన్స్ 2024 సెషన్స్ -1 ఫలితల్లో ఓడిచెరువు మండల కేంద్రానికి చెందిన వశిష్ట పాఠశాల పూర్వపు(2021-22)విద్యార్థి పి. లక్ష్మిగణేష్ 99.51% సాధించి సత్తా చాటాడు. వశిష్ట పాఠశాలలో 7నుండి 10వతరగతి వరకు 4సంవత్సరాలు ఒలంపియాడ్ ప్రోగ్రామ్ లో విద్యార్థి లక్ష్మిగణేష్ శిక్షణ పొంది జేఈ ఈ మెయిన్స్లో ప్రతిభ కనబరిచి 99.51 శాతంతో సాధించడంతో పాఠశాల యాజమాన్యం పిట్టా శివశంకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఈసందర్బంగా అయన మాట్లాడుతూ.... రాబోయే రోజుల్లో వశిష్ట పాఠశాల నుండి ఇలాంటి మరిన్నో ఫలితాలు సాధించగలమని అశభావం వ్యక్తం చేస్తూ.... గ్రామీణ ప్రాంతాల మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి వారికి ఐఐటీ,నీట్ నందు డాక్టర్స్,ఇంజనీర్లు అయ్యేందుకు తమ విద్యాసంస్థ ఫౌండేషన్ కోర్స్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయన కోరారు.

______________________________

శ్రీసత్యసాయిజిల్లా, కదిరి ఫిబ్రవరి14(విజయస్వప్నం.నెట్)

దామోదర సంజీవయ్య  జయంతి సందర్భంగా కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఘనంగా నివాళులర్పించారు ఒక దళితునిగా కాంగ్రెస్ పార్టీ అతనిపైన నమ్మకం ఉంచి ముఖ్యమంత్రిగా గుర్తింపు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి వారు కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీలో దళితులకు,మైనార్టీలకు,బడుగు బలహీన వర్గాలకు నిరంతరం అండగా ఉంటూ.....సముచిత స్థానం కల్పిస్తున్నందున పార్టీ సిద్ధంతాలు నమ్మి మేము తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పేర్కొంటూ....అధిష్టానం మా పైన నమ్మకం ఉంచి ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో మరింత భాద్యతగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని,సేవా కార్యక్రమాలు నిర్వహించి, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని జిల్లా ప్రధాన కార్యదర్శి బొగ్గటి మునికుమార్ ధీమా వ్యక్తం చేశారు.

______________________________


శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు ఫిబ్రవరి14(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కూడలి అతి సమీపంలో నరసింహులు జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకొన్న శశి జనరల్ స్టోర్ లో గుర్తు తెలియని వ్యక్తులు తలుపుకు అమర్చిన బోల్టాలు తొలగించి దుకాణంలో ఉన్న సిగిరెట్లు,బీడీలు,ఇతర సరకులతోపాటు నగదు దొంగిలించినట్లు భాదితుడు వాపోయారు.చోరికి గురైన వస్తువుల విలువ దాదాపుగా 50వేలు ఉంటుందని తెలిపారు.ఘటనపై పోలీసులకు పిర్యాదు చేస్తున్నట్టు భాదితుడు బుధవారం తెలిపారు. అయితే చోరీ గురైన దుకాణం సమీపంలో సిసి కెమెరాలు ఉన్నందున పుటేజీ ద్వారా చోరీ దృశ్యాలు బయట పడవచ్చని పలువురు అనుకొంటున్నారు.

_____________________________

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి