23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

ప్రజాపోరు యాత్రపై బిజెపి నాయకులు ప్రచారం 


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి22(విజయస్వప్నం.నెట్)

ప్రజాపోరు యాత్రలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం కన్వీనర్ హనుమంత్ రెడ్డి  ఆధ్వర్యంలో  ఓబుళదేవర చెరువు మండల అధ్యక్షుడు రంగారెడ్డి అధ్యక్షతన  మహమ్మదాబాధ్ క్రాస్ లో గురువారం ప్రజాపోరు యాత్ర నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధులుగా కదిరి మాజీ శాసనసభ్యులు ఎమ్మెస్ పార్థసారథి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్  పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృధి పథకాలను ప్రజలకి  వివరించారు.ఈకార్యక్రమంలో మండల బిజెపి,బిజెవైయం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

______________________________

ఉత్సాహంగా, ఉల్లాసంగా ఫెర్వెల్ డే వేడుకలు

శ్రీసత్యసాయిజిల్లా, ఆమడగూరు ఫిబ్రవరి22(విజయస్వప్నం.నెట్ )

ఆమడగూరు మండల కేంద్రానికి సమీపంలో శీతిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫెర్ వెల్ డే వేడుకలు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ అధ్యక్షతన, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో ఫెర్ వెల్ డే కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరంగా నిర్వహించగా ఉత్సాహంగా,ఉల్లాసంగా విద్యార్థులు వేడుకలు జరుపుకొన్నారు.వింత పొగడాలకు గురి కాకుండా, సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ ప్రపంచంలో విద్యార్థులు అనుకొన్న లక్ష్యాలను సాధించాలని ప్రిన్సిపాల్ ప్రభాకర్ సూచించారు.క్రమశిక్షణతో ఉన్నత విద్యా సాధ్యమని అధ్యాపకులు తెలిపారు.సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులతో ఆప్యాయంగా పలకరిస్తూ.... జ్ఞాపాకాలను గుర్తు చేసుకొని స్నేహాభావంతో వేడుకలు జరుపుకొన్నారు.

______________________________

ఉపాధ్యాయుడికి పోలీసులు నోటిసులు 

శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు ఫిబ్రవరి 22(విజయస్వప్నం.నెట్)

ఏపీ జెఎసి పిలుపు మేరకు 27వతేది చేపట్టిన ధర్నాకు వెళ్లకూడదని ఏపీ జెఎసి జిల్లా నాయకులు (డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు) కట్టుబడి గౌస్ లాజమ్ కు గురువారం హెడ్ కానిస్టేబుల్ వెంకట రాముడు నోటీసులు అందజేశారన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయపరమైన హక్కుల కోసం చేపట్టిన ధర్నాకు వెళ్లకూడదని నోటీసులు ఇవ్వడం సరైనది కాదని గౌస్ లజామ్ తెలిపారు.

______________________________

ఉపాధ్యాయుడి చికిత్సకి సాయం  

శ్రీసత్యసాయి జిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి22(విజయస్వప్నం.నెట్)

మండలంలోని కమ్మవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు నేలకోటప్ప ఇటీవల తరగతి గదిలో పాఠాలు బోధిస్తూ బ్రెయిన్ స్ట్రోక్ కు గురై ప్రస్తుతం అనంతపురం సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.మానవత దృక్పధంతో స్పందించిన.... చింతమానిపల్లి సర్పంచ్ బోయపాటి జగన్మోహన్ చౌదరీ 10 వేలు,సోసైటీ అధ్యక్షులు ఎద్దుల రామసుబ్బారెడ్డి 5వేలు, కొండకమర్ల అంగడి నాగరాజు 3 వేలు,వెంకట నారాయణ 2 వేలు,నాగేంద్ర గుప్త 500 సేకరించి మొత్తం 20,500 రూపాయలు ఉపాధ్యాయుడు నేల కోటప్పకు మెరుగైన చికిత్స కోసం తమ వంతుగా సహాయంగా ఓడిచెరువు మండల ఎంఈఓ సురేష్ కు గురువారం అందజేశారని తెలిపారు.

______________________________

విద్యుత్ ఉపకేంద్రాన్ని రైతులు ముట్టడి

శ్రీసత్యసాయి జిల్లా, ఆమడగూరు ఫిబ్రవరి22(విజయస్వప్నం.నెట్)

మండలంలోని కొట్టువారిపల్లి విద్యుత్ ఉపకేంద్రం ముట్టడించి రైతులు ధర్నా చేపట్టారు.పూలకుంటపల్లి, కొట్టువారిపల్లి పంచాయతీ గ్రామాల రైతులు భారీగా తరలివచ్చి గురువారం విద్యుత్ ఉపకేంద్రానికి తలుపులకు తాళాలు వేసి ధర్నా చేపట్టారు. ఈసందర్బంగా రైతులు మాట్లాడుతూ.... రాత్రివెళ్ళల్లో 3పేష్ విద్యుత్ సరఫరా ఇవ్వడంతో రైతులు ప్రమాదాలకు గురౌతున్నారని, పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని, రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 7గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేయడంతో పంటలు ఎండిపోయి  ఇబ్బందులు గురై రైతులకు ఆత్మహత్యలే శరణ్యమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.9గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని వారు డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.ఏఈ చంద్రానాయక్ విషయం తీసుకొని స్పందిస్తూ.... 9గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

______________________________

మరోసారి ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డిని గెలిపించండి  మరింత గ్రామాభివృద్ధి చేస్తాం

తిప్పయ్య గారి పల్లిలో ప్రచారం నిర్వహించిన 

దుద్దుకుంట అపర్ణ రెడ్డి

శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి22(విజయస్వప్నం.నెట్)

మరోసారి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించండి,గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేబడుతామని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సతీమణి దుద్దుకుంట అపర్ణ రెడ్డి ప్రచారం చేపట్టారు.నల్లమాడ మండల పరిధిలోని తిప్పయ్యగారిపల్లిలో గురువారం పెద్దమ్మ తల్లి మారెమ్మ తల్లి,సీతారామాలయంలో పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సతీమణి అపర్ణ రెడ్డి పూజలు నిర్వహించి ప్రచారం కొనసాగించారు. 

గడప గడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆదరాభిమానాలు పొందుతూ సంక్షేమ పథకాలను అందిస్తున్న మన జగనన్న ను రెండవసారి ముఖ్యమంత్రిగా,మరోసారి శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని,వైకాపా ప్రభుత్వంలోనే గ్రామాభివృద్ధి సాధ్యమని ఆమె ప్రచారం చేశారు. ప్రచారంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైకాపా నాయకులు,కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.

______________________________

ఎన్నికల ప్రచారానికి మాజీమంత్రి పల్లె శ్రీకారం  

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ఫిబ్రవరి 22(విజయస్వప్నం.నెట్)తెలుగుదేశం పార్టీ 

పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలోని కృష్ణాపురం పంచాయతీ గోపాలపురం గ్రామం నుండి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.ముందుగా గ్రామదేవత గంగమ్మతల్లి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీనీ గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును,ఎమ్మెల్యేగా గెలిపించాలని పల్లె రఘనాథరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్లు,స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

______________________________

వృద్ధులు ఒక్కప్పటి మాతృపితృ దేవతలు



శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఫిబ్రవరి22(విజయస్వప్నం.నెట్)

వృద్ధాప్యంలో ఉన్న అవ్వ తాతయ్యలు ఒక్కప్పటి మాతృపితృ దేవతలని వారిని చిన్నారుల చూసుకొంటూ.... ప్రేమాభిమానలు అందిస్తూ కంటికి రెప్పలా సంరక్షించుకోవాలని సిబిఎస్ శ్రీవిజ్ఞాన్ పాఠశాల కారస్పాండెంట్ మస్తాన్, ప్రిన్సిపాల్ రంగారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఫర్వాజ్ లు విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించారు.గ్రాండ్ పేరెంట్స్ డే సందర్బంగా మండల కేంద్రంలో సిబిఎస్ శ్రీవిజ్ఞాన్ పాఠశాల ఆవరణలో గురువారం అవ్వ తాతయ్యల దినోత్సవం నిర్వహించగా, ముఖ్యఅతిధిగా పాఠశాల కరస్పాండెంట్ మస్తాన్ హాజరై మాట్లాడుతూ.... వృద్ధులు ఒకప్పటి మాతృపితృ దేవతలని, కుటుంబ పెద్దలను గౌరవించడం సంప్రదాయమని,వృద్ధాప్యంలో ఆప్యాయత,అనురాగం చూపించి సేవలు అందించే భాద్యతగా ప్రతి ఒక్కరు పాటించాలని అయన సూచించారు.తదుపరి అవ్వ తాతయ్యలకు షాపింగ్ బాల్, హుప్ బాల్,రోలింగ్ బాల్,బ్యాలన్సింగ్ బాల్ తదితర క్రీడాపోటీలు నిర్వహించి గెలుపొందిన అవ్వతాతయ్యలకు ప్రధమ, ద్వితీయ,తృతీయ బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు,వయోవృద్ధులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి