google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : 26న కాంగ్రెస్ బహిరంగ సభ జయప్రదం చేయండి - లక్ష ఆర్థికసాయం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ - వాలంటీర్లకు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సన్మానం - పురుగల మందుల డబ్బాలతో రైతులు ధర్నా - గురుకుల పాఠశాలలో అపరిచితుడు హంగామా!!....

25, ఫిబ్రవరి 2024, ఆదివారం

26న కాంగ్రెస్ బహిరంగ సభ జయప్రదం చేయండి - లక్ష ఆర్థికసాయం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ - వాలంటీర్లకు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సన్మానం - పురుగల మందుల డబ్బాలతో రైతులు ధర్నా - గురుకుల పాఠశాలలో అపరిచితుడు హంగామా!!....

26న కాంగ్రెస్ బహిరంగ సభ జయప్రదం చేయండి

శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఫిబ్రవరి 24(విజయస్వప్నం.నెట్)

అనంతపురం జిల్లా కేంద్రంలో 26వతేది సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగసభ నిర్వహించనున్నారని నియోజకవర్గం పరిధిలోని నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లయన్ ఖాసీం ఖాన్ విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు.ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల,సిడబ్లయ్యు సభ్యులు ఎన్.రఘువీరారెడ్డి,రుద్రంరాజు,పల్లంరాజు,మాజీమంత్రి శైలజానాథ్,గౌతమ్,కే.టీ శ్రీధర్ రాష్ట్ర, జాతీయ నాయకులు సమక్షంలో లక్షలాది మందితో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు అయన పేర్కొన్నారు.జిల్లా నుండి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టటానికి బహిరంగసభ వేదికగా ఏర్పాట్లు చేస్తున్నారని,కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని,రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వేదిక ద్వారా సందేశం ఇవ్వాలని బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు అయన పేర్కొంటూ.... నాయకులు,కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని అయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ రాష్ట్ర సమన్వయకర్త నచ్చు బాలకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

______________________________

లక్ష ఆర్థికసాయం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్

శ్రీసత్యసాయి జిల్లా తలుపుల ఫిబ్రవరి24(విజయస్వప్నం.నెట్)

కదిరి డివిజన్ తలుపుల మండల పరిధిలోని పూతలవాండ్లపల్లి పంచాయతీ నాయనవారిపల్లి గ్రామంలో గత కొన్ని నెలలుగా విద్యుత్ అంతరాయంతో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు శనివారం స్థానిక సర్పంచ్ పెద్దినాయుడుతో కలిసి కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బుల్ దృష్టికి తీసుకెళ్లగా,తక్షణమే ఆయన స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా విద్యుత్ సరఫరాకు అవసరమయ్యే పరికరాల కోసం లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారని తెలిపారు.అడిగిన వెంటనే ఆర్థికసాయం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఎండి ఇస్మాయిల్,కే.ఎర్రంనాయుడుకే.చలపతి నాయుడు,పి.ప్రభాకర్,కే.కొండ మనాయుడు,కే.భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

______________________________

వాలంటీర్లకు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సన్మానం

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి24(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పుట్టపర్తి శాసన సభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ఆమడగూరు, నల్లమాడ, ఓడిచెరువు గ్రామ వాలంటీర్లను సన్మానించారు. అయన ఈసందర్బంగా మాట్లాడుతూ.... రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశ చరిత్రలోనే గర్వించదగ్గ విషయమని కొనియాడారు.గ్రామ వాలంటరీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని దాదాపుగా 2 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించమన్నారు.వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి సామాన్యుడికి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ప్రతి ఇంటికి వెళ్లి సేవలందించే విధంగా  ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అమలు చేయలేదని, అది ఒక్క వైస్సార్సీపీ జగనన్న ప్రభుత్వానికే సాధ్యమని,కరోనా క్లిష్టసమయాల్లో వాలంటీర్లు అందించిన సేవ మరవలేనివని,సేవలందించిన ప్రతి ఒక్కరికీ ఈసందర్బంగా ఎమ్మెల్యే సెల్యూట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలనే టిడిపి అధినేత చంద్రబాబు మాటలని ఖండించారు. అనంతరం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వాలంటీర్లను సన్మానించి సేవవజ్ర,సేవ మిత్ర,సేవ రత్న పురస్కారాలు అందజేశారు.

______________________________

పురుగల మందుల డబ్బాలతో రైతులు ధర్నా 

విద్యుత్ కోతలపై రైతులు నిరసన 



శ్రీసత్యసాయిజిల్లా ఆమడగూరు ఫిబ్రవరి 24(విజయస్వప్నం.నెట్)

విద్యుత్ కొతలతో రబిలో సాగుచేసిన పంటలు ఎండిపోయి నష్టపోయే పరిస్థితి నెలకొందని, రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని శనివారం మండల కేంద్రంలో రైతులు పురుగుల మందుల డబ్బాలు చేతిలో పట్టుకొని విద్యుత్ కేంద్రం ముందు నరసన తెలిపి ధర్నా చేపట్టారు.లక్షలు అప్పుచేసి పంటలు సాగుచేస్తే లోఓల్టేజితో విద్యుత్ కోతలు విధిస్తున్న అధికారుల నిర్లక్ష్య వైఖరిపై రైతులు అసహనం వ్యక్తం చేస్తూ.... పురుగుల మందు సేవించడానికి యత్నించగా పోలీసులు అప్రమత్తమై పురుగుల మందు డబ్బాలను లాగి పడేసారు.రబి సీజన్లో సాగుచేసుకొన్న పంటలు తీర చేతికొచ్చే సమయంలో లో ఓల్టేజి కారణంతో విద్యుత్ కోతలు విధించి వేళపాల లేకుండా విద్యుత్ సరఫరా చేయడంతో పంటలు ఎండిపోతున్నాయని ఇలాంటి పరిస్థితిలో ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.9గంటల నుండి 7గంటలకు కుదించి విద్యుత్ కోతలు విధిస్తున్న అధికారుల నిర్లక్ష్య తీరును నిరసిస్తూ 5గంటలపాటు రైతులు ధర్నా చేపట్టారు.విద్యుత్ సమస్యలపై సిబ్బందికి సమాచారం అందిస్తే.... నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ.... రైతుల సమస్యలు విస్మరించి నిరంతరం సిబ్బంది కర్ణాటక బిల్లూరు మద్యం దుకాణాల వద్ద దర్శనం ఇస్తన్నారని మండిపడ్డారు. ఏఈ చంద్రానాయక్ స్పందిస్తూ.... చిన్నగానిపల్లి, కససముద్రం ప్లీడర్లలో ఓవర్ లోడ్ వల్ల సమస్య ఉందని, విద్యుత్ మరమ్మత్తు పనులు చేపట్టి,కెపాసిటీ స్టాటర్లు అమర్చి రెండు రోజుల్లో పూర్తి చేసి 9గంటపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.ఈకార్యక్రమంలో లక్ష్మీనారాయణ, మంజునాథరెడ్డి,లోకేష్ రెడ్డి, ఈశ్వరప్ప, చెన్నకేశవ, చంద్రాయప్ప, నాగరాజు,శివశంకర, వెంకటరెడ్డి, శ్రీనివాసులు, శివప్ప, రంగప్ప, రాంమోహన్ తదితర గ్రామ రైతులు పాల్గొన్నారు.

______________________________


శ్రీ సత్య సాయి జిల్లా,పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండలంలోని తిమిరికుంటపల్లికి చెందిన 20 కుటుంబాలు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాజీమంత్రి పల్లె వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి  సాధారణంగా ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.

______________________________

గురుకుల పాఠశాలలో అపరిచితుడు హంగామా!!....

ఎస్ఐ కి ఉపాధ్యాయ బృందం పిర్యాదు 

శ్రీసత్యసాయిజిల్లా, తనకల్లు, ఫిబ్రవరి23(విజయస్వప్నం.నెట్)

మండలంలోని సిజీ ప్రాజెక్టు సమీపంలో ఎస్టీ గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం రాత్రి వేళ అపరిచిత వ్యక్తి ప్రహరీ గోడ వెనుకవైపు నుండి పాఠశాల ప్రాంగణంలో ప్రవేశించి వెనుక గది అద్దాలు పగులకొట్టి లోపల ఉన్న విద్యార్థినీలను భయబ్రాంతులకు గురి చేసినట్లు ఎస్ఐ ధరణి బాబుకు శుక్రవారం పిర్యాదు చేసినట్లు ఇంచార్జ్ ప్రిన్స్పాల్ తెలిపారు.గ్రామానికి దూరంగా ఉన్న పాఠశాలలో ఇలాంటి  సంఘటనలు భవిష్యత్ రాకుండా పోలీసులు రాత్రి వేళల్లో బందోబస్త్ నిర్వహించాలని వారు కోరుతూ.... అపరిచిత వ్యక్తిపై పిర్యాదు చేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

______________________________

విజయస్వప్నం.నెట్ ఫిబ్రవరి 24(శ్రీసత్యసాయిజిల్లా)

నెల్లూరు జిల్లా కవాలి పట్టణంలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం ధర్మశాల ఆవరణలో శనివారం శ్రీగురు శాంత్ రవిదాస్ జయంతి సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించినట్లు కదిరి పట్టణానికి చెందిన ఏపీ బిజెపి ఎస్సి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ తెలిపారు.ఈకార్యక్రమంలో కవాలి బిజెపి పట్టణ అధ్యక్షులు బ్రహ్మానందం,నెల్లూరు బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ ఎస్సి మోర్చా ఉపాధ్యక్షులు పారసు వెంకటేశ్వర్లు,నెల్లూరు జిల్లా బీజేపీ ఎస్సి మోర్చా అధ్యక్షులు పారసు మధు తదితరులు పాల్గొన్నారన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి