11, ఫిబ్రవరి 2024, ఆదివారం

70/71 సర్క్యులర్ రద్దు చేయాలి:కదిరి ఎంప్లాయిస్ యూనియన్

శ్రీసత్యసాయి జిల్లా,కదిరి ఫిబ్రవరి10(విజయస్వప్నం.నెట్)

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  కదిరి డిపోలో శనివారం ఎంప్లాయీస్ యూనియన్  సర్వ సభ్య సమావేశం స్థానిక ఎన్జిఓ హోమ్ లో ఏర్పాటు చేసారని యూనియన్ నాయకులు తెలిపారు.ఈ సమావేశానికి శ్రీసత్యసాయి జిల్లా రీజినల్ సీవీపీ ఆర్ఎస్ రెడ్డి అధ్యక్షత వహించగా,రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు,నబి రసూల్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ 70/71 సర్క్యులర్ రద్దు చేసి 01/2019 సర్క్యులర్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ....భవిష్యత్తులో రాష్ట్ర కమిటీ ఎలాంటి సందర్బంలో పిలుపు ఇచ్చినా ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయిజిల్లా అధ్యక్షులు కే.బి.నాగార్జున రెడ్డి,రీజనల్ కార్యదర్శి జివైపిరావు,డిపో కార్యదర్శి పిశంకర్,డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ జిసిఎస్ నాయుడు, పిఈ ఖాన్,డిపో చైర్మన్ టీజడ్ ఖాన్,గ్యారేజ్ కార్యదర్శి పి.రవికుమార్,డిపో కోశాధికారి కే.హరి కుమార్  యూనియన్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు.


18న సియం బహిరంగసభను విజయవంతం చేయాలి:- ఎమ్మెల్యే దుద్దుకుంట 


శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి ఫిబ్రవరి10(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి పట్టణ వైసీపీ క్యాంప్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ....ఈనెల 18న రాప్తాడు మండలంలో  సిద్ధం కార్యక్రమంలో భాగంగా బహిరంగసభ స్థలం పరిశీలించి ఏర్పాట్లు చేస్తున్నారని, అధికసంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని వైకాపా శ్రేణులకు సూచించారు.ఈనెల 14న ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు అయన తెలిపారు.వైసిపి అసమ్మతి నేతలపై ఎమ్మేల్యే.దుద్దుకుంట మండిపడ్డారు.నారా లోకేష్ తో నేను సమావేశం అయ్యానని దుష్ర్పచారం చేస్తున్నారని,నారా లోకేష్ ను ఒక నాయకుడిగా చూడలేదని,ఆయన వార్డు సభ్యులుగా కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు.తాతల కాలం నుంచి  వైఎస్సార్ కుటుంబానికి దుద్దుకుంట(తాము)కుటుంబ సభ్యులు విధేయులు ఉంటున్నామని,ప్రాణమున్నత వరకు వైఎస్ జగన్ కోసమే పని చేస్తానని ఎమ్మెల్యే దుద్దుకుంట స్పష్టం చేశారు.ఆకాలనీలో తనే (దుద్దుకుంట) విగ్రహం ఏర్పాటు చేయించిందని, విగ్రహాలను ద్వంసం చేసే నీచ సంస్కృతి మాకు(వైకాపాకు) లేదన్నారు.సీఎం జగన్  దేవుడని,ఆయన ఆదేశానుసారం  నిర్ణయాలు తీసుకుంటానని దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అభిప్రాయం తెలిపారు. సొంత పార్టీ నేతలు నిజానిజాలు తెలుసుకోకుండా అభాండాలు వేస్తే చూస్తూ ఊరుకోనని, చంద్రబాబుకు జగన్ ను ఎదుర్కొనే శక్తి లేక రాష్ట్రాలు తిరుగుతున్నాడని, పొత్తులు లేకుండా ఇప్పటి వరకు ఎలాంటి ఎన్నికల్లోనైనా టీడీపీ పోటీ చేసిందాని,పుట్టపర్తిలో వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అసమ్మతి నేతలను కూడా కలుపుకొని ఐక్యతతో వైకాపా విజయం సాధించి మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తామని ఎమ్మెల్యే దుద్దుకుంట ధీమా వ్యక్తం చేశారు.

నేడు పెడబల్లిలో మాజీ మంత్రి పల్లె బహిరంగ సభ 

శ్రీసత్యసాయిజిల్లా, ఫిబ్రవరి10(విజయస్వప్నం.నట్)

నేడు(ఆదివారం)ఉదయం 11 గంటలకు పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోని పెడబల్లిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి  ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.ఈకార్యక్రమానికి జిల్లా ప్రముఖ నాయకులు ముఖ్య అతిధులుగా హాజరైయ్యా భవిష్యత్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి తెలుగుదేశంపార్టీ విజయానికి ప్రణాళికలు రూపొందిస్తారని తెలిపారు.కావున ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళాకార్యకర్తలు,తెలుగుయువత, అనుబంధ సంఘాల నాయకులు సమావేశంలో పెద్ద ఎత్తున హజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అయన పిలుపునిచ్చారు.

శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో భజనలు  


శ్రీసత్యసాయిజిల్లా,కదిరి ఫిబ్రవరి10(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో శనివారం ఖాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో  భక్తిశ్రద్దాలతో భజనలు చేశారు.ఈకార్యక్రమంలో తిరుపతి అన్నమయ్య పీఠాధిపతి శ్రీ శ్రీ విజయ శంకర స్వామి,గాండ్లపెంట కాసి అన్నపూర్ణేశ్వరమ్మ(కాశినాయన ఆశ్రమం పీఠాధిపతి)కదిరి శివారెడ్డి స్వామి,రంగప్ప స్వామీ,నరసింహరావు,బాలయ్య,శంకర్ రెడ్డి,కౌలేపల్లి రమణ,వెంకటరమణస్వామి,రామస్వామి,అచల గురువు ఆదినారాయణస్వామి,కుటగుల్లా ఆదినారాయణ,దొడ్డప్ప ఓబులేష్ స్వామి,డప్పు గంగప్పస్వామి,ముదిగుబ్బ సోంపాలెం లక్ష్మీనారాయణ, భజన బృందం రామకోర్పల్లి రామచంద్రప్ప,కొండేపాలెం మహేష,రేణిగుంట్ల ఆదినారాయణ తదితరులు పాల్గోని భక్తిగీతాలు ఆలపించి, హరినామ సంకీర్తన భజనలు చేశారని తెలిపారు.

మండలంలో అయోధ్య సీతారాముల కళ్యాణోత్స ప్రచార రధయాత్ర


శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఫిబ్రవరి 10(విజయస్వప్నం.నెట్)

ఈనెల 21న కదిరి పట్టణ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల మైదానంలో కదిరి సేవా భారతి ఆధ్వర్యంలో శ్రీ అయోధ్య సీతారాముల కళ్యాణోత్సవం శుభకార్యముకు గ్రామీణ ప్రాంతాల నుండి తరలిరావాలని 11 మండలాల్లో రదయాత్రతో ప్రచారం చేపట్టారని,అందులో భాగంగా శనివారం ఆమడగూరు మండలం నుండి మండల పరిధిలోని ఎంబి క్రాస్, వేమారెడ్డిపల్లి, ఆకుతోటపల్లి, జర్రికుంటపల్లి నుండి ఓడిచెరువు మండల కేంద్రానికి చేరుకోగా సేవా భారతి కార్యవర్గ సభ్యులు పిట్టా ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్,పూలప్ప, సుబ్బరాజు, డప్పు నరేష్, సౌదీ నాగరాజు తదితరులు సీతారాముల విగ్రహాలకు పూలహారాలు వేసి భక్తిశ్రద్దాలతో పూజలు నిర్వహించారు. భజన మండలి కళాకారులు రధం ముందు భక్తిగీతాలు ఆలపిస్తూ మీదుగా  పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మామిళ్లకుంట్లపల్లిలో భక్తులు కాయకర్పూరం సమర్పించారు. కుసుమవారిపల్లి రాత్రి ఈశ్వరిమాత ఆలయం వద్ద భజన కార్యక్రమం నిర్వహించారని, 11వతేది ఉదయం దిగువపల్లి నుండి గాజుకుంటపల్లి, వణుకువారిపల్లి,మిట్టపల్లి గ్రామాల మీదుగా అయోధ్య శ్రీరాముల రదయాత్ర కొనసాగించి నల్లమాడ మండలంలోని పులగంపల్లికి చేరుకొంటుందని ధర్మజాగారణ, సేవా భారతి కార్యవర్గసభ్యులు తెలిపారు.భజన కళాకారులు సుబ్బరాజు, పూజారి వెంకటరమణ, నాగప్ప, బ్యాంకు శీనా, బీజేపీ మండల కార్యదర్శి ఏ.నరేష్ బాబు, కుళ్లాయమ్మ, మస్తానమ్మ తదితర భక్త బృందం సభ్యులు, భజన కళాకారులు పాల్గొన్నారు. అయోధ్య సీతారాముల కళ్యాణమహోత్సవం కార్యక్రమంలో ప్రవచకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు పాల్గోని ప్రవచనాలు భోధిస్తారని తెలిపారు.


_____________________________

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు

ఫిబ్రవరి10(విజయస్వప్నం.నెట్)ఈనెల 13నుండి 15వరకు గుత్తిలో (సేవాఘడ్)నిర్వహించే శ్రీసేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ వేడుకల్లో మండలంలోని గ్రామీణ ప్రాంతాల నుండి భారీ తరలివచ్చి విజయవంతం చేయాలని శనివారం అఖిల భారత బంజారా సేవా సమితి మండల కమిటీ అధ్యక్షులు రమణ నాయక్ జిల్లా కమిటీ సభ్యులు మోహన్ నాయక్, రమేష్ నాయక్,రత్నాభాయ్, బాబూనాయక్(ఉపాధ్యాయులు)తదితరులు విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు.14వతేది లక్ష మంది గుత్తి సేవాఘడ్ లో గిరిజన గర్జన నిర్వహిస్తారని,కావున గ్రామీణ గిరిజన ప్రాంతాల నుండి అధికసంఖ్యలో గిరిజన సోదరి, సోదరులు పాల్గోని జయప్రదం చేయాలని వారు కోరారు.

________________________________

లేపక్షికి విచ్చేసిన సుప్రీమ్ కోర్ట్ జడ్జ్




శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి 10(విజస్వప్నం.నెట్)

సుప్రీంకోర్ట్ జస్టిస్ న్యాయమూర్తి ఆశానుద్దీన్ అమానల్లా,న్యాయమూర్తి వెంకటనారాయణ బట్టి శనివారం లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు.ఉమ్మడి జిల్లాల అదనపు సివిల్ జడ్జిలు, సీనియర్ సివిల్ జడ్జిలతో కలసి సుప్రీం కోర్ట్ జడ్జిలు లేపాక్షి ఆలయంలో సందర్శించి అద్భుతమైన శిల్ప కళ నైపుణ్యం తిలకించారు.జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్,పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ మాధవరెడ్డి తదితరులు సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులకు  పుష్పగుచ్చాలు అందించి గౌరవపూర్వకంగా స్వాగతం పలికారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి