google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : శ్రీసత్యసాయి జిల్లా - వడ్డెర్ల శ్రేయోభిలాషి మల్లెల జయరాం - ఉచిత వివాహ శుభకార్యానికి ఎస్ఐకి ఆహ్వానం - నూలి పురుగుల నివారణ మందులు పంపిణి - భవన నిర్మాణ కార్మికుల సమ్మె విరమణ - ఆహార సంరక్షణపై విద్యార్థినీలు ర్యాలీ

7, ఫిబ్రవరి 2024, బుధవారం

శ్రీసత్యసాయి జిల్లా - వడ్డెర్ల శ్రేయోభిలాషి మల్లెల జయరాం - ఉచిత వివాహ శుభకార్యానికి ఎస్ఐకి ఆహ్వానం - నూలి పురుగుల నివారణ మందులు పంపిణి - భవన నిర్మాణ కార్మికుల సమ్మె విరమణ - ఆహార సంరక్షణపై విద్యార్థినీలు ర్యాలీ

వడ్డెర్ల శ్రేయోభిలాషి మల్లెల జయరాం

శ్రీసత్యసాయి జిల్లా, ఫిబ్రవరి07(విజయస్వప్నం.నెట్)

30ఏళ్లుగా నిరంతరం అందుబాటులో ఉంటూ వడ్డెర్ల కోసం శ్రామిస్తూ.... వడ్డెర్ల శ్రేయోభిలాషుడుగా మల్లెల జయరాం సేవలు అందిస్తున్నట్లు వడ్డెర్ల సంఘం నాయకులు కొనియాడారు.మండల వడ్డెర్ల సంక్షేమ సంఘం కార్యాలయం సంఘం మండల అధ్యక్షులు ఆర్ఎంపి డాక్టర్ కిష్టప్ప,ప్రధాన కార్యదర్శి వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.... దాదాపుగా మూడు దశాబ్దాలుగా పుట్టపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా వడ్డెర్ల సమస్యపై స్పందిస్తూ.... వడ్డెర్ల సంఘంలో సేవా కార్యక్రమాలు చేపట్టి శ్రేయోభిలాషిగా మల్లెల జయరాం గుర్తింపు పొందారని, మృధుస్వభావి, మంచి మనసుతో సేవలు అందిస్తున్న మల్లెల జయరాం  లాంటి వ్యక్తి చట్టసభలోకి వెళితే.... నియోజకవర్గం ప్రజలకు మరింత సేవలు అందిస్తారన్నారు. పుట్టపర్తి  నియోజకవర్గంలో 45వేల వడ్డెర్ల ఓట్లు ఉన్నాయని,మల్లెల జయరాం సేవా కార్యక్రమాలు తెదేపా అధిష్టానం గుర్తించి శాసనసభ స్థానానికి టికెట్ ఇస్తే వడ్డెర్ల ఐక్యమత్యంగా ఉండి సునాయాసంగా గెలిపించుకొంటామని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో రమణ,మహేష్,నాగరాజు,మనోజ్ కుమార్,ఉత్తప్ప,రవి, వేమనారాయణ,రామచంద్ర, నాగలక్ష్మి,బళ్లారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

_________________________________

ఉచిత వివాహ శుభకార్యానికి ఎస్ఐకి ఆహ్వానం

శ్రీసత్యసాయి జిల్లా, ఫిబ్రవరి07(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రానికి అతి సమీపంలో ఎం.కొత్తపల్లి బంగారు బండపై వెలసిన శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామివారి దేవస్థానం ఆవరణలో శ్రీలక్ష్మినరసింహస్వామి సన్నిధిలో ఈనెల 14వతేది(మాఘుమాసం)కదిరి జోగి శ్రీదేవి ఫౌండేషన్ చైర్మన్ కోడూరు శ్రీకాంత్,ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే 11 జంటల వధూవరులకు సామూహిక వివాహ శుభకార్యక్రమంలో పాల్గొనాలని బుధవారం పోలీసుస్టేషన్ లో ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ వంశీకృష్ణను చైర్మన్ కోడూరు శ్రీకాంత్,ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు మర్యాద పూర్వకంగా కలసి ఆహ్వానపత్రిక అందజేశారు.జోగి శ్రీదేవి ఫౌండేషన్ చైర్మన్ శ్రీకాంత్ సహకారంతో ఉచిత వివాహాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు ఈసందర్బంగా తెలిపారు.నూతన వధూవరులకు మంగళసూత్రాలు,నూతన వస్త్రాలతో పాటు భోజనాలు తదితరులు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జోగి శ్రీదేవి ఫౌండేషన్ చైర్మన్ కోడూరు శ్రీకాంత్ తెలిపారు.సామూహిక ఉచిత వివాహ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఎస్ఐ వంశీకృష్ణ కొనియాడారు. ఈకార్యక్రమంలో పురోహిత పూజారి పంచరత్న సురేష్ శర్మ, ఫౌండేషన్ సభ్యులు రాధాకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

_________________________________

నూలి పురుగుల నివారణ మందులు పంపిణి 

శ్రీసత్యసాయిజిల్లా, ఫిబ్రవరి07(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యాశాలలో ఈనెల 9న  నిర్వహించబోయే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా ముందస్తుగా వైద్య సిబ్బందికి అవసరమైన మందుల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఎంపీడీఓ పాల్గోని సిబ్బంది కి అవసరమైన నులిపురుగు నివారణ మందులు పంపిణీ చేసి,కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారని వైద్యాధికారి కమల్ రోహిత్ తెలిపారు.విద్యార్థి దశ నుండే రక్తహీనత రాకుండా తీసుకోవలసిన నివారణ చర్యలు,పోషక ఆహారంలో ఐరన్ ప్రాముఖ్యత గురించి వివరిస్తూ.... మండల వ్యాప్తముగా 9970 మంది పాఠశాల విద్యార్థులకు అందించే లక్ష్యంగా ప్రభుత్వ,ప్రైవేట్,అంగన్వాడీ,  పాఠశాలలు,కళాశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారని వైద్యాధికారి కమల్ రోహిత్ తెలిపారు.అనంతరం కస్తూరిబా బాలికల పాఠశాల విద్యార్థినిలతో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో  ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు,అంగన్వాడీ, స్వచ్చంద సంస్థలు, స్వయం సహాయక పొదుపు మహిళా సంఘాల ప్రతినిధులు,వైద్య సిబ్బంది, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

_________________________________

భవన నిర్మాణ కార్మికుల సమ్మె విరమణ

శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు ఫిబ్రవరి07(విజయస్వప్నం.నెట్)

ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.....భవన నిర్మాణ కార్మికులు గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేపట్టాగా బుధవారం సమ్మెను విరమించినట్లు భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు,సిఐటీయూ నాయకులు రమణ, లక్ష్మినారాయణ, కుళ్లాయప్ప, శ్రీరాములు తెలిపారు.స్థానిక ప్రజా ప్రతినిదులు,అధికారులు గానీ సమస్యల గురించి పట్టించుకోవడం లేదని. భవన నిర్మాణ కార్మికులకు  రెక్కాడి .తేగానే .డొక్కాడని పరిస్థితిలో ఉన్నారని,జీవనోపాదులకు కష్టముగా ఉన్నందున ఇది విషయం గమనించి 9వరోజు దీక్షను తాత్కాలికంగా. విరమీంప చేస్తున్నట్లు పేర్కొన్నారు. తర్వాత కార్యాచరణ రూపొందించుకొని,తిరిగి ఉద్యమాన్ని. కొనసాగిస్తామని. ఈసందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో, భవన నిర్మాణ కార్మిక సంఘం, కార్యదర్శి రవి, సహాయ కార్యదర్శి కేశవ,అధ్యక్షులు కిష్టప్ప.సూరి.సురేంద్ర. శ్రీనివాసులు,మహేంద్ర,మనీ,గంగాదేవి, రమణ,సుగుణమ్మ,గంగా తదితరులు పాల్గొన్నారు.

_________________________________

ఆహార సంరక్షణపై విద్యార్థినీలు ర్యాలీ

శ్రీసత్యసాయి జిల్లా, ఓడిచెరువు ఫిబ్రవరి07(విజయస్వప్నం.నెట్)

మండలంలోని కస్తూరిభా బాలికల పాఠశాల విద్యార్థినిలకు ఆహార సంరక్షణపై అవగాహన కల్పించినట్లు ఎస్ఓ గీతాభాయి తెలిపారు.ఆహార పదార్ధాలు తయారీలో శుచి, శుభ్రత పాటించి నైపుణ్యంతో ఆహార సంరక్షణ సాధ్యమన్నారు.అనంతరం విద్యార్థినీలు ర్యాలీ నిర్వహించి,మండల కేంద్రంలో  టైమ్ సెంటర్ ఫర్ లర్నింగ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బేకరీలో ఆహార పదార్ధాలు తయారు చేసే విధానంపై అవగాహన కలిపించినట్టు ఒకషనల్ ట్రైనర్ గంగాభవాని తెలిపారు.

_________________________________

జర్నలిస్ట్ రాష్ట్ర స్థాయి ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ 

అనంతలో ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ తరహా క్రికెట్ టోర్నీ ఆంధ్ర, తెలంగాణ లోని హైదరాబాదు సికింద్రాబాద్ సిటీ అన్ని జిల్లాల జర్నలిస్టులు పాల్గొనవచ్చు వైట్ బాల్, కలర్ డ్రెస్సులతో టోర్నమెంట్ స్పోర్ట్స్ జర్నలిస్టులకు ప్రత్యేక ఎంట్రీ మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏ పి డబల్యూజెయు) రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి

అనంతపురం ఫిబ్రవరి07(విజయస్వప్నం. నెట్)

వర్కింగ్ జర్నలిస్టుల ఐకమత్యం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జర్నలిస్టు ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 3 వరకు అనంతపురం పట్టణంలోని ఆర్డిటి ప్రధాన క్రికెట్ మైదానంలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు పేర్కొన్నారు. టోర్నమెంట్ కు సంబంధించిన వివరాలను మచ్చ రామలింగారెడ్డి విలేకరుల సమావేశంలో ప్రకటించారు.రాష్ట్ర జర్నలిస్ట్ ఉద్యమ చరిత్రలో ఇప్పటివరకు భారీ స్థాయిలో క్రికెట్ టోర్నీ ఎవ్వరూ నిర్వహించలేదని,రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా మొట్టమొదటి సారిగా అనంతపురం నగరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వర్కింగ్ జర్నలిస్టులందరూ ఆంధ్ర,తెలంగాణలోని హైదరాబాద్,సికింద్రాబాద్ సిటీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా చిన్న పత్రికలలో వివిధ ఛానల్స్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులందరూ ఈ టోర్నమెంట్ లో పాల్గొనవచ్చునని,అన్ని జిల్లాలకు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుందని ఈసందర్బంగా మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి గల జర్నలిస్టులందరూ పాల్గొనవచ్చునని,ఒక జిల్లాకు ఒకే జట్టు అనే నిబంధన ఏమీ లేదని,ఎన్ని జట్లు అయిన జర్నలిస్టులు క్రికెట్ ఆడాలని ఆసక్తి ఉంటే అవకాశం ఇస్తామని అన్నారు.ఐపీఎల్ తరహాలో జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి జర్నలిస్ట్ ఓపెన్ టోర్నమెంట్ రంగురంగు దుస్తులు,తెల్లని బంతితో నిర్వహిస్తారని,టోర్నమెంట్ లో పాల్గొనే అన్ని జర్నలిస్టు జట్లకు కలర్ టీ షర్ట్ ఒక్కొక్క జట్టుకి ఒక కలర్ కేటాయించి ఉచితంగా అందజేస్తారని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.వర్కింగ్ జర్నలిస్టులు అక్రిడేషన్ ఉన్నవాళ్లు అక్రిడేషన్ లేకపోయినా మేనేజ్మెంట్ పత్రిక గుర్తింపు కార్డు ఉన్నటువంటి విలేకరులు ఈ టోర్నమెంట్లో పాల్గొనవచ్చునని,కచ్చితంగా సంబంధిత మేనేజ్మెంట్ గుర్తింపు కార్డులు,లెటర్లు ఉన్న వారికి మాత్రమే టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు.టోర్నమెంట్లో పాల్గొనే జర్నలిస్టులకు ఉచితంగా భోజనం,వసతి సౌకర్యం,ఒక కలర్ టీ షర్టు కూడా అందిస్తామని మచ్ఛా తెలిపారు.ఆంధ్ర, తెలంగాణలో పనిచేస్తున్న స్పోర్ట్స్ జర్నలిస్టులకు ప్రత్యేక ఎంట్రీ ఇస్తామని,స్పోర్ట్స్ జర్నలిస్టులందరూ ఎన్ని టీంలైనా పాల్గొనవచ్చునని,టోర్నమెంట్లో విజేతకు  ట్రోఫీని అందచేస్తామని,రన్నర్స్ గెలుపొందిన వారికి మూడో స్థానంలో గెలుపొందిన జట్లకు ట్రోఫీలు అందించనున్నట్లు తెలిపారు. అలాగే టోర్నమెంట్లో రాణించిన జర్నలిస్టులకు బెస్ట్ బ్యాట్స్మెన్,బెస్ట్ బౌలర్ ఇతర ప్రత్యేక బహుమతులను ప్రదానం చేస్తామని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆంధ్ర,తెలంగాణ హైదరాబాద్,సికింద్రాబాద్ సిటీల్లో తదితర జిల్లాలలో  పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ టోర్నమెంట్ లో పాల్గొని ఆడాలని,జర్నలిస్టులందరూ ఒక వేదిక మీద ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ఒక్కరు సహకారం అందించి విజయవంతం చేయాలని మచ్చా రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు.టోర్నమెంట్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న జర్నలిస్టు క్రికెట్ జట్లు ఈ నెల ఫిబ్రవరి 13వ తేదీలోపు తమ జట్టు ఎంట్రీలను అనంతపురం పట్టణంలోని సుభాష్ రోడ్డులో అంకుశం పత్రిక ప్రధాన కార్యాలయంలో అందజేయాలని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.టోర్నమెంట్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న జర్నలిస్టులు ప్రతి జర్నలిస్టు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని,ఇతర వివరాల కోసం  సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు విజయ్ రాజు జిల్లా సెక్రెటరీ అనంతపురం. 9849152149,  9390997033, 7386958666 సంప్రదించవచ్చునని అయన కోరారు.

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (APWJU)

_________________________________

జయహో బిసి సభను విజయవంతం చేయండి

తెదేపా మండల కన్వీనర్ రాజశేఖర్ పిలుపు

 శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు ఫిబ్రవరి07(విజయస్వప్నం. నెట్)

నల్లచెరువు మండలకేంద్రంలోని తెదేపా మాజీ ఎంపీపీ మాబూసాబ్ నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మండల కన్వీనర్ రాజశేఖర్ మాట్లాడుతూ....8వతేది(నేడు)స్థానిక గీతామందిరంలో జరగబోయే జయహో బిసిసభకు నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కదిరి తెదేపా ఇంచార్జ్,ఎమ్మేల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్,జిల్లా నాయకులు హాజరవుతున్నారన్నారు.ఈకార్యక్రమంలో సర్పంచులు హర్షవర్ధన్ నాయుడు,నాగరాజు,బిసి నాయకులు దేవేంద్ర గౌడ్,బషీర్ అహ్మద్  తదితరులు పాల్గొన్నారు.

_________________________________

జైన్ పాఠశాలలో రోడ్ భద్రతపై అవగాహన 


శ్రీసత్యసాయి జిల్లా, కదిరి, ఫిబ్రవరి07(విజటాస్వప్నం. నెట్)

జనవరి 21 నుండి ఫిబ్రవరి 19 వరకు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కదిరి బేరిపల్లిలో బుధవారం జైన్ పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్  పాల్గోని ఈ సందర్భంగా అయన విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.... రోడ్డు భద్రత జాగ్రత్తలు,విద్యార్థులకు డ్రైవర్లకు సలహాలు,సూచనలుఇచ్చి, కొన్ని మెలకువలు పాటించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్బంగా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ ను శాలువ కప్పి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు,విద్యార్థులు,  డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పాఠశాల ముఖ్య కార్య నిర్వహకులు సాగర్ సిసిఓ ప్రిన్సిపాల్ జయగుప్త, ఆఫీస్ ఇన్చార్జిల ఆధ్వర్యంలో నిర్వహించారని తెలిపారు.

_______________________________

టిడిపి నుండి పలువురు వైకాపాలో చేరిక


అనంతపురం,కదిరి ఫిబ్రవరి07(విజయస్వప్నం. నెట్)

రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కదిరి పర్యటనలో భాగంగా వైసిపి కదిరి అసెంబ్లీ అభ్యర్థి మక్బూల్ అహమ్మద్,మాజీ వైసిపి రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి ఆద్వర్యంలో బుధవారం అనంతపురం ఆర్ అండ్ బి బంగ్లాలో నంబుల పూలకుంట మండలం దనియానిచెరువు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ కుమారుడు ప్రస్తుత పాఠశాల చైర్మన్ బావాజీ యాదవ్,సలీం బాషా,సురేష్,నాగేశ్వర్ తదితరులు వైకాపాలో  చేరినట్లు తెలిపారు.మంత్రి, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ  కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.వీరితో పాటు మండల కన్వీనర్ రంగారెడ్డి, వైకాపా శ్రేణులు పాల్గొన్నారు.

_______________________________


శ్రీసత్యసాయి జిల్లా,కదిరి పట్టణంలో 83,1735 1ఏ1 సర్వే నెంబర్ లో జరిగిన భూ కుంభకోణంలో కారకులు ఆర్ఐ మునవర్ హుసేన్ పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,అతని దళారులైన బొట్టు సామి,నారాయణ పాల్ తదితరులను అరెస్టు చేయాలని,నిరుపేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు బుధవారం 10 వరోజుకు చేరాయని తెలిపారు.

_______________________________

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఫిబ్రవరి 07(విజయస్వప్నం.నెట్)

బిజెపి జిల్లా అధ్యక్షులు శేఖర్ స్వామి ఆధ్వర్యంలో బుధవారం ఓడిచెరువు మండల బిజెపి నూతన కమిటీ ఎంపిక చేశారు. నూతన కమిటీ అధ్యక్షులుగా రంగారెడ్డి, ఉపాధ్యక్షులుగా నాగప్ప,లక్ష్మిరెడ్డి,హరినాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా రాజశేఖర్, నీలకంఠరెడ్డి, జనార్దన్ రెడ్డి, బలరాం, భానుచందర్,కోశాధికారి ఓబులేసుతోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు తెలిపారు

_____________________________

శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు మండల కేంద్రంలో బుధవారం అభయ ఆంజనేయస్వామి ఆలయంలో రాబోయే ఎన్నికలలో రాష్ట్రములో తెదేపా అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అలాగే పుట్టపర్తి ఎమ్మెల్యేగా పల్లె రఘునాథ్ రెడ్డి విజయం సాధించి ప్రజలకు సేవలందించాలని మండల తెదేపా నాయకులు,కార్యకర్తలు 101 టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు.

_____________________________

కానిస్టేబుల్ గణేష్ మృతదేహానికి నివాళులు



 శ్రీసత్యసాయిజిల్లా,ధర్మవరం ఫిబ్రవరి07(విజయస్వప్నం.నెట్)

ధర్మవరం పట్టణంలోని గుట్టకిందపల్లికి చెందిన కానిస్టేబుల్ కురుబ గణేష్ కుటుంబాన్ని మాజీ శాసనసభ్యులు గోనుగుంట్ల సూర్యనారాయణ బుధవారం పరామర్శించి, 1లక్ష రూపాయలు అందజేశారని తెలిపారు.నిన్నటి రోజు 6వతేది తిరుపతిలో(మంగళవారం) ఎర్రచందనం స్మగ్లర్ల కారుతో ఢీ కొట్టిన సంఘటనలో కానిస్టేబుల్ కురుబ గణేష్ మృతి చెందారు.కానిస్టేబుల్ గణేష్ భౌతికకాయానికి బుధవారం ఉదయం గుట్టకిందపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపి పరామర్శించి,అన్ని విధాల అండగా ఉంటానని తనవంతుగా ఒక లక్ష రూపాయలు ఆర్థిక తొడ్పాటు అమరుడు కానిస్టేబుల్ కురుబ గణేష్ కుటుంబ సభ్యులకు గోనుగుంట్ల సూర్యనారాయణ అందజేశారు.కానిస్టేబుల్ గణేష్ మృతదేహానికి తెదేపా జిల్లా అధ్యక్షులు బికే పార్థసారధి,పరిటాల శ్రీరామ్ తోపాటు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి