google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net

24, ఫిబ్రవరి 2024, శనివారం

భక్తిశ్రద్దాలతో గ్రామ దేవతలకు జలాభిషేకం 

శ్రీశైసత్యసాయి జిల్లా, ఓబుళదేవరచెరువు ఫిబ్రవరి 23(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు గ్రామ సత్యమ్మ వీధిలో గంగమ్మతల్లి,నాగులకట్ట వద్ద  సత్యమ్మ దేవతలకు మాఘు మాస శుక్రవారం సందర్బంగా 101 బిందెల జలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమములో మహిళలు, భక్తులు పాల్గొని భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ  పిట్టా ప్రభాకరరెడ్డి, కే.నాగేశయ్య, గందోడి సౌదీ నాగరాజు, పి.నరసింహబాబు, పి.నరసయ్య, ఏ.ఆంజి, ఇ.రమణ, ఏ.నరేష్ బాబు, ఎస్.అరవింద్, యు.సతీష్, ఏ.అజయ్ , టీ.గణేష్, వేములపల్లి శీన, వేములపల్లి రాజా తదితరులు పాల్గొన్నారు.

_____________________________

వైద్య చికిత్సలకు ఉపాధ్యాయులు సాయం

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి 23(విజయస్వప్నం.నెట్

)మండలంలోని కమ్మవారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నేలకోటప్ప తీవ్ర అనారోగ్యం బాధపడుతూ అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మండలంలోని ఉపాధ్యాయులు లక్ష 12 వేల రూపాయలు, జిల్లాలోని 98 ఎంటిఎస్ ఉపాధ్యాయులు 63,500 రూపాయలు సేకరించి  ఉపాధ్యాయుడి భార్యకు శుక్రవారం సవేరా ఆసుపత్రిలో ఆర్థికసాయం చేసి,చికిత్స పొందుతున్న ఉపాధ్యాయుడు నేల కోటప్పను పరామర్శించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సురేష్ బాబు, రమణ, ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి,గౌస్ లాజామ్, ఎంటిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నాగరాజు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

_____________________________

శ్రీసత్యసాయిజిల్లా అమడుగూరు ఫిబ్రవరి23(విజయస్వప్నం.నెట్)

ఆమడగూరు మండలంలోని మహమ్మదాబాద్ పంచాయతీ తిమిరికుంటపల్లి, సంగీతంపల్లి, పట్రవాండ్లపల్లి గ్రామాల్లో నేడు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారుని, ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు,అభిమానులు బారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  తెదేపా శ్రేణులు పిలుపునిచ్చారు.

_____________________________

నేడు వాలంటీర్లకు వందనం సన్మాన సభ

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి 23(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం అవరణంలో నేడు(శనివారం) నల్లమాడ,ఓ‌డిచెరువు, అమడగూరు మండలాలకు చెందిన  గ్రామ వాలంటీర్లకు వందనం  కార్యక్రమంలో భాగంగా ఉదయం 9గంటలకు సన్మాన సభ నిర్వహిస్తారని, అలాగే బుక్కపట్నం మండలం చెండ్రాయుని పల్లె కొండల్లో వెలిసిన చెండ్రాయుని స్వామి తడక మహోత్సవంలో ఎమ్మెల్యే దుద్దుకుంట పాల్గోంటారని, అనంతరంబుక్కపట్నం చెరువులోకి చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గోంటారని,పుట్టపర్తి లోని ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయంలో జరిగే కొత్తచెరువు,బుక్కపట్నం, పుట్టపర్తి అర్బన్,రూరల్ గ్రామీణ వాలంటీర్లకు నిర్వహించే వందనం కార్యక్రమంలో పాల్గోంటారని స్థానిక ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

_____________________________

రెడ్డి పల్లిలో ప్రచారం నిర్వహించిన దుద్దుకుంట అపర్ణ రెడ్డి గారు

శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ ఫిబ్రవరి 23(విజయస్వప్నం.నెట్)

నల్లమాడలోని రెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం దివంగత మహానేత వైఎస్.రాజ శేఖర్ రెడ్డి విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించి పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సతీమణి అపర్ణ రెడ్డి ఇంటింటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో వైకాపా కు ఓటు వేసి,జగనన్న ముఖ్యమంత్రిగా,దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యే గా గెలిపించాలని ప్రచారం కొనసాగించారు.

_____________________________

శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఫిబ్రవరి 23(విజయస్వప్నం.నెట్)

కదిరి మండల పరిధిలోని మోటుకపల్లి పంచాయతీ కౌలేపల్లి గ్రామంలో వైసిపి వార్డు మెంబర్ తో పాటు దాదాపు 40 కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి తెదేపాలోకి చేరారు.శుక్రవారం కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్యెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్  కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలో ఆహ్వానం పలికారు.

_____________________________

శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఫిబ్రవరి 23(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలోని షాలిమార్ పంక్షన్ భవనంలో శుక్రవారం వైకాపా అభ్యర్థి మక్బుల్ బాష అధ్యక్షతన వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించి,గ్రామీణ వాలంటీర్లను సన్మానించి, ప్రసంసాపత్రాలు అందజేశారు. ఈకార్యక్రమంలో అధికారులు,వైకాపా నాయకులు పాల్గొన్నారు.

_____________________________

నల్లమాడలో హెచ్.ఐ.వి / ఎయిడ్స్ పై నాటక ప్రదర్శన

శ్రీసత్యసాయిజిల్లా, నల్లమాడ ఫిబ్రవరి23(విజయస్వప్నం.నెట్)

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ,జన జాగృతి కదిరి స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో  వెంకటేష్ కళాజాత బృందాలతో అవగాహన నాటక ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం నల్లమాడ ప్రధాన కూడలిలో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహనకార్యక్రమాన్ని నిర్వహించారు. నాటక ప్రదర్శన ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు,వ్యాధి వ్యాప్తి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకకుండ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి,సుఖ వ్యాధులు,చికిత్సలు,కండోమ్ ఉపయోగాలు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017,ఏఆర్టి మందులు, ఏపిఎస్ఏ సి ఎస్ యాప్,టోల్ ఫ్రీ నెంబర్ 1097 తదితర అంశాలపై వెంకటేష్ కళాజాత బృందం కళాకారులు పుర ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో  జన జాగృతి కదిరి ప్రాజెక్ట్ మేనేజర్ ఇ.శ్రీనివాసులు, ఓ.ఆర్.డబ్ల్యూ శ్రీవాణి, పిఈఎస్ శాంతమ్మ, ప్రసన్న, చంద్రకళ, విహన్ టీమ్ విజయ్, చైల్డ్ ఫండ్ ఇండియా యువరాజ్  పాల్గొన్నారు.

_____________________________

శ్రీసత్యసాయిజిల్లా, ఆమడగూరు ఫిబ్రవరి23(విజయస్వప్నం.నెట్)

ఆమడగూరు మండల కేంద్రంలోని షిర్డీ సాయిబాబా మందిరం వద్ద నివాసం ఉంటున్న రైతు ధర్మవరం వెంకటరమణకు చెందిన వేరుశెనగ గడ్డివామికి గురువారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో దాదాపు 30 వేలు విలువ చేసే మూడు ట్రాక్టర్ల పశుగ్రాసం పూర్తిగా దగ్ధం అయ్యిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్థికసాయం చేసి ఆడుకోవాలని కోరారు.

శ్రీసత్యసాయిజిల్లా ఓబుళదేవరచెరువు మండలంలోని గాజుకుంటపల్లికి చెందిన ఓగేటి శ్రీనివాసులుకు చెందిన3ఎకరాల పొలంలో కూరగాయల సాగుతో పాటు 1.50 ఎకరాల్లో సాగుచేసిన తమలపాకుల తోట గురువారం అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఖాళీపోయి బూడిద అయ్యినట్లు వాపోయారు.మూడు లక్షలు అప్పుచేసి ఆకుతోట సాగుచేయగా, పంట చేతికి వచ్చేలోపు అగ్ని ప్రమాదంలో డ్రిప్, స్పింకర్లు, పైపులు, కేబులు వైర్లు పూర్తిగా దగ్ధం అయ్యాయని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని రైతు కోరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి