8, ఫిబ్రవరి 2024, గురువారం

ఎమ్మెల్యే బాలకృష్ణను కలసిన తెదేపా నాయకులు - ఆర్ఐ,వీఆర్వోపై అనుచిత వ్యాఖ్యలు దారుణం : రెవిన్యూ ఉద్యోగుల నిరసన - అపరచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : గ్రామసభలో ఎస్ఐ వంశీకృష్ణ - రెవిన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : బిజెపి నాయకుల నిరసన

మండల కన్వీనర్ జయచంద్ర
మండల కన్వీనర్ జయచంద్ర

శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు మండల తెదేపా సర్వసభ్య సమావేశం నేడు(శుక్రవారం)స్థానిక వెంకట సాయి ఐటిఐ కళాశాలలో  ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు తెదేపా మండల కన్వీనర్ జయచంద్ర తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరౌతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కావున సమావేశానికి టిడిపి సర్పంచులు, ఎంపీటీసీలు, బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, నాయకులు కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు.
__________________________________


భారత బియ్యం పంపిణి చేసిన బిజెపి శ్రేణులు శ్రీసత్యసాయిజిల్లా, కదిరి ఫిబ్రవరి08(విజయస్వప్నం.నెట్ )దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గత మూడు సంవ్సరాలుగా దేశ పేద ప్రజల  ఆకలితో ఇబ్బంది పడకూడదన భారత బియ్యం కేవలం 1కేజీ 29 రూపాయలకే పేదలకు అందించాలనే ఉద్దేశ్యమే భారత బియ్యం పధకమని బిజెపి నాయకులు పేర్కొన్నారు.అందులో భాగంగా శుక్రవారం కదిరి పట్టణ ఇందిరా గాంధీ కూడలి వద్ద బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ ఆధ్వర్యంలో భారత బియ్యం వాహనాన్ని  రెవెన్యూ అధికారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి,మిఠాయిలు పంచిపెట్టి ప్రజలకి నిర్ణయించిన ధరకు పంపిణి చేసారన్నారని బిజెపిశ్రేణులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు డీఎల్ ఆంజనేయులు,పట్టణ అధ్యక్షలు రమేష్ బాబు,మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మైనుద్ధిన్,సమివుల్ల ,కృష్ణవేణి, నందిసెట్టి బాబు,మార్కండేయ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
______________________________
జయహో బీసీ సదస్సు విజయవంతం

శ్రీసత్యసాయిజిల్లా,కదిరి ఫిబ్రవరి08(విజయస్వప్నం.నెట్)
కదిరి నియోజకవర్గం పరిధిలోని నంబూలపూలకుంట మండలంలో మాజీ శాసనసభ్యులు,తెదేపా ఇంచార్జ్ కందికుంట వెంకటప్రసాద్ సూచనల మేరకు జయహో బీసీ సదస్సు నిర్వహించగా అధికసంఖ్యలో తెదేపా నాయకులు,కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేసారని తెదేపా శ్రేణులు పేర్కొన్నారు.రాబోయే ఎన్నికల్లో బీసీలు ఐక్యతతో శ్రమించి రాష్టంలో తెదేపా అధికారంలో తీసుకొనివచ్చి,జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చూడాలని,అలాగే కదిరి నియోజకవర్గం అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ను శాసనసభ్యులుగా గెలిపించాలని,నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశంపార్టీలో బీసీలకు పెద్దపీఠ వేశారని,చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ స్కీమ్ పై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని తెదేపా నాయకులు షాహిద్,మనోహర్ నాయుడు,కృష్ణమూర్తి,ఫర్వీన్ బాను తదితర ప్రజాప్రతినిధులు తెలిపారు. జయహో బీసీ సభ విజయవంతం చేసినందుకు నాయకులకు,కార్యకర్తలకు ధన్యవాదములు తెలిపారు.
______________________________

ఆర్ఐ,వీఆర్వోపై అనుచిత వ్యాఖ్యలు దారుణం
- రెవిన్యూ ఉద్యోగుల నిరసన

శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు ఫిబ్రవరి08(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా కొత్తచెరువు మండల రెవిన్యూ కార్యాలయంలో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న దుర్గేష్, విఆర్వో తలారి చెన్నయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం మండల రెవెన్యూ కార్యాలయం ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఆర్ఐ,విఆర్ఓ లపై అసభ్యత వ్యాఖ్యలు చేసిన లోచర్ల సర్పంచ్ కుమారుడు నారాయణస్వామి పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.నిరసన కార్యక్రమంలో రీసర్వే డిప్యూటీ తహసిల్దార్ జాకీర్,ఆర్ఐ నాగేంద్ర,వీఆర్వోలు,విఆర్ఏలు సిబ్బంది పాల్గొన్నారు.
______________________________

ఎమ్మెల్యే బాలకృష్ణను కలసిన తెదేపా నాయకులు


శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు ఫిబ్రవరి08(విజయస్వప్నం.నెట్)
హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణని గురువారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఓబుళదేవరచెరువు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.రాబోయే 2024సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి నారా చంద్రబాబునాయుడు  ముఖ్యమంత్రి అవ్వడానికి పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కొరకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఈసందర్బంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారన్నారు.పార్లమెంట్ తెలుగు రైతు సోషల్ మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ జాకీర్ అహ్మద్,జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బడిశం రామాంజనేయులు,గ్రామ కమిటీ అధ్యక్షుడు గొర్ల శంకరయ్య, మాజీ ఉపసర్పంచ్ సాదిక్ వలి,ఐ టి డి పి  నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పొగాకు షానవాజ్, బూత్ కన్వీనర్ సి.సురేష్, దండగల ఈశ్వర్ తదితరులు నందమూరి బాలకృష్ణ ను కలసినట్లు తెలిపారు.
______________________________

అపరచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
గ్రామసభలో ఎస్ఐ వంశీకృష్ణ

అపరచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అపరచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అపరచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఫిబ్రవరి08(విజయస్వప్నం.నెట్)
మండలంలోని ఆకుతోటపల్లిలో ఎస్ఐ వంశీకృష్ణ గురువారం గ్రామసభ ఏర్పాటు చేశారని తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొంటామని,ఎన్నికల సమయాల్లో ప్రశాంతంగా ఉండాలని,అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, బ్యాంకుల వద్ద కొత్త వ్యక్తులతో అప్రమత్తంగా ఉండి ఖాతా నంబర్లు ఇవ్వకూడదని,రాత్రి వేళ వ్యవసాయ భూముల వద్దకు ఇద్దరు,ముగ్గురు చొప్పున రైతులు కలసి వెళ్ళాలని, ప్రధానంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకు ఉన్నత విద్యా అందిచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తదితర అంశాలపై అవగాహన కల్పించి, సలహాలు, సూచనలు ఇచ్చినట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.
______________________________

రెవిన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
-బిజెపి నాయకుల నిరసన

శ్రీసత్యసాయిజిల్లా, ఫిబ్రవరి08(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణం బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో తహశీల్దార్  కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.గత కొన్ని రోజుల నుండి రెవిన్యూ కార్యాలయంలో తహసీల్దార్,రెవెన్యూ అధికారులు విధులకు హాజరు కాలేదని,రైతులు కానీ సామాన్య ప్రజలు కానీ తహశీల్దార్ సంతకం కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నారని,ప్రజల సమస్యల కొరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించినట్లు తెలిపారు.అనంతరం  తహశీల్దార్ కార్యాలయంలో  అధికారికి వినతి పత్రం అందజేశారని, అధికారి సానుకూలంగా స్పందించి  రెండు, మూడు రోజుల్లో నూతన తహశీల్దార్  నియామకంపై ఉత్తర్వులు జారీ చేసారని వివరణ ఇవ్వడంతో నిరసన కార్యక్రమం విరమించుకున్నరన్నారు.ఈకార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కొత్త రమేష్ బాబు, మహిళా మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి,సీనియర్ నాయకులు కిష్టప్ప,యువ మార్చా అధ్యక్షుడు శెట్టి ఉదయ్ కిరణ్,కార్యదర్శి అశోక్,జిల్లా కార్యదర్శి,కిసాన్ మోర్చా అధ్యక్షులు కేశవరెడ్డి,రాష్ట్ర కార్యదర్శి మైనార్టీ మోర్చా మెహమ్మద్ సాదిక్ బాషా,మైనార్టీ నాయకులు మైనొద్దీన్,జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి షైక్ దస్తగిరి,జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి షైక్ సమీవుల్ల,నందిశెట్టి బాబు, ఖద్దరి వెంకటరమణ  తదితరులు పాల్గొన్నారు.
_____________________________

చంద్రన్న ఆశయం కోసం ప్రతి పేదవాని ఆకలి తీరుస్తున్న సామకోటి
 లోకేష్ అడుగుజాడల్లో అన్న క్యాంటీన్ ను రెండవ రోజు పునః ప్రారంభించిన సామకోటి ఆదినారాయణ


శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఫిబ్రవరి08(విజయస్వప్నం.నెట్) 
పుట్టపర్తి మున్సిపల్ జిల్లా కేంద్రంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి ఐదు రూపాయలకి పేద ప్రజలకు కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూత వేయడంపై, మూతపడ్డ అన్నా క్యాంటీన్ ను  నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో చంద్రన్న ఆశయం కోసం ప్రతి పేదవాని ఆకలి తీర్చుట కొరకు అన్న క్యాంటీన్ ను రెండవ రోజు గురువారం పునః ప్రారంభించినట్లు  సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పేర్కొన్నారు. అయన మాట్లాడుతూ... వ్యవస్థను మార్చాలని రాజకీయాల్లోకి వచ్చిన నందమూరి తారక రామారావు పేదవారికి కూడు,గూడు, నీడ అనే నినాదంతో ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పేదవారి సంక్షేమం కోసం పాటుపడ్డారని,నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ప్రతి పేదవాని ఆకలి తీర్చుట కోసం తక్కువ ధరను నిర్ణయించి,నాణ్యమైన భోజనాన్ని అన్నా క్యాంటీన్ల  ద్వారా అందించిన ఘనత  నారాచంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు ముసివేశారన్నారు. చంద్రబాబు నాయుడు ఆశయం కోసం పేద ప్రజల కడుపు నింపే పనిలో భాగంగా మాత్రమే సత్యమ్మ దేవాలయం వద్ద అన్న క్యాంటిన్లు ప్రారంభించామని, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట పేదవారికి కడుపు నింపే అన్న కాంటీన్లు ప్రారంభించి,ఈ వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సురేష్ నాయుడు, మైనార్టీ నాయకులు సయ్యద్ బాషా, జనసేన జిల్లా నాయకులు డాక్టర్ తిరుపతేంద్ర, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోవెలగుట్టపల్లి ఆంజనేయులు, కమ్మవారిపల్లి లింగప్ప చౌదరి, సురేష్ చౌదరి, ఈనాడు గంగాధర్, ఆరోవార్డు ఇంచార్జ్ బేకరీ నాయుడు, వెంకట్రాముడు, గంగాధర్, నాగరాజు, చెన్నప్ప,నారాయణస్వామి, పాపారాయుడు, సురేంద్ర, శ్రీరాములు, రమణ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు.
____________________





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి