శ్రీసత్యసాయిజిల్లా,కదిరి ఫిబ్రవరి 11(విజయస్వప్నం.నెట్)
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవిని కదిరి పట్టణానికి చెందిన అఖిల భారత చిరంజీవి యువత నియోజకవర్గం అధ్యక్షులు కుటాల లక్ష్మణ గౌరవపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారన్నారు. దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు మెగా స్టార్ చిరంజీవికి రావడం మన తెలుగు వారికి గర్వకారణం.ఆయన సేవా గుణానికి,కళా రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డు రావడం మెగా అభిమానులగా మాకు గర్వకారణం అని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ చిరంజీవికి శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వస్త్రం, ప్రసాదం అందించారని ఈసందర్బంగా లక్ష్మణ కుటాల తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి