13, ఫిబ్రవరి 2024, మంగళవారం

నేడు నారా భువనేశ్వరి మండలానికి రాక - స్వచ్ఛభారత్ కార్మికులకు జీతాలు చెల్లించాలని వినతి -విద్యారంగం ప్రమాదకర పరిస్థితిలో : ప్రొఫెసర్ హరగోపాల్ -మండల తహశీల్దార్ గా బాధ్యతలు స్వికరణం


నేడు నారా భువనేశ్వరి మండలానికి రాక


శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఫిబ్రవరి12(విజయస్వప్నం.నెట్)

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు  సతీమణి నారా భువనేశ్వరి నేడు(మంగళవారం)మండలంలోని గాజుగుంటపల్లి గ్రామానికి మధ్యాహ్నం 12 గంటలకి విచేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళలు,తెలుగుయువత శ్రేణులు,తెదేపా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని   టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు,ఇనగలూరు పంచాయతీ గ్రామం బూత్ కన్వీనర్ శబరిష్ నాయుడు పిలుపునిచ్చారు.చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక  మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించెందుకు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా పర్యటనలో....పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ముగ్గురు కార్యకర్తలను పరామర్శించెందుకు నారా భువనేశ్వరి నేడు(13వతేది)విచ్చేస్తున్నారని,అందులో భాగంగా గాజుకుంటపల్లిలో భాదిత(మృతి చెందిన రామచంద్ర) కుటుంబ సభ్యులను ఆమె పరామర్శిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు మహిళలు నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని శబరీష్ తో పాటు సిబిఎన్,తెదేపా నాయకులు, కార్యకర్తలు కోరారు.

స్వచ్ఛభారత్ కార్మికులకు జీతాలు చెల్లించాలని వినతి

శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు ఫిబ్రవరి12(విజయస్వప్నం.నెట్ )

మండల వ్యాప్తంగా పంచాయతీ గ్రామాల్లో పనిచేస్తున్న స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని సిఐటీయు నాయకులు డిమాండ్ చేస్తూ....సోమవారం కార్మికులతో కలసి తహసీల్దార్ ఖాజాబికి వినతిపత్రం అందజేశారు. గ్రామాలలో పారిశుద్ద పనులు చేస్తూ.... కుటుంబాలు పోషించించుకొంటున్న స్వచ్ఛభారత్ కార్మికులకు గత 12నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారని,ఇంటి అద్దెలకు,నిత్యావసర సరకులకు అప్పులు చేస్తున్నారని అధికారులకు పలుమార్లు విన్నవించుకొన్న రేపుమాపు అంటూ.... కాలయాపన చేస్తున్నారని,ఇప్పటికైనా స్పందించి జీతాలు చెల్లించాలని,లేదంటే రిలే నిరాహార దీక్షలు చేపట్టానున్నట్లు పేర్కొంటూ.... వినతిపత్రం అందజేశారని సిఐటీయు నాయకులు శ్రీరాములు తెలిపారు.స్వచ్ఛభారత్ కార్మికులు రామప్ప, లక్ష్మీనారాయణ, రత్నమ్మ, అంజనమ్మ, ఉమాదేవి,రమేష్, గంగులమ్మ, బాబు, గంగేన్న తదితరులు పాల్గొన్నారు.


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మండలం అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీ అక్కదేవతల ఆలయంలో మాఘుమాసం తొలి సోమవారం సందర్బంగా జినవాండ్లపల్లికి చెందిన గంగాధర్,సుజాతమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదాన కార్యక్రమం సౌకర్యం కల్పించినట్లు పూజారి వెంకటేష్ తెలిపారు.విద్యారంగం కార్పొరేట్ శక్తుల కబంద హస్తల్లోకి వెళ్ళింది:ఫ్రొఫెసర్ హరిగోపాల్ ఆందోళన 

విద్యారంగం కార్పొరేట్ శక్తుల కబంద హస్తల్లోకి వెళ్ళింది:ఫ్రొఫెసర్ హరిగోపాల్ ఆందోళన 


శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి12(విజయస్వప్నం.నెట్)

విద్యారంగం ప్రమాదకర పరిస్థితిలో ఉందని, కార్పొరేట్ శక్తుల చేతుల్లో పడిపోయిందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు.ఉద్యమాలతోనే ఈసమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఉత్తరాంధ్రశాఖ ఈ నెల 10,11 ఆంధ్ర విద్యాలయం ప్లాటినం జూబ్లీగెస్ట్ హౌస్ లో నిర్వహించిన రజతోత్సవ సభలో ఆయన మాట్లాడారు.జాతీయ విద్యావిధానం 2020 పేరిట కేంద్ర ప్రభుత్వం విద్యా రంగంపై దాడి చేస్తోందని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి వైదొలగి పోతున్నాయన్నారు.కనీసం 7వతరగతి వరకైనా ఆంగ్ల మాధ్యమంతో పాటు మాతృభాషా మాధ్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.జివో 117 ప్రాధమిక పాఠశాల విద్యపై ప్రభావం అనే అంశంపై చర్చించారు,జివో 117ను రద్దు చేయాలని ఈసందర్బంగా డిమాండ్ చేశారు.డీటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం నరహరి,ప్రధానకార్యదర్శి ఎన్వీ రమణయ్య,డీటీఎఫ్ శ్రీ సత్య సాయి జిల్లా,అనంతపురం జిల్లా నాయకులు జార్జి,కట్టుబడి గౌస్ లాజమ్,షర్ఫోద్దిన్ డానియల్ విజయ్,పురుషోత్తం మంజుల తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఫెడరేషన్  సంబంధించిన సావనీర్,సంపాదకీయాలు, కవితాలయ అనే మూడు పుస్తకాలు ఆవిష్కరించారని(ఓడిచెరువు) మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు నరసింహులు సోమశేఖర్ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి)ఫిబ్రవరి12(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కూడలిలో  నేడు(మంగళవారం)వైస్సార్ ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోంటారని పేర్కొంటూ.... ఈ కార్యక్రమానికి ఎంపీపీలు లు, జడ్పీటీసీలు, కన్వీనర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, వార్డు సభ్యులు, మండల జేసీఎస్ కన్వీనర్, సచివాలయ కన్వీనర్లు, మండల,బూత్ కమెటీ కన్వీనర్లు, ఏజెంట్లు, సింగల్ విండో అధ్యక్షులు,ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వివిధ కార్పోరేషన్ డైరెక్టర్లు, డీలర్లు,అనుబంధ సంఘాల కమిటీ అధ్యక్షులు,గ్రామ సచివాలయ సిబ్బంది,గృహ సారథులు, వాలంటీర్లు,యాని మేటర్లు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళాలుతదితరులు పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే  కార్యాలయం కార్యదర్శి అధికారిక ప్రకటనలో తెలిపారు.

మండల తహశీల్దార్ గా బాధ్యతలు స్వికరణం 


మండల తహశీల్దార్ గా బాధ్యతలు స్వికరణం నూతన తహసీల్దార్ ఖాజాబీ
నూతన తహసీల్దార్ ఖాజాబీ

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఫిబ్రవరి12(విజయస్వప్నం.నెట్)

మండల రెవిన్యూ కార్యాలయంలో సోమవారం నూతన తహశీల్దారుగా కే.ఖాజాబీ భాద్యతలు చేపట్టారు.రీసర్వే తహసీల్దార్ జాకీర్,ఆర్ఐ నాగేంద్ర,సచివాలయం సర్వేయర్ అనురాధ,వీఆర్వోలు సిబ్బంది నూతనంగా భాద్యతలు స్వికరించిన తహశీల్దార్ ఖాజాబికి పుష్పగుచ్చాలు అందించి గౌరవపూర్వక శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు.అన్నమయ్య జిల్లా,గుర్రంకొండ తహశీల్దార్ గా పనిచేస్తూ ఎన్నికల బదిలీల ప్రక్రియలో భాగంగా ఓడిచెరువు తహసీల్దార్ గా ఖాజాబీని అధికారులు నియమించినట్లు తెలిపారు.గతంలో ఇక్కడ  నిర్వహించిన తహశీల్దార్ వై. రామనాధరెడ్డి ఆమడగూరు మండలానికి బదిలీపై వెళ్లారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి